అక్కడ దయ్యాలు, భూతాలు ఉన్నాయంటే ఆ వైపు కూడా వెళ్లరు చాలామంది. అలాంటిది ఓ వ్యక్తి కేవలం దయ్యాల కోసమే అద్దె చెల్లించాడు. ఈజిప్టులోని కైరో వెలుపల అతి పురాతనమైన మూడు పిరమిడ్‌లు ఉన్నాయి. వీటిని ఈజిప్ట్ ప్రభుత్వం అద్దెకిస్తోంది. వాటిల్లో ఒకటి, అతిపెద్దది, గ్రేట్ పిరమిడ్ ఆఫ్ గిజా. అక్కడ దాదాపు మూడువేలకు పైగా దయ్యాలు, భూతాలు ఉన్నాయని చాలామంది అంటుంటారు.
ఇప్పుడు ఆ దయ్యాలను చూడటానికే ప్రముఖ యూట్యూబర్ జేమ్స్ డొనాల్డ్‌సన్ (మిస్టర్ బీస్ట్), వాటిని వంద గంటలకు అద్దెకు తీసుకున్నాడు. ‘బియాండ్ ది రికార్డ్స్’ పేరుతో భయంకర ప్రదేశాల్లోకి వెళ్లి, అక్కడ జరిగే విచిత్రమైన సంఘటనల వీడియోలు పోస్ట్ చేస్తుంటాడు. ఇప్పుడు తన భారీ అన్వేషణ కోసం ఈజిప్ట్‌లోని ఈ పిరమిడ్‌లను ఎంచుకున్నాడు.
మరో వింత..
ఈ విమానంలో ప్రయాణించాల్సిన పనిలేదు..
‘ఈ వంద గంటల్లో స్నేహితులతో కలసి అక్కడ ఉండే అన్ని గదులు, సమాధులను చూసి, అక్కడే నిద్రించాలన్నది నా ప్లాన్. ఇందుకోసం, అవసరమైన అన్ని వస్తువులతో పాటు, పారానార్మల్ యాక్టివిటీ డివైజ్, ఇతర పరికరాలను తీసుకెళ్తున్నా’ అని చెప్పాడు. కొంతమంది ఇది సాధ్యం కాదని కొట్టి పారేస్తుంటే, తను మాత్రం త్వరలోనే వీడియోతో సమాధానం చెబుతానంటున్నాడు.
భూమి నుంచి దూరంగా వెళ్లకుండా విమానంలో స్పెండ్ చేయడం గురించి విన్నారా..?. ఆ ఆలోచనే వెరైటీగా ఉంది కదూ..!. అలాంటి కోరిక ఉంటే వెంటనే ఉత్తర అమెరికాలో అలాస్కాకి వచ్చేయండి. శీతాకాలపు మంచు అందాల తోపాటు విమానంలో గడిపే అనుభూతిని సొంతం చేసుకోవచ్చు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మరి అదేంటో తెలుసుకుందామా..!
ఆ వీడియోలో 1950ల నాటి విమానం(Airplane) వింటేజ్ డీసీ-6 విమానం విలక్షణమైన విమానహౌస్(Airplane House)గా రూపాంతరం చెందింది. ఇది ఒకప్పుడూ మారుమూల అలాస్కా(Alaska) గ్రామాలకు ఇంధనం, సామాగ్రిని సరఫరా చేసేది. ఇందులో రెండు బెడ్ రూమ్‌లు, ఒక బాత్రూమ్‌తో కూడిన వెకేషనల్ రెంటల్ హౌస్‌గా మార్చారు. చుట్టూ మంచుతో కప్పబడి ఉండే ప్రకృతి దృశ్యం మధ్యలో ప్రత్యేకమైన విమాన ఇల్లులో అందమైన అనుభూతి.
ఇలా సర్వీస్ అయిపోయిన విమానాలను అందమైన టూరిస్ట్ రెంటల్ హౌస్‌లుగా తీర్చిదిద్ది పర్యాటకాన్ని ప్రోత్సహించొచ్చు అనే ఐడియా బాగుంది కదూ..!. చూడటానికి ఇది ప్రయాణించకుండానే విమానంలో గడిపే ఓ గొప్ప అనుభూతిని పర్యాటకులకు అందిస్తోంది. చెప్పాలంటే భూమి నుంచి దూరంగా వెళ్లకుండానే విమానంలో గడిపే ఫీలింగ్ ఇది.
(చదవండి: మంచు దుప్పటిలో విలక్షణమైన ఇల్లు..ఒక్క రాత్రికి ఎంతో తెలుసా...!)
Comments
Please login to add a commentAdd a comment