ప్రపంచ బ్యాంక్ ప్రెసిడెంట్గా మళ్లీ జిమ్ యాంగ్ కిమ్
వాషింగ్టన్: ప్రపంచ బ్యాంక్ ప్రెసిడెంట్గా మళ్లీ జిమ్ యాంగ్ కిమ్ నియమితుల య్యారు. ఈయన పదవీ కాలం వచ్చే ఏడాది జూలై 1 నుంచి ప్రారంభమౌతుంది. కాగా జిమ్ యాంగ్ కిమ్ బ్యాంక్ ప్రెసిడెంట్‌గా ఐదేళ్లపాటు కొనసాగుతారు. ‘బ్యాంక్ అధ్యక్షుడిగా వరుసగా రెండవసారి ఎన్నిక కావడం ఎంతో ఆనందంగా ఉంది. దీన్ని గొప్ప గౌరవంగా భావిస్తాను. అంతర్జాతీయంగా పేదరిక నిర్మూలనకు అవిశ్రాంతంగా శ్రమిస్తాను’ అని కిమ్ పేర్కొన్నారు. ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్లందరూ కిమ్‌ను ఏకగ్రీవంగా ప్రెసిడెంట్‌గా ఎన్నుకున్నారని ప్రపంచ బ్యాంక్ పేర్కొంది. కాగా కిమ్ 2012లో బ్యాంక్ ప్రెసిడెంట్‌గా నియమితులైనప్పుడు 2030 నాటికి పేదరికాన్ని నిర్మూలించడం, వర్ధమాన దేశాల్లోని వ్యక్తుల ఆదాయాన్ని పెంచడం అనే రెండు లక్ష్యాలను బ్యాంకుకు నిర్దేశించారు.