
వార్సా: అందం అనేది శరీరానికి సంబంధించినదనే అభిప్రాయం చాలా మందిలో ఉంటుంది. చిన్న లోపమున్నా తాము అందంగా లేమని బాధపడేవారు ఎందరో. ఇక వికలాంగుల్లో చాలామంది తమ లోపాన్ని గురించి ఆలోచిస్తూ కుంగిపోతారు. కానీ.. అందం అనేది అవయవాలకు సంబంధించినది కాదని, మనసు సంబంధించినదనే విషయాన్ని ప్రపంచానికి చాటిచెప్పింది అలెగ్జాండ్రా చిచికోవా. వీల్‌చైర్‌కు పరిమితమైన 23 ఏళ్ల చిచికోవా.. అందాలపోటీల్లో పాల్గొని విజేతగా నిలిచింది. మిస్ వీల్‌చైర్ కిరీటాన్ని దక్కించుకుంది.
వార్సాలో జరిగిన ఈ పోటీల్లో విజేతగా తన పేరును ప్రకటించిన వెంటనే తీవ్ర ఉధ్వేగానికి లోనైన చిచికోవా.. కాసేపటి తేరుకొని మీడియాతో మాట్లాడింది. ‘మీలోని అపోహలు, భయాలతో పోరాడండి’ అంటూ ఒకే ఒక్కమాట చెప్పి అందరి మనసులు గెలుచుకుంది. దక్షిణాఫ్రికాకు చెందిన లెబొహాంగ్ మొన్యాట్సీ, పొలాండ్‌కు చెందిన ఆండ్రియన్నా జవాడ్‌జిన్‌స్కా.. రెండు, మూడు స్థానాల్లో నిలిచారు.
Comments
Please login to add a commentAdd a comment