world bank CEO
-
'వర్క్ లైఫ్ బ్యాలెన్స్'పై ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడి అమూల్యమైన సలహాలు.!
ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు, మాస్టర్ కార్డ్ మాజీ సీఈవో అజయ్ బంగా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఛాలెంజ్‌పై అమూల్యమైన సలహాలు సూచనలందించారు. నిజానికి వర్క్‌లైఫ్ బ్యాలెన్స్ అనేది పూర్తిగా వ్యక్తిగతానికి సంబంధించిందని అన్నారు. ఎందుకంటే ఇది వ్యక్తి నుంచి వ్యక్తికి గణనీయంగా మారుతుంది. కొంతమంది వ్యక్తులు ప్రతిరోజూ సుమారు 12 నుంచి 18 గంటలు సమతుల్యంగా పనిచేయగా, మరికొందరూ ఆరుగంటలకు పైగా కష్టపడతారు. కాబట్టి ఇక్కడ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది పూర్తిగా వ్యక్తిగతం అని చెప్పొచ్చు. ప్రతి ఒక్కరూ తమకు తాముగా నిర్వర్తించాల్సిన బాధ్యత అని నొక్కి చెప్పారు. అలాగే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ సాధించడం అనేది రెండు కీలక అంశాలపై ఆధారపడి ఉంటుందన్నారు. అవేంటంటే....పనిని ప్రేమించడం, ప్రియమైన వారి కోసం సమయాన్ని కేటాయించడం. దీని అర్థం పనిని ఆస్వాదించినట్లయితే కష్టపడి పనిచేయడం అనేది సాధ్యమవుతుంది. లేదంటే అదోక జర్నీలా సాగుతుంది అంతే. లేదా ఆ పని నచ్చనట్లయితే మీకు నచ్చిన పనిని చేసేందుకు ప్రయత్నించండి అప్పుడూ పని-జీవితంపై బ్యాలెన్స్ సాధించగలుగుతారని చెబుతున్నారు బంగా. దీంతోపాటు కుటుంబానికి సంబంధించిన కార్యక్రమాల్లో మీ వంతు పాత్ర పోషించేలా పాలుపంచుకోవడం, వాళ్లతో గడిపేలా కొంత సమయం కేటాయించడం వంటివి చేయడం కూడా అత్యంత ముఖ్యం. మనవాళ్లకు అవసరమైనప్పుడూ పక్కనే మనం లేనప్పుడూ ఏవిధంగా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ సాధించగలుగుతారు. అందరూ కూడా మొబైల్ పరికరాలకి ప్రాధాన్యత ఇవ్వకండి, దానితోనే అందరితోనూ టచ్‌లో ఉన్నామని అస్సులు భావించొద్దు". అని సూచిస్తున్నారు బంగా. వ్యక్తిగతంగా మీ వాళ్లతో స్పెండ్ చేయండి లేదా వ్యక్తిగత చర్యలకి ప్రాధాన్యత ఇవ్వండని చెబుతున్నారు. ఇక్కడ సాంకేతికత మనుషుల మధ్య ఉన్న కనెక్షన్లను దూరం చేస్తుందనేది గ్రహించండి. ఇది మీ వ్యక్తిగత జీవితంలోకి చొరబడకుండా జాగ్రత్త పడండి. అంటే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ సాధించాలంటే కొన్ని సరిహద్దుల అవసరాన్ని నొక్కి చెబుతూ.. హెచ్చరించారు బంగా. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. Former Mastercard CEO, Ajay Banga on work-life balance: pic.twitter.com/Hi3liSr5of— Business Nerd 🧠 (@BusinessNerd_) October 13, 2024 (చదవండి: 50 గంటల్లో 16 వేల కేలరీల ఫాస్ట్ ఫుడ్ ఛాలెంజ్..కట్‌చేస్తే..!) -
ప్రపంచ బ్యాంకు సారథిగా ఇంద్రా నూయి?
న్యూయార్క్: ప్రపంచ బ్యాంకు ప్రెసిడెంట్ పదవి రేసులో పెప్సీకో మాజీ సీఈవో, జన్మతః భారతీయురాలైన ఇంద్రా నూయి పేరు తెరపైకి వచ్చింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ఆధారంగా న్యూయార్క్ టైమ్స్ ఈ మేరకు ఓ కథనాన్ని ప్రచురించింది. అభ్యర్థుల ఎంపికలో కీలక పాత్ర పోషిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెద్ద కుమార్తె ఇవాంక, ఇంద్రా నూయి పేరును ప్రతిపాదించారు. ఇంద్రా నూయిని మార్గదర్శిగా, స్ఫూర్తినీయురాలిగా పేర్కొంటూ ఇవాంకా గత ఆగస్ట్‌లో ఓ ట్వీట్ కూడా చేశారు. అయితే, తన నామినేషన్‌ను ఇంద్రా నూయి అంగీకరిస్తారా, లేదా అన్న దానిపై ప్రస్తుతానికి స్పష్టత లేదు. ప్రపంచ బ్యాంకు ప్రస్తుత ప్రెసిడెంట్ జిమ్‌యాంగ్ కిమ్ ఫిబ్రవరిలో తన పదవి నుంచి తప్పుకోనున్నట్టు ఇటీవలే ప్రకటించారు. ప్రైవేటు ఇన్ఫ్రా కంపెనీలో చేరనున్నట్టు ఆయన చెప్పారు. నిర్ణీత పదవీ కాలం కంటే మూడేళ్ల ముందే ఆయన తప్పుకుంటున్నారు. కిమ్ వారసుల ఎంపిక ప్రక్రియను ట్రెజరీ సెక్రటరీ స్టీవెన్ ముంచిన్, ఇవాంకా చూస్తున్నారు. ఈ కమిటీ అభ్యర్థుల నామినేషన్లతో కూడిన జాబితాను ట్రంప్ ముందు ఉంచనున్నారు. ఇవాంక మద్దతుతో నూయి ప్రధాన పోటీదారుగా మారడం ఆసక్తికరం. రేసులో మరో ఇద్దరు... ఇక ప్రపంచ బ్యాంకు ప్రెసిడెంట్ పదవికి....అమెరికా అంతర్జాతీయ వ్యవహారాల మంత్రి డేవిడ్ మల్పాస్, ఓవర్సీస్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ ప్రెసిడెంట్ రే వాష్బర్న్ల పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి. ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడిని ప్రపంచ బ్యాంక్ బోర్డ్ నియమిస్తుంది. అయితే అమెరికా అధ్యక్షడు నామినేట్ చేసిన వ్యక్తే ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు కావడం రివాజు. వైట్ హౌస్ సీనియర్ సలహాదారు పదవిలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన కూతురిని నియమించడం పట్ల ఇప్పటికే విమర్శలు తలెత్తుతున్నాయి. ఇప్పుడు ప్రపంచ బ్యాంక్ అధ్యక్ష పదవి విషయంలో ఇవాంకా జోక్యం చేసుకోవడంతో ఈ విమర్శలు మరింతగా పెరుగుతున్నాయి. తన స్వప్రయోజనాల కోసం ఇవాంకా అంతర్జాతీయ ఆర్థిక వ్యవహారాల్లో తలదూర్చుతున్నారన్న విమర్శలున్నాయి. -
భారత్ వృద్ధి తీరు బాగుంటుంది..!
న్యూఢిల్లీ: భారత్ వృద్ధి తీరు బాగుందని ప్రపంచబ్యాంక్ అంచనావేస్తోంది. ఈ మేరకు ప్రపంచబ్యాంక్ తన ద్వైవార్షిక పబ్లికేషన్‌లో పేర్కొన్న కీలక అంచనాలను చూస్తే... వచే ఆర్థిక సంవత్సరం (2017 ఏప్రిల్–2018 మార్చి) భారత్‌వృద్ధి రేటు 7.3 శాతంగా నమోదవుతుంది. 2019–20లో ఈ రేటు 7.5 శాతం. మార్చి 31తో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ రేటు 6.7 శాతంగా నమోదయ్యే వీలుంది. భారత్ 8 శాతం వృద్ధి నమోదుచేయడానికి మరిన్ని చర్యలు అవసరం. సంస్కరణల కొనసాగింపు, వాటి విస్తృతి ఇక్కడ కీలకం. అలాగే రుణం, పెట్టుబడుల సంబంధ సమస్యలు పరిష్కారం కావాలి. అలాగే భారత్ ఆర్థిక వ్యవస్థ మొత్తం క్రమంగా అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థకు అనుసంధానం కావాల్సి ఉంటుంది. డీమోనిటైజేషన్, వస్తు, సేవల పన్ను ప్రభావాల నుంచి భారత్ రికవరీ అవుతుంది. దీనితో వృద్ధి తీరు కూడా నెమ్మదిగా రికవరీ అవుతుంది. ఆయా అంశాల నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో భారత్ వృద్ధి మూడేళ్ల కనిష్ట స్థాయి 5.7 శాతానికి పడిపోయింది. -
నోట్ల రద్దు భారత్‌కు మంచిదే: ప్రపంచబ్యాంకు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయం భారత ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావం చూపిస్తుందని, దానివల్ల అవినీతి కూడా అంతం అవుతుందని ప్రపంచ బ్యాంకు సీఈవో క్రిస్టలీనా జార్జియెవా అన్నారు. ఎక్కువగా నగదుతో కూడిన ఆర్థికవ్యవస్థలో ఉంటున్న ప్రజలకు పెద్దనోట్ల రద్దు వల్ల కొన్ని కష్టాలు ఎదురై ఉండచ్చని, అయితే దీర్ఘకాలంలో మాత్రం దీనివల్ల స్వచ్ఛమైన, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ సాధ్యమవుతుందని అన్నారు. భారతదేశం చేసిన ప్రయోగాన్ని ఇతర దేశాలు గమనిస్తున్నాయని, ఇంత పెద్ద దేశంలో ఎప్పుడూ ఇలా నోట్లను రద్దు చేయలేదని ఆమె చెప్పారు. భారతదేశంలో 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేయడం వల్ల నెలల తరబడి డబ్బులు అందుబాటులో లేక ప్రజలు తీవ్ర కష్టాల పాలవ్వాల్సి వచ్చింది. అయితే దానివల్ల దేశంలో అవినీతి గణనీయంగా తగ్గుతుందని జార్జియెవా అన్నారు. యూరోపియన్ యూనియన్ కూడా క్రమంగా పెద్దనోట్లను రద్దు చేయాలని ప్రయత్నిస్తోందని, అయితే వాళ్లు ఒక్కసారిగా కాకుండా దీర్ఘకాలంలో దశలవారీగా చేస్తారని ఆమె చెప్పారు. వ్యాపారాలపై కూడా కొంత కాలం పాటు నోట్ల రద్దు వల్ల ప్రతికూల ప్రభావం కనిపించిందని, దీర్ఘకాలంలో మాత్రం భారతదేశం చేపట్టిన ఈ సంస్కరణలు మంచి ప్రభావాన్ని చూపిస్తాయని తెలిపారు. రెండు రోజుల పర్యటన కోసం భారతదేశానికి వచ్చిన జార్జియెవా.. ముంబైలో లోకల్ రైల్లో ప్రయాణించడమే కాక, ప్రపంచంలోనే అతిపెద్ద మురికివాడ అయిన ధారవిలో కూడా పర్యటించారు. మెరుగైన జీవితం కోసం ప్రజలు చాలా ఆతృతగా ఉన్నారని, మెరుగైన సేవల కోసం ఎంతైనా చెల్లించడానికి సిద్ధంగా కనపడుతున్నారని ఆమె అన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ను మెరుగు పరుచుకోడానికి రాష్ట్రాల మధ్య పోటీ కూడా ఆరోగ్యకరంగా ఉందని ప్రశంసించారు. భారతదేశంలో ఈసారి వృద్ధిరేటు 7 శాతం ఉండొచ్చని తాము భావిస్తున్నామని, జీఎస్టీ అమలైతే ఆర్థికవృద్ధి మరింత వేగంగా ఉంటుందని తెలిపారు.