అలవోకగా ఎక్కి దిగిన వీధి శునకం
పారా గ్లైడర్ వీడియోతో వెలుగులోకి
వీధి శునకాలు ఆహారం కోసం ఊరంతా తిరుగుతాయి. కానీ ఒక వీధికుక్క ఏకంగా ఈజిప్ట్ పిరమిడ్‌నే ఎక్కేసింది. మార్షల్ మోషెర్ అనే అమెరికా పారా గ్లైడర్ ఈ ఉదంతాన్ని తన మొబైల్ కెమెరాలో బంధించాడు. ఆయన ఇటీవల తోటి పారాగ్లైడర్లతో కలిసి ప్రపంచ ప్రఖ్యాత గిజా పిరమిడ్ల మీదుగా సూర్యోదయ అందాలను చూసేందుకు బయల్దేరాడు. వినీలాకాశంలో చక్కర్లు కొడుతుండగా ఖఫ్రే పిరమిడ్ శిఖరంపై ఒక జీవి కనిపించింది.
తొలుత దాన్ని పర్వత ప్రాంతాల్లో తిరిగే బుల్లి సింహంగా భావించారు. కానీ మొబైల్ కెమెరాను జూమ్ చేసి చూస్తే సాధారణ వీధి కుక్క అని అర్థమైంది. ప్రపంచంలోనే రెండో అత్యంత ఎత్తయిన పిరమిడ్‌పై అదేం చేస్తోందబ్బా అని పరిశీలిసతఏ, పిరమిడ్ శిఖరాగ్రంపై వాలే పిట్టలను పట్టుకునేందుకు పరుగులు పెడుతూ కని్పంచింది. వీధి కుక్కులు ఇలా 130 మీటర్లకు పై చిలుకు ఎత్తుకు ఎక్కిరావడం అరుదు. దారి తప్పి వచి్చందేమో, కిందకు ఎలా వెళ్లాలో తెలీక పైనే తచ్చాడుతోందేమో అని వారు భావించారు. మర్నాడు దాన్ని కిందకు దించాలని నిర్ణయించుకున్నారు.
అది పిరమిడ్‌పై తిరుగుతున్న వీడియోను మోషెర్ తన ఇన్‌స్టా ఖాతాలో షేర్ చేస్తే రాత్రికి రాత్రే కోట్ల మంది చూశారు. తీరా మర్నాడు వెళ్లి చూస్తే కుక్క పిరమిడ్‌పై లేదు! ఒక శునకం పిరమిడ్ పై నుంచి తాపీగా కిందకు దిగొస్తున్న వీడియోను మరో సాహస యాత్రికుడు తర్వాతి రోజే నెట్‌లో షేర్‌చేశాడు. దాంతో అదే ఇదని నిర్ధారణకు వచ్చారు. ఈ వీడియో చూసిన కొందరు ఈజిప్షియన్లు మాత్రం శునకాన్ని ఏదో అతీంద్రీయ శక్తి పైకి తీసుకెళ్లిందని కామెంట్లు చేశారు. ఈజిప్ట్ పురాణాల ప్రకారం ఆ ప్రాంతంలో అనూబిస్ అనే దైవం ఉండేది. మనిషి శరీరం, నక్క ముఖంతో ఉండే ఆ దేవున్ని శుభాలకు ప్రతిరూపంగా భావిస్తారు.
– కైరో
Comments
Please login to add a commentAdd a comment