Belarus
-
US Open 2024: సభలెంకా... విజయ ఢంకా
న్యూయార్క్: గత మూడేళ్లుగా ఊరిస్తున్న యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్‌ను బెలారస్ స్టార్ అరీనా సబలెంకా నాలుగో ప్రయత్నంలో సొంతం చేసుకుంది. భారత కాలమానం ప్రకారం శనివారం అర్ధరాత్రి దాటాక జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ రెండో ర్యాంకర్ సబలెంకా 7–5, 7–5తో ప్రపంచ ఆరో ర్యాంకర్ జెస్సికా పెగూలా (అమెరికా)పై గెలిచింది. గంటా 53 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో సబలెంకా కీలకదశలో పాయింట్లు గెలిచి విజయాన్ని ఖరారు చేసుకుంది. విజేతగా నిలిచిన సబలెంకాకు 36 లక్షల డాలర్లు (రూ. 30 కోట్ల 23 లక్షలు), రన్నరప్ జెస్సికా పెగూలాకు 18 లక్షల డాలర్లు (రూ. 15 కోట్ల 11 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. ఈ టోర్నీలో గత ఏడాది రన్నరప్‌గా నిలిచిన సబలెంకా 2021, 2022లలో సెమీఫైనల్లో ని్రష్కమించింది. తన కెరీర్లో తొలిసారి గ్రాండ్‌స్లామ్ ఫైనల్ ఆడిన పెగూలా అనుభవరాహిత్యంతో ఓటమి పాలైంది. తొలి సెట్ కోల్పోయినప్పటికీ రెండో సెట్లో కోలుకున్న పెగూలా 5–3తో ఆధిక్యంలోకి వెళ్లింది. మరో గేమ్ గెలిచిఉంటే పెగూలా రెండో సెట్‌ను సొంతం చేసుకొని మ్యాచ్‌లో నిలిచేది. కానీ కెరీర్లో నాలుగో గ్రాండ్‌స్లామ్ ఫైనల్ ఆడుతున్న సబలెంకా తన ప్రత్యర్థికి అలాంటి అవకాశం ఇవ్వలేదు. ఒక్కసారిగా విజృంభించిన ఈ బెలారస్ స్టార్ వరుసగా నాలుగు గేమ్‌లు గెల్చుకొని 7–5తో సెట్‌తోపాటు మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. సబలెంకా కెరీర్లో ఇది మూడో గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్. 2023, 2024 ఆస్ట్రేలియన్ ఓపెన్ చాంపియన్‌గా నిలిచిన సబలెంకా తొలిసారి యూఎస్ ఓపెన్ టైటిల్‌ను దక్కించుకుంది. 2019లో నాన్న చనిపోయాక మా ఇంటìæపేరును టెన్నిస్ చరిత్రలో భాగంగా చేయాలనే లక్ష్యంతో ముందుకుసాగాను. నా టెన్నిస్ ప్రయాణం నిరాటంకంగా, ఎల్లవేళలా కొనసాగేందుకు నా కుటుంబ సభ్యులు ఎంతో కృషి చేశారు. గత మూడేళ్లుగా ఈ టోరీ్నలో నేను ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నాను. టోర్నీలలో విన్నర్స్ ట్రోఫీపై నా పేరు చూసుకుంటున్నపుడు ఎంతో గర్వంగా అనిపిస్తుంది. –సబలెంకా -
అప్పటికే విడిపోయాం.. నా హృదయం ముక్కలైంది: టెన్నిస్ స్టార్
బెలారస్ టెన్నిస్ స్టార్, వరల్డ్ నంబర్ టూ సీడ్ అరీనా సబలెంక ఉద్వేగానికి లోనైంది. ఐస్ హాకీ మాజీ ఆటగాడు కొన్‌స్టాంటిన్ కొల్త్సోవ్ అర్ధంతరంగా తనువు చాలించడం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసింది. అదే విధంగా.. కొన్ని రోజుల ముందే తామిద్దరం విడిపోయామని ఈ సందర్భంగా స్పష్టం చేసింది. కాగా బెలారస్‌కు చెందిన కొన్‌స్టాంటిన్ కొల్త్సోవ్ హాకీ ప్లేయర్‌గా గుర్తింపు పొందాడు. 2002- 2010 మధ్య దేశం తరఫున పలు టోర్నీల్లో పాల్గొన్న అతడు 2010 వింటర్ ఒలింపిక్స్‌లోనూ భాగమయ్యాడు. ఈ క్రమంలో 2016లో రిటైర్మెంట్ ప్రకటించిన కొల్త్సోవ్.. ఆ తర్వాత రష్యన్ క్లబ్ అసిస్టెంట్ కోచ్‌గా పనిచేశాడు. గతంలో జులియా అనే మహిళను వివాహం చేసుకున్న కొన్‌స్టాంటిన్ కొల్త్సోవ్కు ఆమెతో ముగ్గురు సంతానం కలిగారు. అయితే, అభిప్రాయ భేదాలు తలెత్తడంతో 2020లో భార్యకు విడాకులు ఇచ్చిన 42 ఏళ్ల ఈ మాజీ హాకీ ప్లేయర్.. 25 ఏళ్ల టెన్నిస్ స్టార్ అరీనా సబలెంకతో ప్రేమలో పడ్డాడు. గత మూడేళ్లుగా వీరిద్దరు డేటింగ్ చేస్తున్నట్లు ధ్రువీకరించే ఫొటోలను సబలెంక తన సోషల్ మీడియా అకౌంట్లలో షేర్ చేస్తోంది. అయితే, దురదృష్టవశాత్తూ కొల్త్సోవ్ మియామీలో మరణించినట్లు వార్తలు రాగా.. బెలారస్ హాకీ ఫెడరేషన్ మంగళవారం ఈ వార్తను ధ్రువీకరించింది. ఈ నేపథ్యంలో విచారణలో భాగంగా కొల్త్సోవ్ది ఆత్మహత్య అని స్థానిక పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే.. కొల్త్సోవ్ మృతి నేపథ్యంలో సబలెంకకు సానుభూతి తెలుపుతూ అభిమానులు సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున పోస్టులు పెట్టారు. అప్పటికే విడిపోయాం ఈ క్రమంలో బుధవారం ఈ విషయంపై స్పందించిన సబలెంక.. కొన్నాళ్ల క్రితమే కొల్త్సోవ్తో తాను విడిపోయినట్లు తెలిపింది. దయచేసి ఈ విషయంలో తన గోప్యతకు భంగం కలగకుండా వ్యవహరించాలని అభిమానులకు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఇన్‌స్టా స్టోరీలో.. ‘‘గత కొన్నాళ్లుగా మేము విడిగా ఉంటున్నాం. ఏదేమైనా.. కొన్‌స్టాంటిన్ కొల్త్సోవ్ మరణం ఊహించలేని విషాదం. నా హృదయం ముక్కలైంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో నాకు, నా కుటుంబ గోప్యతకు భంగం కలగకుండా చూసుకుంటారని భావిస్తున్నా’’ అని సబలెంక ఉద్వేగపూరిత నోట్ షేర్ చేసింది. కాగా రెండుసార్లు ఆస్ట్రేలియన్ ఓపెన్ చాంపియన్‌గా నిలిచిన సబలెంక.. శుక్రవారం మియామీ ఓపెన్ బరిలో దిగేందుకు సిద్ధమవుతోంది. View this post on Instagram A post shared by Australian Open (@australianopen) -
Tennis Tigress: అవమానించిన చోటే అదరగొట్టి.. ‘నేను ఆడ పులిని’!
నాలుగేళ్ల క్రితం.. బెలారస్ దేశంలో ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమం సాగింది. తీవ్ర నిరసనలు, పోరాటాలు జరిగాయి. సహజంగానే ప్రభుత్వం వాటిని అణచివేసేందుకు ప్రయత్నించింది. ఆ దేశంలోని ఎంతో మంది ప్రముఖులు తమ అభిప్రాయాలను వెల్లడించకుండా తటస్థంగా ఉండేందుకే ప్రయత్నించారు. కానీ 22 ఏళ్ల ఒక అంతర్జాతీయ క్రీడాకారిణి మాత్రం గట్టిగా తన గళాన్ని వినిపించింది. దేశాధ్యక్షుడు అలెగ్జాండర్ ల్యుకాన్షెకో వ్యవహరిస్తున్న తీరును తప్పు పట్టింది. మరో రెండేళ్ల తర్వాత ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం మొదలైంది. ప్రపంచవ్యాప్తంగా రష్యాపై తీవ్ర విమర్శలు కురుస్తున్న సమయంలో బెలారస్ మాత్రం యుద్ధంలో రష్యాకు మద్దతు పలికింది. ఆ సమయంలోనూ ఆ ప్లేయర్ తమ ప్రభుత్వాన్ని, దేశాధ్యక్షుడిని తీవ్రంగా విమర్శించింది. ‘అమాయకులపై దాడులు చేసే యుద్ధాన్ని నేను సమర్థించను. అందుకే మా ప్రభుత్వాన్ని కూడా సమర్థించను’ అంటూ బహిరంగ ప్రకటన చేసింది. ఈ రెండు సందర్భాల్లోనూ ఆ మహిళా క్రీడాకారిణి తన కెరీర్‌ను పణంగా పెట్టింది. అంతర్జాతీయ స్థాయిలో అత్యున్నత దశకు వేగంగా ఎదుగుతున్న సమయంలో ఇలాంటి పనులు తనను ఇబ్బంది పెడతాయని తెలిసినా తాను నమ్మినదాని గురించి గట్టిగా మాట్లాడింది. ఆమె పేరే.. అరీనా సబలెంకా. ఈ బెలారస్‌కు టెన్నిస్ స్టార్ రెండు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌ను సాధించడం, వరల్డ్ నంబర్‌వన్ కావడం మాత్రమే కాదు.. ఆటతో పాటు తనకో ప్రత్యేక వ్యక్తిత్వం ఉందనీ నిరూపించింది. ‘నేను ఆడ పులిని’.. కెరీర్ ఆరంభంలో సబలెంకా తన గురించి తాను చెప్పుకున్న మాట. అప్పటికి ఆమె పెద్ద ప్లేయర్ కూడా రాదు. ధైర్యసాహసాలు, చివరివరకూ పోరాడే తత్వం వల్ల తనను తాను అలా భావించుకుంటానని చెబుతుంది. ఆమె చేతిపై ‘పులి’ టాటూ ఉంటుంది. ఆ టాటూను చూసినప్పుడల్లా స్ఫూర్తి పొందుతానని అంటుంది. టెన్నిస్ కోర్టులో సబలెంకా దూకుడైన ఆటే అందుకు నిదర్శనం. పెద్ద సంఖ్యలో విన్నర్స్ ద్వారానే పాయింట్లు రాబట్టడం ఆమె శైలి. ఆరడుగుల ఎత్తు.. పదునైన సర్వీస్.. సబలెంకా అదనపు బలాలు. అవమానించిన చోటే అదరగొట్టి.. 2018 ఆస్ట్రేలియన్ ఓపెన్... సబలెంకా తొలి రౌండ్ మ్యాచ్. అప్పటికి ఆమె అనామక క్రీడాకారిణి మాత్రమే. అంతకు ముందు ఏడాది ఇదే టోర్నీలో క్వాలిఫయింగ్ దశలోనే వెనుదిరిగింది. ఈసారి కాస్త ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగింది. ప్రపంచ ర్యాంకింగ్‌లో 66వ స్థానంలో ఉంది. అయితే అటు వైపున్న ప్రత్యర్థి ఆస్ట్రేలియాకు చెందిన స్టార్ యాష్లీ బార్టీ. చాలా మంది పాతతరం ప్లేయర్ల మాదిరే సబలెంకా కూడా కోర్టులో షాట్ ఆడేటప్పుడు గట్టిగా అరుస్తుంది. ఏ స్థాయికి చేరినా చిన్నప్పటి నుంచి సాధనతో పాటు వచ్చిన ఈ అలవాటును మార్చుకోవడం అంత సులువు కాదు. ఈ మ్యాచ్‌లోనూ అదే జరిగింది. సబలెంకా దూకుడైన ఆటతోపాటు అరుపులు కూడా జోరుగా వినిపించాయి. ఫలితంగా తొలి సెట్ ఆమె సొంతం. దాంతో బార్టీ ఒక్కసారిగా షాక్‌కు గురైంది. అరుపులు కొంతవరకు ఓకే గానీ మరీ శ్రుతి మించిపోయాయని ఫిర్యాదు చేసింది. అయితే బార్టీని మించి ఆస్ట్రేలియా అభిమానులు చేసిన అతి సబలెంకాను బాగా ఇబ్బంది పెట్టింది. పూర్తిగా నిండిన గ్యాలరీల్లో అంతా బార్టీ అభిమానులే ఉన్నారు. వారంతా సబలెంకాను గేలి చేయడం మొదలుపెట్టారు. సబలెంకా ప్రతి షాట్‌కూ వారు పెట్టిన అల్లరి వల్ల ఆమె ఏకాగ్రత చెదిరింది. దాంతో తర్వాతి సెట్లలో ఓడి మ్యాచ్‌లో పరాజయంపాలైంది. దీనిని సబలెంకా మరచిపోలేదు. అదే వేదికపై తానేంటో నిరూపించుకుంటానని ఈ ‘ఆడ పులి’ ప్రతిజ్ఞ పూనింది. అనుకున్నట్టుగానే తన పట్టుదలను చూపించింది! అరుపులను ఆపలేదు కానీ ఆటలో మాత్రం అద్భుతంగా దూసుకుపోయింది. ఐదేళ్ల తర్వాత 2023లో అదే రాడ్ లేవర్ ఎరీనాలో సబలెంకా తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలుచుకుంది. సంవత్సరం తర్వాతా దానిని నిలబెట్టుకొని అదే మెల్బోర్న్ ఫ్యాన్స్ ద్వారా సగర్వంగా జేజేలు అందుకుంది. సీనియర్‌గానే సత్తా చాటుతూ.. చాలామంది వర్ధమాన టెన్నిస్ స్టార్లతో పోలిస్తే సబలెంకా ప్రస్థానం కాస్త భిన్నం. దాదాపు ప్లేయర్లందరూ జూనియర్ స్థాయిలో చిన్న చిన్న టోర్నీలు ఆడుతూ ఒక్కో మెట్టే ఎక్కుతూ ముందుకు వెళతారు. అయితే ఆమె మాత్రం జూనియర్ టోర్నీల్లో ఆడే వయసు, అర్హత ఉన్నా వాటికి దూరంగా ఉంది. గెలిచినా, ఓడినా ప్రొఫెషనల్ సర్క్యూట్లో సీనియర్ స్థాయిలో పోటీ పడటమే మేలు చేస్తుందన్న కోచ్ మాటను పాటిస్తూ సర్క్యూట్లో పోరాడింది. సబలెంకా తన కెరీర్లో ఒక్క జూనియర్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో కూడా పాల్గొనకపోవడం విశేషం. 14 ఏళ్ల వయసులో ప్రొఫెషనల్‌గా ఐటీఎఫ్ విమెన్స్ వరల్డ్ టెన్నిస్ టూర్ టోర్నీల్లో ఆడటం మొదలుపెట్టింది. తొలి రెండేళ్లలో ఐదు టోర్నీలూ సొంతగడ్డ బెలారస్‌లోనే ఆడింది. టైటిల్స్ దక్కకపోయినా ఆమె ఆట మెరుగుపడుతూ వచ్చింది. 2015 ముగిసే సరికి ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 548వ స్థానంలో ఉన్న సబలెంకా.. 2017లో తన తొలి పెద్ద టోర్నీ (ముంబై ఓపెన్) విజయానంతరం 78వ ర్యాంక్‌తో ఆ ఏడాదిని ముగించింది. ఆ తొలి మూడేళ్లను మినహాయిస్తే ఆ తర్వాత అమిత వేగంతో సబలెంకా కెరీర్ దూసుకుపోయింది. అప్పటి వరకు అనామకురాలిగానే ఉన్నా.. 2018 ఆరంభంలో 11వ ర్యాంక్‌కు చేరి.. అప్పటి నుంచి ఇప్పటి వరకు టాప్–10లో తన స్థానాన్ని కొనసాగిస్తూ ఉంది. డబుల్ గ్రాండ్‌స్లామ్.. 2016 యూఎస్ ఓపెన్ క్వాలిఫయింగ్ టోర్నీలో సబలెంకా ఓడింది. తర్వాతి ఆరేళ్లలో నాలుగు గ్రాండ్‌స్లామ్‌లతో కలిపి 22 సార్లు బరిలోకి దిగినా ట్రోఫీకి చేరువగా రాలేకపోయింది. గరిష్ఠంగా మూడుసార్లు సెమీఫైనల్‌తోనే ఆమె సరిపెట్టుకుంది. అయితే 2023లో సబలెంకా కెరీర్ సూపర్‌గా నిలిచింది. అప్పటికి సింగిల్స్‌లో నాలుగు ప్రధాన డబ్ల్యూటీఏ టైటిల్స్ విజయాలతో ఫేవరెట్లలో ఒకరిగా ఆస్ట్రేలియన్ ఓపెన్ బరిలోకి దిగి.. చివరి వరకు దానిని నిలబెట్టుకుంది. స్థాయికి తగ్గ ప్రదర్శనతో తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలుచుకోవడంతో పాటు సింగిల్స్, డబుల్స్‌లలో ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిచిన నాలుగో ప్లేయర్‌గా నిలిచింది. ఈ గెలుపుతో వరల్డ్ నంబర్ 2 ర్యాంక్ ఆమె దరి చేరింది. ఆపై శిఖరానికి చేరేందుకు సబలెంకాకు ఎక్కువ సమయం పట్టలేదు. మిగిలిన మూడు గ్రాండ్‌స్లామ్‌లలో సెమీస్ చేరిన ఆమె యూఎస్ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచింది. ఈ ప్రదర్శన కారణంగా ఇదే టోర్నీ ముగిసే సరికి అధికారికంగా సబలెంకా వరల్డ్ నంబర్‌వన్ స్థానాన్ని అధిరోహించింది. ఫలితంగా సింగిల్స్, డబుల్స్‌లలో ఏదో ఒక దశలో అగ్రస్థానంలో నిలిచిన అరుదైన క్రీడాకారిణుల జాబితాలో ఆమె చేరింది. కొత్త ఏడాది వచ్చేసరికి ఆమె ఆట మరింత పదునెక్కింది. ఇటీవల ముగిసిన ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఏడు మ్యాచ్‌లలో ఒక్క సెట్ కూడా కోల్పోకుండా విజయఢంకా మోగించింది. రెండో గ్రాండ్‌స్లామ్‌ను తన ఖాతాలో వేసుకొని చిరునవ్వులు చిందించింది. దేశం పేరు లేకుండానే.. తన దేశంలో యుద్ధానికి వ్యతిరేకంగా గళమెత్తిన సబలెంకా ఒక క్రీడాకారిణిగా కూడా అదే తరహాలో స్పందించింది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధ సమయంలో క్రీడలను రాజకీయాలకు దూరంగా ఉంచాలంటూ బహిరంగ లేఖ రాసింది. బాధితులైన ఉక్రెయిన్ దేశస్థులకు మద్దతునిస్తున్నానంటూ ఆ దేశపు జాతీయ పతాకంలోని రంగుల బ్యాండ్లను మైదానంలో ధరించింది. తన దేశం అనవసరంగా యుద్ధపిపాసి జాబితాలో చేరడంపై బాధను వ్యక్తం చేసింది. అయితే దురదృష్టం ఏమిటంటే ఆమె బెలారస్ ప్లేయర్ కావడమే. యుద్ధ నేపథ్యంలో రష్యా, బెలారస్ దేశపు ప్లేయర్లపై వేర్వేరు అంతర్జాతీయ క్రీడా సమాఖ్యలు నిషేధం విధించాయి. ఈ జాబితాలో విమెన్ టెన్నిస్ అసోసియేషన్ (డబ్ల్యూటీఏ) కూడా ఉంది. తర్వాత.. యుద్ధంతో ప్లేయర్లకు సంబంధం లేదని భావించి వారికి ఆడే అవకాశాన్నిచ్చాయి. కానీ తమ దేశం పేరును వాడకుండా.. ఏ దేశానికీ ప్రాతినిధ్యం వహించకుండా.. తటస్థులుగా బరిలోకి దిగాలనే నియమంతో! దాంతో చాంపియన్‌గా నిలిచిన తన దేశం పేరును, జెండాను సగర్వంగా ప్రదర్శించుకునే పరిస్థితి సబలెంకాకు లేకపోయింది. ఇటీవలి ఆస్ట్రేలియన్ ఓపెన్‌లోనూ అదే కొనసాగడంతో.. ఇప్పటికీ డబ్ల్యూటీఏ వెబ్సైట్లో ఆమె పేరు పక్కన దేశం పేరు లేదు. 26 ఏళ్ల సబలెంకా తాజా ఫామ్‌ను బట్టి ఈ ప్రతికూలతలన్నింటినీ దాటుకుని మున్ముందు మరిన్ని ఘన విజయాలు అందుకోవడం ఖాయమని తెలుస్తోంది. -మొహమ్మద్ అబ్దుల్ హాది -
వాగ్నర్ అనుభవంతో బెలారస్ బలోపేతం!
మిన్స్క్ (బెలారస్): ఉక్రెయిన్‌లో రష్యా తరఫున యుద్ధంలో పాల్గొన్న ప్రైవేట్ సైన్యం వాగ్నర్ గ్రూప్ అనుభవాన్ని వాడుకోవాలని బెలారస్ భావిస్తోంది. వాగ్నర్ సేన శనివారం ఆ దేశంలో బెలారస్లో అడుగుపెట్టింది. ఇరు సైన్యాల మధ్య సమన్వయం కోసం సంయుక్త సైనిక విన్యాసాలు తదితరాలకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. మెరుపువేగంతో షూటింగ్, ప్రథమ చికిత్సలో బెలారస్ సైనికులకు వాగ్నర్ గ్రూప్ బలగాలు తరీ్ఫదునిస్తున్న వీడియో వైరల్‌గా మారింది. -
వాగ్నర్ చీఫ్ ప్రిగోజిన్ బెలారస్లో కాదు.. రష్యాలోనే ఉన్నాడు
మిన్స్క్: రష్యా అధినేత పుతిన్‌పై స్వల్పకాలం తిరుగుబాటు చేసి, పెను సంచలనం సృష్టించిన కిరాయి సైన్యం వాగ్నర్ గ్రూప్ చీఫ్ యెవ్గెనీ ప్రిగోజిన్ ప్రస్తుతం రష్యాలోనే ఉన్నారని బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకశెంకో గురువారం చెప్పారు. ప్రిగోజిన్ ప్రస్తుతం సెయింట్ పీటర్స్బర్గ్ నగరంలో ఆశ్రయం పొందుతున్నాడని తెలిపారు. ఉక్రెయిన్‌లో యుద్ధం కోసం రష్యా ప్రభుత్వం అందజేసిన నగదు, ఆయుధాలను వెనక్కిఇచ్చేసే ప్రయత్నంలో ప్రిగోజిన్ ఉన్నాడని వెల్లడించారు. వాగ్నర్ సైనిక దళాలు వారి క్యాంప్‌ల్లోనే ఉన్నాయని పేర్కొన్నారు. అయితే, ఆయా క్యాంప్‌లు ఎక్కడున్నాయనే విషయం లుకశెంకో బయటపెట్టలేదు. బెలారస్‌లోని తమ మిలటరీ స్థావరాలను ఉపయోగించుకోవాలని వాగ్నర్ సభ్యులకు సూచించామని, వారు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నారు. సెయింట్ పీటర్స్బర్గ్ సిటీలో ప్రిగోజిన్ నివసిస్తున్నట్లు చెబుతున్న ఓ భవంతి ఫొటోలు, వీడియోలను రష్యా ఆన్లైన్ పత్రిక ఫోంటాకా బయటపెట్టింది. అయితే, ప్రిగోజిన్ ప్రస్తుతం రష్యాలోనే ఉన్నట్లు స్పష్టమైన ఆధారాలేవీ లభించలేదు. పుతిన్ క్షమాభిక్ష పెట్టిన తర్వాత ప్రిగోజిన్ బెలారస్‌కు వెళ్లినట్లు వార్తలు వచ్చాయి. -
మా ఆర్మీకి శిక్షణ ఇవ్వండి
మిన్స్క్: రష్యాలో స్వల్పకాలిక తిరుగుబాటు విఫలయత్నం అనంతరం తమ దేశానికి చేరుకున్న వాగ్నర్ గ్రూప్‌నకు బెలారస్ అధ్యక్షుడు ఓ ఆఫర్ ఇచ్చారు. తమ దేశ మిలటరీకి శిక్షణ ఇవ్వాలంటూ ప్రైవేట్ సైన్యం వాగ్నర్ గ్రూప్‌ను అధ్యక్షుడు లుకషెంకో కోరారు. ‘ఇక్కడికి వచ్చి మన సైన్యానికి యుద్ధ నైపుణ్యంలో శిక్షణ ఇవ్వాలని వాగ్నర్ గ్రూప్‌ను కోరాం. వారి అనుభవం మాకెంతో అవసరం’అని ఆయన అన్నట్లు అధికార వార్తా సంస్థ బెల్టా వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా పోరాడుతూ సాధారణ పరిస్థితులను నెలకొల్పేందుకు ప్రయతి్నస్తున్న వాగ్నర్ గ్రూప్‌ను పశి్చమదేశాలు ద్వేషిస్తున్నాయన్నారు. చరిత్రలోనే ఎన్నడూ లేనంతటి స్థాయిలో ప్రపంచ సైనిక–రాజకీయ సంక్షోభం ఏర్పడబోతోందని హెచ్చరించారు. దీనిని పరిష్కరించడానికి చర్చల అవసరాన్ని పశి్చమదేశాలు గుర్తించడం లేదని విమర్శించారు. పోలెండ్ మరో ఉక్రెయిన్ మాదిరిగా మారబోతోందని, ఆ దేశానికి ఈయూ, అమెరికా ఆయుధాలు అందిస్తున్నాయని ఆరోపించారు. -
ఆస్పత్రిలో చేరిన బెలారస్ అధ్యక్షుడు..పుతిన్‌తో సమావేశం తర్వాతే..
బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాషెంకో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ని కలిసిన తర్వాతే ఆస్పత్రిలో చేరినట్లు వార్త కథనాలు గుప్పుమన్నాయి. ఈ మేరకు అమెరికన్ వీక్లీ న్యూస్ మ్యాగజైన్ లుకాషెంకో మాస్కోలోని సెంట్రల్ క్లినికల్ ఆస్పత్రిలో చేరినట్లు ఆ బెలారస్ ప్రెసిడెంట్ అభ్యర్థి వాలెరీ సెప్కలో ఓ టెలీగ్రామ్ పోస్ట్‌లో పేర్కొన్నట్లు తెలిపింది. అంతేగాదు లుకాషెండో పుతిన్‌తో సమావేశం అనంతరం అత్యవసరంగా మాస్కోలోని ఆస్పత్రిలో చేరారని, అక్కడే చికిత్స పొందుతున్నట్లు తెలిపారు వాలేరీ. ఐతే అక్కడ అతని పరిస్థితి విషమంగా ఉందని, అందువల్ల అతనిని తీసుకువచ్చేలా వైద్య నిపుణలతో సహా అధికార బృందాన్ని పంపినట్లు తెలిపారు. అక్కడ లుకాషెంకోపై మాస్కో విషప్రయోగం జరిపినట్లు ఊహాగానాలు హల్చల్ చేస్తున్నట్లు కూడా వివరించారు వాలేరీ. అందువల్ల తాము అతనని సతర్వరమే రక్షించేలా అన్ని రకాల వ్యవస్థీకృత చర్యలు తీసుకుంటున్నట్లు వాలేరీ పేర్కోన్నట్లు అమెరికా వీక్లీ న్యూస్ తెలిపింది. నిజానికి మే 9ప మాస్కోలో రెడ్ స్క్వేర్‌లో జరిగిన విక్టరీ డే వేడుకలో లుకాషెంకో కనిపించిన కొన్ని వారాల తర్వాత ఆయన ఆరోగ్యంపై పుకార్లు రావడం మొదలైంది. ఐతే లుకాషెంకో వాటిని తోసిపుచ్చారు. అంతేగాదు బెలారస్లో వ్యూహాత్మక క్షిఫణుల విస్తరణను లాంఛనప్రాయంగా చేయడానికి లుకాషెంకో ప్రభుత్వంతో రష్యా ఒప్పందం కుదుర్చకున్నట్లు రష్యా మీడియా పేర్కొంది. అందుకు సంబంధించిన పత్రాలపై ఇరు దేశాల నాయకులు సంతకం చేసినట్లు బెలారసియన్ రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. కాగా, ఆ రెండు దేశాలు తీసుకున్న చర్యలు అంతర్జాతీయ చట్టపరమైన బాధ్యతలకు అనుగుణంగా ఉన్నట్లు మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అలాగే సమావేశంలో ఇరు దేశాల నాయకులు సైనిక, రాజకీయ పరిస్థితుల తోపాటు సాంకేతిక సహకార సమస్యలపై చర్చించనట్లు అని బెలారసియన్ రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. (చదవండి: దిగుతున్న టైంలో విమానం డోర్ లాక్ అయ్యింది!.పాపం ఆ ప్రయాణికుడు..) -
రష్యా, బెలారస్ టెన్నిస్ ఆటగాళ్లకు ఊరట.. నిషేధం ఎత్తివేత
Russia And Belarus Tennis Players: ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధం నేపథ్యంలో గత ఏడాది రష్యా, బెలారస్ టెన్నిస్ క్రీడాకారులపై ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ క్లబ్ నిషేధం విధించింది. దాంతో ప్రతిష్టాత్మక వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో రష్యా, బెలారస్ క్రీడాకారులు పాల్గొనలేకపోయారు. అయితే ఈ ఏడాది రష్యా, బెలారస్ క్రీడాకారులపై ఉన్న నిషేధాన్ని ఎత్తి వేస్తున్నామని, వారు తటస్థ క్రీడాకారుల హోదాలో పాల్గొనవచ్చని ఆల్ ఇంగ్లండ్ క్లబ్ తెలిపింది. దాంతో పురుషుల విభాగంలో స్టార్స్ మెద్వెదెవ్, రుబ్లెవ్, ఖచ నోవ్ (రష్యా), మహిళల విభాగంలో విక్టోరియా అజరెంకా, ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేత అరీనా సబలెంకా (బెలారస్) వింబుల్డన్‌లో ఆడేందుకు మార్గం సుగమమైంది. ఈ ఏడాది వింబుల్డన్ టోర్నీ జూలై 3 నుంచి 16 వరకు జరుగుతుంది. చదవండి: IPL2023 Opening Ceremony: అట్టహాసంగా ఐపీఎల్ ఆరంభ వేడుకలు: దుమ్ములేపిన తమన్నా, రష్మిక.. తెలుగు పాటలతో -
Ales Bialiatski: చెరసాలలో శాంతి కపోతం
అంతర్జాతీయ సమాజం, మానవ హక్కుల సంఘాలు ఊహించినట్లే జరిగింది. దేశంలో కల్లోలానికి కారకుడంటూ మానవ హక్కుల ఉద్యమకారుడు, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత అలెస్ బియాలియాట్ స్కీ(60)కు పదేళ్ల జైలు శిక్ష విధించింది బెలారస్ న్యాయస్థానం. 2020లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలకు అలెస్.. ఆర్థిక సహకారం అందించాడని, తద్వారా ఇతర నేరాలకూ కారకుడయ్యాని ప్రభుత్వం మోపిన అభియోగాలను ధృవీకరించింది కోర్టు. అంతేకాదు ఆ సమయంలో అరెస్టయిన వాళ్లకు న్యాయపరమైన సాయం కూడా అందించాడని నిర్ధారించుకుని.. శుక్రవారం ఆయనకు పదేళ్ల జైలుశిక్షను ఖరారు చేసింది. ► బియాలియాట్ స్కీ.. వియాస్నా మానవ హక్కుల సంఘం సహ వ్యవస్థాపకుడు. శాంతియుత పోరాటాలు నిర్వహిస్తుంది ఈ సంస్థ. 2020లో అలెగ్జాండర్ లుకాషెంకో తిరిగి బెలారస్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక.. దేశవ్యాప్తంగా తీవ్ర ప్రజావ్యతిరేకత వ్యక్తం అయ్యింది. ఈ నిరసనలకు బియాలియాట్ స్కీ.. ఆయన నిర్వహిస్తున్న ఫౌండేషన్ సూత్రధారి అని, నిరసనకారులకు అన్నివిధాలుగా సహకరించారనేది వెల్లువెత్తిన ఆరోపణలు. దీంతో 2021లో ఆయన్ని, వియాస్నా గ్రూప్‌కు చెందిన మరో ఇద్దరు సహవ్యవస్థాపకులనూ బెలారస్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. ► ఇదిలా ఉండగానే.. 2021 అక్టోబర్‌లో బియాలియాట్ స్కీకి నోబెల్ శాంతి ప్రైజ్(రష్యా మానవ హక్కుల సంస్థతో పాటు ఉక్రెయిన్‌కు చెందిన సంస్థకు సైతం) వరించింది. ► అలెస్ బియాలియాట్ స్కీ.. మానవ హక్కుల ఉద్యమకారుడే కాదు.. సాహిత్యకారుడు కూడా. స్కూల్ టీచర్‌గా, మ్యూజియం డైరెక్టర్‌గానూ ఆయన పని చేశాడు. 1980 నుంచి బెలారస్లో జరుగుతున్న పలు ఉద్యమాల్లో ఆయన భాగం అవుతూ వస్తున్నారు. ► సోవియట్ యూనియన్ నుంచి బెలారస్ స్వాతంత్రం కోసం ఉద్యమించిన ప్రముఖుల్లో ఈయన కూడా ఉన్నారు. ► 1990లో బెలారస్ స్వాతంత్ర్యం ప్రకటించుకుంది. 1994లో జరిగిన ఎన్నికల్లో అలెగ్జాండర్ లుకాషెంకో అధ్యక్షుడిగా ఎన్నియ్యాడు. అయితే.. అక్కడ పారదర్శకంగా జరిగిన ఎన్నిక అదొక్కటేనని చెప్తుంటారు మేధావులు. ఆపై దొడ్డిదారిలో ఎన్నికవుతూ.. ఇప్పటికీ ఆయన ఆ దేశ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ► లుకాషెంకో.. పుతిన్‌కు అత్యంత సన్నిహితుడు. రష్యా అండతోనే బెలారస్.. పాశ్చాత్య దేశాలపైకి కయ్యానికి కాలు దువ్వుతోంది. ఉక్రెయిన్ విషయంలోనూ రష్యాకు మద్దతు ఇస్తోంది. ఈ క్రమంలో తమ దేశంలో రష్యా బలగాలకు ఆశ్రయం కల్పిస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. ► 2020 అలర్లకు సంబంధించి రాజకీయ ఖైదీలకు.. బియాలియాట్ స్కీ బహిరంగ మద్దతు ప్రకటించారు. అయితే.. జైల్లో వాళ్లు ఎదుర్కొన్న వేధింపులను ఒక డాక్యుమెంటరీ ద్వారా బయటి సమాజానికి తెలియజేశారు. ఆ కోపంలోనే బెలారస్ సర్కార్ ఆయనపై పగ పెంచుకుని.. ఇబ్బందిపెడుతోందన్నది అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాల వాదన. ► బియాలియాట్ స్కీ జైలుకు వెళ్లడం ఇదేం కొత్త కాదు. 2011 నుంచి మూడేళ్లపాటు ఆయన జైలు శిక్ష అనుభవించారు. వియాస్నా గ్రూప్ ఫండింగ్‌కు సంబంధించి పన్నుల ఎగవేత నేరంపై అప్పుడు ఆయన శిక్ష అనుభవించారు. అయితే.. ఆ సమయంలోనూ ఆయన నేరారోపణలను ఖండించారు. ► ఇక 2021లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలకుగానూ మరోసారి అరెస్ట్ కాగా.. అప్పటి నుంచి చెరసాలలోనే ఉన్నారు. ఆ సమయంలో ఆయన అరెస్ట్‌ను మానవ హక్కుల సంఘాలు, బెలారస్ ప్రతిపక్షాలు తీవ్రంగా ఖండించాయి. అమ్నెస్టీ ఇంటర్నేషనల్ బియాలియాట్ అరెస్ట్‌ను ప్రభుత్వ ప్రతీకార చర్యగా అభివర్ణించింది. మొత్తం 23 మానవ హక్కుల సంఘాలు ఆయనకు సంఘీభావంగా సంయుక్తంగా ఓ ప్రకటన విడుదల చేశాయి. ► తొలుత 12 ఏళ్ల శిక్ష విధించాలని ప్రాసిక్యూటర్లు వాదించారు. అయితే.. కోర్టు మాత్రం పదేళ్ల శిక్ష విధించింది. ఆయనతో పాటు ఉన్న మరో ఇద్దరికి.. ఒకరికి ఏడు, మరొకరికి 9 ఏళ్ల శిక్షలు ఖరారు చేసింది. అఆగే ముగ్గురికి లక్ష నుంచి 3 లక్షల డాలర్ల జరిమానా కూడా విధించింది. ► బియాలియాట్ స్కీ జైలు శిక్ష తీర్పుపై బయటి దేశాల నుంచే కాదు బెలారస్‌లోనూ తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. వాదప్రతివాదాలు సహేతుకంగా జరగలేదని విమర్శించారు బెలారస్ ప్రతిపక్ష నేత, బహిష్కృత నేత స్వియాట్లానా. మరోవైపు ఆయన అరెస్ట్‌కు ఖండిస్తూ.. సంఘీభావంగా పలు చోట్ల శాంతి ర్యాలీలు నిర్వహిస్తున్నారు. -
2024 Paris Olympics: పారిస్ ఒలంపిక్స్‌ను బహిష్కరించాలి: పోలండ్
వార్సా: 2024 పారిస్ ఒలంపిక్స్‌లో రష్యా, బెలారస్‌ల ప్రాతినిధ్యాన్ని అంగీకరిస్తే తీవ్ర పరిణామాలుంటాయని పోలండ్ హెచ్చరించింది. రష్యా, బెలారస్‌లు ఒలంపిక్స్ పాల్గొనే పక్షంలో పోలండ్, లిథువేనియా, ఎస్టోనియా, లాట్వియా దేశాలు ఆ క్రీడలను బహిష్కరిస్తాయని పోలండ్ మంత్రి కమిల్ చెప్పారు. ఆ రెండు దేశాల క్రీడాకారులకు అవకాశమివ్వాలన్న అంతర్జాతీయ ఒలంపిక్ కమిటీ నిర్ణయాన్ని ఖండించారు. ఈ నెల 10న జరిగే ఐవోసీ భేటీలో ఈయూ, యూకే, అమెరికా, కెనడాలతోపాటు ఉక్రెయిన్‌పై రష్యా ఆక్రమణను వ్యతిరేకించే 40 దేశాలు గ్రూపుగా ఏర్పడాలన్నారు. ఈ 40 దేశాలు గనుక బహిష్కరిస్తే ఒలంపిక్స్ నిర్వహణకు అర్థమే లేకుండా పోతుందని చెప్పారు. రష్యా పాల్గొంటే తాము ఒలంపిక్స్‌ను బహిష్కరిస్తామని ఉక్రెయిన్ ఇప్పటికే స్పష్టం చేసింది. -
Aryna Sabalenka: ఎగతాళి చేసిన గడ్డపైనే చప్పట్లు
ఐదేళ్ల క్రితం సబలెంకా తొలిసారి ఆ్రస్టేలియా ఓపెన్ బరిలోకి దిగింది. మొదటి రౌండ్ మ్యాచ్‌లోనే ఆమె స్థానిక స్టార్ యాష్లీ బార్టీతో తలపడాల్సి వచ్చింది. అయితే షాట్ ఆడే సమయంలో సబలెంకా చేస్తున్న అరుపులు వివాదాన్ని రేపాయి. ప్రేక్షకులు ఆమెను బాగా ఎగతాళి చేశారు. చివరకు ఓటమితో మొదటి రౌండ్లోనే నిష్క్రమించాల్సి వచ్చింది. ఇప్పుడు అదే గడ్డపై ఆమెపై అభినందనలతో చప్పట్ల వర్షం కురుస్తోంది. సబలెంకా దూకుడైన ఆట, పదునైన ఏస్‌లు తప్ప ఆమె అరుపులు ఎవరికీ వినిపించడం లేదు. సబలెంకా ఎడమ చేతిపై పెద్దపులి టాటూ ఉంటుంది. ‘నేను నాలాగే ఉంటాను. ఎవరినీ లెక్క చేయను. నేను టైగర్‌ను’ అంటూ తనకు తాను చెప్పుకునే సబలెంకా అలాంటి ధీరోదాత్త ఆటను ప్రదర్శించింది. ఆరడుగుల ఎత్తు ఉన్న సబలెంకా బలం వేగవంతమైన సర్వీస్‌లో ఉంది. అయితే అదే బలం బలహీనతగా మారి గత టోర్నీలో నాలుగు రౌండ్లలోనే 56 డబుల్‌ఫాల్ట్‌లు చేసింది. ఈ సారి తన కోచింగ్ బృందంతో కలిసి ప్రత్యేక దృష్టి పెట్టిన ఆమె ఇప్పుడు 7 మ్యాచ్‌లలో కలిపి 29 డబుల్ ఫాల్ట్‌లే చేసింది. సబలెంకా టెన్నిస్‌ను చాలా ఆలస్యంగా మొదలు పెట్టింది. హాకీ ఆటగాడైన తండ్రి సెర్గీ ప్రోత్సాహంతో ఆటలోకి అడుగు పెట్టిన ఆమె 15 ఏళ్ల వయసు వరకు ఎలాంటి జూనియర్ టోర్నీలు ఆడనే లేదు. 16 ఏళ్ల వయసులో నేషనల్ టెన్నిస్ అకాడమీలో చేరిన తర్వాత ఆమె కెరీర్ మలుపు తిరిగింది. 2019లో తండ్రి ఆకస్మిక మరణం సబలెంకాను కలచివేసింది. ‘మా నాన్న నన్ను వరల్డ్నంబర్వన్గా చూడాలనుకున్నారు’ అని ఆమె గుర్తు చేసుకుంది. ఓపెన్ ఎరాలో గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలిచిన 58వ మహిళా ప్లేయర్‌గా నిలిచి రెండో ర్యాంక్‌కు చేరిన సబలెంకా నంబర్‌వన్ కావడానికి మరెంతో దూరం లేదు! Your #AO2023 women’s singles champion, @SabalenkaA 🙌@wwos • @espn • @eurosport • @wowowtennis • #AusOpen pic.twitter.com/5ggS5E7JTp — #AusOpen (@AustralianOpen) January 28, 2023 చదవండి: AUS Open 2023: మహిళల సింగిల్స్ విజేత సబలెంకా -
పదేళ్ల తర్వాత మళ్లీ సెమీస్‌లోకి
మెల్బోర్న్: తన పూర్వ వైభవాన్ని గుర్తుకు తెచ్చేలా ఆడిన బెలారస్ టెన్నిస్ స్టార్ విక్టోరియా అజరెంకా పదేళ్ల తర్వాత ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెమీఫైనల్ దశకు అర్హత సాధించింది. సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ప్రపంచ 24వ ర్యాంకర్ అజరెంకా మూడోసారి సెమీఫైనల్‌కు చేరింది. 2012, 2013లో ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేతగా నిలిచిన అజరెంకా 2013లో ఫ్రెంచ్ ఓపెన్‌లో సెమీఫైనల్ చేరాక మరే గ్రాండ్‌స్లామ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్ దాటలేకపోయింది. మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో అజరెంకా 6–4, 6–1తో మూడో సీడ్ జెస్సికా పెగూలా (అమెరికా)పై అలవోకగా గెలిచింది. 97 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్ లో అజరెంకా 17 విన్నర్స్ కొట్టి, ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసింది. మరో క్వార్టర్ ఫైనల్లో 22వ సీడ్ రిబాకినా (కజకిస్తాన్) 6–2, 6–4తో 17వ సీడ్ ఒస్టాపెంకో (లాత్వియా)ను ఓడించి సెమీస్‌లో అజరెంకాతో పోరుకు సిద్ధమైంది. పురుషుల సింగిల్స్‌లో మూడో సీడ్ సిట్సిపాస్ (గ్రీస్), 18వ సీడ్ ఖచనోవ్ (రష్యా) సెమీఫైనల్లోకి ప్రవేశించారు. క్వార్టర్ ఫైనల్స్‌లో సిట్సిపాస్ 6–3, 7–6 (7/2), 6–4తో లెహచ్కా (చెక్ రిపబ్లిక్)పై నెగ్గగా... ఖచనోవ్ 7–6 (7/5), 6–3, 3–0తో ఆధిక్యంలో ఉన్న దశలో అతని ప్రత్యర్థి సెబాస్టియన్ కోర్డా (అమెరికా) గాయంతో వైదొలిగాడు. ‘మిక్స్డ్’ సెమీస్‌లో సానియా–బోపన్న జోడీ సానియా మీర్జా–రోహన్ బోపన్న (భారత్) ద్వయం కోర్టులోకి అడుగు పెట్టకుండానే మిక్స్డ్ డబుల్స్‌లో సెమీఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకున్నారు. సానియా–బోపన్నలతో ఆడాల్సిన ఒస్టాపెంకో (లాత్వియా)–వెగా హెర్నాండెజ్ (స్పెయిన్) జోడీ గాయం కారణంగా బరిలోకి దిగకపోవడంతో భారత జంటను విజేతగా ప్రకటించారు. -
రష్యా, బెలారస్ జాతీయ జెండాలపై నిషేధం
ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో భాగంగా రష్యా, బెలారస్ దేశాల జాతీయ జెండాలపై నిషేధం విధించారు. టోర్నమెంట్‌లోని ఓ టెన్నిస్ కోర్టులో జరిగిన ఘటన ఆధారంగా నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకున్నారు. మెల్బోర్న్ పార్క్‌లోకి జాతీయ జెండాలను తీసుకువచ్చేందుకు తొలుత ప్రేక్షకులకు అనుమతి ఇచ్చారు. అయితే ఉక్రెయిన్ ప్లేయర్ కేతరినీ బెయిడా, రష్యా ప్లేయర్ కమిల్లా రఖిమోవా మధ్య మ్యాచ్ జరుగుతున్న సమయంలో కొందరు ప్రేక్షకులు రష్యా జెండాలను ప్రదర్శించారు. దీంతో నిర్వాహకులు తక్షణమే ఆ రెండు దేశాల జెండాలపై బ్యాన్ విధించారు. అంతేకాదు తమ ప్లేయర్‌ను రష్యన్లు వేధించినట్లు ఉక్రెయిన్ అభిమానులు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై తక్షణమే చర్యలు తీసుకోవాలని టెన్నిస్ ఆస్ట్రేలియాను కోరారు. దీంతో ఆస్ట్రేలియన్ ఓపెన్ నిర్వాహకులు ఈ రెండు దేశాల జాతీయ జెండాల ప్రదర్శించకుండా నిషేధం విధించింది. చదవండి: షార్ట్ టెంపర్‌కు మారుపేరు.. అభిమానిపై తిట్ల దండకం సంచలనం.. మాజీ వరల్డ్ నెంబర్ వన్‌కు బిగ్‌షాక్ -
ఒక్క సెట్ కూడా కోల్పోకుండా విజేతగా నిలిచిన సబలెంకా
అడిలైడ్: గత ఏడాది ఒక్క టైటిల్ నెగ్గలేకపోయిన బెలారస్ టెన్నిస్ స్టార్, ప్రపంచ ఐదో ర్యాంకర్ సబలెంకా ఈ సంవత్సరాన్ని టైటిల్‌తో ప్రారంభించింది. ఆదివారం ముగిసిన అడిలైడ్ ఇంటర్నేషనల్–1 ఓపెన్ డబ్ల్యూటీఏ–500 టోర్నీలో ఆమె విజేతగా నిలిచింది. ఫైనల్లో సబలెంకా 6–2, 7–6 (7/4)తో క్వాలిఫయర్ లిండా నొస్కోవా (చెక్ రిపబ్లిక్)పై గెలిచింది. ఈ టోర్నీలో సబలెంకా ప్రత్యర్థులకు ఒక్క సెట్ కూడా కోల్పోకపోవడం విశేషం. సబలెంకా కెరీర్లో ఇది 11వ టైటిల్‌కాగా... ఆమెకు 1,20,150 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 98 లక్షల 92 వేలు)తోపాటు 470 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
ఒలింపిక్ మాజీ స్విమ్మర్‌కు 12 ఏళ్ల జైలుశిక్ష
బెలారస్‌కు చెందిన మాజీ ఒలింపిక్ స్విమ్మర్ అలియాక్సాండ్రా హెరాసిమేనియాకు 12 ఏళ్ళ జైలుశిక్ష పడింది. దేశ భద్రతకు ముప్పు వాటిల్లేలా ఆమె చర్యలు ఉన్నాయని.. ఆమె వల్ల దేశానికి హాని పొంచి ఉందన్న కారణంతో ఈ శిక్ష విధిస్తున్నట్లు మింక్స్ కోర్టు తెలిపింది. అలియాక్సాండ్రాతో పాటు ఆమె స్నేహితుడు పొలిటికల్ యాక్టివిస్ట్ అలెగ్జాండర్ ఒపేకిన్కు కూడా 12 ఏళ్ల జైలుశిక్ష విధించినట్లు పేర్కొంది. అలెగ్జాండర్ లుకాషెంకో యొక్క నిరంకుశ పాలనను నిరసించడంలో హెరాసిమేనియా, ఒపేకిన్ ముందు వరుసలో నిలిచి అపఖ్యాతిని సంపాదించుకున్నారని.. అందుకే వారి వల్ల దేశ భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని భావించి జైలుశిక్ష విధించారని న్యూస్ బీటీ ఏజెన్సీ ఒక ప్రకటనలో తెలిపింది. ఇక అలియాక్సాండ్రా మూడుసార్లు ఒలింపిక్ మెడల్స్ సొంతం చేసుకుంది. 2012 లండన్ ఒలింపిక్స్‌లో 50 మీటర్ల ఫ్రీస్టైల్ విభాగం, 100 మీటర్ల ఫ్రీసైల్ విభాగంలో సిల్వర్ మెడల్ గెలిచిన ఆమె.. 2016 రియో ఒలింపిక్స్‌లో 50 మీటర్ల ఫ్రీస్టైల్ విభాగంలో కాంస్య పతకం సాధించింది. -
స్వియాటెక్‌కు సబలెంకా షాక్
టెక్సాస్ (అమెరికా): ఈ ఏడాదిని మరో టైటిల్‌తో ముగించాలని ఆశించిన ప్రపంచ నంబర్‌వన్ ఇగా స్వియాటెక్ (పోలాండ్)కు నిరాశ ఎదురైంది. మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) సీజన్ ముగింపు టోర్నీ డబ్ల్యూటీఏ ఫైనల్స్‌లో టాప్ సీడ్ స్వియాటెక్ పోరాటం సెమీఫైనల్లో ముగిసింది. బెలారస్ ప్లేయర్, ప్రపంచ ఏడో ర్యాంకర్ సబలెంకా 6–2, 2–6, 6–1తో స్వియాటెక్‌ను ఓడించి ఫైనల్లోకి దూసుకెళ్లింది. లీగ్ దశలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచిన స్వియాటెక్ సెమీస్‌లో మాత్రం సబలెంకా ధాటికి తడబడింది. ఈ ఏడాది స్వియాటెక్ ఫ్రెంచ్ ఓపెన్, యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌తోపాటు మరో ఆరు టోర్నీలలో విజేతగా నిలిచింది. ఓవరాల్‌గా ఈ సీజన్లో ఆమె 67 మ్యాచ్‌ల్లో గెలిచింది. మరో సెమీఫైనల్లో కరోలినా గార్సియా (ఫ్రాన్స్) 6–3, 6–2తో మరియా సాకరి (గ్రీస్)పై గెలిచి ఫైనల్లో సబలెంకాతో టైటిల్ పోరుకు సిద్ధమైంది. సాకరి కూడా లీగ్ దశలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో గెలిచి కీలకమైన సెమీఫైనల్లో ఓడిపోవడం గమనార్హం. -
మానవ హక్కుల పోరాటాలకు నోబెల్ శాంతి బహుమతి
ఓస్లో: మానవ హక్కుల పరిరక్షణ కోసం కొనసాగుతున్న ఉద్యమాలకు నోబెల్ కమిటీ అత్యున్నత గౌరవాన్ని కల్పించింది. బెలారస్ మానవ హక్కుల ఉద్యమకారుడు అలెస్ బియాల్‌యాస్కీ(60), రష్యా మానవ హక్కుల సంస్థ ‘మెమోరియల్’, ఉక్రెయిన్ సంస్థ ‘సెంటర్ ఫర్ సివిల్ లిబర్టీస్’కు సంయుక్తంగా 2022 సంవత్సరానికి గాను నోబెల్ శాంతి బహుమతిని శుక్రవారం ప్రకటించింది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రెండు దేశాల్లోని సంస్థలు ప్రపంచ ప్రతిష్టాత్మక బహుమానానికి ఎంపిక కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఉక్రెయిన్‌పై దండెత్తుతున్న రష్యా అధినేత పుతిన్ ఏకపక్ష వైఖరిపై ఇదొక నిరసన అని నిపుణులు అంచనా వేస్తున్నారు. బెలారస్, రష్యా, ఉక్రెయిన్‌లో మానవ హక్కులు, ప్రజాస్వామ్యం, శాంతియుత సహజీవనం వంటి అంశాల్లో గొప్ప చాంపియన్లు అయిన ముగ్గురిని (ఒక వ్యక్తి, రెండు సంస్థలు) శాంతి బహుమతితో గౌరవిస్తుండడం ఆనందంగా ఉందని నార్వే నోబెల్ కమిటీ చైర్మన్ బెరిట్ రీస్–ఆండర్సన్ చెప్పారు. ఆమె మీడియాతో మాట్లాడారు. వారంతా సైనిక చర్యలను వ్యతిరేకిస్తూ మానవీయ విలువలు, న్యాయ సూత్రాల రక్షణ అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారని కొనియాడారు. దేశాల మధ్య శాంతి, సౌభ్రాతృత్వం వర్థిల్లాలని ఆల్ఫెడ్ నోబెల్ ఆకాంక్షించారని గుర్తుచేశారు. బియాల్‌యాస్కీని విడుదల చేయండి జైలులో ఉన్న అలెస్ బియాల్‌యాస్కీని విడుదల చేయాలని బెలారస్ పాలకులకు బెరిట్ రీస్–ఆండర్సన్ విజ్ఞప్తి చేశారు. బహుమతి బియాల్యాస్కీలో నైతిక స్థైర్యాన్ని పెంచుతుందని, ఆయనపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపించబోదని భావిస్తున్నట్లు తెలిపారు. రష్యా మానవ హక్కుల సంస్థకు శాంతి బహుమతి ప్రకటించడం ద్వారా.. శుక్రవారం 70వ పుట్టినరోజు జరుపుకుంటున్న పుతిన్‌కు ఉద్దేశపూర్వకంగా ఏదైనా సంకేతం పంపదలిచారా? అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా... ప్రజలకు మంచి చేసేవారికి బహుమతి ఇస్తుంటామని, అంతేతప్ప తాము ఎవరికీ వ్యతిరేకం కాదని, వ్యక్తుల పుట్టినరోజులతో తమకు సంబంధం లేదని బెరిట్ రీస్–ఆండర్సన్ బదులిచ్చారు. ఈ ప్రైజ్ పొందడం ద్వారా ఆయా సంస్థల వెనుక ఉన్న వ్యక్తులు వారు నమ్మినదాని కోసం మరింత ఉత్సాహంతో కృషి సాగిస్తారన్న నమ్మకం తమకు ఉందన్నారు. గత ఏడాది(2021) నోబెల్ శాంతి బహుమతిని సంయుక్తంగా అందుకున్న రష్యా జర్నలిస్టు దిమిత్రీ మురతోవ్, ఫిలిప్పైన్స్ జర్నలిస్టు మారియా రెస్సా అక్కడి ప్రభుత్వాల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాము పనిచేస్తున్న మీడియా సంస్థల్లో ఉద్యోగాలను కాపాడుకోవడానికి పెద్ద పోరాటమే చేయాల్సి వస్తోంది. భావవ్యక్తీకరణ స్వేచ్ఛ కోసం సాగించిన పోరాటానికి వీరిద్దరికి నోబెల్ లభించింది. యుద్ధంపై ఎక్కుపెట్టిన ఆయుధం ఉక్రెయిన్‌లోని కొందరు శాంతి కాముకులు 2007లో ‘సెంటర్ ఫర్ సివిల్ లిబర్టీస్’ను ఏర్పాటు చేశారు. అప్పట్లో దేశంలో అశాంతి రగులుతున్న తరుణంలో మానవ హక్కుల పరిరక్షణ, ప్రజాస్వామ్య ఉద్యమాలను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ సంస్థకు శ్రీకారం చుట్టారు. ఉక్రెయిన్ పౌర సమాజాన్ని బలోపేతం తదితరాలు సంస్థ ముఖ్య లక్ష్యాలు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం మొదలైన తర్వాత ఈ సంస్థ మరింత క్రియాశీలకంగా పనిచేస్తోంది. సాధారణ ప్రజలపై రష్యా యుద్ధ నేరాలను రికార్డు చేసి, ప్రపంచానికి తెలియజేస్తోంది. ఈ యుద్ధ నేరాలకు రష్యాను జవాబుదారీగా మార్చేందుకు కృషి చేస్తోంది. యుద్ధానికి వ్యతిరేకంగా ఎక్కుపెట్టిన అసలైన ఆయుధం మానవ హక్కుల పోరాటమేనని ‘సెంటర్ ఫర్ సివిల్ లిబర్టీస్’ చెబుతోంది. అంకితభావం గల ఉద్యమకారుడు అలెస్ బియాల్‌యాస్కీ నేటి రష్యాలోని వైర్టిసిల్లాలో 1962 సెప్టెంబర్ 25వ తేదీన జన్మించారు. ఆ తర్వాత వారి కుటుంబం బెలారస్‌కు వలస వెళ్లింది. విద్యాభ్యాసం అనంతరం బియాల్‌యాస్కీ కొంతకాలంపాటు పాఠశాల ఉపాధ్యాయుడిగా, తర్వాత సైన్యంలో డ్రైవర్‌గా పనిచేశారు. 1980వ దశకం నుంచి బెలారస్లో ఆయన మానవ హక్కుల ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. 1996లో ‘వియాస్నా హ్యూమన్ రైట్స్ సెంటర్’ అనే ప్రభుత్వేతర సంస్థను స్థాపించారు. అంకితభావం కలిగిన మానవ హక్కుల, పౌరస్వేచ్ఛ, ప్రజాస్వామ్య ఉద్యమకారుడిగా ప్రజల్లో గుర్తింపు పొందారు. ఎన్నో పోరాటాలను ముందుండి నడిపించారు. హవెల్స్ ఫర్ హ్యూమన్ రైట్స్ అవార్డును 2013లో, నోబెల్‌కు ప్రత్యామ్నాయంగా భావించే రైట్ లైవ్లీçహుడ్ అవార్డును 2020లో గెలుచుకున్నారు. ప్రభుత్వ వ్యతిరేక పోరాటాలకు సారథ్యం వహిస్తున్న బియాల్‌యాస్కీని పన్నులు ఎగవేశారన్న కారణంతో బెలారస్ పాలకులు 2021 జూలై 14న నిర్బంధించారు. ఆయన ప్రస్తుతం ఎలాంటి విచారణ లేకుండా జైలులో మగ్గుతున్నారు. ఆయనను విడుదల చేయాలంటూ ప్రజలు డిమాండ్ చేస్తున్నా పాలకులు లెక్కచేయడం లేదు. ఎన్నో అవరోధాలు, బెదిరింపులు ఎదురైనా వెనక్కి తగ్గకుండా నమ్మిన సిద్ధాంతానికి బియాల్‌యాస్కీ కట్టుబడి ఉండడం విశేషం. సైనిక చర్యలకు వ్యతిరేకంగా పోరాటం ‘మెమోరియల్’ సంస్థ 1989 జనవరి 28న అప్పటి సోవియట్ యూనియన్ చివరిదశలో ఉన్న సమయంలో ఏర్పాటైంది. ప్రధానంగా ఇది న్యాయ సేవా సంస్థ. కమ్యూనిస్టు పాలకుల అణచివేత చర్యల వల్ల ఇబ్బందులు పడుతున్నవారికి అండగా నిలిచింది. రష్యాలో మానవ హక్కుల విధ్వంసంపై, రాజకీయ ఖైదీల స్థితిగతులపై ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తోంది. సైనిక చర్యలకు వ్యతిరేకంగా పోరాడుతోంది. ‘మెమోరియల్’ ప్రధాన కార్యాలయం రష్యా రాజధాని మాస్కోలో ఉంది. సంస్థ బోర్డు చైర్మన్‌గా యాన్ రచిన్‌స్కీ వ్యవహరిస్తున్నారు. ఉక్రెయిన్‌పై యుద్ధం నేపథ్యంలో ఈ సంస్థను ఈ ఏడాది ఏప్రిల్ 5న రష్యా ప్రభుత్వం మూసివేసింది. అయినప్పటికీ ‘మెమోరియల్’ కార్యకలాపాలు అనధికారికంగా కొనసాగుతూనే ఉండటం విశేషం. -
రష్యా, బెలారస్ ప్లేయర్లపై నిషేధం అన్యాయం.. నదాల్, జకో, ముర్రే
ఉక్రెయిన్‌పై రష్యా దాడులను వ్యతిరేకిస్తూ వింబుల్డన్ నిర్వాహకులు తీసుకున్న నిర్ణయంపై స్టార్ టెన్నిస్ ప్లేయర్లు రఫెల్ నదాల్, నొవాక్ జకోవిచ్, ఆండీ ముర్రే స్పందించారు. రష్యా, బెలారస్ ఆటగాళ్లను వింబుల్డన్‌లో పాల్గొనకుండా నిషేధించడాన్ని వారు తప్పుబట్టారు. ఈ నిషేధం అన్యాయమని, ఆల్ ఇంగ్లండ్ క్లబ్ తీసుకున్న ఈ కఠినమైన నిర్ణయం వల్ల చాలా మంది ప్రతిభావంతులైన ఆటగాళ్లు నష్టపోతారని అభిప్రాయపడ్డారు. ఈ నిర్ణయాన్ని ఏటీపీ (అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్), డబ్ల్యూటీఏ (వుమెన్స్ టెన్నిస్ అసోసియేషన్) కూడా ఖండించింది. కాగా, రష్యా.. బెలారస్ సరిహద్దుల నుంచి ఉక్రెయిన్‌పై దాడుల చేస్తున్నందుకు గాను ఆ రెండు దేశాల ప్లేయర్లపై ఆల్ ఇంగ్లండ్ క్లబ్ నిషేధం విధించింది. వింబుల్డన్ నిర్వాహకులు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల వరల్డ్ నంబర్ టూ ర్యాంకర్ డేనిల్ మెద్వెదెవ్, గతేడాది వుమెన్స్ సెమీ ఫైనలిస్ట్ (వింబుల్డన్ ), బెలారస్ క్రీడాకారిణి అరీనా సబలెంకా వంటి చాలామంది ప్రతిభావంతులైన క్రీడాకారులు వింబుల్డన్‌కు దూరం కానున్నారు. వింబుల్డన్ టోర్నీ ఈ ఏడాది జూన్ 27నుండి జూలై 10 వరకు జరగనుంది. చదవండి: Andre Russell: ఆఖరి ఐదు మ్యాచ్‌ల్లో మా తడాఖా ఏంటో చూపిస్తాం.. -
ఉక్రెయిన్ తిప్పికొడుతోంది
కీవ్: ఉక్రెయిన్‌పై నెలకు పైగా సాగిస్తున్న యుద్ధంలో రష్యా సేనలు క్రమంగా వెనకడుగు వేస్తున్న సూచనలు కన్పిస్తున్నాయి. రష్యా సైన్యం ఆక్రమించిన చాలా పట్టణాలు, గ్రామాలను ఉక్రెయిన్ దళాలు తిరిగి స్వాధీనం చేసుకుంటున్నాయి. కీవ్, చెర్నిహివ్ ప్రాంతాల్లో, ఇతర చోట్ల కనీసం 30కి పైగా సెటిల్మెంట్లను ఇప్పటికే విముక్తం చేసినట్టు ఉక్రెయిన్ సైన్యం ప్రకటించింది. కీవ్, పరిసర ప్రాంతాల నుంచి రష్యా దళాలు భారీ స్థాయిలో వెనక్కు వెళ్లడం శనివారం కూడా కొనసాగింది. 700కు పైగా సాయుధ వాహనాలు కీవ్ నుంచి బెలారస్ దిశగా వెనుదిరుగుతూ కన్పించాయి. అయితే అవి వెనక్కు వెళ్లడం లేదని, తూర్పున డోన్బాస్‌పై భారీ దాడి కోసమే బయల్దేరుతున్నాయని ఉక్రెయిన్, పశ్చిమ దేశాలు అనుమానిస్తున్నాయి. పైగా రష్యా దళాలు వెనక్కు వెళ్తూ వీలైన చోటల్లా మందుపాతరలు అమర్చాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆరోపించారు. ఉక్రెయిన్‌కు మరో 30 కోట్ల డాలర్ల విలువైన ఆయుధాలను అందజేయనున్నట్టు అమెరికా ప్రకటించింది. వీటిలో లేజర్ గైడెడ్రాకెట్ సిస్టమ్స్, మానవరహిత విమానాలు, నైట్ విజన్ పరికరాలు, సాయుధ వాహనాలు తదితరాలుంటాయని పేర్కొంది. మరోవైపు శుక్రవారం రష్యా, ఉక్రెయిన్ బృందాల మధ్య జరిగిన వీడియో కాన్ఫరెన్స్ చర్చలు ఏ మేరకు పురోగతి సాధించిందీ తెలియరాలేదు. కానీ ఉక్రెయిన్ తమ దేశంపై దాడులు చేస్తోందన్న వార్తలు చర్చలకు ఆటంకం కలిగిస్తాయని పుతిన్ అధికార ప్రతినిధి ద్మత్రీ పెస్కోవ్ అన్నారు. కీవ్‌ను సందర్శించాలని ఆలోచిస్తున్నట్టు పోప్ ఫ్రాన్సిస్ తెలిపారు. ఇక మారియుపోల్ సహా పలు నగరాల్లో రష్యా విధ్వంసకాండ కొనసాగుతూనే ఉంది. యువకులను ఏడాది పాటు సైనిక విధుల్లోకి తీసుకునే వార్షిక కార్యక్రమానికి రష్యా శుక్రవారం శ్రీకారం చుట్టింది. లక్షన్నర మందిని రిక్రూట్ చేసుకోవాలన్నది లక్ష్యమని చెప్తున్నారు. రష్యాకు ఆయుధాల కొరత రష్యా వద్ద పలు కీలక ఆయుధాలు దాదాపుగా నిండుకున్నాయని ఇంగ్లండ్ రక్షణ వర్గాలు చెబుతున్నాయి. వాటిని ఇప్పుడప్పుడే భర్తీ చేసుకునే అవకాశాలు కూడా లేవంటున్నాయి. హెలికాప్టర్లు, ఫైటర్ జెట్లు, క్రూయిజ్ మిసైళ్ల కొరత రష్యాను తీవ్రంగా వేధిస్తున్నట్టు చెప్పాయి. పలు కీలక విడి భాగాలను ఉక్రెయిన్ నుంచే రష్యా దిగుమతి చేసుకుంటోందని సమాచారం. 2014 క్రిమియా యుద్ధానంతరం రష్యాకు ఆయుధాల ఎగుమతిని ఉక్రెయిన్ బాగా తగ్గించింది. యుద్ధ నేపథ్యంలో నెలకు పైగా అవి పూర్తిగా ఆగిపోయాయి. ఇంగ్లండ్ స్టార్‌స్ట్రీక్ మిసైల్‌తో రష్యా హెలికాప్టర్ కూల్చివేత ఇంగ్లండ్‌లో తయారైన స్టార్‌స్ట్రీక్ మిసైల్ సాయంతో రష్యా ఎంఐ–28ఎన్ హెలికాప్టర్‌ను లుహాన్స్క్ ప్రాంతంలో ఉక్రెయిన్ కూల్చేసింది. మిసైల్ ఢీకొట్టడంతో హెలికాప్టర్ రెండు ముక్కలై నేలకూలిన వీడియో వైరల్‌గా మారింది. ధ్వని కంటే మూడు రెట్ల వేగంతో దూసుకెళ్లే ఈ లేజర్ గైడెడ్ మిసైల్ సిస్టమ్ తక్కువ ఎత్తులో వెళ్లే హెలికాప్టర్లను 100 శాతం కచ్చితత్వంతో నేలకూలుస్తుంది. పైగా ఇది చాలా తేలిగ్గా ఉంటుంది గనుక ఎక్కడికైనా సులువుగా మోసుకెళ్లవచ్చు. భుజం మీది నుంచి కూడా ప్రయోగించవచ్చు. స్టార్‌స్ట్రీక్ ప్రయోగంపై రష్యా మండిపడింది. ఇకపై ఇంగ్లండ్ ఆయుధ సరఫరాల నౌకలు, వాహనాలను లక్ష్యం చేసుకుని దాడులకు దిగుతామని హెచ్చరించింది. -
యుద్ధంలో ట్విస్ట్.. జోష్‌లో జెలెన్ స్కీ.. పుతిన్‌కి బిగ్ షాక్
కీవ్: ఉక్రెయిన్‌లో రష్యాలు దాడులు కొనసాగుతున్నాయి. గత నెల రోజులుగా బాంబు దాడులతో ఉక్రెయిన్‌లోని నగరాలన్నీ పూర్తిగా ధ్వంసమయ్యాయి. దీంతో ఉక్రెయిన్‌కు భారీ నష్టం జరిగింది. రష్యా దాడుల కారణంగా ఇప్పటికే పలు దేశాలు ఉక్రెయిన్‌కు ఆయుధాలు, రక్షణ సామాగ్రిని అందిస్తున్నాయి. మరోవైపు యుద్ధం జరుగుతున్న వేళ తమ దేశం తరఫున పోరాడేందుకు వాలంటీర్లు రావాలని అభ్యర్థించారు. దీంతో ఇప్పటికే పలు దేశాల నుంచి యువకులు పెద్ద సంఖ్యలో ఉక్రెయిన్ ఆర్మీతో కలిసి రష్యా బలగాలపై పోరాడుతున్నారు. భారత్ తరఫున తమిళనాడుకు చెందిన సైనికేశ్ రవిచంద్రన్ కూడా ఉక్రెయిన్ ఆర్మీలో చేరిన విషయం తెలిసిందే. తాజాగా రష్యా బలగాల దాడులను తిప్పికొట్టేందుకు బెలారస్‌కు చెందిన ఔత్సాహిక ఫైటర్లు ఉక్రెయిన్ సైన్యంలో చేరారు. దీనికి సంబంధించిన ఒక వీడియోను కీవ్ ఇండిపెండెంట్ ట్విట్టర్లో పోస్ట్ చేసింది. బెలారసియన్ 19వ శతాబ్దపు రచయిత, విప్లవకారుడు కస్టస్ కలినౌస్కి పేరుతో ఏర్పడిన బెలారసియన్ వాలంటీర్ బెటాలియన్ సభ్యులు ఉక్రెయిన్ సైన్యంతో భాగమైనట్లుగా ప్రమాణం చేసినట్లు ఈ వీడియోలో ఉన్నది. ఈ సందర్భంగా మారు మాట్లాడుతూ.. స్వతంత్ర ఉక్రెయిన్ కోసం తాము పోరాడతామని.. ఎందుకంటే ఉక్రెయిన్ స్వతంత్రంగా లేకపోతే భవిష్యత్‌లో బెలారస్ కూడా స్వతంత్రంగా ఉండదని ఈ గ్రూప్‌కు నాయకత్వం వహించిన పావెల్ కులజంకా స్పష్టం చేశారు. మరోవైపు.. బెలారస్ నుంచే రష్యా బలగాలు దాడులు ప్రారంభించిన విషయం తెలిసిందే. బెలారస్‌ను 28 ఏండ్లుగా పరిపాలిస్తున్న అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాషెంకో ఉక్రెయిన్‌పై యుద్ధంలో రష్యాకు సహకరిస్తున్నారు. దీంతో రష్యన్ బలగాలు ఉత్తర బెలారస్ సరిహద్దు మీదుగా ఉక్రెయిన్‌లోకి ప్రవేశించి బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బెలారసియన్ వాలంటీర్ బెటాలియన్ సభ్యులు.. బెలారసియన్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాషెంకో మాదిరిగా కాకుండా ఉక్రెయిన్‌కు తాము మద్దతుగా ఉంటామని ప్రతిజ్ఞ చేశారు. ⚡️Belarusian Volunteer Battalion officially joins Ukraine’s military. The members of the battalion named after Kastus Kalinouski, Belarusian 19th century writer and revolutionary, took oath and became part of Ukraine’s Armed Forces. pic.twitter.com/XyrtX0owPn — The Kyiv Independent (@KyivIndependent) March 26, 2022 -
ఉక్రెయిన్‌పై యుద్ధం.. ఇక రష్యాను తిట్టేయొచ్చు!
ఉక్రెయిన్‌పై ఆక్రమణకుగానూ రష్యాపై కోపంతో రగిలిపోతున్నారు కొందరు. అయితే వాళ్ల తమ ఆక్రోశాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకోవడానికి కొన్ని అభ్యంతరాలు అడ్డం పడుతున్నాయి. విద్వేషపూరిత కామెంట్లు, హింసాత్మక సందేశాలు, ఉల్లంఘనల పేరిట.. అలాంటి పోస్టులకు అనుమతి ఇవ్వడం లేదు. ఈ తరుణంలో ఫేస్బుక్ కాస్త ఊరట ఇచ్చింది. ఉక్రెయిన్ ఆక్రమణ విషయంలో రష్యాకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టేందుకు ‘తాత్కాలిక’ అనుమతులు మంజూరు చేసింది ఫేస్బుక్. ఫేస్‌బుక్‌తో పాటు ఇన్స్టాగ్రామ్ యూజర్లు కూడా ఈ పరిణామాలకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టొచ్చని గురువారం ప్రకటించింది మెటా సంస్థ. రష్యన్ 'ఆక్రమణదారుల'పై హింసాత్మక ప్రసంగాన్ని అనుమతించే పోస్ట్‌లను ఫేస్బుక్ తాత్కాలికంగా అనుమతిస్తోంది అంటూ మెటా గురువారం సాయంత్రం ఒక నోట్ రిలీజ్ చేసింది. అయితే ఇదంతా రాజకీయపరంగానే, అదీ పరిధిలోకి లోబడే ఉండాలట!. దురాక్రమణకు మూలకారకులు, ఆయా దేశాల అధ్యక్షులను(రష్యా, బెలారస్ అధ్యక్షులను ఉద్దేశించి పరోక్షంగా..) సంబంధించి కామెంట్లను అనుమతిస్తాం. ఒకవేళ అవి ఫేస్బుక్ సాధారణ ఉల్లంఘనలను దాటినా చర్యలు తీసుకుంటాం. కానీ, సాధారణ పౌరులు, సైనికులను ఉద్దేశించి హింసాత్మక పోస్టులు పెడితే మాత్రం ఎట్టిపరిస్థితుల్లో అనుమతించం అని స్పష్టం చేసింది మెటా. ఈ తాత్కాలిక పాలసీలను అర్మేనియా, అజెర్బైజాన్, ఎస్టోనియా, జార్జియా, హంగేరీ, లాత్వియా, లిథువేనియా, పోల్యాండ్, రొమేనియా, రష్యా, స్లోవేకియా, ఉక్రెయిన్లకు వర్తింపజేస్తున్నట్లు ప్రకటించింది. ఇదిలా ఉండగా.. రష్యా తమ దేశంలో ఫేస్‌బుక్‌పై తాత్కాలిక నిషేధం విధించినా, యూజర్లు మాత్రం ప్రత్యామ్నాయ మార్గాల్లో ఆ ప్లాట్‌ఫామ్‌ను వినియోగించుకుంటున్నారు. అయితే రష్యా, ఉక్రెయిన్ మరియు పోల్యాండ్తో సహా పలు దేశాల్లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉక్రెయిన్ ఆక్రమణలో రష్యాకు అండగా ఉంటున్న బెలారస్ ప్రెసిడెంట్ అలెగ్జాండర్ లుకాషెంకో చావుకు సంబంధించి కొన్ని పోస్ట్‌లను కూడా ఫేస్బుక్ తాత్కాలికంగా అనుమతులు ఇవ్వడం గమనార్హం. చదవండి: నూతన చట్టంతో ఉక్కుపాదం మోపిన రష్యా -
ఉక్రెయిన్ వార్: విమానాలు నిలిపేసిన ఏరోఫ్లోట్
న్యూయార్క్: రష్యాకు చెందిన దిగ్గజ విమానయాన సంస్థ ఏరోఫ్లోట్ అన్ని రకాల అంతర్జాతీయ విమానాలను ఈ నెల 8నుంచి నిలిపివేస్తున్నట్లు శనివారం ప్రకటించింది. బెలారస్‌కు మాత్రం తమ విమానాల రాకపోకలు సాగుతాయని తెలిపింది. విదేశీ విమానాలను అద్దెకు తీసుకునే రష్యా వైమానిక సంస్థలు ప్రయాణికుల, సరుకుల రవాణాను కొన్నాళ్లు నిలిపివేయాలని ఇటీవలే రష్యా విమానయాన నియంత్రణా సంస్థ రోసావైట్సియా సూచించింది. రష్యాపై ఆంక్షలు విధించడంతో లీజుకిచ్చిన విదేశీ విమానాలను వెనక్కు స్వాధీనం చేసుకునే అవకాశాలున్నాయని తెలిపింది. ఇందుకనుగుణంగానే ఏరోఫ్లోట్ తాజా నిర్ణయాన్ని ప్రకటించింది. ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్నవారికి నగదు రిఫండ్ చేస్తామని కంపెనీ తెలిపింది. ఇప్పటికే రష్యాకు చెందిన ఎస్7 సంస్థ అంతర్జాతీయ విమాన సర్వీసులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. -
యుద్ధం ఎఫెక్ట్.. రష్యా, బెలారస్‌కు ఊహించని షాక్
వాషింగ్టన్: ఉక్రెయిన్‌పై రష్యా సైనిక దాడులను కొనసాగిస్తోంది. రష్యా దళాలు ఉక్రెయిన్‌పై బాంబులు, క్షిపణులతో విరుచుకుపడుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ పరిస్థితులు భయానకంగా మారాయి. దీంతో రష్యా చర్యలపై ప్రపంచ దేశాలు పుతిన్‌పై ఆంక్షలు విధిస్తున్నాయి. ఇప్పటికే రష్యాపై యూరోపియన్ యూనియన్ సహా పలు దేశాలు ఆర్థిక ఆంక్షలను విధించాయి. యుద్ధంలో రష్యాకు బెలారస్ సాయం అందిస్తున్న కారణంగా ఆ దేశంపై కూడా ఆంక్షలు కొనసాగుతున్నాయి. తాజాగా రష్యా, బెలారస్ దేశాల్లో తాము అమలు చేస్తున్న అన్ని కార్యక్రమాలను తక్షణమే నిలిపివేస్తున్నట్లు ప్రపంచబ్యాంక్ తెలిపింది. 2014 నుంచి రష్యాకు ప్రపంచబ్యాంకు ఎలాంటి కొత్త లోన్లు ఇవ్వలేదు. పెట్టుబడులు పెట్టలేదు. అలాగే, బెలారస్‌కు 2020 నుంచి కొత్తగా రుణాలివ్వలేదు’ అని ఒక ప్రకటనలో పేర్కొంది. రష్యా ఉక్రెయిన్‌లోని క్రిమియాను 2014లో ఆక్రమించుకోగా, 2020లో జరిగిన బెలారస్ అధ్యక్ష ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని ప్రపంచ దేశాలు ఆరోపిస్తున్నాయి. అమెరికా సైతం రష్యాపై భారీ ఆంక్షలను విధించింది. ఉక్రెయిన్‌పై సైనిక దాడులకు దిగిన రష్యా భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని జో బైడెన్ వార్నింగ్ ఇచ్చారు. రష్యా, పుతిన్‌పై రానున్న కాలంలో యుద్ద ప్రభావం తీవ్రంగా ఉంటుందని తెలిపారు. ఉక్రెయిన్‌పై జరుగుతున్న యుద్ధంలో పుతిన్ గెలిచినా, ఓడినా.. ఆర్థిక పరంగా, ఇతర అంశాల విషయంలో రష్యా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. పుతిన్ ఓ నియంత.. అతడి అంతు చూస్తామంటూ బెడెన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు చెందిన విలాసవంతమైన అపార్ట్మెంట్లు, ప్రైవేట్ ఎయిర్ క్రాఫ్ట్‌లను సీజ్ చేస్తున్నామని వెల్లడించారు. -
ఉక్రెయిన్, రష్యా మధ్య రెండో దశ చర్చలు.. ఎజెండాలోని అంశాలు ఇవే!
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం మొదలుపెట్టి ఇప్పటికే ఎనిమిది రోజులు గడుస్తోంది. దీని వల్ల ఉక్రెయిన్ భారీగా నష్టపోయింది. అంతేకాకుండా యుద్ధ ప్రభావం రష్యా మీద కూడా ప్రతికూలంగానే ఉంది. సమస్య పరిష్కారం దిశగా వెళ్లాలని ప్రపంచ దేశాలు ఈ ఇరు దేశాలకు చెప్తున్నాయి. అయితే ఎవరివాదన వారిదేనన్నట్లు ఉంది రష్యా ఉక్రెయిన్ తీరు. ఎట్టికేలకు ఉక్రెయిన్, రష్యా మధ్య రెండో దశ చర్చలు బెలారస్- పోలాండ్ మధ్య చర్చలు జరిగాయి. చర్చలోకి వచ్చిన ఎజెండాలోని అంశాలు ఇవే 1. వెంటనే కాల్పుల విరమణ 2.యుద్ధ విరమణ 3. పౌరులు సరిహద్దులు దాటేందుకు వీలుగా చర్యలు చర్చలు చర్చలే.. దాడులు దాడులేనని అంతవరకు పరిస్థితిలో ఏ మార్పు రాదని రష్యా చెప్తోంది. మా డిమాండ్లను ఇంతకు ముందే చెప్పం.. అది ఒప్పుకుంటేనే యుద్ధం ఆగుతుందని రష్యా స్పష్టం చేసింది. దోనాస్క్ ల్యూనిస్క్లను వదిలేయాలని ఉక్రెయిన్ అంటోంది. ప్రస్తుతం ఈ రెండో విడత చర్చల కోసం ఉక్రెయిన్ ప్రతినిధులు బెలారస్‌కు బయలుదేరారు. కాగా ఫిబ్రవరి 28న బెలారస్లో రష్యా ఉక్రెయిన్ల మధ్య సుమారు 4 గంటల చర్చలు జరిగాయి. అయితే, ఇరు వర్గాల మధ్య నెలకొన్న ప్రతిష్టంభన కారణంగా చర్చలు విఫలమైయ్యాయి. ప్రస్తుతం గురువారం జరగబోయే చర్చలైనా సఫలం అవ్వాలని ఇరదేశాల ప్రజలతో పాటు ప్రపంచ దేశాలు కోరుకుంటున్నాయి. -
రష్యాకు మరో షాక్.. పుతిన్ అహంకారానికి అథ్లెట్లు బలి
Russian and Belarus Athletes Banned From Winter Paralympics: ఉక్రెయిన్‌పై దాడుల నేపథ్యంలో రష్యాపై యావత్ క్రీడా జగత్తు కన్నెర్ర చేస్తుంది. ఇప్పటికే ఆ దేశంపై ప్రముఖ ఫుట్‌బాల్ సంస్థలు ఫిఫా, UEFA బ్యాన్ విధించగా.. తాజాగా వింటర్ పారాలింపిక్ కమిటీ కత్తి దూసింది. 2022 వింటర్ పారాలింపిక్స్‌లో రష్యాతో పాటు బెలారస్ అథ్లెట్లు పాల్గొనకుండా అంతర్జాతీయ పారాలింపిక్ కమిటీ నిషేధం విధించింది. అంతర్జాతీయంగా వస్తున్న ఒత్తిళ్ల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు పారాలింపిక్ కమిటీ అధ్యక్షుడు ఆండ్రూ పార్సన్స్ తెలిపారు. రాజకీయాలతో క్రీడలకు ఎటువంటి సంబంధం లేనప్పటికీ, అనివార్య కారణాల వల్ల రష్యా, బెలారస్ పారా అథ్లెట్లను బహిష్కరించాల్సి వచ్చిందని ఆయన అన్నారు. ఇలా జరిగినందుకు చింతిస్తున్నామని పేర్కొన్నారు. ఆయా దేశ ప్రభుత్వాల చర్యలకు, ముఖ్యంగా పుతిన్ అహంకారానికి పారా అథ్లెట్లు బలైపోయారని వాపోయారు. కాగా, రేపటి (మార్చి 4) నుంచి బీజింగ్‌లో వింటర్ పారాలింపిక్స్ పోటీలు ప్రారంభంకానున్నాయి. ఈ పోటీల్లో రష్యా నుంచి 71 మంది, బెలారస్ నుంచి 12 మంది పారా అథ్లెట్లు పాల్గొనాల్సి ఉండింది. చదవండి: రష్యా అధ్యక్షుడికి వరుస షాక్‌లు.. తైక్వాండో బ్లాక్ బెల్ట్ కూడా తొలగింపు