
ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు, మాస్టర్ కార్డ్ మాజీ సీఈవో అజయ్ బంగా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఛాలెంజ్‌పై అమూల్యమైన సలహాలు సూచనలందించారు. నిజానికి వర్క్‌లైఫ్ బ్యాలెన్స్ అనేది పూర్తిగా వ్యక్తిగతానికి సంబంధించిందని అన్నారు. ఎందుకంటే ఇది వ్యక్తి నుంచి వ్యక్తికి గణనీయంగా మారుతుంది. కొంతమంది వ్యక్తులు ప్రతిరోజూ సుమారు 12 నుంచి 18 గంటలు సమతుల్యంగా పనిచేయగా, మరికొందరూ ఆరుగంటలకు పైగా కష్టపడతారు.
కాబట్టి ఇక్కడ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది పూర్తిగా వ్యక్తిగతం అని చెప్పొచ్చు. ప్రతి ఒక్కరూ తమకు తాముగా నిర్వర్తించాల్సిన బాధ్యత అని నొక్కి చెప్పారు. అలాగే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ సాధించడం అనేది రెండు కీలక అంశాలపై ఆధారపడి ఉంటుందన్నారు. అవేంటంటే....పనిని ప్రేమించడం, ప్రియమైన వారి కోసం సమయాన్ని కేటాయించడం.
దీని అర్థం పనిని ఆస్వాదించినట్లయితే కష్టపడి పనిచేయడం అనేది సాధ్యమవుతుంది. లేదంటే అదోక జర్నీలా సాగుతుంది అంతే. లేదా ఆ పని నచ్చనట్లయితే మీకు నచ్చిన పనిని చేసేందుకు ప్రయత్నించండి అప్పుడూ పని-జీవితంపై బ్యాలెన్స్ సాధించగలుగుతారని చెబుతున్నారు బంగా. దీంతోపాటు కుటుంబానికి సంబంధించిన కార్యక్రమాల్లో మీ వంతు పాత్ర పోషించేలా పాలుపంచుకోవడం, వాళ్లతో గడిపేలా కొంత సమయం కేటాయించడం వంటివి చేయడం కూడా అత్యంత ముఖ్యం.
మనవాళ్లకు అవసరమైనప్పుడూ పక్కనే మనం లేనప్పుడూ ఏవిధంగా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ సాధించగలుగుతారు. అందరూ కూడా మొబైల్ పరికరాలకి ప్రాధాన్యత ఇవ్వకండి, దానితోనే అందరితోనూ టచ్‌లో ఉన్నామని అస్సులు భావించొద్దు". అని సూచిస్తున్నారు బంగా. వ్యక్తిగతంగా మీ వాళ్లతో స్పెండ్ చేయండి లేదా వ్యక్తిగత చర్యలకి ప్రాధాన్యత ఇవ్వండని చెబుతున్నారు. ఇక్కడ సాంకేతికత మనుషుల మధ్య ఉన్న కనెక్షన్‌లను దూరం చేస్తుందనేది గ్రహించండి. ఇది మీ వ్యక్తిగత జీవితంలోకి చొరబడకుండా జాగ్రత్త పడండి. అంటే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ సాధించాలంటే కొన్ని సరిహద్దుల అవసరాన్ని నొక్కి చెబుతూ.. హెచ్చరించారు బంగా. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
Former Mastercard CEO, Ajay Banga on work-life balance: pic.twitter.com/Hi3liSr5of
— Business Nerd 🧠 (@BusinessNerd_) October 13, 2024
(చదవండి: 50 గంటల్లో 16 వేల కేలరీల ఫాస్ట్ ఫుడ్ ఛాలెంజ్..కట్‌చేస్తే..!)