Fake guns
-
రెస్టారెంట్‌కు నకిలీ తుపాకీతో వెళ్లి దోపిడీ.. చివరకు..
వాషింగ్టన్: అమెరికా టెక్సాస్‌లోని సౌత్ హ్యూస్టన్‌లో నకిలీ తుపాకీతో దోపిడీకి ప్రయత్నించాడు ఓ దొంగ. రెస్టారెంట్లో వెళ్లి కస్టమర్లను బెదిరించి వారి నుంచి డబ్బులు తీసుకున్నాడు. అతని దగ్గరున్న గన్ నకిలీదని తెలియక కస్టమర్లు భయపడ్డారు. అయితే రెస్టారెంట్‌లోని ఓ కస్టమర్ దొంగను చావుదెబ్బతీశాడు. అదును చూసి తన దగ్గరున్న తుపాకీ తీసి దొంగను షూట్ చేశాడు. దీంతో అతనికి తూటాలు తగిలి కిందపడిపోయాడు. అయినా అంతటితో ఆగకుండా దొంగ దగ్గరకు వెళ్లి పలు మార్లు కాల్పులు జరిపాడు కస్టమర్. దీంతో దొంగ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. 🚨#WATCH: Self-defense shooting of armed robber at a restaurant 📌#Houston | #Texas Watch as a brave customer at a taqueria shot restaurant shot and killed an armed criminal who was robbing from other customers. Houston police are now looking for that person for questioning pic.twitter.com/g7EYjms5PZ — R A W S A L E R T S (@rawsalerts) January 7, 2023 గతవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. అయితే దొంగను కాల్చిచంపిన కస్టమర్‌ను పోలీసులు విచారించాల్సి ఉంది. దొంగ నుంచి తనను తాను కాపాడుకునేందుకే షూట్ చేసినందున అమెరికా చట్టాల ప్రకారం అతనికి శిక్ష పడే అవకాశం లేదు. ఇంతకీ దొంగను కాల్చి చంపిన కస్టమర్ ఎవరనే విషయం తెలియలేదు. చదవండి: షాకింగ్.. విమానంలోకి పామును తీసుకెళ్లబోయిన మహిళ.. ఫొటో వైరల్.. -
డమ్మీ తుపాకీతో తిరుగుతున్న వ్యక్తి అరెస్ట్
ధర్మవరం అర్బన్: డమ్మీ తుపాకీతో బ్యాంకులో తిరుగుతున్న వ్యక్తిని ధర్మవరం పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను సీఐ హరినాథ్ శుక్రవారం రాత్రి మీడియాకు వివరించారు. బత్తలపల్లి మండలం తంబాపురం గ్రామానికి చెందిన టి.హరికృష్ణ బెంగళూరులో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. శుక్రవారం ధర్మవరంలోని మార్కెట్ వీధిలో గల ఒక బ్యాంకులో డమ్మీ తుపాకీతో హరికృష్ణ తిరుగుతుండటంతో సిబ్బంది, స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు వెంటనే వచ్చి అతడిని అదుపులోకి తీసుకున్నారు. తుపాకీతో ఎవరినైనా బెదిరించి డబ్బులు డిమాండ్ చేయడానికా.. లేక ఇంకేదైనా కారణముందా అనే కోణంలో విచారణ చేస్తున్నామని సీఐ తెలిపారు. -
వర్ణం: గేమ్ ‘స్పిరిట్’
స్పెయిన్‌లో స్వతంత్ర ప్రతిపత్తిగల ‘ల రియోజా’ ప్రాంతంలోని దృశ్యం ఇది. అక్కడి నేలలో ద్రాక్షలు విరివిగా పండుతాయి. అందుకే వైన్ తయారీకి ప్రసిద్ధి గాంచింది. ‘పంట’ చేతికొచ్చాక ‘లా బ్యాటలా డెల్ వినో డె హరో’ జరుగుతుంది. ‘వైన్ యుద్ధం’గా పిలిచే ఈ వేడుకలో స్థానికులు, యాత్రికులు సంబరంగా పాల్గొంటారు. బొమ్మ తుపాకులతో లీటర్లకొద్దీ వైన్‌ను దేహపుపాలు చేస్తారు. అదొక రకం మజా! తోపుడు బైక్ నిత్య రణరంగంగా ఉండే దేశం కాంగోలో రవాణాకు ఉపయోగిస్తున్న కర్ర వాహనం ఇది! దీన్ని షుకుడు అని పిలుస్తున్నారు. కిలోలకొద్దీ కూరగాయలు, నేలబొగ్గు లాంటివాటిని మోసుకెళ్లడానికి తరుణోపాయంగా ఇది రూపొందింది. అక్కడి గోమా నగరంలోని దృశ్యం ఇది. కీలెరిగి... ఒక మనిషిని చాలా పద్ధతిగా కాల్చుతున్నట్టు లేదూ! ఇది చైనాలో చేసే ఫైర్ థెరపీలో భాగం. వైద్యుడు రోగి ఒంటిమీద మద్యాన్ని పోసి ‘అంటిస్తాడు’. అది శరీరం లోపలి ‘చలి’ని తొలగిస్తుందట. కొన్ని రకాల రుగ్మతలకు ఈ ప్రాచీన మంట వైద్యం చక్కగా పనిచేస్తుందని చెబుతారు. అందుకే చైనాలో ఇది కోట్లాది రూపాయల వ్యాపారం కూడా!