Jim Yong Kim
-
ప్రపంచ బ్యాంక్ ప్రెసిడెంట్ కిమ్ రాజీనామా
వాషింగ్టన్: ప్రపంచ బ్యాంక్ ప్రెసిడెంట్ పదవికి జిమ్ యోంగ్ కిమ్ రాజీనామా చేశారు. పదవీకాలం ఇంకా మూడేళ్లుండగానే ఆయన అర్ధంతరంగా తప్పుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రైవేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ సంస్థలో చేరే ఉద్దేశంతో ప్రపంచ బ్యాంక్ ప్రెసిడెంట్ పదవికి కిమ్(58) రాజీనామా చేశారు. ఫిబ్రవరి 1 నుంచి ఇది అమల్లోకి వస్తుంది. కొత్త చీఫ్ నియమితులయ్యేదాకా వరల్డ్ బ్యాంక్ సీఈవో క్రిస్టలీనా జార్జియేవా తాత్కాలిక ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తారు. కిమ్ ఆరేళ్లుగా ప్రపంచ బ్యాంక్ ప్రెసిడెంట్ పదవిలో కొనసాగుతున్నారు. 2017లో రెండో దఫా ప్రెసిడెంట్‌గా ఎన్నికైన కిమ్ పదవీకాలం వాస్తవానికి 2022 నాటికి ముగియాల్సి ఉంది. వాతావరణ మార్పులు, కరువు, కాందిశీకుల సమస్యలు మొదలైనవి అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో ప్రపంచ దేశాల పేదల ఆకాంక్షలను నెరవేర్చాల్సిన బాధ్యత ప్రపంచ బ్యాంక్‌పై ఉందని ఒక ప్రకటనలో కిమ్ పేర్కొన్నారు. వృత్తి రీత్యా వైద్యుడైన కిమ్.. దక్షిణ కొరియా దేశానికి చెందినవారు. ముందుగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్‌లో అడ్వైజర్‌గా చేరి, ఆ తర్వాత వరల్డ్ బ్యాంక్‌లో అంచెలంచెలుగా ప్రెసిడెంట్ స్థాయికి ఎదిగారు. కొత్త చీఫ్ నియామకం అంశం.. ప్రపంచ బ్యాంక్‌లోని ఇతర సభ్య దేశాలు, అమెరికా మధ్య రగడకు దారి తీసే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. సాధారణంగా ప్రపంచ బ్యాంక్ ప్రెసిడెంట్‌ను అమెరికా నామినేట్ చేస్తే, దానిలో భాగమైన అంతర్జాతీయ ద్రవ్య నిధి చీఫ్‌ను యూరప్ దేశాలు నామినేట్ చేస్తూ వస్తున్నాయి. మిగతా ప్రాంతాల వర్ధమాన దేశాలకు కూడా ఈ ప్రక్రియలో భాగం ఉండాలన్న డిమాండ్ నెలకొనడంతో 2012లో కిమ్‌ను ఎంపిక చేయడం ద్వారా పాత సంప్రదాయానికి అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఫుల్స్టాప్ పెట్టారు. కానీ ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ప్రపంచ రాజకీయాల్లో అమెరికా ప్రాధాన్యాన్ని మరింతగా పెంచే ప్రయత్నాల్లో ఉండటం, దీనికి మిగతా దేశాల నుంచి వ్యతిరేకత వస్తుండటం తదితర పరిణామాల నేపథ్యంలో ప్రపంచ బ్యాంక్ కొత్త చీఫ్ నియామకంపై వివాదానికి దారితీయొచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు రాజీనామా
వాషింగ్టన్: ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు జిమ్ యాంగ్ కిమ్ తన పదవికి రాజీనామా చేశారు. పదవీ కాలానికి మూడేళ్లు ముందే ఆయన వైదొలగడం ఆశ్చర్యానికి గురిచేసింది. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి అధ్యక్షుడి బాధ్యతల నుంచి తప్పకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. మౌలిక రంగంలోని సంస్థలో అవకాశం రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రపంచ సంస్థకు అధ్యక్షుడిగా ఉండటం ఎంతో గౌరవంగా భావిస్తున్నానని, పేదరికం నిర్మూలన కోసం ఎంతో కృషి చేసినట్లు జిమ్ యాంగ్ తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా పేదరికం పెరుగుతున్న దశలో ప్రపంచ బ్యాంక్ సేవలు ఎంతో అవసరమని ఆయన అన్నారు. కిమ్ ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడిగా 2012లో తొలిసారి బాధ్యతలు స్వీరించారు. 2017లో రెండోసారి ఎన్నికై కిమ్ పదవీ కాలం 2022 వరకు ఉంది. అంతర్జాతీయంగా పేదరిక నిర్మూలనకు అవిశ్రాంతంగా పోరాడిన వ్యక్తిగా ఆయన గుర్తింపు పొందారు. 2012లో తొలిసారి ప్రపంచ బ్యాంక్ ప్రెసిడెంట్‌గా నియమితులైనప్పుడు 2030 నాటికి పేదరికాన్ని నిర్మూలించడం, వర్ధమాన దేశాల్లోని వ్యక్తుల ఆదాయాన్ని పెంచడం అనే రెండు లక్ష్యాలను బ్యాంకుకు నిర్దేశించారు. ప్రపంచ బ్యాంకు ప్రస్తుత సీఈవో క్రిస్టాలినా జార్జియేవా ఆయన స్థానంలో తాత్కాలిక అధ్యక్షురాలిగా వచ్చే నెల ఒకటో తేదీ నుంచి బాధ్యతలను స్వీకరించనున్నట్లు సమాచారం. 59 ఏళ్ల కిమ్ దక్షిణ కొరియా దేశానికి చెందినవారు. -
స్వచ్ఛ భారత్ ఈజిప్ట్ విధానమే
వాషింగ్టన్: భారత ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వచ్ఛభారత్ కార్యక్రమంఈజిప్ట్ విధానమని ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు జిమ్ యాంగ్ కిమ్ అన్నారు. దీనికి ప్రపంచ బ్యాంక్ రూ. లక్ష కోట్లను మంజూరు చేసిందని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా అమలవుతున్న ఉత్తమ విధానాల నుంచి ఆయా దేశాలు స్ఫూర్తిని పొంది అనుసరిస్తున్నాయనడానికి ఇది ఒక ఉదాహరణ అని పేర్కొన్నారు. వాషింగ్టన్లో జరిగిన ప్రపంచ బ్యాంక్ దేశాల ప్లీనరీలో ఆయన మాట్లాడారు. -
ప్రపంచ బ్యాంక్ ప్రెసిడెంట్‌గా మళ్లీ జిమ్ యాంగ్ కిమ్
వాషింగ్టన్: ప్రపంచ బ్యాంక్ ప్రెసిడెంట్‌గా మళ్లీ జిమ్ యాంగ్ కిమ్ నియమితుల య్యారు. ఈయన పదవీ కాలం వచ్చే ఏడాది జూలై 1 నుంచి ప్రారంభమౌతుంది. కాగా జిమ్ యాంగ్ కిమ్ బ్యాంక్ ప్రెసిడెంట్‌గా ఐదేళ్లపాటు కొనసాగుతారు. ‘బ్యాంక్ అధ్యక్షుడిగా వరుసగా రెండవసారి ఎన్నిక కావడం ఎంతో ఆనందంగా ఉంది. దీన్ని గొప్ప గౌరవంగా భావిస్తాను. అంతర్జాతీయంగా పేదరిక నిర్మూలనకు అవిశ్రాంతంగా శ్రమిస్తాను’ అని కిమ్ పేర్కొన్నారు. ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్లందరూ కిమ్‌ను ఏకగ్రీవంగా ప్రెసిడెంట్‌గా ఎన్నుకున్నారని ప్రపంచ బ్యాంక్ పేర్కొంది. కాగా కిమ్ 2012లో బ్యాంక్ ప్రెసిడెంట్‌గా నియమితులైనప్పుడు 2030 నాటికి పేదరికాన్ని నిర్మూలించడం, వర్ధమాన దేశాల్లోని వ్యక్తుల ఆదాయాన్ని పెంచడం అనే రెండు లక్ష్యాలను బ్యాంకుకు నిర్దేశించారు. -
వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్‌గా జిమ్ యాంగ్ కిమ్
-
జిమ్ యాంగ్ కిమ్ కే మళ్లీ పట్టం
వాషింగ్టన్: ప్రపంచ బ్యాంకు అధ్యక్షునిగా జిమ్ యాంగ్ కిమ్(56) తిరిగి నియమితులయ్యారు. కిమ్ ను ఏకగ్రీవంగా నియమిస్తున్నట్టు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ బోర్డు తెలిపింది. కొరియన్ అమెరికన్ అయిన కిమ్ 2012 లో అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. ఆయన పదవీకాలం 2017 జులైతో ముగియనుంది. తనను రెండోసారి ఎన్నకున్నందుకు కిమ్ ధన్యవాదాలు తెలిపారు. -
మోదీ పాలనలో భారత్ భేష్
♦ ఆయనకు నేను పెద్ద అభిమానిని ♦ ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు కిమ్ కితాబు ♦ ప్రధానితో సమావేశం... సంపూర్ణ సహకారానికి హామీ న్యూఢిల్లీ: ప్రధాని మోదీ పాలనలో భారత్ అద్భుతంగా పయనిస్తోందంటూ ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు జిమ్‌యాంగ్ కిమ్ కితాబిచ్చారు. మోదీ కార్యశీలి అని, ఆయనకు తాను పెద్ద అభిమానినని చెప్పారు. రెండు రోజల భారత పర్యటనలో భాగంగా చివరి రోజున గురువారం ప్రధాని మోదీతో కిమ్ భేటీ అయ్యారు. సంప్రదాయేతర ఇంధన రంగం, పోషకాహారం, స్మార్ట్ సిటీలు, గంగా నదీ నవీకరణ, నైపుణ్య అభివృద్ధి, స్వచ్ఛభారత్ సహా ప్రభుత్వం చేపట్టిన అన్ని ప్రతిష్టాత్మక కార్యక్రమాలకు ప్రపంచ బ్యాంకు నుంచి పూర్తి సహాయ సహకారాలుంటాయని హామీ ఇచ్చారు. భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ మాత్రమే కాదని, బ్రెగ్జిట్ పరిణామంలోనూ తట్టుకొని నిలబడగలనని ప్రపంచానికి తెలియజేసిందని కిమ్ చెప్పారు. ‘గొప్ప నేతలు చేయగలిగినట్టుగా మోదీ కూడా ఏదో ఒకటి చేయగలరు. లక్ష్యాలు, వాటికి గడువులను నిర్దేశించడంతోపాటు ఆ లక్ష్యాలకు సిబ్బంది కట్టుబడి ఉండేలా చేయగలగాలి. ఈ విధానమే ఫలితాలను సాధించిపెడుతుందని నిరూపితమైంది. అందుకే నేను మోదీకి పెద్ద అభిమానిని’ అని ప్రధానితో సమావేశం అనంతరం విలేకరులతో కిమ్ చెప్పారు. మోదీ ప్రయత్నాలు ఫలితాలనివ్వడం ప్రారంభమైందని, వ్యాపార నిర్వహణకు భారత్ సులభతరమంటూ ప్రపంచ బ్యాంకు నివేదికలో స్థానాన్ని మెరుగుపరుచుకుందని కిమ్ గుర్తు చేశారు. 2014లో భారత్ 54వ స్థానంలో ఉండగా... 2016లో 35వ స్థానానికి చేరుకుందని కిమ్ తెలిపారు. ‘స్వచ్ఛభారత్’ అద్భుత కార్యక్రమమని ప్రశంసించారు. -
నేడు భారత్‌కు ప్రపంచ బ్యాంకు ప్రెసిడెంట్
న్యూఢిల్లీ: ప్రపంచ బ్యాంకు ప్రెసిడెంట్ జిమ్ యాంగ్ కిమ్... రెండు రోజుల పర్యటన నిమిత్తం మంగళవారం (నేడు) భారత్ కు చేరుకుంటారు. కిమ్ తన పర్యటనలో భాగంగా న్యూట్రిషన్, పునరుత్పాదక ఇంధన వృద్ధికి భారత్ తీసుకుంటున్న చర్యలను సమీక్షిస్తారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పలు సంస్కరణలకు ఆర్థికంగా చేయూతనందించడానికి తగిన మార్గాలను అన్వేషించనున్నారు. పర్యటనలో భాగంగా ప్రధాని మోదీని, ఆర్థిక మంత్రి జైట్లీని కలుస్తారు. పేదరిక నిర్మూలనకు పటిష్టమైన చర్యలు అవసరమని ఈ సందర్భంగా కిమ్ అభిప్రాయపడ్డారు. -
వచ్చే ఏడాది 6% పైనే.. : ప్రపంచ బ్యాంకు
వాషింగ్టన్: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వచ్చే ఆర్థిక సంవత్సరంలో (2014-15) 6% పైగానే నమోదవుతుందన్న అంచనాలను ప్రపంచబ్యాంక్ వెలువరించింది. 2016-17లో ఈ రేటు 7.1%కి పెరుగుతుందని విశ్లేషించింది. ‘ప్రపంచ ఆర్థికాభివృద్ధి అవకాశాలు’ శీర్షికతో బుధవారం విడుదలైన తన తాజా నివేదికలో ప్రపంచబ్యాంక్ ఈ అంచనాలను ప్రకటించింది. భారత్ వృద్ధికి ప్రపంచ డిమాండ్‌లో రికవరీ, దేశీయంగా పెట్టుబడుల మెరుగుదల దోహదపడతాయని వివరించింది. కాగా చైనా 2014లో కూడా వృద్ధి 7.7%గా ఉంటుందని అభిప్రాయపడింది. ప్రపంచ ఆర్థికవృద్ధి 3.4 శాతం కాగా ప్రపంచం మొత్తంగా జీడీపీ వృద్ధి 2013లో 2.4 శాతంకాగా ఇది 2014లో 3.2 శాతానికి పెరగవచ్చని వివరించింది. 2015, 2016ల్లో ఈ రేట్లు 3.4 శాతం, 3.5 శాతంగా ఉండే అవకాశం ఉందని పేర్కొంది. అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల్లో వృద్ధి ఊపందుకోవడం వల్ల ప్రపంచ ఆర్థిక సంక్షోభం తరువాత తిరిగి పరిస్థితులు మెరుగుపడే అవకాశాలు కనిపిస్తున్నాయని వరల్డ్ బ్యాంక్ గ్రూప్ ప్రెసిడెంట్ కిమ్ అన్నారు.