సెమీస్‌లో భారత అమ్మాయిలు
వెస్ట్ వాంకోవర్ (కెనడా): మహిళల హాకీ వరల్డ్ లీగ్ రౌండ్–2 టోర్నమెంట్‌లో భారత జట్టు సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. బెలారస్‌తో జరిగిన గ్రూప్ ‘ఎ’ రెండో లీగ్ మ్యాచ్‌లో భారత్ 1–0 గోల్ తేడాతో గెలిచి వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది.
మ్యాచ్ 26వ నిమిషంలో వందన కటారియా బ్యాక్‌హ్యాండ్ షాట్‌తో కళ్లు చెదిరేరీతిలో భారత్‌కు ఏకైక గోల్‌ను అందించింది. మూడు జట్లున్న గ్రూప్ ‘ఎ’లో భారత్ ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిచి ఐదు పాయింట్లతో సెమీఫైనల్ బెర్త్‌ను దక్కించుకుంది.