ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఐదేళ్ల పిల్లాడు చేసిన బిత్తిరి చర్య ప్రాణాల మీదకు తెచ్చింది. అయితే స్థానికులు అప్రమత్తం కావటంతో చిన్నచిన్న గాయాలతో బయటపడగలిగాడు. వివరాల్లోకి వెళ్తే...
బెలారస్: రాజధాని మిన్‌స్క్ నగరంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో సదరు బాలుడి కుటుంబం నివసిస్తోంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆడుకుంటూ బెడ్‌రూమ్ కిటికీ ఎక్కిన ఆ పిల్లాడు పట్టుతప్పి.. బయటకు వేలాడాడు. దూరంగా ఉన్న ఓ సెక్యూరిటీగార్డ్ అది గమనించి.. స్థానికులను అప్రమత్తం చేశాడు. పట్టుతప్పి కిందకు పడిపోవటం.. స్థానికులు కింద ఓ బ్లాంకెట్‌తో సిద్ధంగా ఉండటంతో ఆ బుడ్డోడు అందులో పడిపోయాడు. దుప్పటి చినిగి కింద పడ్డప్పటికీ.. స్వల్ఫ గాయాలతో బయటపడ్డాడు. అక్కడే ఉన్న ఓ వైద్యుడు అతనికి ప్రథమ చికిత్స చేసి.. అనంతరం ఆస్పత్రికి తరలించారు.
అతని తల్లి స్థానికంగా ఓ ఆస్పత్రిలో నర్సు పని చేస్తోందని.. బాగా అల్లరి చేయటంతోనే పనిష్మెంట్ కింద అతన్ని ఇంట్లో ఒంటరిగా వదిలేసి బయటకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఎలాంటి చర్యలు తీసుకున్నారన్న దానిపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment