
న్యూఢిల్లీ: భారత్ వృద్ధి తీరు బాగుందని ప్రపంచబ్యాంక్ అంచనావేస్తోంది. ఈ మేరకు ప్రపంచబ్యాంక్ తన ద్వైవార్షిక పబ్లికేషన్‌లో పేర్కొన్న కీలక అంచనాలను చూస్తే...
వచే ఆర్థిక సంవత్సరం (2017 ఏప్రిల్–2018 మార్చి) భారత్‌వృద్ధి రేటు 7.3 శాతంగా నమోదవుతుంది. 2019–20లో ఈ రేటు 7.5 శాతం. మార్చి 31తో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ రేటు 6.7 శాతంగా నమోదయ్యే వీలుంది.
భారత్ 8 శాతం వృద్ధి నమోదుచేయడానికి మరిన్ని చర్యలు అవసరం. సంస్కరణల కొనసాగింపు, వాటి విస్తృతి ఇక్కడ కీలకం. అలాగే రుణం, పెట్టుబడుల సంబంధ సమస్యలు పరిష్కారం కావాలి. అలాగే భారత్ ఆర్థిక వ్యవస్థ మొత్తం క్రమంగా అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థకు అనుసంధానం కావాల్సి ఉంటుంది.
డీమోనిటైజేషన్, వస్తు, సేవల పన్ను ప్రభావాల నుంచి భారత్ రికవరీ అవుతుంది. దీనితో వృద్ధి తీరు కూడా నెమ్మదిగా రికవరీ అవుతుంది. ఆయా అంశాల నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో భారత్ వృద్ధి మూడేళ్ల కనిష్ట స్థాయి 5.7 శాతానికి పడిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment