2024 Paris Olympics: పారిస్‌ ఒలంపిక్స్‌ను బహిష్కరించాలి: పోలండ్‌ | 2024 Paris Olympics: Poland expects broad coalition to call for Olympics ban on Russian, Belarusian athletes | Sakshi
Sakshi News home page

2024 Paris Olympics: పారిస్‌ ఒలంపిక్స్‌ను బహిష్కరించాలి: పోలండ్‌

Published Sat, Feb 4 2023 5:35 AM | Last Updated on Sun, Feb 5 2023 4:04 AM

2024 Paris Olympics: Poland expects broad coalition to call for Olympics ban on Russian, Belarusian athletes - Sakshi

వార్సా: 2024 పారిస్‌ ఒలంపిక్స్‌లో రష్యా, బెలారస్‌ల ప్రాతినిధ్యాన్ని అంగీకరిస్తే తీవ్ర పరిణామాలుంటాయని పోలండ్‌ హెచ్చరించింది. రష్యా, బెలారస్‌లు ఒలంపిక్స్‌ పాల్గొనే పక్షంలో పోలండ్, లిథువేనియా, ఎస్టోనియా, లాట్వియా దేశాలు ఆ క్రీడలను బహిష్కరిస్తాయని పోలండ్‌ మంత్రి కమిల్‌ చెప్పారు.

ఆ రెండు దేశాల క్రీడాకారులకు అవకాశమివ్వాలన్న అంతర్జాతీయ ఒలంపిక్‌ కమిటీ నిర్ణయాన్ని ఖండించారు. ఈ నెల 10న జరిగే ఐవోసీ భేటీలో ఈయూ, యూకే, అమెరికా, కెనడాలతోపాటు ఉక్రెయిన్‌పై రష్యా ఆక్రమణను వ్యతిరేకించే 40 దేశాలు గ్రూపుగా ఏర్పడాలన్నారు. ఈ 40 దేశాలు గనుక బహిష్కరిస్తే ఒలంపిక్స్‌ నిర్వహణకు అర్థమే లేకుండా పోతుందని చెప్పారు. రష్యా పాల్గొంటే తాము ఒలంపిక్స్‌ను బహిష్కరిస్తామని ఉక్రెయిన్‌ ఇప్పటికే స్పష్టం చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement