
స్వచ్ఛ భారత్ ఈజిప్ట్ విధానమే
వాషింగ్టన్: భారత ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వచ్ఛభారత్ కార్యక్రమంఈజిప్ట్ విధానమని ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు జిమ్ యాంగ్ కిమ్ అన్నారు. దీనికి ప్రపంచ బ్యాంక్ రూ. లక్ష కోట్లను మంజూరు చేసిందని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా అమలవుతున్న ఉత్తమ విధానాల నుంచి ఆయా దేశాలు స్ఫూర్తిని పొంది అనుసరిస్తున్నాయనడానికి ఇది ఒక ఉదాహరణ అని పేర్కొన్నారు. వాషింగ్టన్‌లో జరిగిన ప్రపంచ బ్యాంక్ దేశాల ప్లీనరీలో ఆయన మాట్లాడారు.