వాషింగ్టన్: ఉక్రెయిన్‌పై రష్యా సైనిక దాడులను కొనసాగిస్తోంది. రష్యా దళాలు ఉక్రెయిన్‌పై బాంబులు, క్షిపణులతో విరుచుకుపడుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ పరిస్థితులు భయానకంగా మారాయి. దీంతో రష్యా చర్యలపై ప్రపంచ దేశాలు పుతిన్‌పై ఆంక్షలు విధిస్తున్నాయి. ఇప్పటికే రష్యాపై యూరోపియన్ యూనియన్ సహా పలు దేశాలు ఆర్థిక ఆంక్షలను విధించాయి. యుద్ధంలో రష్యాకు బెలారస్ సాయం అందిస్తున్న కారణంగా ఆ దేశంపై కూడా ఆంక్షలు కొనసాగుతున్నాయి.
తాజాగా రష్యా, బెలారస్ దేశాల్లో తాము అమలు చేస్తున్న అన్ని కార్యక్రమాలను తక్షణమే నిలిపివేస్తున్నట్లు ప్రపంచబ్యాంక్ తెలిపింది. 2014 నుంచి రష్యాకు ప్రపంచబ్యాంకు ఎలాంటి కొత్త లోన్లు ఇవ్వలేదు. పెట్టుబడులు పెట్టలేదు. అలాగే, బెలారస్‌కు 2020 నుంచి కొత్తగా రుణాలివ్వలేదు’ అని ఒక ప్రకటనలో పేర్కొంది. రష్యా ఉక్రెయిన్‌లోని క్రిమియాను 2014లో ఆక్రమించుకోగా, 2020లో జరిగిన బెలారస్ అధ్యక్ష ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని ప్రపంచ దేశాలు ఆరోపిస్తున్నాయి.
అమెరికా సైతం రష్యాపై భారీ ఆంక్షలను విధించింది. ఉక్రెయిన్‌పై సైనిక దాడులకు దిగిన రష్యా భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని జో బైడెన్ వార్నింగ్ ఇచ్చారు. రష్యా, పుతిన్‌పై రానున్న కాలంలో యుద్ద ప్రభావం తీవ్రంగా ఉంటుందని తెలిపారు. ఉక్రెయిన్‌పై జరుగుతున్న యుద్ధంలో పుతిన్ గెలిచినా, ఓడినా.. ఆర్థిక పరంగా, ఇతర అంశాల విషయంలో రష్యా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. పుతిన్ ఓ నియంత.. అతడి అంతు చూస్తామంటూ బెడెన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు చెందిన విలాసవంతమైన అపార్ట్‌మెంట్లు, ప్రైవేట్ ఎయిర్ క్రాఫ్ట్‌లను సీజ్ చేస్తున్నామని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment