Man Robbery With Fake Gun Customer Shoots Him Dead Texas - Sakshi
Sakshi News home page

నకిలీ తుపాకీతో దోపిడీకి వెళ్లి ప్రాణాలు పోగొట్టుకున్న దొంగ.. వీడియో వైరల్..

Published Mon, Jan 9 2023 7:14 PM | Last Updated on Mon, Jan 9 2023 9:16 PM

Man Robbery With Fake Gun Customer Shot Him Dead Texas - Sakshi

వాషింగ్టన్‌: అమెరికా టెక్సాస్‌లోని సౌత్ హ్యూస్టన్‌లో నకిలీ తుపాకీతో దోపిడీకి ప్రయత్నించాడు ఓ దొంగ. రెస్టారెంట్‌లో వెళ్లి కస్టమర్లను బెదిరించి వారి నుంచి డబ్బులు తీసుకున్నాడు. అతని దగ్గరున్న గన్ నకిలీదని తెలియక కస్టమర్లు భయపడ్డారు.

అయితే రెస్టారెంట్‌లోని ఓ కస్టమర్ దొంగను చావుదెబ్బతీశాడు. అదును చూసి తన దగ్గరున్న తుపాకీ తీసి దొంగను షూట్ చేశాడు. దీంతో అతనికి తూటాలు తగిలి కిందపడిపోయాడు. అయినా అంతటితో ఆగకుండా దొంగ దగ్గరకు వెళ్లి పలు మార్లు కాల్పులు జరిపాడు కస్టమర్.  దీంతో దొంగ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

గతవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. అయితే దొంగను కాల్చిచంపిన కస్టమర్‌ను పోలీసులు విచారించాల్సి ఉంది. దొంగ నుంచి తనను తాను కాపాడుకునేందుకే షూట్ చేసినందున అమెరికా చట్టాల ప్రకారం అతనికి శిక్ష పడే అవకాశం లేదు. ఇంతకీ దొంగను కాల్చి చంపిన కస్టమర్ ఎవరనే విషయం తెలియలేదు.
చదవండి: షాకింగ్.. విమానంలోకి పామును తీసుకెళ్లబోయిన మహిళ.. ఫొటో వైరల్..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement