International Olympic Committee
-
సౌదీ అరేబియాలో ఇ–స్పోర్ట్స్ ఒలింపిక్స్
లుసానే (స్విట్జర్లాండ్): మొట్టమొదటి ఒలింపిక్స్ ఇ–స్పోర్ట్స్‌కు సౌదీ అరేబియా ఆతిథ్యమివ్వబోతోంది. 2027లో సౌదీ రాజధాని రియాద్‌లో ఎలక్ట్రానిక్ స్పోర్ట్స్ విశ్వక్రీడలు జరుగనున్నాయి. గతేడాది పారిస్ ఒలింపిక్స్ సందర్భంగా ఈ ఏడాదే ఇ–స్పోర్ట్స్ మెగా ఈవెంట్ నిర్వహించాలని మొదట అనుకున్నారు. అయితే ఇది కార్యరూపం దాల్చేందుకు ఇంకో రెండేళ్లు ఆలస్యమవుతుంది. అయితే 2027 నుంచి రెగ్యులర్‌గా ప్రతీ రెండేళ్లకోసారి మెగా ఈవెంట్ ఇ–స్పోర్ట్స్ నిర్వహించేందుకు సౌదీ ప్రభుత్వం అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ)తో 12 ఏళ్ల ఒప్పందం చేసుకుంది. గతేడాది జూలై, ఆగస్టు నెలల్లో రియాద్‌లో ఇ–స్పోర్ట్స్ ప్రపంచకప్ జరిగింది. కాల్ ఆఫ్ డ్యూటీ, ఫోర్ట్‌నైట్, స్ట్రీట్ ఫైటర్ క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించారు. అయితే ఇందులో సాధారణ షూటర్లకు అనుమతించేది లేనిది తేలలేదు. త్వరలోనే దీనిపై స్పష్టత వస్తుంది. సౌదీ క్రీడల మంత్రి ప్రిన్స్ అబ్దుల్ అజిజ్ బిన్ తుర్కీ అల్ ఫైజల్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల కమిటీ ఒలింపిక్స్ ఇ–స్పోర్ట్స్ క్రీడాంశాలపై చర్చించనుంది. ఇటీవల ఐఓసీ చైర్మన్ థామస్ బాచ్, సౌదీ రాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ల మధ్య చర్చలు ఫలప్రదంగా జరగడంతో తాజాగా ఇ–స్పోర్ట్స్ విశ్వక్రీడలపై ప్రకటన వెలువడింది. అయితే ఇంకో రెండేళ్లలో జరిగే ఈ పోటీల కోసం ఈ ఏడాది నుంచే క్వాలిఫయింగ్ పోటీలు మొదలవుతాయని ఐఓసీ వర్గాలు తెలిపాయి. -
ఐఓసీ అధ్యక్ష రేసులో ఏడుగురు.. 130 ఏళ్ల చరిత్రలోనే?
అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) అధ్యక్ష పీఠంపై ఇద్దరు మాజీ ఒలింపిక్ చాంపియన్లు, ఓ మిడిల్ ఈస్ట్ రాజు మొత్తంగా ఏడుమంది అభ్యర్థులు కన్నేశారు. ప్రస్తుత చీఫ్ థామస్ బాచ్ పదవీ కాలం త్వరలోనే ముగియనుంది. ఈ నేపథ్యంలో మార్చిలో అధ్యక్ష ఎన్నికలకు ఇదివరకే నోటిఫికేషన్ ఇవ్వడంతో చివరకు ఏడుగురు రేసులో నిలిచారు. ఇందులో ఎన్నికైన అభ్యర్థి ఎనిమిదేళ్ల పాటు పదవిలో కొనసాగుతారు. ఈ మేరకు పోటీలో 7 మంది ఉన్నట్లు ఐఓసీ సోమవారం ప్రకటించింది.జింబాబ్వేకు చెందిన మహిళ కిర్ కొవెంట్రీ అధ్యక్ష ఎన్నికల బరిలో ఉంది. ఈ జింబాబ్వే మాజీ స్విమ్మర్ ఒలింపిక్ చాంపియన్. 130 ఏళ్ల ఐఓసీ చరిత్రలో ఇప్పటి వరకు అంతా పురుషులే ఐఓసీని పాలించారు. ఒక వేళ మార్చిలో ఆమె గెలిస్తే ఐఓసీలో అధ్యక్ష పీఠాన్ని చేపట్టిన తొలి మహిళగా రికార్డుల్లోకెక్కుతుంది.బ్రిటన్‌కు చెందిన మిడిల్ డిస్టెన్స్ రన్నర్ సెబాస్టియన్ కో కూడా మాజీ ఒలింపిక్ చాంపియన్. ఆయనతో పాటు జోర్డాన్ రాజు ఫైజల్ అల్ హుసేన్ కూడా ఐఓసీ పీఠంపై ఆసక్తి కనబరిచారు. మరో నలుగురు బరిలో నిలువగా 111 మంది సభ్యులు గల కమిటీ వచ్చే మార్చిలో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోనుంది.చదవండి: ఆసియా ఛాంపియన్స్ హాకీ ట్రోఫీ విజేతగా భారత్.. -
Gitika Talukdar: ప్యారిస్ ఒలింపిక్స్‌కు మన ఫొటోగ్రాఫర్
వచ్చే నెలలో ప్యారిస్ ఒలింపిక్స్. అన్ని దేశాల ఆటగాళ్లే కాదు మీడియా ఫొటోగ్రాఫర్లు కూడా కెమెరాలతో బయలుదేరుతారు. కాని ‘ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ’ (ఐ.ఓ.సి) గుర్తింపు పొందిన వారికే అన్ని మైదానాల్లో ప్రవేశం. అలాంటి అరుదైన గుర్తింపును పొందిన మొదటి భారతీయ మహిళా ఫొటోగ్రాఫర్ గీతికా తాలూక్దార్. అస్సాంకు చెందిన స్పోర్ట్స్ ఫొటోగ్రాఫర్ గీతికా తాలూక్దార్ పరిచయం.‘స్పోర్ట్స్ ఫొటోగ్రాఫర్‌గా కెరీర్‌ని ఎంచుకోవడానికి స్త్రీలు పెద్దగా ముందుకు రారు. ఎందుకంటే అది మగవాళ్ల రంగం చాలా రోజులుగా. అక్కడ చాలా సవాళ్లు ఉంటాయి. నేను వాటన్నింటినీ అధిగమించి ఇవాళ గొప్ప గుర్తింపు పొందగలిగాను’ అని సంతోషం వ్యక్తం చేసింది గీతికా తాలూక్దార్. జూలై 26 నుంచి ఆగస్టు 11 వరకూప్యారిస్లో జరగనున్న ఒలింపిక్స్ పోటీల్లో ఫొటోలు తీయడానికి ఆమెకు అక్రిడిటేషన్ లభించింది. ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటి (ఐ.ఓ.సి) చాలా తక్కువ మంది ఫొటోగ్రాఫర్లకు మాత్రమే ఒలింపిక్స్‌ను కవర్ చేసే అధికారిక గుర్తింపు ఇస్తుంది. ఈసారి ప్రపంచవ్యాప్తంగా అతి కొద్దిమంది మహిళా స్పోర్ట్స్ ఫొటోగ్రాఫర్లు ఈ గుర్తింపు పొందితే మన దేశం నుంచి మొదటి, ఏకైక మహిళా స్పోర్ట్స్ ఫొటోగ్రాఫర్‌గా గీతికా తాలూక్దార్ చరిత్ర సృష్టించింది. ఫ్రీ లాన్సర్‌గా...‘స్పోర్ట్స్ ఫొటోగ్రాఫర్ అంటే విస్తృతంగా పర్యటించాలి. సంస్థలో ఉద్యోగిగా ఉన్నప్పుడు సంస్థలు ఒక్కోసారి అనుమతిస్తాయి, మరోసారి అనుమతించవు. అందుకని నేను ఫ్రీలాన్సర్‌గా మారాను. స్వేచ్ఛ పొందాను. నా సేవలు కావాల్సిన సంస్థలు నన్ను సంప్రదిస్తాయి’ అంది గీతిక. ఫ్రీ లాన్సర్‌గా ఉంటూనే ఆమె ఇంకా చదువు కొనసాగించింది. కొలంబోలో డిప్లమా కోర్సు చేసింది. అలాగే సౌత్ కొరియా స్పోర్ట్స్ మినిస్ట్రీ వారి స్కాలర్షిప్ పొంది సియోల్ నేషనల్ యూనివర్సిటీ నుంచి స్పోర్ట్స్ మేనేజ్మెంట్లో మాస్టర్స్ డిగ్రీ చేసింది. ‘కొలంబోలో చదువుకునే సమయంలో సర్ రిచర్డ్ హ్యాడ్లీని ఇంటర్వ్యూ చేయడం గొప్ప అనుభవం. అక్కడ ఆయన పేద పిల్లలకు క్రికెట్ నేర్పేందుకు అకాడెమీ నిర్వహిస్తున్నారు. నేను వెళ్లిన రోజు బాల్ ఎలా విసరాలో నేర్పుతున్నారు. నేను ఇంటర్వ్యూ అడిగితే ఇచ్చారు’ అని చెప్పింది గీతిక.కోవిడ్ రిస్క్ ఉన్నా...ప్రపంచంలో ఎక్కడ భారీ క్రీడా వేడుకలు జరుగుతుంటే అక్కడ ప్రత్యక్షమవుతుంది గీతిక. ఆస్ట్రేలియా ఫీఫా విమెన్స్ వరల్డ్ కప్, ఖతార్‌లో జరిగిన ఫీఫా వరల్డ్ కప్ పోటీలను ఆమె కవర్ చేసింది. 2020 సియోల్ ఒలింపిక్స్‌కు కోవిడ్ కారణంగా చాలా మంది అక్రిడిటెడ్ ఫొటో జర్నలిస్టులు వెళ్లడానికి భయపడ్డారు. కాని అక్రిడిటేషన్ లేకున్నా గీతిక అక్కడకు వెళ్లి ప్రాణాలకు తెగించి ఫొటోలు తీసి గుర్తింపు పొందింది. తన వృత్తి పట్ల ఆమెకు ఉన్న ఈ అంకిత భావాన్నే ఒలింపిక్స్ కమిటీ గుర్తించింది. అందుకే ఈసారి అధికారికంగా ఆహ్వానం పలికింది. జూలై 23న ప్యారిస్ బయలుదేరి వెళ్లనుంది గీతిక. ‘గేమ్స్ వైడ్ ఓపెన్’ అనేది ఈసారి ఒలింపిక్స్ థీమ్. మరిన్ని వర్గాలను కలుపుకుని ఈ క్రీడలు జరగాలనేది ఆశయం. తక్కువ గుర్తింపుకు నోచుకునే మహిళా స్పోర్ట్స్ ఫొటోగ్రాఫర్లను ప్రత్యేకంగా ఆహ్వానించడం కూడా ఈ ఆశయంలో భాగమే. ‘నాకొచ్చిన అవకాశం నా ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. మరింత కష్టపడి పని చేస్తాను. స్పోర్ట్స్ ఫొటోగ్రాఫర్‌గా కెరీర్‌ను ఎంచుకోవాలనుకునేవారికి క్రమశిక్షణ అవసరం. అంతర్జాతీయ క్రీడాపోటీలు టైముకు మొదలయ్యి టైమ్‌కు ముగుస్తాయి. వాటిని అందుకోవాలంటే క్రీడల్లోని ఉత్తమ క్షణాలను కెమెరాలో బంధించాలంటే ఏకాగ్రత, క్రమశిక్షణ చాలా అవసరం. అవి ఉన్నవారు ఈ రంగంలో నిస్సందేహంగా రాణిస్తారు’ అంటోంది గీతిక.‘టీ సిటీ’ అమ్మాయిఅస్సాంలోని డూమ్డుమా పట్టణాన్ని అందరూ ‘టీ సిటీ’ అని పిలుస్తారు. ఎందుకంటే అక్కడ తేయాకు తోటలు విస్తారం. హిందూస్తాన్ లీవర్ టీ ఎస్టేట్ అక్కడే ఉంది. ఆ ఊళ్లో చిన్న ఉద్యోగి కుమార్తె అయిన గీతిక చిన్నప్పటి నుంచి కెమెరాతో ప్రేమలో పడింది. అందుకు కారణం ఆమె మేనమామ చంద్ర తాలూక్దార్ ఫిల్మ్‌మేకర్‌గా గుర్తింపు పొందడం. అతను కెమెరాలో నుంచి చూస్తూ రకరకాల దృశ్యాలను అందంగా బంధించడాన్ని బాల్యంలో గమనించిన గీతిక తాను కూడా అలాగే చేయాలనుకుంది. పొలిటికల్ సైన్స్‌లో డిగ్రీ చేశాక మాస్ కమ్యూనికేషన్లో డి΄÷్లమా చేసింది. క్రీడలంటే ఆసక్తి ఉండటంతో స్పోర్ట్స్ జర్నలిస్ట్‌గా, ఫొటోగ్రాఫర్‌గా మారి 2005 నుంచి డీఎన్ఏ, బీబీసీ, ఇండియా టుడే, పీటీఐ వంటి సంస్థలతో పనిచేసింది. -
Cricket in Olympics: ఒలింపిక్స్‌లో క్రికెట్
ముంబై: లాంఛనం ముగిసింది. ఎట్టకేలకు క్రికెట్ ఒలింపిక్స్ క్రీడల్లో పునరాగమనం చేయనుంది. 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్ క్రీడల్లో క్రికెట్‌తోపాటు స్క్వా‹Ù, బేస్‌బాల్/సాఫ్ట్‌బాల్, లాక్రాస్ (సిక్స్–ఎ–సైడ్), ఫ్లాగ్ ఫుట్‌బాల్ క్రీడాంశాలను కొత్తగా చేర్చారు. ఐదు కొత్త క్రీడాంశాలకు లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్‌లో అనుమతి ఇవ్వాలని ఎగ్జిక్యూటివ్ బోర్డు చేసిన ప్రతిపాదనలకు సోమవారం అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) సభ్యులు ఓటింగ్ ద్వారా ఆమోదం తెలిపినట్లు ఐఓసీ అధ్యక్షుడు థామస్ బాక్ ప్రకటించారు. 99 మంది ఐఓసీ సభ్యుల్లో ఇద్దరు మాత్రమే ఈ ఐదు క్రీడాంశాల ప్రతిపాదనను వ్యతిరేకించగా... 97 మంది సమ్మతించారు. లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్‌లో క్రికెట్ ఈవెంట్‌ను టి20 ఫార్మాట్లో పురుషుల, మహిళల విభాగాల్లో ఆరు జట్ల మధ్య నిర్వహిస్తారు. ఆతిథ్య దేశం హోదాలో అమెరికా జట్లకు నేరుగా ఎంట్రీ లభిస్తుంది. ఐసీసీ ర్యాంకింగ్స్ ఆధారంగా మిగతా ఐదు జట్లను నిర్ణయించే అవకాశముంది. ► 1877లో క్రికెట్లో తొలి టెస్టు మ్యాచ్ జరిగింది. 1900 పారిస్ ఒలింపిక్స్‌లో ఒకే ఒకసారి క్రికెట్ మెడల్ ఈవెంట్‌గా ఉంది. పారిస్ గేమ్స్‌లో కేవలం ఫ్రాన్స్, బ్రిటన్ జట్లు మాత్రమే పాల్గొన్నాయి. బ్రిటన్ జట్టుకు స్వర్ణం, ఫ్రాన్స్ జట్టుకు రజతం లభించాయి. ఆ తర్వాత క్రికెట్ విశ్వ క్రీడల జాబితాలో చోటు కోల్పోయింది. టెస్టు, వన్డే ఫార్మాట్ల బదులు మూడు, నాలుగు గంటల్లో ఫలితం వచ్చే టి20 ఫార్మాట్ రాకతో క్రికెట్ స్వరూపమే మారిపోయింది. విశ్వవ్యాప్తంగా జరుగుతున్న టి20 లీగ్‌లు ఎంతోమంది క్రికెటర్లకు కొత్తగా అవకాశాలు కలి్పస్తుండటంతోపాటు ఆరి్థకంగా వారిని ఆదుకుంటున్నాయి. ప్రస్తుతం ఫుట్‌బాల్ తర్వాత ప్రపంచంలో అత్యధిక ఆదరణ కలిగిన క్రీడగా క్రికెట్‌కు గుర్తింపు వచ్చింది. ఫలితంగా 128 ఏళ్ల తర్వాత ఎట్టకేలకు క్రికెట్ ఒలింపిక్స్‌లో పునరాగమనం చేయనుంది. ► ప్రస్తుతానికి క్రికెట్‌తోపాటు మిగతా నాలుగు కొత్త క్రీడాంశాలు లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్ వరకే పరిమితం కానున్నాయి. తదుపరి ఒలింపిక్స్ క్రీడల్లోనూ క్రికెట్ కొనసాగడమనేది ఆయా దేశాల కార్యనిర్వాహక కమిటీల ఆసక్తిపై ఆధారపడి ఉంది. ఐఓసీ నిబంధనల ప్రకారం ఒలింపిక్స్ క్రీడల ఆతిథ్య దేశానికి తమకు నచి్చన కొన్ని క్రీడాంశాలను అదనంగా చేర్చే వెసులుబాటు ఉంది. 2032 ఒలింపిక్స్ ఆ్రస్టేలియాలోని బ్రిస్బేన్ నగరంలో జరుగుతాయి. 2036 ఒలింపిక్స్ ఆతిథ్యానికి భారత్ ఆసక్తి కనబరుస్తోంది. ఆ్రస్టేలియా, భారత్‌లో క్రికెట్‌కు విపరీతమైన ఆదరణ ఉండటంతో 2032, 2036 ఒలింపిక్స్‌ల్లోనూ క్రికెట్ కొనసాగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ► ‘విశ్వవ్యాప్తంగా 2.5 బిలియన్ అభిమానులు కలిగిన ప్రపంచంలోని రెండో అత్యధిక ఆదరణ కలిగిన క్రికెట్ క్రీడను ఒలింపిక్స్‌లోకి స్వాగతం పలుకుతున్నాం. అమెరికాలోనూ మేజర్ లీగ్ క్రికెట్ టోర్నీ ద్వారా ఈ ఆటకు ఆదరణ పెరుగుతోంది. వచ్చే ఏడాది అమెరికా–వెస్టిండీస్ సంయుక్తంగా టి20 ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. నా మిత్రుడు విరాట్ కోహ్లికి సామాజిక మాధ్యమాల్లో ప్రపంచ వ్యాప్తంగా 340 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. బాస్కెట్‌బాల్ దిగ్గజం లేబ్రాన్ జేమ్స్, అమెరికన్ ఫుట్‌బాల్ స్టార్ టామ్ బ్రేడీ, గోల్ఫ్ స్టార్ టైగర్ వుడ్స్కంటే ఎక్కువ మంది ఫాలోవర్లు కోహ్లికి ఉన్నారు. అందుకే క్రికెట్ కేవలం కొన్ని దేశాలకే పరిమితం కాకుండా విశ్వవ్యాప్తంగా ఆదరణ పొందాలనే ఉద్దేశంతో ఒలింపిక్స్‌లో చోటు కల్పిస్తున్నాం’ అని లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్ స్పోర్ట్స్ డైరెక్టర్, ఒలింపిక్ చాంపియన్ షూటర్ నికోలో కాంప్రియాని వ్యాఖ్యానించాడు. ఒలింపిక్స్ క్రీడల్లో క్రికెట్‌కు చోటు లభించడంపట్ల ఐఓసీ సభ్యురాలు, ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ యజమాని నీతా అంబానీ హర్షం వ్యక్తం చేశారు. ఒలింపిక్స్‌లో క్రికెట్ శాశ్వతంగా కొనసాగేందుకు తమవంతుగా అన్ని చర్యలు తీసుకుంటామని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) చైర్మన్ గ్రెగ్ బార్క్లే తెలిపారు. ► రగ్బీ తరహాలో ఆడే ఫ్లాగ్ ఫుట్‌బాల్‌కు... స్వా్వష్కు ఒలింపిక్స్‌లో తొలిసారి స్థానం దక్కింది. బేస్‌బాల్/సాఫ్ట్‌బాల్‌కు వచ్చే ఏడాది పారిస్‌లో జరిగే ఒలింపిక్స్‌లో చోటు దక్కకపోయినా... అమెరికాలో ఎంతో ప్రాచుర్యం ఉండటంతో బేస్‌బాల్/సాఫ్ట్‌బాల్ లాస్ ఏంజెలిస్‌లో మళ్లీ కనిపిస్తాయి. ► హాకీ తరహాలో ఆడే లాక్రాస్ క్రీడాంశం 1904 సెయింట్ లూయిస్ ఒలింపిక్స్‌లో, 1908 లండన్ ఒలింపిక్స్‌లో మెడల్ ఈవెంట్‌గా ఉంది. ఆ తర్వాత 1928 అమ్‌స్టర్‌డామ్, 1932 లాస్ ఏంజెలిస్, 1948 లండన్ ఒలింపిక్స్‌లో ప్రదర్శన క్రీడగా కొనసాగి ఆ తర్వాత చోటు కోల్పోయింది. చదవండి: WC 2023: ఎదుటి వాళ్లను అన్నపుడు నవ్వుకొని.. మనల్ని అంటే ఏడ్చి గగ్గోలు పెట్టడం ఎందుకు? అతడికి స్ట్రాంగ్ కౌంటర్ The proposal from the Organising Committee of the Olympic Games Los Angeles 2028 (@LA28) to include five new sports in the programme has been accepted by the IOC Session. Baseball/softball, cricket (T20), flag football, lacrosse (sixes) and squash will be in the programme at… — IOC MEDIA (@iocmedia) October 16, 2023 -
2028 ఒలింపిక్స్‌లో క్రికెట్!
ముంబై: అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) ఓటింగ్ లాంఛనం పూర్తయితే 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్‌లో క్రికెట్ పునరాగమనం చేస్తుంది. మరోవైపు బాక్సింగ్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. అంతర్జాతీయ బాక్సింగ్ సమాఖ్యపై ఐఓసీ వేటుకు సిద్ధమైన నేపథ్యంలో బాక్సింగ్‌ను ఒలింపిక్స్‌లో కొనసాగించాలనే నిర్ణయాన్ని నిలిపివేసింది. మరోవైపు కొత్తగా కాంపౌండ్ ఆర్చరీ ఈవెంట్‌ను చేర్చాలన్న ప్రతిపాదనను తిరస్కరించింది. 2028లో అమెరికా నిర్వహించనున్న ఈ విశ్వక్రీడల కోసం క్రికెట్ సహా మరో నాలుగు క్రీడలు బేస్‌బాల్–సాఫ్ట్‌బాల్, ఫ్లాగ్ ఫుట్‌బాల్, లాక్రోసి (సిక్సెస్), స్క్వాష్ ఆటలు చేర్చే ప్రతిపాదనల్ని ఐఓసీ ఎగ్జిక్యూటీవ్ బోర్డు ఆమోదించింది. ఐఓసీ అధ్యక్షుడు థామస్ బాచ్ నేతృత్వంలోని కమిటీ ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేసింది. దీంతో కేవలం లాంఛనప్రాయమైన ఓటింగ్ మాత్రమే మిగిలుంది. ముంబైలో ప్రస్తుతం జరుగుతున్న ఐఓసీ సెషన్స్‌లోనే ఆ లాంఛనం కూడా ఆదివారం పూర్తి కానుంది. ఎగ్జిక్యూటివ్ కమిటీ అమోదం లభించడంతో ఓటింగ్‌లో ఏ సమస్య ఎదురవదు. మెజారిటీ ఓట్లు ఖాయమవుతాయి. ‘విశ్వవ్యాప్తంగా క్రికెట్ విశేష ఆదరణ పొందుతోంది. ముఖ్యంగా టి20 ఫార్మాట్ అందర్ని అలరిస్తుంది. వన్డే ప్రపంచకప్ అయితే ఏళ్ల క్రితమే విజయవంతమైంది. ఈ నేపథ్యంలో ఒలింపిక్స్‌కు క్రికెట్ దగ్గరైంది’ అని ఐఓసీ చీఫ్ థామస్ బాచ్ అన్నారు. ఆదివారం ఓటింగ్ ప్రక్రియ పూర్తయితే లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్‌లో టి20 ఫార్మాట్లో క్రికెట్ నిర్వహిస్తారు. చివరిసారి 1900 పారిస్ ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను ఆడించారు. ఆ తర్వాత క్రికెట్‌ను విశ్వ క్రీడల నుంచి తొలగించారు. -
క్రికెట్ ప్రేమికులకు శుభవార్త.. ఇకపై.. ‘ఒలింపిక్స్’లో కూడా.. గ్రీన్ సిగ్నల్
Cricket's Inclusion In 2028 Los Angeles Games: క్రికెట్ ప్రేమికులకు శుభవార్త..! విశ్వ క్రీడల్లో క్రికెటర్లను చూడాలన్న అభిమానుల కల 2028లో తీరనుంది. ఇప్పటికే ఆసియా క్రీడల్లో క్రికెట్‌ను చేర్చిన విషయం తెలిసిందే. తాజాగా.. లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్ క్రీడల్లో క్రికెట్‌ను చేర్చడానికి అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) ఆమోదం తెలిపింది. ఇందుకు సంబంధించి ఐఓసీ శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. ఈ విషయం గురించి ఏఓసీ అధ్యక్షుడు థామస్ బాష్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా... లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్ క్రీడల్లో క్రికెట్ చేర్చాలన్న నిర్వాహకుల ప్రతిపాదనకు కమిటీ అంగీకారం తెలిపినట్లు ప్రకటించారు. 2028 ఒలింపిక్స్‌లో కొత్తగా చేర్చనున్న ఐదు క్రీడాంశాల్లో కూడా క్రికెట్ కూడా ఉందని వెల్లడించారు. ఆ ఐదు క్రీడల్లో ఒకటిగా క్రికెట్ కూడా కాగా ఒలింపిక్స్‌లో అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో క్రికెట్ మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. బేస్‌బాల్/సాఫ్ట్‌బాల్, ఫ్లాగ్ ఫుట్‌బాల్(నాన్- కాంటాక్ట్ అమెరికన్ ఫుట్‌బాల్), స్క్వాష్, లాక్రోస్‌లతో పాటు క్రికెట్ కూడా చేర్చనున్నారు. కాగా అక్టోబరు 15 నుంచి 17 వరకు ముంబైలో ఐఓసీ సమావేశ నిర్వహణకు సర్వం సిద్ధమైంది. ఈ క్రమంలో ఇప్పటికే ఐఓసీ సభ్యులు ముంబైకి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో.. ఎగ్జిక్యూటివ్ బోర్డు మీటింగ్ రెండో రోజున థామస్ బాష్ ఈ మేరకు ప్రకటన చేశారు. తొలి అడుగు.. పసిడి పతకాలతో చరిత్ర ఇక ఇటీవల ఆసియా క్రీడలు-2023 సందర్భంగా భారత క్రికెట్ నియంత్రణ మండలి తొలిసారి క్రికెట్ జట్లను చైనాకు పంపిన విషయం తెలిసిందే. హోంగ్జూలో టీ20 ఫార్మాట్లో జరిగిన ఈ టోర్నమెంట్లో భారత మహిళల, పురుష జట్లు స్వర్ణ పతకాలు సాధించాయి. హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలో మహిళా జట్టు, రుతురాజ్ గైక్వాడ్ నేతృత్వంలోని టీమిండియా ద్వితీయ శ్రేణి జట్లు ఆసియా క్రీడల్లో అడుగుపెట్టిన ఎడిషన్‌లోనే గోల్డ్ మెడల్స్ గెలిచి చరిత్ర సృష్టించాయి. కాగా క్రికెట్‌కు భారత్‌లో ఉన్న క్రేజ్ దృష్ట్యా ఒలింపిక్స్‌లో ఈ క్రీడను చేర్చడం ద్వారా నిర్వాహకులు పెద్ద ఎత్తున ప్రసార హక్కుల రూపంలో ఆర్జించే అవకాశం ఉంది. చదవండి: WC 2011లో నేనే కెప్టెన్ అయి ఉంటే అతడిని తప్పక తీసుకునేవాడిని.. కానీ! -
అంతర్జాతీయ బాక్సింగ్ సంఘంపై వేటు
International Boxing Association: అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం (ఐబీఏ)పై అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) నిషేధం విధించింది. అయితే పారిస్ ఒలింపిక్స్‌లో బాక్సర్లకు ఏ ఇబ్బంది లేకుండా పోటీ పడే అవకాశమిచ్చారు. కొన్నేళ్లుగా ఐబీఏ వివాదాలతో వార్తల్లో నిలిచింది. సమస్యల్ని పరిష్కరించుకోవాలని ఐఓసీ ఎన్ని సార్లు సూచించినా ఐబీఏ మాత్రం పెడచెవిన పెట్టింది. దీంతో ఐఓసీ అధ్యక్షుడు థామస్ బాచ్ నేతృత్వంలో ఎగ్జిక్యూటివ్ బోర్డు ఐబీఏను బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకుంది. గ్యాంజస్ గ్రాండ్‌మాస్టర్స్, ముంబా మాస్టర్స్ గెలుపు దుబాయ్: గ్లోబల్ చెస్ లీగ్‌లో భాగంగా తొలి రోజు జరిగిన రెండు మ్యాచ్‌ల్లో అప్‌గ్రాడ్ ముంబా మాస్టర్స్, గ్యాంజస్ గ్రాండ్‌మాస్టర్స్ జట్లు గెలుపొందాయి. గ్యాంజస్ గ్రాండ్‌మాస్టర్స్ 10–4 పాయింట్లతో చింగారి గల్ఫ్ టైటాన్స్‌పై, ముంబా మాస్టర్స్ 8–7 పాయింట్లతో త్రివేణి కాంటినెంటల్ కింగ్స్ జట్టుపై విజయం సాధించాయి. ముంబా మాస్టర్స్‌కు ఆడిన ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక తమ ప్రత్యర్థులతో గేమ్‌లను ‘డ్రా’ చేసుకున్నారు. -
2024 Paris Olympics: పారిస్ ఒలంపిక్స్‌ను బహిష్కరించాలి: పోలండ్
వార్సా: 2024 పారిస్ ఒలంపిక్స్‌లో రష్యా, బెలారస్‌ల ప్రాతినిధ్యాన్ని అంగీకరిస్తే తీవ్ర పరిణామాలుంటాయని పోలండ్ హెచ్చరించింది. రష్యా, బెలారస్‌లు ఒలంపిక్స్ పాల్గొనే పక్షంలో పోలండ్, లిథువేనియా, ఎస్టోనియా, లాట్వియా దేశాలు ఆ క్రీడలను బహిష్కరిస్తాయని పోలండ్ మంత్రి కమిల్ చెప్పారు. ఆ రెండు దేశాల క్రీడాకారులకు అవకాశమివ్వాలన్న అంతర్జాతీయ ఒలంపిక్ కమిటీ నిర్ణయాన్ని ఖండించారు. ఈ నెల 10న జరిగే ఐవోసీ భేటీలో ఈయూ, యూకే, అమెరికా, కెనడాలతోపాటు ఉక్రెయిన్‌పై రష్యా ఆక్రమణను వ్యతిరేకించే 40 దేశాలు గ్రూపుగా ఏర్పడాలన్నారు. ఈ 40 దేశాలు గనుక బహిష్కరిస్తే ఒలంపిక్స్ నిర్వహణకు అర్థమే లేకుండా పోతుందని చెప్పారు. రష్యా పాల్గొంటే తాము ఒలంపిక్స్‌ను బహిష్కరిస్తామని ఉక్రెయిన్ ఇప్పటికే స్పష్టం చేసింది. -
ఒలింపిక్స్‌లో క్రికెట్.. త్వరలోనే ప్రకటన..!
జెంటిల్మెన్ గేమ్ క్రికెట్ త్వరలో విశ్వక్రీడల్లో భాగంగా కానుందా..? అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది. 2028 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను భాగం చేసే అంశాన్ని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) పరిశీలిస్తున్నట్లు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) వర్గాలు వెల్లడించాయి. క్రికెట్ సహా మరో 8 కొత్త క్రీడలను ఒలింపిక్స్ క్రీడల తుది జాబితాలో చేర్చినట్లు సమాచారం. ఈ జాబితాపై ఐఓసీ త్వరలోనే సమీక్ష నిర్వహించి 2028 ఒలింపిక్స్‌లో ఏఏ క్రీడలకు అనుమతి ఇవ్వాలో తేల్చనుంది. వచ్చే ఏడాది ముంబైలో జరిగే సమావేశాల్లో ఈ అంశంపై క్లారిటీ రానుంది. క్రికెట్‌తో పాటు బేస్ బాల్/సాఫ్ట్ బాల్, ఫ్లాగ్ ఫుట్ బాల్, లాక్రోస్సే, బ్రేక్ డ్యాన్సింగ్, కరాటే, కిక్ బాక్సింగ్, స్క్వాష్, మోటార్ స్పోర్ట్ క్రీడలను ఒలింపిక్స్‌లో చేర్చేందుకు ఐఓసీ ప్రతపాదించింది. కాగా, 1900 సంవత్సరంలో జరిగిన పారిస్ ఒలింపిక్స్‌లో క్రికెట్ తొలిసారి విశ్వక్రీడల్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. చదవండి: ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ నామినీస్ ఎవరంటే..? -
అదే నా కల, ఐఓఏతో చేతులు కలిపిన రిలయన్స్
ప్రముఖ వ్యాపార దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ క్రీడా రంగంలో తనదైన పాత్ర పోషించేందుకు సిద్ధమైంది. ఇందుకోసం ఇండియన్ ఒలింపిక్స్ అసోసియేషన్ తో చేతులు కలిపింది. రిలయన్స్, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్లు సంయుక్తంగా దీర్ఘకాలికా భాగస్వామైనట్లు ప్రకటించాయి. తద్వారా భారతీయ అథ్లెట్లను ప్రోత్సహించడం, నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్లకు మద్దతు ఇవ్వడం, ప్రపంచ క్రీడా దేశంగా భారత్‌ను నిలబెట్టేలా లక్ష్యాలను నిర్దేశించింది. ఈ సందర్భంగా ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ కమిటీ సభ్యురాలు, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ డైరెక్టర్ నీతా అంబానీ మాట్లాడుతూ, “ప్రపంచ క్రీడా రంగంలో భారత దేశ ఖ్యాతిని ప్రపంచ దేశాలకు చాటిచెప్పడమే మా కల. భవిష్యత్తులో ఒలింపిక్ క్రీడలను భారత్‌లో నిర్వహించాలని ఆకాంక్షిస్తున్నామని అన్నారు. 2024లో పారిస్ ఒలింపిక్ క్రీడలలో మొట్టమొదటిసారిగా ఇండియా హౌస్‌ని నిర్వహించేందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నాం. దేశం యెక్క అపారమైన ప్రతిభను, సామర్థ్యాన్ని, ఆకాంక్షను ప్రపంచానికి చాటి చెప్పేందుకు ఇదొక గొప్ప అవకాశమని నీతా అంబానీ కొనియాడారు. -
Narinder Batra: మూడు పదవుల నుంచి అవుట్
న్యూఢిల్లీ: గత కొన్నేళ్లుగా భారత ఒలింపిక్ క్రీడల పరిపాలనా వ్యవహారాల్లో కీలక ముద్ర వేయడంతో పాటు ప్రపంచ హాకీ నిర్వహణలో కూడా ప్రధాన పాత్ర పోషించిన సీనియర్ అడ్మినిస్ట్రేటర్ నరీందర్ బత్రా కథ ముగిసింది. ఇటీవల తనపై వచ్చిన విమర్శలు, వివాదాల నేపథ్యంలో ఆయన అన్ని పదవుల నుంచి తప్పుకున్నారు. ప్రతిష్టాత్మక అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు బత్రా ప్రకటించారు. దీంతో పాటు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) సభ్యత్వానికి, భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అధ్యక్ష పదవికి కూడా ఆయన రాజీనామా చేశారు. మూడు వేర్వేరు రాజీనామా లేఖల్లో ‘వ్యక్తిగత కారణాలతో’ తప్పుకుంటున్నట్లుగా వెల్లడించారు. ఎఫ్ఐహెచ్ అధ్యక్షుడిగా 2016లో తొలిసారి ఎంపికైన బత్రా... గత ఏడాది జరిగిన ఎన్నికల్లో గెలిచి 2024 వరకు పదవిలో సాగేలా అవకాశం దక్కించుకున్నారు. ‘హాకీ ఇండియా’ అధ్యక్షుడిగా రూ. 35 లక్షలు దుర్వినియోగం చేశారనే ఆరోపణలతో బత్రాపై సీబీఐ విచారణ జరుగుతోంది. సోమవారం కూడా బత్రా ఇళ్లపై సీబీఐ దాడులు చేసింది. ఇది జరిగిన కొన్ని గంటలకే ఆయన రాజీనామాలు వచ్చాయి. నిజానికి ఐఓఏ అధ్యక్ష పదవి నుంచి గత మే నెలలోనే ఢిల్లీ కోర్టు తొలగించినా... కోర్టులో సవాల్ చేసిన ఆయన అధికారికంగా రాజీనామా చేయలేదు. 2017లో ఐఓఏ అధ్యక్షుడిగా మరోసారి ఎన్నికయ్యేందుకు బత్రా తప్పుడు పద్ధతిని అనుసరించారు. తనను తాను హాకీ ఇండియా జీవితకాల సభ్యుడిగా నియమించుకొని ఐఓఏ ఎన్నికల్లో గెలిచారు. దాంతో కోర్టు జోక్యం చేసుకుంది. మరోవైపు ఐఓఏ అధ్యక్షుడైన కారణంగానే లభించిన ఐఓసీ సభ్యత్వ పదవికి సహజంగానే రాజీనామా ఇవ్వాల్సి వచ్చింది. -
దేశం కోసం కీలక మ్యాచ్‌ను వదిలేసుకున్న టెన్నిస్ స్టార్
ఉక్రెయిన్‌పై రష్యా దుందుడుకు వైఖరిపై అన్ని వైపుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉక్రెయిన్‌కు చెందిన క్రీడాకారులు తమ దేశంపై రష్యా జరుపుతున్న అమానుష దాడిని వ్యతిరేకిస్తూ పలు విధాలుగా సంఘీభావాన్ని ప్రకటిస్తున్నారు. ఉక్రెయిన్‌కు చెందని ఫుట్‌బాలర్స్ తాము ఆడుతున్న మ్యాచ్‌ల్లో దేశానికి తమ వంతు మద్దతు తెలుపుతూ అభిమానుల మనసులు చూరగొంటున్నారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడిని నిరసిస్తూ.. ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ గత శుక్రవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై అంతర్జాతీయ క్రీడల్లో రష్యా, బెలారస్‌కు చెందిన జాతీయ జెండాలను ప్రదర్శన చేయొద్దని కోరింది. ఇక దీనికి అదనంగా జాతీయ గీతం, సింబల్స్, కలర్స్‌ను కూడా ఎక్కడా వాడకూడదంటూ ఐవోసీ అధికారి సోమవారం ప్రకటన విడుదల చేశారు. తాజాగా ఐవోసీ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఉక్రెయిన్ టెన్నిస్ స్టార్ ప్లేయర్ ఎలినా విటోలినా కీలక నిర్ణయం తీసుకుంది. రష్యా వైఖరిని ఎండగడుతూ.. మాంటేరీ ఓపెన్‌లో ఆ దేశానికి చెందిన టెన్నిస్ ప్లుయర్ అనస్థీషియా పోటాపోవాతో రౌండ్ ఆఫ్ 32 మ్యాచ్ ఆడేది లేదంటూ పేర్కొంది.ఈ విషయాన్ని ట్విటర్లో సుధీర్ఘంగా రాసుకొచ్చింది. ''డియర్ ఆల్.. ఇప్పుడున్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఉక్రెయిన్ తరపున ఏటీపీ, డబ్ల్యూటీఏ, ఐటీఎఫ్ ఆర్గనైజేషన్లకు విజ్ఞప్తి చేస్తున్నా. ఐవోసీ పేర్కొన్న నిబంధనల ప్రకారం రష్యా, బెలారస్‌కు చెందిన అథ్లెట్లను మాములుగా పరిగణించండి. ఆ దేశం తరపున ఎలాంటి జాతీయ జెండాలు, సింబల్స్, కలర్స్, జాతీయ గీతాలు ప్రదర్శన చేయకూడదు. ఇందులో భాగంగానే మాంటేరీ ఓపెన్‌లో రష్యా క్రీడాకారిణితో జరగనున్న మ్యాచ్‌కు దూరంగా ఉండాలనుకుంటున్నా. సదరు ఆర్గనైజేషన్స్ తమ వైఖరిని తెలిపే వరకు రష్యాతో ఎలాంటి మ్యాచ్ ఆడదలచుకోలేదు. అయితే రష్యన్ అథ్లెట్స్‌ను అవమానించడం ఎంతమాత్రం కాదు. మా దేశంపై దాడి చేయడంలో రష్యా ఆటగాళ్లకు ఎలాంటి సంబంధం లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో క్రీడాకారులందరూ మద్దతుగా నిలవాల్సినవ అవసరం ఉంది. ముఖ్యంగా రష్యా, బెలారస్‌కు చెందిన ఆటగాళ్లు ముందు నిలబడాల్సిన అవసరం ఉంది.'' అంటూ పేర్కొంది. చదవండి: Russia-Ukraine War: రష్యాకు భారీ షాక్.. ఫుట్‌బాల్ ప్రపంచకప్ నుంచి బహిష్కరణ Rohit Sharma-Saba Karim: కెప్టెన్‌గా ఓకే రోహిత్.. మరి బ్యాటింగ్ సంగతి ఏంటి ?: భారత మాజీ క్రికెటర్ ✊🏼🇺🇦 #Ukraine #Україна #StandWithUkriane pic.twitter.com/1LT4WjrYI9 — Elina Monfils (@ElinaSvitolina) February 28, 2022 -
రష్యా, బెలారస్లను వెలివేయండి: ఐఓసీ
లూసానే: అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) రష్యా యుద్ధోన్మాదాన్ని తీవ్రంగా ఖండిస్తోంది. రష్యాతో పాటు ఆ దేశ మిలిటరీ చర్యకు సాయం చేస్తున్న బెలారస్‌పై అంతర్జాతీయ క్రీడా సమాజం నిషేధం విధించాలని గట్టిగా కోరింది. ‘ఇరు దేశాల్లో ఏ టోర్నీ నిర్వహించకుండా రద్దు చేయాలి. అథ్లెట్లు, అధికారులు ఇతర దేశాల్లో జరిగే ఈవెంట్లలో పాల్గొనకుండా నిషేధించాలి’ అని ఐఓసీ తెలిపింది. పోలాండ్ ఫుట్‌బాల్ జట్టు ఇదివరకే ప్రపంచకప్ క్వాలిఫయర్స్‌లో రష్యాతో ఆడేది లేదని తేల్చి చెప్పింది. ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య రష్యా, బెలారస్‌లకు కేటాయించిన బ్యాడ్మింటన్ టోర్నీలన్నీ రద్దు చేసింది. అంతర్జాతీయ అక్వాటిక్స్ సమాఖ్య ఈ ఆగస్టులో రష్యాలో నిర్వహించాల్సిన ప్రపంచ జూనియర్ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్‌ను రద్దు చేసింది. -
International Olympic Committee: భారత్‌లో 2023 ఐవోసీ సెషన్
-
40 ఏళ్ల తర్వాత భారత్‌లో ఐఓసీ సమావేశాలు..
బీజింగ్: 2023 ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ(ఐఓసీ) సమావేశాల నిర్వహణ హక్కులను భారత్ గెలుచుకుంది. 40 ఏళ్ల తర్వాత భారత్ వేదికగా ఐఓసీ సమావేశాలు జరగనున్నాయి. 50 అంతర్జాతీయ క్రీడా సంఘాలు పాల్గొనే ఈ సమావేశాలు ముంబై నిర్వహించేందుకు ఐఓసీ అధికారులు నిర్ణయించారు. చివరిసారిగా ఐఓసీ సమావేశాలు 1983లో న్యూఢిల్లీ వేదికగా జరిగాయి. ఐఓసీ సభ్యురాలు నీతా అంబానీ, భారత్ బిడ్ గెలవడంలో కీలక పాత్ర పోషించారు. ఐఓసీ సెషన్స్‌లో కమిటీ సభ్యులందరూ సమావేశమై గ్లోబల్ ఒలింపిక్ మూమెంట్ గురించి చర్చిస్తారు. అలాగే భవిష్యత్తులో ఏ నగరంలో ఒలింపిక్స్ నిర్వహించాలన్న విషయాన్ని నిర్ణయిస్తారు. బీజింగ్‌లో జరిగిన 139వ ఐఓసీ సమావేశంలో భారత్ నుంచి ఒలింపిక్ స్వర్ణ పతక విజేత అభినవ్ బింద్రా, ఐఓసీ సభ్యురాలు నీతా అంబానీ, ఐఓఏ అధ్యక్షుడు నరీందర్ బత్రా, క్రీడా మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ పాల్గొన్నారు. చదవండి: IPL 2022: యూపీ సీఎంతో కేఎల్ రాహుల్ జట్టు ఓనర్ భేటీ -
భారత్ కు మరో అరుదైన గౌరవం, హర్షం వ్యక్తం చేసిన నీతా అంబానీ!!
40 ఏళ్ల తర్వాత భారత్‌కు మరో అరుదైన గౌరవం లభించింది. వచ్చే ఏడాది ముంబాయిలో అంతర్జాతీయ ఒలంపిక్స్ కమిటీ 2023 సెషన్ ను నిర్వహించేందుకు భారత్ హక్కుల దక్కించుకుంది. ఈ సెషన్ ను 1863లో ఢిల్లీలో నిర్వహించారు. మళ్లీ వచ్చే ఏడాది ముంబైలో సెషన్ నిర్వహించడంపై రిలయన్స్ ఫౌండేషన్ చైర్మన్, అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) సభ్యురాలు నీతా అంబానీ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నీతా అంబానీ మాట్లాడుతూ.. ఇన్నేళ్ల నిరీక్షణ తర్వాత భారత్‌లో సెషన్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ అరుదైన గౌరవాన్ని భారత్‌కు అందించినందుకు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీకి కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాదు ఈ గౌరవం భారతదేశ ఒలింపిక్ ఆకాంక్షలకు గణనీయమైన అభివృద్ధికి సంకేతమనీ నీతా అంబానీ అభిప్రాయం వ్యక్తం చేశారు. -
క్రికెట్ అభిమానులకు చేదు వార్త..
జెనీవా: విశ్వవేదికపై జెంటిల్మెన్ గేమ్‌ను చూడాలని ఆశించిన క్రికెట్ అభిమానుల ఆశలపై అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) నీళ్లు చల్లింది. 2028 లాస్ ఏంజిల్స్ విశ్వక్రీడల కోసం ఐఓసీ ప్రకటించిన 28 క్రీడల జాబితాలో క్రికెట్‌కు చోటు దక్కలేదు. క్రికెట్‌తో పాటు వెయిట్‌లిఫ్టింగ్, బాక్సింగ్, ఆధునిక పెంటాథ్లాన్లకు చోటు కల్పించని ఐఓసీ.. స్కేట్ బోర్డింగ్, సర్ఫింగ్, స్కోర్ట్ క్లైంబింగ్ వంటి పలు క్రీడలకు కొత్తగా అవకాశం కల్పించింది. కాగా, విశ్వక్రీడల్లో క్రికెట్‌కు కేవలం ఒకే ఒక్కసారి మాత్రమే ప్రాతినిధ్యం లభించిన విషయం తెలిసిందే.1900 పారిస్ గేమ్స్‌లో క్రికెట్‌ను తొలిసారి ప్రవేశపెట్టారు. ఇదిలా ఉంటే, వెయిట్ లిఫ్టింగ్, బాక్సింగ్ సమాఖ్యల్లో నెలకొన్న అవినీతి, డోపింగ్ పరిస్థితుల కారణంగా ఆ రెండు క్రీడలపై ఐఓసీ వేటు వేసే అవకాశం ఉంది. ఇందులో భాగంగానే ఆ రెండు క్రీడలను ప్రాధమిక జాబితా నుంచి తొలగించినట్లు తెలుస్తోంది. మరోవైపు ఒలింపిక్స్‌లో క్రికెట్‌కు ప్రవేశం కల్పించాలని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) గట్టి ప్రయత్నాలే చేస్తుంది. ఐఓసీ నుంచి ప్రాధమిక క్రీడల జాబితా వెలువడినప్పటికీ.. తమ ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉంది. చదవండి: బంగ్లా క్రికెట్ జట్టులో ఒమిక్రాన్ కేసులు.. -
ఒలింపిక్స్ నుంచి బాక్సింగ్, వెయిట్‌లిఫ్టింగ్ ఔట్!
లాసానే (స్విట్జర్లాండ్): ఒలింపిక్స్‌లో భారత్‌కు మూడు పతకాలు అందించిన బాక్సింగ్, రెండు పతకాలు అందించిన వెయిట్లిఫ్టింగ్లకు విశ్వ క్రీడల్లో భవిష్యత్తు సందేహాత్మకంగా మారింది. 2028లో లాస్ ఏంజెలిస్‌లో జరిగే ఒలింపిక్స్ నుంచి ఈ క్రీడలను తప్పించే అవకాశం ఉంది. దీంతో పాటు ఐదు క్రీడాంశాల సమాహారమైన మోడ్రన్ పెంటాథ్లాన్‌ను (రన్నింగ్, ఈక్వెస్ట్రియన్, స్విమ్మింగ్, షూటింగ్, ఫెన్సింగ్) కూడా తొలగించాలని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) భావిస్తోంది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడకపోయినా... మూడు కొత్త క్రీడాంశాల ప్రకటనను బట్టి చూస్తే పై మూడింటిని తప్పించాలని ఐఓసీ అంతర్గత సమావేశాల్లో నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. వీటి స్థానాల్లో కొత్తగా స్కేట్ బోర్డింగ్, స్పోర్ట్ క్లైంబింగ్, సర్ఫింగ్‌లను చేర్చనున్నారు. యువత ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్న ఈ క్రీడలను ఒలింపిక్స్‌లో రెగ్యులర్ క్రీడాంశంగా మార్చేందుకు ఐఓసీ సిద్ధమైంది. 1912 ఒలింపిక్స్ నుంచి ఉన్న మోడ్రన్ పెంటాథ్లాన్‌కు చారిత్రక ప్రాధాన్యమే తప్ప వాణిజ్యపరంగా కానీ అభిమానులపరంగా పెద్దగా ఆసక్తి గానీ ఉండటం లేదని ఐఓసీ చెబుతోంది. ఇక బాక్సింగ్, వెయిట్‌లిఫ్టింగ్ క్రీడలను సుదీర్ఘ కాలంగా పలు సమస్యలు వెంటాడుతున్నాయి. ఆర్థిక పరమైన అంశాలు, నైతికత లోపించడం, డోపింగ్, పరిపాలన సరిగా లేకపోవడంతో ఈ క్రీడల ప్రక్షాళన అవసరమని భావిస్తూ వీటిని తప్పించాలని ఐఓసీ ప్రతిపాదించింది. మరోవైపు 2028 నుంచి క్రికెట్ కూడా ఒలింపిక్స్‌లోకి రావచ్చంటూ వినిపించగా, తాజా పరిణామాలతో ఆ అవకాశం లేదని తేలిపో యింది. లాస్ ఏంజెలిస్ ఈవెంట్ కోసం నిర్వాహకులు ప్రతిపాదించిన 28 క్రీడాంశాల్లో క్రికెట్ పేరు లేకపోవడంతో దీనిపై స్పష్టత వచ్చేసింది. -
టోక్యో గెలిచింది
కరోనా వచి్చనా... వేరియంట్లతో కలకలం రేపినా... ఓ ఏడాది వాయిదా పడినా... ఆఖరి దాకా అనుమానాలే ఉన్నా... మెజార్టీ జపనీయులు వ్యతిరేకించినా... సక్సెస్ (ఒలింపిక్స్)... డబుల్ సక్సెస్ (పారాలింపిక్స్)... టోక్యో ఇప్పుడు వేదిక కాదు... ముమ్మాటికి విజేత! ఎనిమిదేళ్ల జపాన్ శ్రమ వృథా కాలేదు. నాడు ఆతిథ్య హక్కులు పొందిన రాజధాని (టోక్యో) నేడు హ్యాపీగా ముగించేంత వరకు... చేసిన కసరత్తు, పడిన శ్రమ, వెచ్చించిన వ్యయం, కట్టుదిట్టంగా రూపొందించిన నియమావళి, వేసుకున్న ప్రణాళికలు అన్నీ కుదిరాయి. మాటు వేసిన మహమ్మారిని జయించి మరీ ఒలింపిక్స్, పారాలింపిక్స్ భేషుగ్గా జరిగాయి. భళారే అన్నట్లుగా ముగిశాయి. ప్రేక్షకులు లేని లోటు ఉన్నా... ఆటగాళ్లకు, అధికారులకు ఏ లోటు లేకుండా జపాన్ పకడ్బందీగా పనులు చక్కబెట్టిన తీరుకు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ), పారాలింపిక్ కమిటీ (ఐపీసీ), ప్రపంచ క్రీడా సమాఖ్యలు ఫిదా అయ్యాయి. టోక్యోకు జయ హో అన్నాయి. ఇక ఒలింపిక్ టార్చ్ చలో చలోమని పారిస్ (2024) బాట పట్టింది. ఇంకో మూడేళ్లే ఉన్న తదుపరి ఒలింపిక్స్ కోసం ఫ్రాన్స్ ఏర్పాట్లలో తలమునకలైంది. మనం... అందరం... కలుద్దాం పారిస్‌లో..! సందడి చేద్దాం ఒలింపిక్స్‌లో! ఎదురులేని చైనా మొత్తం 162 దేశాలు పాల్గొన్న టోక్యో పారాలింపిక్స్‌లో చైనా తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. చైనా 96 స్వర్ణాలు, 60 రజతాలు, 51 కాంస్యాలతో కలిపి మొత్తం 207 పతకాలు సాధించింది. 124 పతకాలతో బ్రిటన్ (41 స్వర్ణాలు, 38 రజతాలు, 45 కాంస్యాలు) రెండో స్థానంలో... 104 పతకాలతో అమెరికా (37 స్వర్ణాలు, 36 రజతాలు, 31 కాంస్యాలు) మూడో స్థానంలో నిలిచాయి. ఓవరాల్‌గా 78 దేశాలు కనీసం ఒక్క పతకమైనా సాధించాయి. తదుపరి పారాలింపిక్స్ 2024లో పారిస్‌లో జరుగుతాయి. -
Tokyo Olympics: రూల్స్ సవరణ.. రెచ్చిపోతున్న అథ్లెట్లు
టోక్యో: కరోనా కట్టడితో అథ్లెట్లకు ఊపిరి ఆడని పరిస్థితి. ఒలింపిక్స్ విలేజ్‌లో ఆహ్లాదంగా గడపలేని పరిస్థితులు, కఠిన నిబంధనలు, ఆల్కహాల్- సెక్స్‌కి దూరం కావడం వెరసి టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న ఆటగాళ్ల మానసిక స్థితిపై ప్రతికూల ప్రభావం పడుతోంది. ఈ నేపథ్యంలో ఆటగాళ్లకు కొంతలో కొంత ఊరట ఇచ్చింది ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ కమిటీ. సోషల్ మీడియా కఠిన నిబంధనల్ని ఎత్తేయడంతో అథ్లెట్లంతా ఒక్కసారిగా రెచ్చిపోతూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ సోషల్ మీడియా రూల్స్‌ను సవరించింది. దీంతో టిక్‌టాక్ లాంటి వీడియో జనరేట్ కంటెంట్ యాప్‌లలో రెచ్చిపోతున్నారు అథ్లెట్లు. ఖాళీ టైం దొరికితే చాలు.. వాళ్లరూమ్లలో షార్ట్ వీడియోలు తీసుకుంటూ పండుగ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో కొందరికి ఈ-పాపులారిటీ దక్కుతుండడం విశేషం. ఐరిష్ జిమ్నాస్ట్ రైస్ మెక్‌క్లెనాగన్ ‘యాంటీ-సెక్స్’ బెడ్ పుకార్లను బద్ధలు కొట్టిన వీడియోతో మొదలైన సందడిని వందల మంది అథ్లెట్లు కొనసాగిస్తూ వస్తున్నారు. అమెరికన్ రగ్బీ ప్లేయర్ ఇలోనా మహెర్ తన టీంతో కలిసి, వాలీబాల్ ప్లేయర్ ఎరిక్ షోజీ, ఐరిష్ ట్రాక్ స్టార్ లియోన్ రెయిడ్.. ఈ జాబితాలో ముందున్నారు. అథ్లెట్లకు కేటాయించిన రూమ్‌ల్లో వాళ్ల చేస్తున్న సందడి మామూలుగా ఉండడం లేదు. “Anti-sex” beds at the Olympics pic.twitter.com/2jnFm6mKcB — Rhys Mcclenaghan (@McClenaghanRhys) July 18, 2021 I drop about 3 tiktoks a day from here in the village. Follow me for a good laugh. pic.twitter.com/VzxDKhJZ5r — Raven HULK Saunders (@GiveMe1Shot) July 27, 2021 టఫ్ ఐవోసీ రూల్స్ ఐవోసీలోని ఇంతకు ముందు రూల్స్ ప్రకారం.. అథ్లెట్లతో పాటు కోచ్‌లు, అధికారులు ఎవరైనా కూడా ఫొటోలు మాత్రమే పోస్ట్ చేయాలి. కాంపిటీషన్ వెన్యూ నుంచి కూడా పోస్టులు పెట్టొచ్చు. కానీ, ఆడియో-వీడియో కంటెంట్ మాత్రం పోస్ట్ చేయడానికి వీల్లేదు. అలాగే నాన్-ఒలిపింక్ స్పాన్సర్స్‌కు సంబంధించిన పోస్ట్‌లు కూడా చేయకూడదు. అలా చేస్తే ఫైన్‌తో పాటు బ్యాన్‌కు కూడా అవకాశం ఉందని హెచ్చరికలు ఉండేవి. అయితే 2018 వింటర్ ఒలింపిక్స్ టైంలో అథ్లెట్లు.. ఆడియెన్స్‌తో ఇంటెరాక్ట్ అవుతూ ఇన్స్టాగ్రామ్ రీల్స్ తీసే అవకాశం కల్పించింది. అంతేకాదు వ్లోగర్స్ వీడియోలు తీసుకోవచ్చని పేర్కొంది. అయితే అదే ఒలింపిక్స్‌లో ఐస్ డ్యాన్సింగ్ అక్కాచెల్లెలు మయియా-అలెక్స్ షిబుటానీ ఒలింపిక్స్ వ్లోగ్ కక్రియేట్ చేయగా.. గంటలో దానిని యూట్యూబ్ కాపీరైట్స్ పాలసీ ఉల్లంఘనల పేరిట తొలగించేసింది. అప్పటి నుంచి కొన్ని పరిమితులతో వీడియోలకు అవకాశం ఇచ్చింది. ఇక కరోనా టైంలో ఒత్తిడి ఎదుర్కొనే అవకాశం ఉండడంతో అథ్లెట్లు వాళ్ల అనుభవాల్ని సన్నిహితులతో పంచుకోవచ్చని పేర్కొంది. అది కూడా నాన్-కమర్షియల్ అయితేనే. -
మెడల్ గెలిస్తే మరో బంపర్ ఆఫర్..
టోక్యో: ఒలింపిక్స్‌లో పతకం సాధించే అథ్లెట్లకు నిర్వహకులు మరో బంపర్ ఆఫర్ ప్రకటించారు. పతకం గెలిచాక అథ్లెట్లు పోడియంపై నిల్చున్న సమయంలో ఫొటోలకు పోజులివ్వడానికి 30 సెకన్ల పాటు మాస్కులు తీసివేసే అవకాశం కల్పించారు. అయితే ఈ అవకాశాన్ని అథ్లెట్లు దుర్వినియోగం చేయొద్దని నిర్వాహకులు కోరారు. ఈ మేరకు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ(ఐఓసీ) సోమవారం ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది. కాగా, ఒలింపిక్ గ్రామంలో అథ్లెట్లు, సిబ్బంది కరోనా బారిన పడకుండా నిర్వాహకులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా అథ్లెట్లు బరిలో ఉన్నప్పుడు మినహా అన్ని సమయాల్లో మాస్కులు ధరించే ఉండాలని నిబంధనలు జారీ చేశారు. అయితే మాస్కుల విషయంలో తాజాగా లభించిన వెసులుబాటుకు అథ్లెట్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ఒలింపిక్ గ్రామంలో అథ్లెట్లకు రోజూ కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. -
టోక్యో ఒలింపిక్స్ 2020: ఓడిన ఓ ‘విజేత’ కథ
ఏడాది ఆలస్యం తర్వాత ప్రారంభమైన క్రీడా సంబురం ఒలింపిక్స్.. ఎలాంటి ఆర్భాటాలు లేకుండానే మొదలైంది. టోక్యో వేదికగా జరుగుతున్న విశ్వక్రీడల సమరాన్ని ఆసక్తిగా తిలకించబోతున్నారు కోట్లాది ప్రజలు. అయితే నిన్న ఆరంభ వేడుకల్లో జరిగిన ఓ ఈవెంట్.. ఎవరికీ అంతుబట్టని రీతిలో జరగడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఓ పక్క డ్యాన్సులు కొనసాగుతున్న టైంలో.. ఆ వెలుగుల జిగేలులో ట్రెడ్‌మిల్‌పై ఓ మహిళ పరుగులు తీసి అందరి దృష్టిని ఆకర్షించింది. దీంతో ఆమె ఎవరు? ఎందుకలా చేసింది? అనే ప్రశ్నలతో పాటు ఆ ట్రెడ్మిల్ వీడియో సోషల్ మీడియాలో మీమ్‌లా వైరల్ అవుతోంది. ఆమె పేరు అరిస సుబాటా. వయసు 27 ఏళ్లు. జపాన్‌కే చెందిన ఆమె ఒక ఆస్పత్రిలో నర్స్‌గా పని చేస్తోంది. కానీ, పిడిగుద్దులతో బాక్సర్‌గా కూడా ఆమెకు మాంచి గుర్తింపు ఉంది ఈ దేశంలో. ఒలింపిక్స్ అర్హత కోసం ఏడాదిన్నరగా కష్టపడిందామె. కానీ, కరోనా ఆమెను ఘోరంగా ఓడించింది. క్వాలిఫైయింగ్ మ్యాచ్‌ల్ని ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ కమిటీ రద్దు చేయడంతో ఆమెకు అవకాశం దక్కలేదు. అయితే ఆమె విజ్ఞప్తి మేరకు ఇలా టోక్యో ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో ట్రెడ్‌మిల్‌పై సందడి చేసింది. పేద కుటుంబంలో పుట్టిన సుబాటా కెరీర్లోకి అడుగుపెట్టి మూడేళ్లే అయ్యింది. అయితేనేం జపాన్ బాక్సింగ్ ఛాంపియన్‌గా ఎదిగింది. కరోనా టైంలో ఆటగాళ్లంతా ఐసోలేషన్‌లో మెగా టోర్నీని సన్నద్ధం అవుతుంటే.. ఆమె మాత్రం నర్సుగా తన విధుల్ని నిర్వహిస్తూనే మరోవైపు ఒలింపిక్స్ కోసం రేయింబవళ్లు కష్టపడింది. కానీ, ఆ కష్టం వృథా అయ్యింది. క్వాలిఫైయింగ్ మ్యాచ్‌ల్ని రద్దుచేసేసింది ఐవోసీ. అంతేకాదు 2017 నుంచి ప్రపంచ ర్యాంకింగ్‌ల ఆధారంగా 53 బాక్సర్లను మాత్రమే టోక్యో ఒలింపిక్స్‌కు ఎంపిక చేసింది. తనకు అవకాశం దక్కకపోవడంపై ఆమె నిరాశ చెందింది. అయితేనేం మిగతా ఆటగాళ్లకు ఆల్ ది బెస్ట్ చెబుతోంది. ‘ట్రెడ్‌మిల్‌పై నేను చూపించింది నా కష్టం మాత్రమే కాదు.. వేలమంది అథ్లెట్ల కష్టానికి ప్రతీక. వాళ్లందరికీ ఆల్‌దిబెస్ట్ చెబుతున్నా. తన చేష్టలను చాలామంది నవ్వుకోవచ్చు. కొందరు మెచ్చుకోవచ్చు. కానీ, మిగతా ఆటగాళ్లను అందరూ ప్రోత్సహించండి. ఏదో ఒకనాటికి ఛాంపియన్ అయ్యి తీరుతా’ అని కన్నీళ్లతో మీడియాతో మాట్లాడిందామె. -
బ్రిస్బేన్‌లో 2032 ఒలింపిక్స్
టోక్యో: 2032 విశ్వక్రీడలను ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ నగరంలో నిర్వహించనున్నట్లు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ(ఐఓసీ) బుధవారం ప్రకటించింది. 2000 సంవత్సరంలో సిడ్నీలో ఒలింపిక్స్ జరిగిన తరువాత తిరిగి 32 ఏళ్ల విరామం తర్వాత.. ఆస్ట్రేలియాలో ఒలింపిక్ క్రీడలు జరగనున్నాయి. 1956 ఒలింపిక్స్‌కు మెల్బోర్న్ నగరం ఆతిథ్యం ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా, ఈ విషయంపై ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ స్పందిస్తూ.. విశ్వక్రీడల ఆతిధ్య హక్కులు తమ దేశానికి దక్కడం గౌరవంగా భావిస్తామని అన్నారు. అలాగే ఈ క్రీడలు విజయవంతంగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన అన్ని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే ఒలింపిక్స్ ఆతిథ్య హక్కుల కోసం జరిగిన ఓటింగ్‌లో బ్రిస్బేన్‌కు 72-5 ఓట్లు పోలయ్యాయి. టోక్యో ఒలింపిక్స్ తర్వాత 2024 విశ్వక్రీడలకు పారిస్ నగరం ఆతిధ్యం ఇవ్వనుండగా, 2028 ఒలింపిక్స్ లాస్ ఏంజిల్స్ నగరంలో జరగనున్నాయి. -
ఒలింపిక్స్‌లో కరోనా వివాదం
దశలు.. వేరియెంట్ల వారీగా కరోనా మనుషుల మీద విరుచుకుపడుతోంది. ఇద్దరు దగ్గరగా ఉంటేనే వైరస్ సోకుతుందేమోనన్న భయం వెంటాడుతోంది. అలాంటిది వేల మంది ఆటగాళ్లతో జపాన్ ఎందుకు ఒలింపిక్స్ నిర్వహించాలనుకుంటోంది. మరోవైపు ఒలింపిక్స్ వాయిదా వేయాలంటూ అంతర్జాతీయ సమాజం నుంచి ఒత్తిడి వస్తోంది. దీంతో ఒలింపిక్స్ నిర్వాహణపై సర్వత్రా ఆసక్తితో పాటు ఆందోళన కూడా నెలకొంది. -
చరిత్ర సృష్టించిన భారత్ బాక్సర్.. ప్రపంచ నంబర్ వన్ స్థానం కైవసం
న్యూఢిల్లీ: బాక్సింగ్ క్రీడలో భారత స్టార్ బాక్సర్ అమిత్ పంగాల్ చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ (ఐఓసి)కి చెందిన బాక్సింగ్ టాస్క్ ఫోర్స్ విడుదల చేసిన తాజా ర్యాంక్సింగ్స్‌లో పురుషుల 52 కిలోల ఫ్లై వెయిట్ విభాగంలో ప్రపంచ నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఇదే హోదాలో టోక్యో ఒలింపిక్స్‌లో బరిలో దిగనున్నాడు. ఈ క్రమంలో అమిత్ మరో ఘనతను సొంతం చేసుకున్నాడు. ప్రపంచ నంబర్ వన్ ర్యాంకు పొందిన ఏకైక భారత ఒలింపియన్‌గా రికార్డు నెలకొల్పాడు. కాగా, గత నెలలో జరిగిన ఆసియా బాక్సింగ్ ఛాంపియన్షిప్ ఫైనల్లో ఉజ్బెకిస్థాన్‌కు చెందిన షాఖోబిదిన్ జోయిరోవ్ చేతిలో 2-3 తేడాతో ఓటమిపాలైనప్పటికీ అమిత్ ఈ ఘనతను సొంతం చేసుకోవడం విశేషం. ఇదిలా ఉంటే, ఐఓసి తాజా ర్యాంకింగ్స్‌లో అమిత్‌తో పాటు పలువురు భారత బాక్సర్లు టాప్ 20లో స్థానం సంపాదించారు. పురుషుల విభాగంలో సతీష్ కుమార్ (75, 95 కిలోలు) తొమ్మిదో స్థానంలో మనీష్ కౌశిక్ (63 కిలోలు) 18వ స్థానంలో నిలిచారు. ఇక మహిళల విభాగంలో ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన భారత స్టార్ బాక్సర్ మేరీ కోమ్ (69 కిలోలు) ఏడో స్థానంలో నిలువగా, సిమ్రాన్‌జిత్ కౌర్ (60 కిలోలు) నాలుగో స్థానంలో, లోవ్లినా బోర్గోహైన్(69 కిలోలు) ఐదో స్థానంలో, పూజా రాణి(75 కిలోలు) 8వ స్థానంలో నిలిచారు. కాగా, కరోనా కారణంగా ఏడాదిపాటు వాయిదా పడ్డ టోక్యో ఒలింపిక్స్ జులై 23న ప్రారంభమై.. ఆగస్టు 8 వరకు జరగనున్నాయి. ఇప్పటికే కొందరు అథ్లెట్లు ఒలింపిక్స్ గ్రామానికి చేరుకున్నారు. ప్రతిరోజు 10000 మంది ప్రేక్షకులను మాత్రమే స్టేడియాలకు అనుమతిస్తామని నిర్వాహకులు ఇటీవలే స్పష్టం చేశారు. మాస్కులు ధరించడం, టెంపరేచర్ చెకింగ్ వంటి అన్ని కోవిడ్ జాగ్రత్తల తీసుకున్న తర్వాతే ప్రేక్షకులను స్టేడియాల్లోకి అనుమతిస్తామని, అక్కడ కూడా భౌతిక దూరంగా పాటించే విధంగా ఏర్పాట్లు చేశామని, ఆటోగ్రాఫ్‌లు, మద్యపానం తదితరరాలను నిషేధించామని నిర్వహకులు వెల్లడించారు. చదవండి: టీమిండియా కెప్టెన్‌గా అతనే సరైనోడు: పనేసర్ -
టోక్యో ఒలింపిక్స్ క్రీడలు సురక్షితం
టోక్యో: ఈ ఏడాది కూడా టోక్యో ఒలింపిక్స్ క్రీడల ను నిర్వహించొద్దంటూ ఆందోళనలు చేస్తున్న జపాన్ ప్రజలకు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) భరోసా ఇచ్చే ప్రయత్నం చేసింది. ఒలింపిక్స్‌ను సురక్షితంగా నిర్వహిస్తామంటూ ఐఓసీ ఉపాధ్యక్షుడు జాన్ కోట్స్ జపాన్ ప్రజలకు తెలియజేశారు. మెగా ఈవెంట్ ఏర్పాట్లలో భాగంగా మూడు రోజులపాటు జరిగిన వర్చువల్ సమావేశం శుక్రవారం ముగిసింది. ఇందులో అధ్యక్ష హోదాలో పాల్గొన్న జాన్... ‘నేను మరోసారి స్పష్టంగా చెబు తున్నా... గేమ్స్ సురక్షితంగా జరుగుతాయి. అందు లో పాల్గొనే క్రీడాకారులతో పాటు జపాన్ వాసుల ఆరోగ్యానికి పెద్ద పీట వేస్తూ గేమ్స్‌ను నిర్వహిస్తాం’ అని స్పష్టం చేశారు. విశ్వ క్రీడలు ఆరంభమయ్యే సమయానికి టోక్యో ప్రజల్లో దాదాపు 80 శాతం మంది కోవిడ్–19 వ్యాక్సిన్‌ను వేసుకొని ఉంటారని ఆయన వ్యాఖ్యానించారు. ఒలింపిక్స్‌కు మరో తొమ్మిది వారాల సమయం మాత్రమే ఉండగా... ఇటీవల ఐఓసీ సీనియర్ సభ్యుడు రిచర్డ్ పౌండ్ ఒక పత్రికా సమావేశంలో ఆసక్తికర వ్యాఖ్య చేశారు. ఒలింపిక్స్ నిర్వహణపై తాము ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని, జూన్ చివరి నాటికి క్రీడలపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని ఆయన పేర్కొనడం విశేషం. ఒకవేళ ఈ ఏడాది గేమ్స్ జరగకపోతే... అవి రద్దయినట్లుగా భావించాలని రిచర్డ్ తెలిపారు. -
టోక్యో ఒలింపిక్స్ ఆగవు...
ఒకవైపు కరోనా కేసులు పెరిగిపోతున్నా... మరోవైపు జపాన్ ప్రజలు నిరసనలు చేస్తున్నా... టోక్యో ఒలింపిక్స్ క్రీడలు ఆగిపోవని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) అధికార ప్రతినిధి మార్క్ ఆడమ్స్ స్పష్టం చేశాడు. ‘మీకు మరోసారి స్పష్టంగా చెబుతున్నా. టోక్యో గేమ్స్ ఈ ఏడాది జరిగేలా ఐఓసీ ఇప్పటికే తీర్మానం చేసింది. ఇందులో ఎలాంటి మార్పు ఉండదు’ అని ఆడమ్స్ వ్యాఖ్యానించాడు. -
Tokyo Olympics: ‘రాజకీయాలతో చంపేస్తారా’
టోక్యో: ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఏడాది టోక్యోలో ఒలింపిక్స్ జరుపుతామని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) నిర్వహణా కమిటీ పదే పదే చెబుతున్నా... స్థానికంగా మాత్రం పరిస్థితులు అంత అనుకూలంగా కనిపించడం లేదు. ఒలింపిక్స్ రద్దు చేయాలంటూ కోరుతున్న పిటిషన్‌కు అనుకూలంగా 3 లక్షల మంది ఇప్పటికే సంతకాలు చేశారు. కరోనాతో ప్రజలు ఇబ్బంది పడుతుండగా... పలు చోట్ల సరైన వైద్య సౌకర్యాలు అందుబాటులో లేవు. జపాన్ దేశంలోని పలు ప్రాంతాల్లో ప్రస్తుతం జాతీయ ఎమర్జెన్సీ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో స్థానిక పత్రికలో వచ్చిన ఒక ప్రకటన అందరి దృష్టినీ ఆకర్షించింది. ‘వ్యాక్సిన్లు లేవు, వైద్యం లేదు, వెదురు బొంగులతో చేసిన ఆయుధాలతో మేం పోరాడాలా. పరిస్థితులు మారకపోతే ఈ రాజకీయాల కారణంగానే మేం చచ్చిపోతాం. ఏడాది కాలంగా మమ్మల్ని మోసం చేస్తూనే ఉన్నారు. ఇంకా ఏం చేయాలి’ అని రాసి ఉన్న ప్రకటనలో జపాన్ దేశ ప్రజల్లో పెరిగిపోతున్న అసహనం కనిపించింది. -
ఐఓసీ చీఫ్ జపాన్ పర్యటన రద్దు
టోక్యో: కరోనా కేసులు పెరుగుతుండటంతో జపాన్ పర్యటనను అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) అధ్యక్షుడు థామస్ బాచ్ రద్దు చేసుకున్నారు. ఈ విషయాన్ని ఒలింపిక్ ఆర్గనైజింగ్ కమిటీ తమ ప్రకటనలో పేర్కొంది. వచ్చే సోమవారం టార్చ్ రిలే హిరోషిమా నగరానికి చేరుకోనుండగా... బాచ్ అందులో పాల్గొనాల్సి ఉంది. ప్రస్తుతానికైతే బాచ్ పర్యటన రద్దయిందని... త్వరలోనే ఆయన కొత్త పర్యటన తేదీలను ప్రకటిస్తామని ఒలింపిక్ ఆర్గనైజింగ్ కమిటీ తెలిపింది. ఒలింపిక్స్‌కు మరో 10 వారాల సమయం మాత్రమే ఉండగా... నిర్వాహకులు అనేక సమస్యలతో సతమతమవుతున్నారు. కరోనా వేళ ఒలింపిక్స్ ఏంటంటూ... వాటిని మరోసారి వాయిదా లేదా రద్దు చేయాలంటూ స్థానిక మీడియా నిర్వహించిన సర్వేల్లో తేలింది. ఈ సర్వేల్లో ఏకంగా 60 నుంచి 80 శాతం మంది ప్రజలు ఒలింపిక్స్ నిర్వహణపై తమ విముఖతను తెలియజేశారు. మరోవైపు ఇటీవలే టోక్యో ఒలింపిక్స్‌ను నిర్వహించకూడదంటూ ఆన్లైన్లో దాఖలు చేసిన పిటిషన్‌కు మద్దతుగా 3 లక్షల మందికి పైగా జపాన్‌వాసులు సంతకాలు చేశారు. ఇన్ని సమస్యల మధ్య కూడా అనుకున్న తేదీల్లోనే ఒలింపిక్స్‌ను నిర్వహిస్తామని ఐఓసీ పేర్కొనడం విశేషం. -
PV Sindhu: సింధుకు సముచిత గౌరవం
న్యూఢిల్లీ: భారత బ్యాడ్మింటన్ స్టార్, ప్రపంచ చాంపియన్ పీవీ సింధును అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) తగిన రీతిలో గౌరవించింది. ఐఓసీ ప్రచార కార్యక్రమంలో ‘బిలీవ్ ఇన్ స్పోర్ట్స్’కు అంబాసిడర్‌గా సింధును ఎంపిక చేసింది. సింధుతో పాటు కెనడా షట్లర్ మిషెల్లీ లీకి కూడా ఈ గౌరవం దక్కింది. ఐఓసీ ప్రచారంలో భాగంగా సింధు, లీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న షట్లర్లతో సోషల్ మీడియా ద్వారా సంభాషిస్తారు. క్రీడల్లో అత్యుత్తమంగా ఎదిగే క్రమంలో ఎదురయ్యే ఇబ్బందులను ఎలా అధిగమించాలనే అంశంపై తమ సూచనలు, సలహాలు ఇస్తారు. ముఖ్యంగా ఆటలో భాగంగా ఉంటూ తప్పుడు మార్గాల వైపు ఆకర్షితులయ్యే ప్రమాదాల నుంచి ఎలా దూరంగా ఉండాలనే అంశంపై మార్గనిర్దేశనం చేస్తారు. చదవండి: Tokyo Olympics: జిమ్నాస్ట్ ప్రణతి నాయక్ అర్హత -
అడుగడుగునా కరోనా పరీక్షలు
టోక్యో: ఒలింపిక్స్ క్రీడలకు మరో 85 రోజులు ఉన్నాయి. కరోనా కల్లోలంలో వీటిని సజావుగా జరిపేందుకు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) బుధవారం టోక్యో ఒలింపిక్స్ ఆర్గనైజింగ్ కమిటీ, జపాన్ ప్రభుత్వంతో సమావేశం నిర్వహించింది. ఇందులో టోక్యో ఒలింపిక్స్‌ను సజావుగా ఎలా నిర్వహించాలనే అంశంపై చర్చించడంతో పాటు ఇందులో పాల్గొనే క్రీడాకారుల ఆరోగ్య భద్రతపై కూడా కొన్ని కీలక అంశాలను ఆమోదించాయి. అంతేకాకుండా కరోనా నేపథ్యంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో తయారు చేసిన రూల్‌బుక్‌లోని నిబంధనలను కూడా సవరించాయి. కొత్త నిబంధనలు ► ఒలింపిక్స్‌లో పాల్గొనే అథ్లెట్లు, వారి సహాయక సిబ్బంది జపాన్‌కు వచ్చే ముందు తప్పనిసరిగా రెండుసార్లు కోవిడ్ పరీక్షను చేయించుకోవాలి. నెగెటివ్‌గా వస్తేనే టోక్యోలో అడుగుపెట్టాలి. ► ఒలింపిక్స్ సందర్భంగా అథ్లెట్లు, వారితో దగ్గరగా పనిచేసే కోచ్‌లు, ఫిజియోలకు ప్రతి రోజూ కోవిడ్ పరీక్షలను నిర్వహించడం జరుగుతుంది. ఇందుకు సంబంధించిన టైమ్ టేబుల్‌ను కూడా రూపొందించనున్నారు. ► ఒలింపిక్స్‌తో ప్రత్యక్షంగా సంబంధం ఉన్న వారు (అథ్లెట్లు తప్ప) ఒలింపిక్స్ విలేజ్‌లో అడుగుపెట్టగానే వారికి వరుసగా మూడు రోజుల పాటు కోవిడ్ పరీక్షలను నిర్వహిస్తారు. ఆ తర్వాత అథ్లెట్లతో వారికి ఉండే సంబంధాన్ని బట్టి రోజూ కోవిడ్ పరీక్షలు నిర్వహించాలా వద్దా అనేది నిర్ణయిస్తారు. ► ఒలింపిక్స్‌లో పాల్గొనేవారు తమకు కేటాయించిన పనులను మాత్రమే చేయాలి. అంతేకాకుండా వారంతా జపాన్ వాసులకు, జపాన్‌లో 14 రోజులకు పైగా ఉంటున్న వారితో ఒక మీటర్ కంటే తక్కువ దూరంతో ఉంటూ చేసే సంభాషణలను సాధ్యమైనంత మేర తగ్గించాలి. ► ఒలింపిక్స్‌లో పాల్గొనడానికి వచ్చిన వారు తమకు ప్రత్యేకంగా కేటాయించిన వాహనాల్లో మాత్రమే ప్రయాణం చేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజా రవాణాల్లో ప్రయాణం చేయరాదు. ► ఒలింపిక్స్‌లో పాల్గొనే వారు తమకు కేటాయించిన ప్రదేశాల్లో మాత్రమే అల్పాహారం, భోజనం వంటివి చేయాలి. ► కోవిడ్ పాజిటివ్‌గా తేలిన వ్యక్తితో 15 నిమిషాలు లేదా అంతకంటే ఎక్కువగా మాట్లాడినా, ఒక మీటర్ పరిధిలో ఉన్నా, మాస్క్ వేసుకోకుండా మాట్లాడిన వారిని క్లోజ్ కాంటాక్టులుగా భావిస్తారు. అయితే ఇవన్నీ కూడా ఒక గదిలో లేదా వాహనంలో జరగాల్సి ఉంటుంది. ► ఒలింపిక్స్, పారాలింపిక్స్‌లో జరిగే పోటీలను ప్రత్యక్షంగా చూడటానికి ఎంతమంది దేశవాళీ ప్రేక్షకులను అనుమతించాలి అనే విషయంపై జూన్‌లో నిర్ణయం తీసుకోనున్నారు. కరోనా నేపథ్యంలో ఇప్పటికే విదేశీ ప్రేక్షకులను అనుమతించకూడదనే నిర్ణయాన్ని ఐఓసీ తీసుకున్న విషయం తెలిసిందే. -
ఒలింపిక్స్‌లో నిరసన ప్రదర్శనలపై నిషేధం
టోక్యో ఒలింపిక్స్‌లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులు పోడియంపై పతకాలు తీసుకొని వెనక్కి వచ్చేయాలి తప్ప... అవకాశం దొరికింది కదా అని రాజకీయ ప్రసంగాలు, నిరసన ప్రదర్శలనలను చేపడితే ఇక వారి కథ కంచికి చేరినట్లే. ఈ మేరకు ఒలింపిక్స్‌లో క్రీడాకారుల నిరసన ప్రదర్శనలపై ఉన్న నిషేధాన్ని కొనసాగించేందుకే తాము నిర్ణయం తీసుకున్నట్లు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) స్పష్టం చేసింది. ఒకవేళ క్రీడాకారులు నిబంధనలను ఉల్లంఘిస్తే మాత్రం తీవ్రమైన పరిణామాలను ఎదుర్కొనాల్సి ఉంటుందని ఐఓసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ క్రిస్టీ కొవెన్ట్రీ హెచ్చరించారు. -
వద్దు... మీరెవరూ రావొద్దు!
టోక్యో: ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్ క్రీడలను మనం జపాన్‌కెళ్లి చూద్దామంటే కుదరనే కుదరదు. మనమే కాదు... మరే దేశానికి చెందిన ప్రేక్షకులకు ఆ అవకాశం లేదు. చరిత్రలో తొలిసారి విదేశాలకు చెందిన ప్రేక్షకుల్లేకుండా ఒలింపిక్స్‌ను నిర్వహించాలని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) నిర్ణయించింది. శనివారం జపాన్ ప్రభుత్వం, టోక్యో అధికారులు, గేమ్స్ ఆర్గనైజింగ్ కమిటీ, పారాలింపిక్ కమిటీ వర్గాలతో ఆన్లైన్ మీటింగ్ నిర్వహించిన ఐఓసీ ప్రేక్షకులపై తుది నిర్ణయం తీసుకుంది. జపాన్‌లో ఇప్పటివరకు ఎన్నో సర్వేలు నిర్వహించారు. ప్రతి సర్వేలో 80 శాతానికి పైగా జపాన్ వాసులు విదేశీ ప్రేక్షకులు వస్తే కరోనా మహమ్మారి వ్యాప్తి అడ్డుఅదుపు లేకుండా పెరిగిపోతుందని భయాందోళనలు వ్యక్తం చేశారు. అంతేకాదు... సర్వేల్లో పాల్గొన్న మెజారిటీ ప్రజలు వారితో వైరస్ ఎక్కడ అంటుకుంటుందోనన్న బెంగతో అసలు ఒలింపిక్సే రద్దు చేయాలని కోరారు! ఈ నేపథ్యంలోనే జపాన్ కేంద్ర ప్రభుత్వంతోపాటు స్థానిక ప్రభుత్వాధికారులతో ఆన్లైన్లో సమావేశమైన ఐఓసీ ప్రేక్షకులపై స్పష్టత ఇచ్చింది. ఇదివరకే 6 లక్షల టికెట్లను విదేశీయులకు విక్రయించారు. ఇప్పుడు వారందరికీ డబ్బులు తిరిగి చెల్లిస్తారు. టోక్యో ఒలింపిక్స్ జూలై 23 నుంచి ఆగస్టు 8 వరకు జరుగుతాయి. ఆన్లైన్ సమావేశంలో ఐఓసీ అధ్యక్షుడు థామస్ బాచ్, ఆర్గనైజింగ్ కమిటీ చీఫ్ హాషిమోటో -
పాడొద్దు... అరవొద్దు... మాస్కులు తీయొద్దు!
టోక్యో: విశ్వ క్రీడల నిర్వహణ విషయంలో ముందుకే వెళ్తున్న ఆతిథ్య జపాన్ దేశం అక్కడ తు.చ. తప్పకుండా పాటించాల్సిన నిబంధనల చిట్టాను విడుదల చేసింది. టోక్యోకు వెళ్లే విదేశీ అథ్లెట్లు తినేటపుడు, పడుకునేటపుడు తప్ప అన్ని వేళలా మాస్కులు ధరించాల్సిందే! అక్కడి ప్రజా రవాణా వాహనాల్ని అనుమతి లేనిదే వినియోగించరాదు. ఇలాంటి ఎన్నో కట్టుబాట్లతో టోక్యో ఒలింపిక్స్ కార్యనిర్వాహక కమిటీ, అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) ‘ప్లేబుక్’ను బుధవారం విడుదల చేసింది. మీడియాతో వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న అధికారులు... మెగా ఈవెంట్‌ను విజయవంతం చేసేందుకు అంతా బాధ్యతతో మెలగాలని సూచించారు. ఆటగాళ్లే కాదు... ప్రేక్షకులకు ఇందులో బంధనాలున్నాయి. తమ ఫేవరెట్ అథ్లెట్లకు మద్దతుగా ప్రేక్షకులు అరవడంగానీ పాడటంగానీ చేయడం నిషిద్ధం. కరోనా మహమ్మారి ప్రమాదం పొంచిఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో అథ్లెట్లు, సహాయక సిబ్బంది, ఇతర సిబ్బంది, ప్రేక్షకులు అందరూ తమ మార్గదర్శకాలను నిక్కచ్చిగా పాటించాల్సిందేనని కార్యనిర్వాహక కమిటీ తెలిపింది. ఈ మెగా ఈవెంట్‌ను చూసేందుకు విదేశీ ప్రేక్షకులను అనుమతించే అవకాశాలు లేవు. అయితే దీనిపై తుది నిర్ణయాన్ని త్వరలోనే వెల్లడిస్తామని కమిటీ పేర్కొంది. -
ఈ ఒలింపిక్స్ అంతేనా!
టోక్యో: జపాన్ ఏ ముహూర్తాన 2020 ఒలింపిక్స్‌కు బిడ్ వేసిందో గానీ... తీరా నిర్వహించే సమయం వచ్చేసరికి అన్నీ ప్రతికూలతలే! గతేడాదే జరగాల్సిన ఈ టోర్నీ కరోనా వైరస్‌తో వాయిదా పడింది. ఇప్పుడు ఆ వైరస్ సెకండ్ వేవ్ కలకలంతో మళ్లీ విశ్వక్రీడల నిర్వహణపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. దీంతో ఈ ఒలింపిక్స్‌ను వదిలేసి 2032 ఒలింపిక్స్‌ను పట్టుకుందామని జపాన్ ప్రభుత్వం అంతర్గతంగా నిర్ణయించినట్లు మీడియాలో వార్తలొచ్చాయి. అయితే ఈ వార్తల్ని ఖండిస్తున్నట్లు అటు ప్రభుత్వం, ఇటు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) ప్రకటించాయి. జపాన్ ప్రధాని యొషిహిదే సుగా మెగా ఈవెంట్ నిర్వహించేందుకు పట్టుదలతో ఉన్నారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ‘గేమ్స్ అనుబంధ వర్గాలు షెడ్యూల్ ప్రకారమే భద్రంగా, సురక్షితంగా విశ్వ క్రీడలను నిర్వహించాలని కృతనిశ్చ యంతో ఉన్నాయి’ అని కేబినెట్ డిప్యూటీ చీఫ్ సెక్రటరీ సకాయ్ తెలిపారు. అంతకుముందు ‘టైమ్స్’ పత్రిక ఈ ఏడాది క్రీడల సంగతి అటకెక్కినట్లేనని కథనం రాసింది. జపాన్ కేంద్ర ప్రభుత్వం అంతర్గతంగా చర్చించే ఈ నిర్ణయం తీసుకుందని ఆ కథనంలో పేర్కొంది. ఈ వార్త కథనం జపాన్ ప్రభుత్వంలో కలకలం రేపింది. వెంటనే టోక్యో గవర్నర్ కొయికె స్పందిస్తూ నిరాధార వార్త రాసిన బ్రిటిష్ పత్రికపై చట్టపరమైన చర్యలు తీసుకుంటా మన్నారు. అసలు ప్రభుత్వం అలాంటి చర్చే జరపలేదని ఆమె చెప్పారు. ఐఓసీ చీఫ్ థామస్ బాచ్ మాట్లాడుతూ 2020 మార్చి తరహాలో 2021 మార్చి ఉండబోదని, కరోనాకు వ్యాక్సిన్లు కూడా వచ్చాయని అన్నారు. -
వ్యాక్సిన్ వచ్చినా... రాకున్నా...
టోక్యో: మహమ్మారి కరోనా వైరస్ కారణంగా సంవత్సరంపాటు వాయిదా పడిన టోక్యో ఒలింపిక్స్‌ను 2021లో ఎట్టి పరిస్థితుల్లోనైనా నిర్వహించాలని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) పట్టుదలగా ఉంది. వచ్చే ఏడాది జులై 23 నుంచి ఒలింపిక్స్ జరగాల్సి ఉంది. ఆలోగా కరోనా పూర్తిగా తగ్గకపోయినా, దీనికి సంబంధించి వ్యాక్సిన్ అందుబాటులోకి రాకపోయినా తాము మాత్రం వెనక్కి తగ్గమని ఐఓసీ ఉపాధ్యక్షుడు జాన్ కోట్స్ స్పష్టం చేశారు. కోవిడ్–19ను గెలిచిన క్రీడలుగా టోక్యో ఒలింపిక్స్ చరిత్రలో నిలిచిపోతాయని ఆయన వ్యాఖ్యానించారు. (చదవండి: ఎంటర్టైన్మెంట్ ఫీవర్.. సక్సెస్ ఫియర్) ‘కరోనా అంతమైనా, కాకపోయినా ఒలింపిక్స్ మాత్రం జరుగుతాయి. 2011లో సునామీ ముంచెత్తిన తర్వాతే జపాన్ ఒలింపిక్స్ కోసం ముందడుగు వేసింది. దేశాన్ని పునర్నిర్మించుకుంది. ఇప్పుడు కోవిడ్–19ను గెలవడంలో కూడా ఒలింపిక్ క్రీడలు స్ఫూర్తిగా నిలుస్తాయి. అవి కారు చీకట్లో కాంతిరేఖవంటివి. కోవిడ్‌కు ముందు పరిస్థితిని చూస్తే జపాన్ గతంలో కనీవినీ ఎరుగని రీతిలో అత్యద్భుత సన్నాహాలు చేసింది. ఏడాది వాయిదా కారణంగా స్పాన్సర్షిప్, ప్రసారహక్కులు, హోటల్స్ వసతి... ఇలా చాలా అంశాల్లో మళ్లీ ఒప్పందాలు చేసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ కష్టమే అయినా జపాన్ ప్రభుత్వం కాడి పడేయలేదు. 2021 కోసం మళ్లీ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా పరిస్థితి ఎలా ఉన్నా 206 దేశాల అథ్లెట్లు పాల్గొనడం మాత్రం ఖాయం’ అని కోట్స్ వెల్లడించారు. -
2021లోనే ఒలింపిక్స్... లేదంటే రద్దు
టోక్యో: వాయిదా పడిన ప్రతిష్టాత్మక ఒలింపిక్స్ వచ్చే ఏడాది కుదరకపోతే ఇంకో వాయిదా ఉండనే ఉండదని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) చీఫ్ థామస్ బాచ్ స్పష్టం చేశారు. 2021 వరకు కరోనా నియంత్రణలోకి రాకపోతే గేమ్స్ వాయిదాకు బదులు రద్దుకే మొగ్గు చూపుతామన్న జపాన్ ప్రభుత్వ వైఖరికి తాను మద్దతిస్తున్నట్లు ప్రకటించారు. ‘జపాన్ పరిస్థితిని నేను అర్థం చేసుకోగలను. విశ్వ క్రీడల ఏర్పాట్ల కోసం ప్రత్యేకంగా 3000–5000 మందికి ఏడాది పొడవునా ఉపాధి కల్పించడం చాలా కష్టం. వాయిదా పడిన ప్రతీసారి క్రీడల షెడ్యూల్ మార్చలేం. గేమ్స్ అప్పుడు ఇప్పుడు అంటూ అథ్లెట్లను అనిశ్చితిలో ఉంచకూడదు. అందుకే వచ్చే ఏడాది నిర్వహణ సాధ్యం కాకపోతే ఒలింపిక్స్ రద్దుకే మొగ్గుచూపుతాం’ అని బాచ్ వివరించాడు. -
అనుకున్న తేదీల్లోనే ఒలింపిక్స్
న్యూఢిల్లీ: రీషెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది టోక్యో ఒలింపిక్స్ కచ్చితంగా జరుగుతాయని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) సభ్యుడు, భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అధ్యక్షుడు నరీందర్ బాత్రా స్పష్టం చేశారు. శనివారం ఆన్లైన్లో నిర్వహించిన భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్ఐ) ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు. కరోనాకు వ్యాక్సిన్ అమల్లోకి వచ్చాకే విశ్వ క్రీడలు నిర్వహించాలంటూ వస్తోన్న ప్రతిపాదనలతో నెలకొన్న సందిగ్ధతను ఆయన సమావేశంలో దూరం చేశారు. ‘టోక్యో క్రీడలపై రోజుకో రకంగా వస్తోన్న వార్తల్లో నిజం లేదు. ఏది ఏమైనా షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది ఒలింపిక్స్ జరుగుతాయి. విశ్వ క్రీడలకు సంబంధించిన ముఖ్య వ్యక్తులతో నేను తరచుగా మాట్లాడుతున్నా. వదంతులకు ప్రాధాన్యతనివ్వకండి. ఈ ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్లలో కరోనా చికిత్స భారత్‌లో అందుబాటులోకి రావొచ్చు. కాబట్టి ఒలింపిక్స్ జరుగుతాయనే మానసిక సన్నద్ధతతో ఉండండి’ అని ఆయన పేర్కొన్నారు. -
ఒలింపిక్స్ నిర్వహణకు వాటితో సంబంధం లేదు
సిడ్నీ: కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ అందరికీ అందుబాటులోకి వచ్చాకే టోక్యో ఒలింపిక్స్ నిర్వహించాలంటూ వస్తోన్న ప్రతిపాదనలపై అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) సభ్యుడు జాన్ కోట్స్ అభ్యంతరం వ్యక్తం చేశారు. క్రీడల నిర్వహణకు సంబంధించి పలువురు శాస్త్రవేత్తలు, వైద్యులు సూచిస్తోన్న ఈ వ్యాక్సిన్ ప్రతిపాదనను తాను అంగీకరించనని బుధవారం పేర్కొన్నారు. స్వయంగా లాయర్ అయిన జాన్ కోట్స్ (ఆస్ట్రేలియా)... డబ్ల్యూహెచ్‌వో మార్గదర్శకాలకు అనుగుణంగానే తాము విశ్వ క్రీడల విషయంలో సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు. ఇందులో టీకా ప్రస్తావనే లేదన్నారు. ‘వ్యాక్సిన్ కనుగొంటే మంచిదే. కానీ మేమైతే డబ్ల్యూహెచ్‌వో, జపాన్ వైద్య సంస్థలు చెప్పిన ప్రకారమే నడుచుకుంటున్నాం. ఒలింపిక్స్ వాయిదా పడినప్పటి నుంచి ఇప్పటివరకు చాలా పనులు జరిగాయి. రీషెడ్యూల్ తేదీకి క్రీడలు జరుగుతాయి. అందుకుగానూ ఇంకా 43 వేదికలు సిద్ధం చేసే పనిలో ఉన్నాం’ అని కోట్స్ అన్నారు. వాయిదా కారణంగా తమపై కొన్ని వందల మిలియన్ డాలర్ల అదనపు భారం పడనుందని ఐఓసీ అధ్యక్షుడు థామస్ బాచ్ అన్నారు. ‘వాయిదా కారణంగా కొత్తగా ఏర్పాటు చేయాల్సిన వసతులపై సమీక్షించాలి. నిర్వహణ వ్యయం కచ్చితంగా పెరుగుతుంది. దీన్ని భరించేందుకు ఐఓసీ సిద్ధంగా ఉంది. కచ్చితంగా ఇది కొన్ని వందల మిలియన్ డాలర్లు ఉంటుందని అనుకుంటున్నాం’ అని బాచ్ వివరించారు. మరోవైపు జపాన్ ప్రధాని షింజో అబె, జపాన్ వైద్య సంఘం అధ్యక్షుడు యోషితాకే యోకొకురా మాట్లాడుతూ... ప్రపంచవ్యాప్తంగా కరోనా నియంత్రణలోకి రాని పక్షంలో క్రీడలు జరిగే అవకాశం లేదన్నారు. -
అప్పుడైనా జరుగుతాయా?
తీవ్ర తర్జనభర్జనల అనంతరం ప్రతిష్టాత్మక ఒలింపిక్ క్రీడలను కూడా ఏడాదిపాటు వాయిదా వేస్తూ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) నిర్ణయం కూడా తీసుకుంది. ఈ మెగా ఈవెంట్‌కు మరో 15 నెలల సమయం ఉంది. అయితే అప్పుడు కూడా ఈ క్రీడల నిర్వహణ సాధ్యమేనా అంటూ వైద్య నిపుణులు కొత్త సందేహాలు తెరపైకి తీసుకొచ్చారు. కరోనాకు తగిన చికిత్స సిద్ధమయ్యే వరకు ఒలింపిక్ వంటి మెగా ఈవెంట్ల నిర్వహణ సరైంది కాదని వారు చెబుతున్నారు. టోక్యో: కొత్త షెడ్యూల్ ప్రకారం టోక్యో ఒలింపిక్స్ క్రీడలు 2021 జూలై 23 నుంచి ఆగస్టు 8 వరకు జరగాల్సి ఉన్నాయి. అవసరమైతే ఐఓసీ మళ్లీ ఒలింపిక్ తేదీలను మార్చేందుకు సిద్ధంగా ఉండాలని అమెరికాకు చెందిన ఇమోరీ యూనివర్సిటీ వైద్య నిపుణుడు జాక్ బిన్నీ అభిప్రాయపడ్డారు. ‘స్టేడియాల్లో భారీ సంఖ్యలో ప్రేక్షకులు రావాలని కోరుకుంటూ క్రీడల నిర్వహణ గురించి మనం ఆలోచిస్తున్నాం. అయితే కనీసం కరోనాకు తగిన వ్యాక్సిన్ వచ్చే వరకైనా ఇలాంటివి జరగకుండా ఉంటే బాగుంటుంది. మైదానంలో వచ్చే ఒక్కో వ్యక్తితో కరోనా వ్యాపించే ప్రమాదం పెరుగుతూనే ఉంటుంది. ఇప్పటికే ప్రకటించిన తేదీలు చూస్తే నిర్వాహకులు అతిగా ఆశిస్తున్నట్లే అనిపిస్తోంది. ఎందుకంటే వైరస్‌కు వ్యాక్సిన్ రావడానికి కనీసం ఏడాదిన్నర పట్టవచ్చు. అంటే 2021 చివరి వరకు ఇది సాధ్యం కాదు. ఒక స్టేడియంలో 50 వేల నుంచి లక్ష మంది వరకు ప్రేక్షకులను కూర్చోబెట్టడం అంటే అంతకంతకూ ప్రమాదం పెరిగిపోతున్నట్లే లెక్క’ అని ఆయన అన్నారు. ఒలింపిక్ వేదిక చుట్టుపక్కల తిరిగే అభిమానులకు ఇన్ఫెక్షన్ సోకితే అక్కడ మాత్రమే కాకుండా తిరుగు ప్రయాణంలో తమ తమ దేశాలకు కూడా వైరస్‌ను మోసుకెళ్లే ప్రమాదం ఉందని బిన్నీ చెబుతున్నారు. కెనడాలోని మనిటోబా యూనివర్సిటీలో అంటువ్యాధుల నిరోధక విభాగానికి చెందిన ప్రొఫెసర్ జాసన్ కిండ్రాచుక్ కూడా ఇదే తరహా అభిప్రాయం వ్యక్తం చేశారు. గతంలో సార్స్, ఎబోలా వంటి వ్యాధులు ప్రబలిన సమయంలో ఆయన తన సేవలందించారు. ‘సంవత్సరంలోపు కోవిడ్–19కు వైరస్ వస్తుందని ఆశిస్తున్నాం. అయితే ఆ సమయానికి ఒలింపిక్స్ దగ్గరకు వచ్చేస్తాయి. సరిగ్గా ప్రారంభానికి ముందు మీరు అందరికీ వ్యాక్సిన్ ఇచ్చి కూడా లాభం ఉండదు. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరగడానికి కాస్త ముందుగా ఇంజక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది’ అని ఆయన సూచించారు. జపాన్‌లో సాధారణ స్థితి వచ్చేందుకు కనీసం సంవత్సరం పడుతుందని, తన అంచనా ప్రకారం వచ్చే ఏడాది ఒలింపిక్స్ ఏ రకంగానూ సాధ్యం కాదని అదే దేశానికి చెందిన మరో ప్రొఫెసర్ డాక్టర్ కెంటారో వ్యాఖ్యానించడం గమనార్హం. ఎడిన్బర్గ్ యూనివర్సిటీ గ్లోబల్ హెల్త్ విభాగ అధిపతి దేవీ శ్రీధర్ కూడా దీనితో ఏకీభవించారు. ‘ఒకసారి వ్యాక్సిన్ వస్తేనే ఒలింపిక్స్ నిర్వహణపై మనం నమ్మకం పెట్టుకోవచ్చు. చౌకగా, అందరికీ అందుబాటులో వ్యాక్సిన్ వస్తే తిరుగుండదు. వైజ్ఞానికపరంగా దీని నిరోధం గురించి స్పష్టత రాకపోతే ఆటల గురించి మరచిపోవచ్చు’ అని శ్రీధర్ విశ్లేషించారు. మా ప్రణాళికలు మాకున్నాయి... తాజా విమర్శలపై టోక్యో ఒలింపిక్స్ నిర్వాహకులు స్పందించారు. ‘ప్రస్తుత స్థితిలో కొందరు చేస్తున్న ఊహాగానాలపై మేమేమీ చెప్పలేం. అయితే కోవిడ్–19 వ్యాప్తి నిరోధం గురించి మా వద్ద తగిన ప్రణాళికలు ఉన్నాయి. ఈ విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ కలిసి పనిచేస్తున్నాం. ఈవెంట్‌తో సంబంధం ఉన్న అందరితో చర్చిస్తూ తాజా స్థితిని సమీక్షించి తగిన నిర్ణయాలు తీసుకుంటాం. అయితే క్రీడలను మళ్లీ వాయిదా వేసే ఆలోచనే లేదు. షెడ్యూల్ ప్రకారం ఒలింపిక్స్ సమర్థ నిర్వహణకు ఏర్పాట్లు చేసుకుంటున్నాం. ఒలింపిక్స్ జరగడానికి కనీసం నాలుగు నుంచి ఆరు వారాల ముందుగా టోక్యోకు వచ్చి రెండు వారాల క్వారంటైన్ తర్వాత అథ్లెట్లు ఒలింపిక్ గ్రామంలోకి అడుగుపెడితే సరిపోతుందని కూడా ఒక ప్రతిపాదన వచ్చింది’ అని నిర్వహణ కమిటీ అధికార ప్రతినిధి మాసా టకాయా స్పష్టం చేశారు. -
టోక్యో వాయిదా... మాకూ భారమే: ఐఓసీ
టోక్యో: ఈ ఏడాది ఒలింపిక్స్ వచ్చే ఏడాదికి వాయిదా పడటం వల్ల అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ)పై కూడా భారం పడుతుందని ఐఓసీ చీఫ్ థామస్ బాచ్ చెప్పారు. ఓ జర్మన్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ... వాయిదా వల్ల మాకూ వందల కోట్ల నష్టం (వందల మిలియన్ డాలర్లు) వస్తుంది. ఇక మిగతాదంతా జపానే భరించాల్సి ఉంటుంది. ఇదే విషయాన్ని ‘ఆతిథ్య ఓప్పందం’లో స్పష్టంగా తెలియజేశాం. జపాన్ ప్రధాని సమక్షంలోనే ఈ ఒప్పందం జరిగింది. అదనపు భారంలో సింహభాగాన్ని ఆతిథ్య దేశం భరించాల్సిందేనని నియమ నిబంధనల్లో ఉంది. కొంత నష్టాన్ని ఐఓసీ భరిస్తుంది’ అని అన్నారు. తాజా అంచనాల ప్రకారం 2 నుంచి 6 బిలియన్ డాలర్లు (రూ.15 వేల కోట్ల నుంచి రూ.45 వేల కోట్లు) వరకు ఈ భారం ఉంటుంది. అంటే మొత్తం నిర్వహ ణకు అయ్యే వ్యయంలో ఇంచు మించు సగమన్నమాట! ఇప్పటి వరకు జపాన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలనుకున్న టోక్యో ఈవెంట్ కోసం రూ. 92 వేల కోట్లు (12.6 బిలియన్ డాలర్లు) ఖర్చు చేసింది. అయితే ఇటీవల టోక్యో ఆర్గనైజింగ్ కమిటీ సీఈఓ తోషిరో ముటో వచ్చే ఏడాది కూడా జరిగేది సందేహాస్పదమేనన్నారు. ‘అప్పటికల్లా మహమ్మారి అదుపులోకి వస్తుందని ఎవరైనా చెప్పగలరా’ అని అన్నారు. దీనిపై బాచ్ మాట్లాడుతూ స్పష్టమైన జవాబు ఇచ్చే పరిస్థితిలో తాను లేనని... అయితే మరో వాయిదాకు అవకాశమైతే లేదని జపాన్ వర్గాలు చెప్పినట్లు వెల్లడించారు. -
టోక్యో 2021 జూలై 23–ఆగస్టు 8
2020 జూలై 24 నుంచి 2021 జూలై 23కు... 364 రోజులు ఆలస్యంగా విశ్వ క్రీడా సంబరం నిర్వహించేందుకు ముహూర్తం ఖరారైంది. కరోనా దెబ్బకు తల్లడిల్లిపోతున్న ప్రపంచం కోలుకొని మళ్లీ ఆటలపై మనసు పెట్టేందుకు ఈ సమయం సరిపోతుందని భావించిన నిర్వాహకులు దాదాపుగా అసలు షెడ్యూల్లో ఉన్న తేదీలనే మరుసటి ఏడాది కోసం కూడా ప్రకటించారు. ఒలింపిక్స్‌కు సంబంధించి అధికారికంగా వాయిదా, ఆపై మళ్లీ నిర్వహించే తేదీలపై కూడా స్పష్టత కూడా వచ్చేసింది. వచ్చే సంవత్సరం కోసం తమ ప్రణాళికలతో ప్రపంచ వ్యాప్తంగా అథ్లెట్లు సన్నద్ధం కావడమే ఇక మిగిలింది. అయితే ఈ వాయిదా పర్వం నిర్వహణ కమిటీకి భారీ స్థాయిలో ఆర్థికభారంగా మారనుండటమే ప్రతికూలాంశం. టోక్యో: వారం రోజుల క్రితం వరకు కూడా టోక్యో ఒలింపిక్స్ తేదీల్లో మార్పు ఉండదని, షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తామని చెబుతూ వచ్చిన అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) ఇప్పుడు ఆరు రోజుల వ్యవధిలోనే రెండు కీలక నిర్ణయాలు ప్రకటించాల్సి వచ్చింది. గత మంగళవారం ఒలింపిక్స్‌ను ఏడాది పాటు వాయిదా వేస్తున్నామని చెప్పిన ఐఓసీ, ఈ సోమవారం పోటీలు నిర్వహించే తేదీలను కూడా ప్రకటించింది. 2021లో జూలై 23 నుంచి ఆగస్టు 8 వరకు క్రీడలు జరుపుతామని టోక్యో 2020 చీఫ్ యోషిరో మొరీ వెల్లడించారు. వా యిదా పడక ముందు అసలు షెడ్యూల్ ప్రకారం ఒలింపిక్స్ ఈ ఏడాది జూలై 24 నుంచి ఆగస్టు 9 వరకు జరగాల్సి ఉంది. ఇప్పుడు కొత్తగా ప్రకటించిన షెడ్యూల్ ఒకే ఒక రోజు తేడాతో ఉండటం విశేషం. పారాలింపిక్స్‌ను ఆగస్టు 24 నుంచి సెప్టెంబర్ 5 వరకు నిర్వహిస్తారు. సన్నద్ధతకు సమయం... నిర్వాహక కమిటీ సోమవారం టెలికాన్ఫరెన్స్ ద్వారా ఐఓసీతో అత్యవసర సమావేశం నిర్వహించి ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. ‘ఒలింపిక్స్ నిర్వహణా సమయం అసలు తేదీల తరహాలోనే జపాన్ వేసవిలో ఉండాలని చాలాసార్లు చర్చ జరిగింది. దీనికి మేమంతా అంగీకరించాం. కరోనా వైరస్ తాజా పరిస్థితిని దృష్టిలో ఉంచుకోవడంతో పాటు సన్నాహాలకు, క్వాలిఫయింగ్‌కు కొంత సమయం కావాలనే అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటూ ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని యోషిరో వెల్లడించారు. ప్రస్తుతం ప్రకటించిన తేదీల ప్రకారం చూస్తే అంతర్జాతీయ క్రీడా క్యాలెండర్‌పై ఎలాంటి ప్రభావం పడదని ఐఓసీ పేర్కొంది. ‘ప్రస్తుత విపత్కర స్థితి కారణంగా ప్రపంచం పరిస్థితి చీకట్లో మగ్గుతున్నట్లుగా ఉంది. అలాంటి సమయంలో 2020 టోక్యో ఒలింపిక్స్ వెలుగులు విరజిమ్మే కాంతిలాంటిది. వచ్చే ఏడాది ఈ ఒలింపిక్స్‌ను నిర్వహించడం ద్వారా వైరస్‌పై మానవజాతి సాధించిన విజయంగా మనం భావించాలి’ అని యోషిరో వ్యాఖ్యానించాడు. అక్షరాలా 6 బిలియన్ డాలర్లు అదనం! 2011లో జపాన్ మూడు రకాల ప్రకృతి విపత్తులకు గురైంది. భారీ భూకంపం, సునామీలతో పాటు ఫుకుషిమా ప్రాంతంలో పెద్ద ఎత్తున అణు విస్ఫోటనం జరిగింది. వాటిని తట్టుకొని తాము ముందుకు సాగుతున్నామని రుజువు చేసి చూపాలనే సంకల్పంతో ఒలింపిక్స్ నిర్వహణను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అయితే ఇప్పుడు ఒలింపిక్స్‌ను సంవత్సరంపాటు వాయిదా వేయడం వల్ల ఆర్థికపరంగా ఆ దేశానికి భారీ ఎత్తున నష్టం వాటిల్లనుంది. షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాదిలో జరగాల్సిన ఒలింపిక్స్ నిర్వహణ వ్యయం 12 బిలియన్ డాలర్లు (సుమారు. రూ. 90 వేల కోట్లు)గా ఉంది. ఒప్పందం ప్రకారం ఈ బడ్జెట్‌ను నిర్వాహక కమిటీ, జపాన్ ప్రభుత్వం, టోక్యో మహా నగరం కలిపి భరిస్తాయి. ఇందులో ఐఓసీ ఇస్తున్న 1.3 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 10 వేల కోట్లు), ప్రైవేట్ సంస్థల ద్వారా సేకరించిన 5.6 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 42 వేల కోట్లు) మినహా మిగిలినదంతా జపాన్ ప్రజాధనమే. అయితే ఏడాది ఆలస్యం ఏకంగా మరో 50 శాతం అదనపు మొత్తం మీద పడే పరిస్థితి వస్తోంది. అదనంగా మరో 6 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 45 వేల కోట్లు) కేటాయించాల్సి వస్తుందని జపాన్ ఆర్థికరంగ నిపుణుల అంచనా. సంవత్సరం పాటు కొత్తగా కట్టిన స్టేడియాల నిర్వహణ కూడా రాబోయే రోజుల్లో పెద్ద సమస్యగా మారనుంది. టోక్యో నగరం ముఖ్యంగా ఒలింపిక్ క్రీడా గ్రామం నుంచి భారీ ఆదాయాన్ని ఆశించింది. ఆటలు ముగిశాక వాటిని లగ్జరీ అపార్ట్మెంట్లుగా మార్చి అమ్మ కానికి పెట్టాలని నిర్ణయించింది. ఇప్పటికే అనేక మంది అడ్వాన్స్‌లు కూడా ఇచ్చేశారు. ఇప్పుడు అవన్నీ సందేహంలో పడతాయి. వాయిదా అంటే ఒలింపిక్స్‌తో సంబంధం ఉన్న అన్ని రంగాలపై ప్రభావం పడుతుంది. మెగా ఈవెంట్ కోసం నిర్వాహకులు ఇప్పటికే 45 లక్షల టికెట్లు అమ్మారు. వీరికి డబ్బులు తిరిగి ఇస్తారా అనేది స్పష్టత లేదు. టోక్యోలో ఏర్పాటు చేసిన ఒలింపిక్స్ కౌంట్‌డౌన్ గడియారం. ఈ విశ్వ క్రీడల ప్రారంభానికి మరో 479 రోజులు ఉన్నాయి -
ఒలింపిక్స్ రీషెడ్యూల్ ఇదే..
టోక్యో: కరోనా వైరస్ (కోవిడ్-19) ఉత్పాతం ప్రపంచాన్ని వణికిస్తున్న నేపథ్యంలో టోక్యో ఒలింపిక్స్‌ను వాయిదా వేసిన అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) తాజాగా దానికి సంబంధించిన రీషెడ్యూల్‌ను ఖరారు చేసింది. వచ్చే ఏడాది జూలై నెలలో ఒలింపిక్స్‌ను నిర్వహించనున్నట్లు ఐఓసీ స్పష్టం చేసింది. ఈ మేరకు టోక్యో ఒలింపిక్స్ నిర్వాహకులతో సోమవారం సుదీర్ఘంగా చర్చించిన ఐఓసీ.. ఈ నిర్ణయం తీసుకుంది. ఫలితంగా వచ్చే ఏడాది(2021) జూలై 23వ తేదీ నుంచి టోక్యో వేదికగా ఒలింపిక్స్ ప్రారంభం కానున్న విషయాన్ని ఐఓసీ తెలిపింది. జూలై చివరి వారంలో ఆరంభమయ్యే ఈ మెగా క్రీడా సంబరం ఆగస్టు 8వ తేదీన ముగియనుంది. కరోనా విజృంభణ కారణంగా ఈ ఏడాది జరగాల్సిన ఒలింపిక్స్‌ను ముందుగా రద్దు చేశారు. ఇటీవల ఈ ఏడాది ఒలింపిక్స్‌ను రద్దు చేసిన ఐఓసీ.. ఏడాది పాటు వాయిదానే సరైనది భావించింది. మరొకవైపు 2021 ఆగస్టు 24వ తేదీ నుంచి సెప్టెంబర్5 వరకూ పారా ఒలింపిక్స్‌ను నిర్వహించనున్నారు. ఒలింపిక్స్ సభ్య దేశాలన్ని ముక్త కంఠంతో ఒలింపిక్స్‌ను రద్దు లేదా వాయిదా వేయాలని కోరడంతో ఐఓసీ ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. టోక్యో వేదికగా జరగాల్సిన ఒలింపిక్స్–2020ను ఏడాది పాటు వాయిదా వేయాలని జపాన్ దేశ ప్రధాని షింజో అబె, ఐఓసీ అధ్యక్షుడు థామస్ బాచ్ సంయుక్తంగా నిర్ణయించిన తర్వాతే రీషెడ్యూల్కు వెళ్లారు. ఈ అర్హత సరిపోద్ది.. టోక్యోలో జరగాల్సిన 2020 ఒలింపిక్స్ కోసం వివిధ క్రీడాంశాల్లో అర్హత సాధించిన వారికి ఊరట లభించింది. ఇప్పటివరకూ అర్హత సాధించిన అథ్లెట్లు మళ్లీ క్వాలిఫయింగ్ టోర్నీలు ఆడాల్సిన అవసరం లేకుండా నిర్ణయం తీసుకున్నారు. 2020 ఒలింపిక్స్ కోసం వివిధ క్రీడాంశాల్లో కలిపి ఇప్పటికే 57 శాతం మంది అర్హత సాధించారు. అయితే క్రీడలు ఏడాది కాలం పాటు వాయిదా పడటంతో వీరి అర్హతపై సందేహాలు మొదలయ్యాయి. ఇందులో పలువురు అథ్లెట్లు తమ కెరీర్ చరమాంకంలో ఉండటంతో పాటు సంవత్సరం పాటు తమ ఫిట్నెస్ను, ఆటను అదే స్థాయిలో కొనసాగిస్తూ మళ్లీ క్వాలిఫయింగ్ పోటీల్లో పాల్గొని అర్హత సాధించడం అంటే దాదాపుగా అసాధ్యమే! ఈ నేపథ్యంలో వారికి అనుకూలంగా నిర్ణయం తీసుకోవడం మంచి పరిణామం.(‘నేను చనిపోతే నా పిల్లలు ఇది తెలుసుకోవాలి’) -
మళ్లీ వేసవిలోనే ఒలింపిక్స్!
టోక్యో: వాయిదా పడిన టోక్యో ఒలింపిక్స్ 2021 వేసవి సీజన్లోనే జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. టోక్యో ఒలింపిక్స్ కార్యనిర్వాహక కమిటీ అధ్యక్షుడు యోషిరో మోరీ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇందుకు ఊతమిస్తున్నాయి. రాబోయే విశ్వక్రీడల షెడ్యూల్... 2020 గేమ్స్ కోసం చేసిన షెడ్యూల్ కన్నా భిన్నంగా ఏమీ ఉండబోదు అని మోరీ పేర్కొన్నారు. ‘అందరూ ఒలింపిక్స్ వేసవి (జూన్–ఆగçస్టు)లోనే జరగాలని కోరుకుంటారు. అందుకే మేం కూడా జూన్ నుంచి సెప్టెంబర్ మధ్యే విశ్వక్రీడల షెడ్యూల్ రూపొందించాలని ఆలోచిస్తున్నాం’ అని మోరీ పేర్కొన్నట్లు స్థానిక న్యూస్ ఏజెన్సీ ‘క్యోడో’ ప్రకటించింది. ఈ ఏడాది జూలై 24 నుంచి ఆగస్టు 9 మధ్య జరగాల్సిన టోక్యో ఒలింపిక్స్ కరోనా కారణంగా వచ్చే ఏడాదికి వాయిదా పడ్డాయి. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) అధ్యక్షుడు థామస్ బాచ్ మంగళవారం గేమ్స్ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన సమయంలోనే... ఈ క్రీడల్ని వచ్చే ఏడాది మార్చి–మేలో నిర్వహించే అవకాశాలున్నట్లు సూచనప్రాయంగా పేర్కొన్నాడు. అయితే ఈ వారంలో భేటీ కానున్న ‘ఒలిం పిక్స్ కార్యనిర్వాహక కమిటీ’ ఎగ్జిక్యూటివ్ సమావేశంలో క్రీడల నిర్వహణ తేదీలపై స్పష్టత వస్తుందని మోరీ స్పష్టం చేశారు. ఐఓసీ, స్థానిక నిర్వాహకులు, వందలాది స్పాన్సర్లు, క్రీడా సమాఖ్యలు, బ్రాడ్కాస్టర్లు అందరితో సంప్రదించి తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. విశ్వ క్రీడల నిర్వహణ ఖర్చు గతంతో పోలిస్తే విపరీతంగా పెరుగుతుందని కమిటీ సీఈవో తోషిరో అన్నారు. -
ఆటగాళ్లూ... మీ స్థానాలు భద్రం
టోక్యో: కరోనా కారణంగా టోక్యో ఒలింపిక్స్ వచ్చే ఏడాదికి వాయిదా పడటంతో ఒలింపిక్స్ బెర్త్‌లపై ఆటగాళ్లలో నెలకొన్న సందేహాలపై అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) అధికారులు స్పష్టత ఇచ్చారు. అర్హత టోర్నీల ద్వారా ఇప్పటికే ఒలింపిక్స్ బెర్త్‌లు సాధించిన 6,200 మంది అథ్లెట్ల స్థానానికి ఢోకా లేదని తెలిపారు. వారు వచ్చే ఏడాది జరుగనున్న ఒలింపిక్స్‌లో నేరుగా పాల్గొంటారని స్పష్టం చేశారు. ఐఓసీ నిర్ణయంపై అన్ని అంతర్జాతీయ క్రీడా సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. ప్రపంచ అథ్లెటిక్స్ అధ్యక్షుడు సెబాస్టియన్ కో ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. ‘ఇప్పటికే టోక్యోకు అర్హత సాధించిన అథ్లెట్లను నేరుగా వచ్చే ఏడాది గేమ్స్‌లో అనుమతించడం హర్షించదగిన అంశం. ఇంకా మిగిలి ఉన్న స్థానాల కోసం సరైన పద్ధతిని అనుసరించి అర్హత టోర్నీలు నిర్వహించాలి’ అని ఆయన అన్నారు. కరోనా కారణంగా ఆటలన్నీ రద్దు కాకముందే మారథాన్, స్విమ్మింగ్, ఇతర క్రీడా ఈవెంట్లలో ఒలింపిక్స్ అర్హత టోర్నీలు జరుగగా వందలాది మంది అథ్లెట్లు టోక్యో బెర్త్‌లు కైవసం చేసుకున్నారు. అనూహ్యంగా విశ్వక్రీడలు వాయిదా పడటంతో వారి కోటాలపై ఆటగాళ్లలో ఆందోళన నెలకొంది. ఇప్పటివరకు సగం బెర్త్‌లే ఖరారు కాగా... మిగిలిన స్థానాలను ఎలా భర్తీ చేస్తారనే అంశాన్ని ఇంకా నిర్ణయించాల్సి ఉంది. -
టోక్యో 2021కూ వర్తిస్తుంది!
లాసానె: టోక్యోలో జరగాల్సిన 2020 ఒలింపిక్స్ కోసం వివిధ క్రీడాంశాల్లో కలిపి ఇప్పటికే 57 శాతం మంది అర్హత సాధించారు. అయితే క్రీడలు ఏడాది కాలం పాటు వాయిదా పడటంతో వీరి అర్హతపై సందేహాలు మొదలయ్యాయి. ఇందులో పలువురు అథ్లెట్లు తమ కెరీర్ చరమాంకంలో ఉండటంతో పాటు సంవత్సరం పాటు తమ ఫిట్నెస్ను, ఆటను అదే స్థాయిలో కొనసాగిస్తూ మళ్లీ క్వాలిఫయింగ్ పోటీల్లో పాల్గొని అర్హత సాధించడం అంటే దాదాపుగా అసాధ్యమే! ఈ నేపథ్యంలో వారికి అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) భావిస్తోంది. ఇప్పటికే 2020 కోసం సాధించిన అర్హత 2021కి కూడా వర్తించే విధంగా చేయాలనే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయంపై గురువారం ఐఓసీతో 32 సభ్య దేశాలు చర్చించాయి. అయితే వచ్చే ఏడాది ఒలింపిక్స్ నిర్వహించాల్సిన తేదీలపై మాత్రం ఈ సమావేశంలో స్పష్టత రాలేదు. కొందరు మే నెలలో, మరికొందరు జూన్‌లో అంటూ సూచనలిచ్చారని... వచ్చే నెల రోజుల్లోపు దీనిపై నిర్ణయం తీసుకోవచ్చని ఒక సభ్యదేశపు ప్రతినిధి ప్రకటించారు. -
భయపడిందే జరిగింది!
న్యూఢిల్లీ: ప్రస్తుత పరిస్థితుల్లో టోక్యో ఒలింపిక్స్ వాయిదాపై క్రీడాకారుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) వాయిదా నిర్ణయంపై నిరాశ వ్యక్తం చేసింది. తాము భయపడిందే చివరికి జరిగిందని వినేశ్ పేర్కొంది. ‘ఐఓసీ తాజా నిర్ణయంతో చాలా నిరాశ చెందాను. ఒలింపిక్స్ వాయిదా వేస్తారేమో అని అందరం భయపడ్డాం. చివరకు అదే జరిగింది. ఒలింపిక్స్ వేదికపై రాణించడం ఒక అథ్లెట్‌కు చాలా కష్టం. కానీ ఇప్పుడు ఈ గేమ్స్ కోసం వేచి చూడటం, మళ్లీ సన్నాహకాలు కొనసాగించడం దానికన్నా పెద్ద కష్టం. ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. కానీ ఎన్నో భావోద్వేగాలు నన్ను చుట్టుముడుతున్నాయి’ అని 25 ఏళ్ల వినేశ్ తెలిపింది. గతేడాది ప్రపంచ చాంపియన్‌షిప్‌లో సత్తా చాటిన వినేశ్ టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. -
అందరూ త్యాగాలు చేయాల్సిందే!
లుసానే: ఏడాదిపాటు వాయిదా పడిన టోక్యో ఒలింపిక్స్ క్రీడలను మళ్లీ అంతే స్థాయిలో నిర్వహించాలంటే దీంతో సంబంధం ఉన్న అందరూ తమ వైపు నుంచి కొన్ని త్యాగాలు, సర్దుబాట్లు చేయక తప్పదని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) అధ్యక్షుడు థామస్ బాచ్ అన్నారు. అథ్లెట్ల కల అయిన ఒలింపిక్స్‌ను సాకారం చేయడం తమ బాధ్యత అని ఆయన వ్యాఖ్యానించారు. ‘టోక్యో ఒలింపిక్స్‌ను పూర్తిగా రద్దు చేయాలనే అంశంపై కూడా చర్చ జరిగింది. దానిని పరిశీలించాం కూడా. అయితే రద్దు చేయడం వల్ల ఎవరికీ మేలు జరిగే అవకాశం లేదని భావించి మేం మొదటి నుంచీ పట్టుదలగా ఉన్నాం. ఇప్పుడు వాయిదా పడిన క్రీడలను మళ్లీ నిర్వహించేందుకు అన్ని వర్గాలవారు కొన్ని రకాల త్యాగాలు చేయాల్సిందే’ అని బాచ్ స్పష్టం చేశారు. 2021లో ఒలింపిక్స్ జరపడం మరో పెద్ద సవాల్ అని, ఈ సమస్యలు పరిష్కరించడంలో భాగంగా ‘హియర్ వి గో’ పేరుతో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ‘వచ్చే వేసవి సమయంలోనే నిర్వహించాలనే ఏమీ లేదు. ఆ తేదీలతో పాటు ఇతర నెలలకు సంబంధించి కూడా వేర్వేరు ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నాయి. 2021 స్పోర్ట్స్ క్యాలెండర్‌ను కూడా పరిగణనలోకి తీసుకొని షెడ్యూల్ రూపొందిస్తాం. దీనిపై గురువారం 33 సభ్య దేశాల క్రీడా సమాఖ్యలతో చర్చిస్తాం. ఇక వాయిదా వల్ల వచ్చే నష్టాల గురించి ఇప్పుడే చెప్పలేను. అయితే గతంలో మేం ఎన్నడూ ఎదుర్కోని పరిస్థితి ఇది కాబట్టి ఏం చేయాలో చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం’ అని బాచ్ వెల్లడించారు. -
కరోనా ఎఫెక్ట్: అందరూ ఊహించిందే జరిగింది..
టోక్యో: జపాన్ వేదికగా జులై 24 నుంచి ప్రారంభం కావాల్సిన అతిపెద్ద క్రీడా సమరం ఒలింపిక్స్ అందరూ ఊహించనట్టే వాయిదా పడింది. కరోనా వైరస్ (కోవిడ్-19) ఉత్పాతం ప్రపంచాన్ని వణికిస్తున్న నేపథ్యంలో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) సంచలన నిర్ణయం తీసుకుంది. సభ్య దేశాలన్ని ముక్త కంఠంతో ఒలింపిక్స్‌ను రద్దు లేదా వాయిదా వేయాలని కోరడంతో ఐఓసీ కీలక నిర్ణయం తీసుకుంది. టోక్యో వేదికగా జరగాల్సిన ఒలింపిక్స్–2020ను ఏడాది పాటు వాయిదా వేయాలని జపాన్ దేశ ప్రధాని షింజో అబె, ఐఓసీ అధ్యక్షుడు థామస్ బాచ్ సంయుక్తంగా నిర్ణయించనట్టు ఒలింపిక్స్ నిర్వాహకుల ప్రకటించారు. వచ్చే ఏడాది వేసవి తర్వాత ఒలింపిక్స్-2021 గురించి ఉండొచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. కరోనా వైరస్ అన్ని దేశాలకు వ్యాప్తి చెందుతున్న సమయంలో క్రీడల మహాసంగ్రామం వాయిదా వేయాలని అన్ని వైపుల డిమాండ్లు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. కాగా, ఆది నుంచి ఒలింపిక్స్ నిర్వహణపై ఐఓసీ ధీమాగానే ఉంది. నాలుగు వారాల్లో ఒలింపిక్స్‌పై తుది నిర్ణయం తీసుకుంటామని ప్రకటించింది. అయితే సోమవారం జపాన్ ప్రధాని షింజో అబె ఆ దేశ పార్లమెంట్లో ‘ఒలింపిక్స్‌ను పూర్తి స్థాయిలో నిర్వహించలేకపోతే వాటిని వాయిదా వేయడమే మంచిది. అథ్లెట్ల ఆరోగ్య భద్రత అన్నింటికంటే ప్రధానం కాబట్టి వాయిదా తప్పకపోవచ్చు. ఒక వేళ వాయిదా తప్పదనుకుంటే ఐఓసీ ఆ నిర్ణయాన్ని సాధ్యమైనంత త్వరగా ప్రకటించాలి. వాయిదాతో ముడిపడిన అనేక సమస్యలను పరిష్కరించుకునేందుకు తగినంత సమయం ఉండాలి. అయితే ఒలింపిక్స్ రద్దయ్యే అవకాశం ఏమాత్రం లేదు’అని స్పష్టం చేసిన విషయం తెలసిందే. దీంతో ఐఓసీ మెత్త పడి వాయిదా వైపు మొగ్గు చూపింది. చదవండి: ‘24 ఏళ్ల తర్వాత ఆసీస్‌ను ఓడించారు’ ఐపీఎల్ 2020 రద్దు! -
‘జ్యోతి’ వీక్షణకు భారీగా ఆహూతులు
సెండాయ్ (జపాన్): కరోనా వైరస్ భయబ్రాంతులకు గురిచేస్తున్నప్పటికీ చరిత్రాత్మక ‘ఒలింపిక్ జ్యోతి’కి జపాన్ వాసులు బ్రహ్మరథం పట్టారు. ఈనెల 26 నుంచి రిలే జరుగనున్నప్పటికీ అంతకుముందే జ్యోతిని చూసేందుకు అభిమానులు అమితాసక్తి కనబరిచారు. మియాగిలోని సెండాయ్ స్టేషన్లో వీక్షణకు ఉంచిన ‘జ్యోతి’ని చూసేందుకు శనివారం ఈశాన్య జపాన్ ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. వారాంతం కావడంతో 50 వేల మందికి పైగా ‘జ్యోతి’ని చూసేందుకు గంటల తరబడి ‘క్యూ’లో నిలబడ్డారు. కరోనా నేపథ్యంలో మాస్క్‌లతో వచ్చిన అభిమానులు ఒలింపిక్ జ్యోతితో ఫొటోలు తీసుకునేందుకు ఉత్సాహం ప్రదర్శించారు. ‘ఒలింపిక్ జ్యోతిని ప్రత్యక్షంగా చూడటం చాలా ఆనందంగా ఉంది. దీనికోసం నేను మూడు గంటలకు పైగా లైన్లో నిలబడ్డాను’ అని 70 ఏళ్ల మహిళ ఒకరు స్థానిక మీడియాతో వ్యాఖ్యానించారు. మరోవైపు పెద్దసంఖ్యలో తరలివచ్చిన అభిమానులను చూసి నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేశారు. గుంపులు గుంపులుగా పోగైతే జ్యోతి వీక్షణ కార్యక్రమాన్ని రద్దు చేస్తామని ప్రజలని హెచ్చరించారు. ఈనెల 26న ఫుకుషిమాలోని జె. విలేజ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నుంచి ఒలింపిక్స్ జ్యోతి రిలే కార్యక్రమం జరుగుతుంది. రిలే జరుగనున్న దారుల్లో గుమిగూడ వద్దంటూ ఇప్పటికే ప్రజల్ని నిర్వాహకులు కోరారు. -
‘టోక్యో’ వాయిదా తప్పదేమో !
ఇప్పుడు కేంద్రం ప్రకటించిన లాక్‌డౌన్‌తో భారత్‌లో ఐపీఎల్ దారి దాదాపు మూసుకుపోయింది! అలాగే ప్రపంచవ్యాప్తంగా 3.5 లక్షలపైగా దాటిన కరోనా బాధితులతో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ), నిర్వాహక దేశం జపాన్ ఆలోచనలో పడింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో వాయిదా తప్ప వేరే మార్గమే లేదని అంచనాకు వచ్చిన ఐఓసీ తెరవెనుక అదే పనిచేస్తున్నా... బయటికి మాత్రం చెప్పలేకపోతోంది. దీంతో జులై 24న టోక్యోలో ఒలింపిక్స్ జే గంట మోగే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. టోక్యో: కరోనా ఎంత పనిచేసింది. వుహాన్‌లో మొదలుపెట్టిన మృత్యు ఘంటికల్ని ప్రపంచమంతా మోగిస్తున్న ఈ ‘కోవిడ్–19’.... ఇటు వైరస్ బారిన పడిన బాధితుల్నే కాదు చాన్నాళ్లుగా జపాన్ ప్రభుత్వానికి, అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ)కి కంటిమీద కునుకే లేకుండా చేస్తోంది. దీంతో షెడ్యూల్ ప్రకారం ఒలింపిక్స్ జరిపి తీరుతామన్న ఐఓసీ ఇప్పుడు వాయిదా వేసే పనిలో పడింది. ఎన్నో ప్రత్యామ్నాయాల్ని పరిశీలించి, చివరకు ప్లాన్ ‘బి’ కూడా సాధ్యం కాదనే అంచనాకు వచ్చింది. వాయిదా ఖాయమైనా అధికారికంగా ఇప్పుడప్పుడే వెల్లడించడం లేదు. కానీ పాత షెడ్యూల్ ప్రకారం ఈవెంట్ జరిగే అవకాశం కూడా లేదు. ఎక్కడికక్కడ అన్నీ స్తంభించాయి. దేశ సరిహద్దులన్నీ మూతపడుతున్నాయి. చిన్న, పెద్ద పట్టణాలే కాదు... 24 గంటలు గడియారం ముల్లులా మెలకువగా ఉండే విశ్వనగరాలే లాక్డౌన్ అయ్యాయి. ప్రజారవాణా లేనే లేదు. ఐదు, పది మందికి మించి గుమిగూడే పరిస్థితులేవీ లేవు. ఇలాంటి పరిస్థితుల్లో ఒలింపిక్స్ లక్ష్యంగా శిబిరాలు నిర్వహించే అవకాశాల్లేవు. మిగతా క్వాలిఫయింగ్ ఈవెంట్లు జరగనే జరగవు. ఇవన్నీ క్షుణ్నంగా పరిశీలించిన ఐఓసీ ఓ నిర్ణయానికి వచ్చింది. రేపో మాపో కచ్చితంగా వెల్లడిస్తుంది. అదే టోక్యో ఒలింపిక్స్ ‘వాయిదా’ అని! ప్రపంచం ‘వాచ్’ ఆగిపోతే... ఆటలా! సెల్ఫోన్లు లేని రోజుల్లో మన చేతికున్న రిస్ట్ వాచ్ ఆగిపోతే ఎంత ఇబ్బంది అయ్యేదో అందరికీ తెలుసు. సమయపాలన అంతా చిన్నాభిన్నమయ్యేది. అలాంటిది ఇప్పుడు భూగోళం (గ్లోబ్) గడియారమే ఆగిపోయింది. కాసేపు ‘ప్రతిష్టంభన’ తట్టుకుంటామేమో కానీ ఈ ‘ప్రతిస్తంభన’ (అంటే రోజులపాటు ప్రతీది స్తంభించిపోవడం) ఎవరి తరం కాదు. ప్రపంచ వ్యవస్థే మూతపడిన ఈ వేళలో ఆటలెలా ఆడించేది అని ఐఓసీ ఓ నిర్ణయానికి వచ్చింది. జపాన్ ప్రజల్లోనూ వైరస్ భయాందోళనలున్నాయి. ఇవన్నీ అక్కడి ప్రభుత్వానికీ తెలుసు. అందుకే ఐఓసీతో కలిసిపోయింది. ఏం చెబితే అదే అన్న ధోరణిలో ఉంది. కానీ పైకి మాత్రం నిర్వహణకే ఏర్పాట్లు అంటూ ఇప్పటికీ బీరాలు పలుకుతుంది. ఎందుకంటే జపాన్ దేశం టోక్యో విశ్వక్రీడలకు వేల కోట్ల డబ్బులను ఖర్చు చేసింది. స్పాన్సర్‌షిప్‌ల రూపేణా కోట్లకొద్దీ డబ్బులు పోగేసుకుంది. కోట్ల మొత్తంలో ఆర్థిక వ్యవహరాలు ముడిపడి ఉండటంతో ఆటలు సాగుతాయనే అంటుంది. కానీ బయట జరిగేది మాత్రం ‘వాయిదా’ ప్రక్రియే! ఐఓసీ అధికారిక వర్గాల సమాచారం మేరకు అనుకున్న షెడ్యూల్ ప్రకారం పోటీలు జరిపి తీరే అవకాశాలే లేవని తెలుస్తోంది. రేపోమాపో చెప్పక తప్పదు ఇప్పటికైతే ప్లాన్ ‘బి’, ‘సి’, ‘డి’... ఇతరత్రా ప్రత్యామ్నాయాలున్నాయని చెబుతున్నా... చిట్టచివరికి ఆటలు నిర్దేశిత సమయంలో జరగవని, కాస్త ఆలస్యమవుతాయని ఐఓసీ రేపోమాపో చెప్పనుంది. లోగడ ఆయా దేశాల్లో కరోనా విలయం ఎలా ఉంది? ఆటగాళ్ల ప్రాక్టీసు సాగుతుందా ఆగిందా? అని ఆరా తీసింది. మిగిలున్న క్వాలిఫయింగ్ ఈవెంట్లు పూర్తి చేయడం, ప్రత్యామ్నాయ అర్హత అవకాశాలు కూడా లేకపోవడంతో సభ్య దేశాలకు చెందిన క్రీడా సమాఖ్యలు, ఒలింపిక్ సమాఖ్యలు, సంఘాలు, అంతర్జాతీయ క్రీడా పాలక మండలిలతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూనే ఉంది. టోక్యో ఈవెంట్‌కు 60 కంపెనీలు, సంస్థలు స్పాన్సర్ చేస్తున్నప్పటికీ ప్రధాన స్పాన్సర్లయిన టయోటా మోటార్ కార్ప్, ప్యానసోనిక్ కార్ప్ సంస్థలకు సమస్య అర్థమై ఆందోళన చెందుతున్నాయి. జపాన్ ఎయిర్‌లైన్స్ కంపెనీ కూడా షెడ్యూల్ ప్రకారం ఒలింపిక్స్ జరిగే అవకాశమే లేదని తెగేసి చెప్పింది. వాయిదా సరే... రద్దయితే? జపాన్ ప్రభుత్వం ఎన్ని చెప్పినా... ఒలింపిక్స్ వాయిదా దాదాపు ఖాయమైనట్లేనని ఐఓసీ వర్గాలే చెబుతున్నాయి. కానీ మరో రెండేళ్ల వరకు అంతర్జాతీయ క్రీడల క్యాలెండర్ బిజీబిజీగా ఉంది. 2021 సమ్మర్ సీజన్ ఏమాత్రం ఖాళీ లేదు. 2022 ఫుట్‌బాల్ ప్రపంచకప్ , బీజింగ్ వింటర్ ఒలింపిక్స్‌లతో నిండిపోయింది. మరి వాయిదా కొన్ని నెలలపాటే అయితే కుదరొచ్చు కానీ వచ్చే ఏడాది అంటే మాత్రం మొదటికే మోసమొస్తుంది. పైగా ‘టోక్యో’ను ప్రతీ 40 ఏళ్ల ఒలింపిక్స్ భయాలు కూడా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. రెండో ప్రపంచ యుద్ధం కారణంగా 1940 ఒలింపిక్స్ రద్దుకాగా... మరో 40 ఏళ్లకు మాస్కోలో జరిగిన 1980 ఒలింపిక్స్‌ను జపాన్ బహిష్కరించింది. ఇప్పుడు మళ్లీ 40 ఏళ్లకు జపానే ఆతిథ్యమివ్వనున్న క్రీడలకు కూడా అదేగతి పడుతుందా అనే ఆందోళనలో జపాన్ విలవిలలాడుతోంది. -
ఐఓసీ... జోక్ చేస్తున్నారా?
న్యూఢిల్లీ: ఒలింపిక్స్ కోసం ప్రాక్టీస్ కొనసాగించండి అని ఆటగాళ్లను ప్రోత్సహించిన అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) వ్యాఖ్యలపై భారత షట్లర్ పారుపల్లి కశ్యప్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. అకాడమీలు అన్ని మూసేసిన ఈ పరిస్థితుల్లో ఎలా ప్రాక్టీస్ చేయమంటారని ట్విట్టర్ వేదికగా ఐఓసీని ప్రశ్నించాడు. ‘ప్రాకీŠట్స్ కొనసాగించమని ఐఓసీ మమ్మల్ని ప్రోత్సహిస్తోంది. కానీ ఎలా? ఎక్కడ? ఐఓసీ.. మీరు జోక్ చేస్తున్నారా?’ అని 2014 కామన్వెల్త్ గేమ్స్ చాంపియన్ కశ్యప్ పేర్కొన్నాడు. తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం భారత షట్లర్లందరూ ప్రాక్టీస్ చేసే గోపీచంద్ అకాడమీ ఈనెల 31 వరకు మూసేశారని... ఇలాంటి పరిస్థితుల్లో ప్రాక్టీస్ కొనసాగించండి ఐఓసీ అని అనడంలో అర్థం లేదని కశ్యప్ అన్నాడు. ‘ఇంకా చెప్పాలంటే అసలు ఒలింపిక్స్‌కు అర్హత ఎవరు సాధించారనే దానిపై స్పష్టత లేదు. ముందే అర్హత పొందిన క్రీడాకారులు ప్రాక్టీస్ చేసేందుకు అకాడమీలు అందుబాటులో లేవు. అందరి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని విదేశాల నుంచి వచ్చిన ఆటగాళ్లంతా స్వీయ నిర్బంధంలో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రాక్టీస్ చేయండి అనడంలో అర్థం లేదు’ అని కశ్యప్ పేర్కొన్నాడు. -
‘గేమ్స్‌ను జరిపి తీరుతాం’
టోక్యో: కొవిడ్–19 విలయతాండవం చేస్తున్నప్పటికీ ప్రతిష్టాత్మక ఒలింపిక్స్‌ను నిర్వహించడమే లక్ష్యంగా అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) మంగళవారం ప్రత్యేక సమావేశం నిర్వహించింది. టోక్యో ఈవెంట్‌కు ఇంకా నాలుగు నెలలు సమయం ఉండటంతో ఇప్పటికిప్పుడు ఎలాంటి అనుచిత, అసాధారణ నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం లేదని ఐఓసీ ఎగ్జిక్యూటీవ్ కౌన్సిల్ అభిప్రాయపడింది. ఈ అత్యున్నత సమావేశంలో ఐఓసీ స్టేక్ హోల్డర్లు, అంతర్జాతీయ పారాలింపిక్ కమిటీ, వివిధ దేశాలకు చెందిన జాతీయ ఒలింపిక్ కమిటీ, క్రీడాసమాఖ్యల ప్రతినిధులు పాల్గొన్నారు. అయితే అందరి సంరక్షణకే తమ తొలి ప్రాధాన్యమని, ఆరోగ్యకరమైన వాతావరణంలోనే ఆటలు సాగుతాయని ఐఓసీ అధ్యక్షుడు థామస్ బాచ్ తెలిపారు. వైరస్ వ్యాప్తిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూనే కార్యాచరణ కొనసాగిస్తామని చెప్పారు. ప్రత్యేక సమావేశంలో అసంపూర్తిగా ఉన్న క్వాలిఫికేషన్ ప్రక్రియను ఎలా పూర్తిచేయాలన్న దానిపై చర్చించారు. ఇప్పటివరకైతే 57 శాతం మంది క్రీడాకారులు టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సంపాదించారు. ఇంకా 43 శాతం మంది అర్హత సాధించాల్సివుంది. ప్రధానంగా దీనిపైనే ఐఓసీ సమావేశంలో చర్చించారు. సమావేశంలోని ప్రతిపాదనల్ని ఐఓసీ ఎగ్జిక్యూటీవ్ కౌన్సిల్‌తో పాటు పాల్గొన్న ప్రతి అంతర్జాతీయ క్రీడా సమాఖ్య ఏకగ్రీవంగా ఆమోదించింది. చర్చలోని ప్రధానాంశాలు ►ఇప్పటివరకు ఖరారైన కోటా స్థానాల్ని సంబంధిత అథ్లెట్లకు, సమాఖ్యలకు కేటాయించారు. దీనిపై ఏ సమస్యా లేదు. ►ఇక మిగిలిన క్వాలిఫికేషన్ ఈవెంట్లను పూర్తి చేసేందుకు అవలంభించాల్సిన పద్ధతుల్ని, సాధ్యాసాధ్యాల్ని సంబంధిత క్రీడా సమాఖ్యలతో పరిశీలిస్తారు. ►ఆన్ ఫీల్డ్ ఫలితాలు లేదంటే ర్యాంకింగ్, గడిచిన అత్యుత్తమ ఫలితాల ఆధారంగా బెర్తులిచ్చే అంశాల్ని పరిశీలించనున్నారు. ►ఈ పద్ధతుల్లో అథ్లెట్ల కోటా పెరిగితే ప్రతి కేసును, ఆయా పరిస్థితుల్ని కూలంకషంగా చర్చించి తుది నిర్ణయం తీసుకుంటారు. కరోనా హైరానా... ‘జ్యోతి’ దారి కుదింపు టోక్యో: ప్రతిష్టాత్మక ఒలింపిక్స్‌కు ముందు టార్చ్ రిలే (ఒలింపిక్ జ్యోతి) చేసే హంగామా అంతా ఇంతా కాదు. ప్రపంచ దిగ్గజాలు చేతబూనే ఈ జ్యోతి ఎక్కడికెళ్లినా విశేష ఆదరణ లభిస్తుంది. అలాంటి రిలేకు కరోనా పెద్ద కష్టమే తెచ్చింది. అసాంతం, అద్వితీయంగా సాగే రీలే ఇప్పుడు మాత్రం కుదించిన రూట్లలో అది కూడా పరిమిత సంఖ్యలోనే హాజరయ్యే వారితో ముగించాలని టోక్యో–2020 ఆర్గనైజింగ్ కమిటీ నిర్ణయించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ జన సమూహానికి అవకాశమివ్వరాదని, ఎవరూ కూడా గుమిగూడి చూడాల్సిన అవసరం లేదని దానివల్ల కరోనా ముప్పు పొంచి వుందని నిర్వాహకులు హెచ్చరికలు జారీచేశారు. ►జపాన్ ఒలింపిక్ కమిటీ డిప్యూటీ చీఫ్‌కు వైరస్ టోక్యో: ఓ వైపు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) ఏమో గేమ్స్‌ను జరిపి తీరాల్సిందేననే పట్టుదలతో ఉంటే... మరోవైపు నిర్వాహక దేశానికి చెందిన కమిటీ డిప్యూటీ చీఫ్ కొజో తషిమా కరోనా బారిన పడ్డారు. తనకు నిర్వహించిన కోవిడ్–19 పరీక్షల ఫలితాలు పాజిటివ్‌గా వచ్చాయని ఆయన వాపోయారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. ►ఫుట్‌బాల్ యువ కోచ్ మృతి మాడ్రిడ్: కరోనా వైరస్ స్పెయిన్‌కు చెందిన 21 ఏళ్ల యువ ఫుట్‌బాల్ కోచ్‌ను బలి తీసుకుంది. ఫ్రాన్సిస్కా గార్సియా కొవిడ్–19తో మృతి చెందినట్లు స్పానిష్ లీగ్ వర్గాలు తెలిపాయి. ►అన్ని శిబిరాలు వాయిదా: రిజిజు భారత్‌లోనూ కరోనా వైరస్ చాపకింద నీరులా విజృంభిస్తుండటంతో దేశంలో అన్ని రకాల శిక్షణ శిబిరాలను వాయిదా వేస్తున్నట్లు కేంద్ర క్రీడల మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు. ఒలింపిక్స్ సన్నాహక శిబిరాలు మాత్రమే యథాతథంగా కొనసాగుతాయని ఆయన చెప్పారు. ►భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా టర్కీలో తన శిక్షణను అర్ధాంతరంగా ముగించుకొని తిరుగుముఖం పట్టాడు. టోక్యో ఈవెంట్‌కు అర్హత సంపాదించిన ఇతను గత నెల రోజులుగా టర్కీలో శిక్షణ పొందుతున్నాడు. -
ఒక్కో దేశం నుంచి ఇద్దరు...
లుసానే: టోక్యో ఒలింపిక్స్‌లో కొత్త సాంప్రదాయానికి అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) తెర తీస్తోంది. మెగా ఈవెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పతాకధారులుగా (ఫ్లాగ్ బేరర్లు) ఇకపై ఒక దేశం నుంచి ఇద్దరిని అనుమతిస్తున్నట్లు ఐఓసీ ప్రకటించింది. ‘ఒక పురుష అథ్లెట్, ఒక మహిళా అథ్లెట్‌ను ఆయా దేశాలు తమ ఫ్లాగ్ బేరర్లుగా నామినేట్ చేయవచ్చు. ఇందు కోసం నిబంధనలు మార్చాం. అన్ని దేశాలు దీని ప్రకారం ఫ్లాగ్ బేరర్లను ఎంపిక చేస్తే బాగుంటుంది’ అని ఐఓసీ వెల్లడించింది. ఇప్పటి వరకు జరిగిన ఒలింపిక్స్‌తో పోలిస్తే 2020 ఒలింపిక్స్‌లో మహిళా సమానత్వానికి అమిత ప్రాధాన్యతనిస్తున్నామని, ఇందులో పాల్గొనే అథ్లెట్లలో 48.8 శాతం మహిళలే ఉండటం దీనికి రుజువని కూడా ఐఓసీ పేర్కొంది. తొలిసారిగా ఒలింపిక్స్‌లో పాల్గొనే ప్రతీ దేశం నుంచి కనీసం ఒక పురుష, ఒక మహిళా అథ్లెట్ ఉండేలా చర్యలు తీసుకున్నామని కూడా స్పష్టం చేసింది. జూలై 24 నుంచి ఆగస్టు 9 వరకు టోక్యోలో ఒలింపిక్స్ జరగనున్నాయి. -
టోక్యో... క్యా కరోనా?
రెండు వందలకు పైగా దేశాల నుంచి దాదాపు పది వేల మంది అథ్లెట్లు... అంతకంటే ఎన్నో రెట్ల సంఖ్యలో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు... పక్షం రోజుల పాటు క్రీడా ప్రేమికులకు పండగ... ఇంతటి హంగామా ఉండే విశ్వ సంబరం ఒలింపిక్స్‌పై కూడా ఇప్పుడు ప్రమాదకర కరోనా (కోవిడ్–19) వైరస్ ప్రభావం పడనుందా... జూలై–ఆగస్టుల్లో జపాన్ రాజధాని టోక్యోలో జరగాల్సిన 2020 మెగా ఈవెంట్ వాయిదా పడుతుందా లేక మొత్తానికే రద్దవుతుందా... ఇద్దరు మనుషులు కలిసినప్పుడు షేక్ హ్యాండ్లు ఇవ్వడం కూడా ప్రమాదంగా భావిస్తున్న ప్రస్తుత స్థితిలో వేల సంఖ్యలో జనం గుమిగూడే ఒలింపిక్స్ నిర్వహణ సాధ్యమా...? అసలు ఆ సాహసం నిర్వాహకులు చేయగలరా! టోక్యో: కరోనా వైరస్ (కోవిడ్–19) దెబ్బకు ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే ఎన్నో ప్రముఖ క్రీడా ఈవెంట్లు రద్దు కావడమో లేక వాయిదా పడటమో జరుగుతున్నాయి. ప్రతీ రోజు ఎక్కడో ఒక క్రీడాంశానికి సంబంధించి ఇలాంటి వార్త వస్తూనే ఉంది. అయితే వీటన్నింటిని మించి ఇప్పుడు అందరి దృష్టి టోక్యో ఒలింపిక్స్‌పై పడింది. యూరోపియన్ దేశాలతో పోలిస్తే ఆసియా ఖండంలో విస్తృతంగా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఒలింపిక్స్ వేదిక జపాన్ కావడంతో కొత్త సందేహాలు తలెత్తుతున్నాయి. షెడ్యూల్ ప్రకారం జూలై 24 నుంచి ఆగస్టు 9 వరకు టోక్యో ఒలింపిక్స్ క్రీడలు జరగాల్సి ఉన్నాయి. ఇప్పుడు స్వయంగా ఆ దేశ పార్లమెంట్లో మంత్రి ఇచ్చిన వివరణ కొత్తగా ఆందోళనను రేకెత్తిస్తోంది. పార్లమెంట్లో ఒక ప్రతినిధి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ జపాన్ ఒలింపిక్ మంత్రి సీకో హషిమొటో కీలక వ్యాఖ్య చేశారు. ‘ఒలింపిక్స్ నిర్వహణకు ఉద్దేశించిన క్యాలెండర్ సంవత్సరం ముగిసే వరకు వాటిని మళ్లీ మళ్లీ వాయిదా వేసేందుకు నిర్వాహక కమిటీకి హక్కు ఉంటుంది. అయితే 2020లో గనక మనం నిర్వహించలేకపోతే నిబంధనల ప్రకారం క్రీడలను పూర్తిగా రద్దు చేసే అధికారం అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ)కి ఉంది’ అని ఆయన ప్రకటించారు. షెడ్యూల్ ప్రకారం జూలై 24 నుంచి మాత్రం నిర్వహణ సాధ్యం కాకపోవచ్చని మంత్రి వ్యాఖ్యల్లో పరోక్షంగా వినిపించింది. కరోనా వైరస్ కారణంగా రాబోయే రోజుల్లో పరిస్థితి మరింతగా దిగజారితే అప్పుడేం చేస్తారనే ప్రశ్నకు కూడా మంత్రి సమాధానమిచ్చారు. అలాంటి పరిస్థితి రాకుండా తాము అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఆయన వెల్లడించారు. నిర్వాహక కమిటీ, ఐఓసీ, జపాన్ ప్రభుత్వం కలిసి దీనిపై పని చేస్తున్నాయని మంత్రి చెప్పారు. హషిమొటో అంచనా ప్రకారం క్రీడల నిర్వహణ విషయంలో నిర్ణయం తీసుకునేందుకు ఐఓసీ మే నెలను డెడ్‌లైన్‌గా పెట్టుకుంది. అదే నెల చివరి వరకు ఎదురు చూసి అప్పటి పరిస్థితులకు అనుగుణంగా ఒలింపిక్స్‌పై ప్రకటన రావచ్చు. ఒలింపిక్స్ చరిత్రలో మూడు సార్లు మాత్రమే ప్రపంచ యుద్ధాల కారణంగా క్రీడలు (1916, 1940, 1944) రద్దయ్యాయి. థామస్ బాచ్ టెస్టు ఈవెంట్లు రద్దు! ఒలింపిక్స్ నిర్వహణకు ముందు జరిగే పలు టెస్టు ఈవెంట్లను నిర్వాహకులు తప్పనిసరి పరిస్థితుల్లో రద్దు చేయాల్సి వస్తోంది. రాబోయే కొన్ని వారాల పాటు ప్రేక్షకులు ఎక్కువ సంఖ్యలో వచ్చే ఎలాంటి ఈవెంట్లు జరపరాదని దేశ ప్రధాని షింజో అబె ఆదేశించారు. మంగళవారం పారాలింపిక్ వీల్‌చైర్ రగ్బీ టెస్టు ఈవెంట్ రద్దయింది. షెడ్యూల్ ప్రకారం మే 8లోగా మరో 17 విభిన్న క్రీడాంశాల్లో టెస్టు ఈవెంట్లు జరగాల్సి ఉంది. వీటిలో ఎక్కువ భాగం చిన్నవి కావడం, స్థానిక అథ్లెట్లతోనే కావడంతో ఇబ్బంది లేదు. అయితే ప్రధానమైన జిమ్నాస్టిక్స్ ఈవెంట్‌ను మాత్రం జపాన్ ఆటగాళ్లతోనే ముగించే అవకాశం ఉంది. జపాన్ బేస్‌బాల్ లీగ్ పోటీలు కూడా ప్రేక్షకులు లేకుండానే సాగుతుండగా, సాకర్ జె లీగ్ కూడా రద్దయింది. ఆదివారం టోక్యో మారథాన్‌ను నిర్వహించారు. సాధారణంగా 30 వేల మంది హాజరయ్యే మారథాన్‌కు ఈసారి వేయి మంది కూడా రాలేదు. మరోవైపు ఐఓసీ మాత్రం టోక్యో ఒలింపిక్స్‌ను విజయవంతంగా నిర్వహించేందుకు తమ సన్నాహాలు కొనసాగుతున్నాయని ప్రకటించడం విశేషం. లుసానేలో జరిగిన ఐఓసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో పాల్గొన్న అనంతరం అధ్యక్షుడు థామస్ బాచ్ మాట్లాడుతూ...‘తుది నిర్ణయం తీసుకునేందుకు చాలా సమయం ఉంది. ఆలోగా మా ఏర్పాట్లు చేసుకుంటూ సిద్ధంగా ఉండాలి కదా’ అని అన్నారు. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీకి నాలుగేళ్ల కాలంలో వచ్చే 5.7 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 42 వేల కోట్లు) ఆదాయంలో 75 శాతం ప్రసార హక్కులు విక్రయించడం ద్వారానే లభిస్తుంది. ఇందులో సగం అమెరికాకు చెందిన టీవీ నెట్వర్క్ నేషనల్ బ్రాడ్‌కాస్టింగ్ కంపెనీ (ఎన్బీసీ) నుంచే వస్తోంది. ఎన్బీసీ ప్రసారాల సౌకర్యం కోసమే ఒలింపిక్స్‌ను జూలై–ఆగస్టులో నిర్వహిస్తున్నారు. 1964లో టోక్యో ఒలింపిక్స్ అక్టోబరులో జరిగాయి. 2020లో మిగిలిన ఏడాది ఇతర ప్రముఖ క్రీడా ఈవెంట్లతో ఎన్బీసీ షెడ్యూల్ బిజీగా ఉంది. ఇప్పుడు ఒలింపిక్స్ నిర్వహణ తేదీల్లో తేడా వస్తే ఆర్థికపరంగా కూడా ఐఓసీకి భారీ నష్టం జరగవచ్చు. -
ప్రపంచ నంబర్ వన్ బాక్సర్‌గా అమిత్ పంఘాల్
న్యూఢిల్లీ: అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) బాక్సింగ్ టాస్క్ ఫోర్స్ తాజాగా ప్రకటించిన ప్రపంచ ర్యాంకింగ్స్‌లో భారత బాక్సర్, ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్ రజత పతక విజేత అమిత్ పంఘాల్ ప్రపంచ నంబర్‌వన్‌గా అవతరించాడు. 52 కేజీల విభాగంలో 420 పాయింట్లతో అమిత్ అగ్రస్థానంలో నిలిచాడు. దాంతో 2009 అనంతరం బాక్సింగ్‌లో నంబర్‌వన్ ర్యాంకును దక్కించుకున్న తొలి భారత బాక్సర్‌గా నిలిచాడు. గతంలో విజేందర్ సింగ్ (75 కేజీలు) వరల్డ్ నంబర్‌వన్‌గా నిలిచాడు. ఇక మహిళల విభాగంలో ఆరు సార్లు ప్రపంచ చాంపియన్ అయిన మేరీ కోమ్ 51 కేజీల విభాగంలో ఐదో స్థానంలో నిలవగా... తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ 22వ ర్యాంకును సాధించింది. మహిళల 69 కేజీల విభాగంలో లొవ్లీనా బొర్గోహైన్ మూడో ర్యాంకును దక్కించుకుంది. -
రూ. 63 కోట్ల చేతి ప్రతి!
అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) అధ్యక్షుడు థామస్ బాచ్, రష్యా కోటీశ్వరుడు అలీషర్ ఉస్మానోవ్ చేతుల్లో కనిపిస్తున్న ఈ రాత ప్రతి విలువ అక్షరాలా రూ. 63 కోట్లు! ఒలింపిక్ క్రీడల నిర్వహణపై తన విజన్‌ను చెబుతూ ‘ఆధునిక ఒలింపిక్ పితామహుడు’ పియర్రీ డి క్యూబర్టీన్ స్వయంగా రాసుకున్న 14 పేజీల డాక్యుమెంట్ ఇది. ఇటీవల జరిగిన వేలంలో ఉస్మానోవ్ దీనిని 8.8 మిలియన్ డాలర్లకు (సుమారు రూ. 63 కోట్లు)కు సొంతం చేసుకున్నాడు. దానిని ఇప్పుడు లాసానేలోని ఒలింపిక్ మ్యూజియంలో ఉంచమంటూ తానే బహుమతిగా అందించాడు. క్రీడల చరిత్రలో వేలం ద్వారా ఒక స్మారకం లేదా జ్ఞాపికకు లభించిన అత్యధిక మొత్తం ఇదే కావడం విశేషం. గతంలో అమెరికా బేస్‌బాల్ ఆటగాడు బేబ్ రూత్ ధరించిన ‘న్యూయార్క్ యాంకీస్’ టీమ్ జెర్సీ 5.64 మిలియన్ డాలర్లకు (రూ. 40 కోట్లు) అమ్ముడుపోయింది. -
రష్యాపై నాలుగేళ్ల నిషేధం!
మాస్కో: అంతర్జాతీయ క్రీడల్లో మరో నాలుగేళ్ల పాటు రష్యా జెండా, అథ్లెట్లు కనిపించరేమో! తప్పుడు డోపింగ్ పరీక్షా ఫలితాలు, నిర్వహణతో రష్యా క్రీడా సమాఖ్య ఇప్పుడు భారీ మూల్యమే చెల్లించుకునేందుకు సిద్ధమైంది. ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) రష్యాపై నాలుగేళ్ల నిషేధం విధించాలని అంతర్జాతీయ క్రీడా సమాఖ్యలకు సిఫార్సు చేసింది. మాస్కోలోని ల్యాబోరేటరీల్లో నామమాత్రపు పరీక్షలు, నకిలీ నివేదికలు, నిర్వహణ తీరుపై విచారించిన ‘వాడా’ స్వతంత్ర దర్యాప్తు కమిటీ ఆ మేరకు నిషేధాన్ని సూచించింది. రష్యా ఆటగాళ్లు పాల్గొనకుండా చేయడంతో పాటు రష్యా అంతర్జాతీయ పోటీల ఆతిథ్యానికి బిడ్ వేసే అవకాశముండదు. ఇదే జరిగితే యూరో 2020 ఈవెంట్‌ను ఈ సారి ఉమ్మడిగా నిర్వహిస్తున్నప్పటికీ ఇందులో రష్యాకు చెందిన సెయింట్ పీటర్స్బర్గ్ వేదిక కూడా ఉండటం ఫుట్‌బాల్ వర్గాల్ని కలవరపెడుతున్నాయి. రష్యా డోపింగ్ నిరోధక సంస్థ (ఆర్‌యూఎస్‌ఏడీఏ) చీఫ్ యూరీ గానస్ మాట్లడుతూ ‘నిషేధం తప్పేలా లేదు. నాలుగేళ్ల పాటు ఆటలకు దూరమయ్యే అవకాశం ఉంది. దీంతో మా వాళ్లకు టోక్యో ఒలింపిక్స్ (2020), బీజింగ్ వింటర్ ఒలింపిక్స్ (2022) మెగా ఈవెంట్లలో పాల్గొనే అవకాశం ఉండకపోవచ్చు’ అని అన్నారు. 2015లో రష్యాలో వ్యవస్థీకృత డోపింగ్ వ్యవహారం అంతర్జాతీయ క్రీడా సమాజంలో కలకలం రేపింది. అక్కడి క్రీడాధికారులు, కోచ్‌లు తమ క్రీడాకారులకు శిక్షణతో పాటు నిషేధిత ఉ్రత్పేరకాలు అలవాటు చేస్తున్నట్లు తేలడంతో ‘వాడా’ విచారణకు స్వతంత్ర దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ విచారణలో అధికారుల అండదండలతోనే ఇదంతా జరిగిందని తేలడంతో కథ ఆ దేశ నిషేధానికి చేరింది. సాధారణంగా డోపీలపై నిషేధం విధించడం సర్వసాధారణం కానీ... ఇక్కడ అధికారగణం ప్రోద్బలంతోనే ఇదంతా జరగడంతో ఏకంగా రష్యానే నిషేధించాల్సిన పరిస్థితి తలెత్తింది. గత రియో ఒలింపిక్స్ (2016)లో రష్యా ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్లను అనుమతించలేదు. మిగతా క్రీడాకారులను మాత్రం అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) గొడుగు కింద అనుమతించారు. -
ఐఓసీలో ‘ఐబా’ ప్రతినిధిగా మేరీకోమ్
న్యూఢిల్లీ: ఐదు సార్లు ప్రపంచ చాంపియన్ అయిన భారత మహిళా బాక్సర్ మేరీకోమ్‌కు అరుదైన అవకాశం దక్కింది. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) అథ్లెట్స్ ఫోరమ్‌లో ఆమె అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం (ఏఐబీఏ–ఐబా) ప్రతినిధిగా పాల్గొననుంది. దీంతో ఈ ఘనత సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా ఆమె నిలిచింది. 33 ఏళ్ల మణిపూర్ స్టార్ బాక్సర్ గతేడాది ‘ఐబా’ లెజెండ్స్ అవార్డు అందుకుంది. రాజ్యసభ ఎంపీ అయిన ఆమె... నవంబర్ 11 నుంచి 13 వరకు లుసానేలో జరిగే ఎనిమిదో ఐఓసీ అథ్లెట్స్ ఫోరమ్‌లో ఐబా ప్రతినిధిగా వ్యవహరిస్తుంది. ‘ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అథ్లెట్లు ఈ ఫోరమ్‌లో పాల్గొని తమ అభిప్రాయాల్ని పంచుకోవడమే ఈ వేదిక ఉద్దేశం’ అని ఐబా... భారత బాక్సింగ్ సమాఖ్య అధ్యక్షుడు అజయ్ సింగ్‌కు లేఖ రాసింది. అయితే వియత్నాంలో నవంబర్ 2 నుంచి 12 వరకు ఆసియా బాక్సింగ్ చాంపియన్‌షిప్ జరగనుంది. ఈ టోర్నీ కోసం జరిగే ట్రయల్స్‌లో మేరీకోమ్ ఎంపికైతే అథ్లెట్స్ ఫోరమ్‌లో పాల్గొనడంపై అనిశ్చితి నెలకొంటుంది. -
బోల్ట్ చేజారిన రిలే స్వర్ణం
లుసానే: జమైకా స్టార్ అథ్లెట్ ఉసేన్ బోల్ట్ సాధించిన తొమ్మిది ఒలింపిక్ స్వర్ణాలలో ఒకటి తగ్గనుంది. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో బోల్ట్, మైకేల్ ఫ్రాటెర్, అసఫా పావెల్, నెస్టా కార్టర్ సభ్యులుగా ఉన్న జమైకా రిలే జట్టు 4్ఠ100 మీ టర్ల రిలేలో స్వర్ణ పతకం సాధించింది. అయితే ఈ రిలే జట్టు సభ్యుడైన నెస్టా కార్టర్ డోపింగ్‌లో పట్టుబడటంతో... అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) ఈ ఫలితాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. బోల్ట్ వరుసగా మూడు ఒలింపిక్స్ (2008 బీజింగ్, 2012 లండన్, 2016 రియో) క్రీడల్లో మూడేసి స్వర్ణాలు (100, 200 మీటర్లు, 4్ఠ100 మీ.రిలే) సాధించాడు. -
ఐఓసీ సమావేశంలో పాల్గొనడం లేదు
బ్లాటర్పై ఫిఫా ప్రకట లాసానే : వచ్చే వారం జరిగే అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) సమావేశానికి సెప్ బ్లాటర్ హాజరు కావడం లేదని ఫిఫా ప్రకటించింది. ఐదోసారి ఫిఫా అధ్యక్షుడిగా ఎన్నికైన నాలుగురోజులకే పదవి నుంచి తప్పుకున్న బ్లాటర్ ఒలింపిక్ కమిటీలోనూ సభ్యుడుగా ఉన్నారు. లాసానేలో జరిగే ఈ సమావేశానికి హాజరుకాబోనని గత ఏప్రిల్‌లోనే బ్లాటర్ తెలిపారని, ఇప్పుడు కూడా ఆ నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదని ఫిఫా అధికార ప్రతినిధి చెప్పారు. 1999 నుంచి ఒలింపిక్ కమిటీలో ఫుట్‌బాల్ ప్రతినిధిగా 79 ఏళ్ల బ్లాటర్ కొనసాగుతున్నారు. -
ఒలింపిక్స్ రేసులో భారత్ లేదు
ఊహాగానాలకు తెరదించిన ఐఓసీ చీఫ్ {పధానితో భేటీ న్యూఢిల్లీ: 2024 ఒలింపిక్స్‌ను నిర్వహించేందుకు భారత్ ఆసక్తి ప్రదర్శిస్తుందంటూ వచ్చిన ఊహాగానాలకు తెర పడింది. ప్రధాని న రేంద్ర మోదీ నుంచి ఈ దిశగా ఎలాంటి ప్రతిపాదన రాలేదని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) అధ్యక్షుడు థామస్ బాచ్ స్పష్టం చేశారు. ఆయన సోమవారం ప్రధానితో సమావేశమయ్యారు. ఏడాది క్రితమే సస్పెన్షన్ తొలగించుకున్న భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) ఇంత పెద్ద ఈవెంట్‌ను నిర్వహిస్తుందనుకోవడం తొందరపాటు ఆలోచనే అవుతుందని పేర్కొన్నారు. ప్రధానిని కలుసుకోవడానికి ముందు బాచ్... ఐఓఏ అధికారులతో, క్రీడా శాఖ మంత్రి శర్బానంద సోనోవాల్‌తో విడివిడిగా సమావేశమయ్యారు. క్రీడా బిల్లుపై తమ వ్యతిరేకతను ప్రధానికి తెలపాలని ఐఓఏ అధికారులు బాచ్‌ను కోరారు. ప్రధానితో భేటీ అనంతరం మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన వివిధ అంశాలపై మాట్లాడారు. 2024 ఒలింపిక్స్ కోసం భారత్ బిడ్ వేస్తుందని మీడియాలో వచ్చిన కథనాలు నన్ను ఆశ్చర్యపరిచాయి. ప్రధాని దృష్టికి కూడా ఈ విషయాన్ని తెచ్చాను. అయితే మేం ఇది తొందరపాటుగానే భావించాం. ఎందుకంటే ఐఓఏ గతేడాదే సస్పెన్షన్ నుంచి బయటకు వచ్చింది. ఇంకా పటిష్టంగా నిలవాల్సి ఉంది. బిడ్ సాధ్యాసాధ్యాలపై ప్రధానిని అడిగాను. ఈ గేమ్స్ కోసం తాము సర్వసన్నద్ధంగా ఉండడంతో పాటు నైపుణ్యాన్ని పెంచుకోవాల్సి ఉందని ఆయన చెప్పారు. దేశంలో క్రీడల అభివృద్ధి కోసం కోచింగ్, సాంకేతికత, క్రీడా పాలకులకు.. కోచ్‌లకు శిక్షణ తదితర అంశాల్లో తోడ్పడేందుకు కేంద్రం, ఐఓఏ, ఐఓసీ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. నా పర్యటనతో దేశంలో క్రీడలకు మంచి జరుగుతుందని ఆశిస్తున్నాను. ఐఓఏ స్వయంప్రతిపత్తిని గౌరవిస్తామని ప్రధాని నాతో చెప్పారు. కేంద్రం, ఎన్ఓసీలు పరస్పరం గౌరవించుకుంటూ ముందుకెళతాయని భావిస్తున్నాను.భవిష్యత్‌లో భారత్ క్రీడాపరంగా సూపర్ పవర్‌గా మారితే ఐఓసీ సంతోషిస్తుంది. దీనికోసం మేం సహకరిస్తాం. దేశంలో 80 మిలియన్ల ముంది యువతే ఉంది. వీరికి క్రీడల్లో నైపుణ్యాన్ని అందిస్తే అద్భుతం జరుగుతుంది. అంతర్జాతీయ ఈవెంట్స్‌లో అథ్లెట్లు రాణించాలంటే కేంద్రం, ఐఓఏ సంయుక్తంగా వారికి మంచి సౌకర్యాలు కల్పించాల్సి ఉంది. -
భారత్ రానున్న ఐఓసీ చీఫ్ 27న ప్రధానితో థామస్ బాచ్ భేటీ
న్యూఢిల్లీ: అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) అధ్యక్షుడు థామస్ బాచ్ రెండు రోజుల పర్యటన కోసం భారత్‌కు ఈ నెల 26న రానున్నారు. 2013లో ఐఓసీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన బాచ్, భారత్‌కు రావడం ఇదే తొలిసారి. భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) ఎగ్జిక్యూటివ్ కమిటీతో సమావేశం కానున్న బాచ్... ప్రధాని నరేంద్ర మోదిని 27న కలవనున్నారు. 2024 ఒలింపిక్స్ నిర్వహణ కోసం భారత్ బిడ్ వేస్తుందని ఇటీవల వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. -
మళ్లీ మువ్వన్నెల నీడలో...
న్యూఢిల్లీ: అంతర్జాతీయ ఈవెంట్లలో భారత ఆటగాళ్లు పాల్గొంటారు.. అయినా వారి చేతులో మువ్వన్నెల పతాకం కనిపించదు.. పతకాలు సాధించినా తమ దేశ ఖాతాలోకి రావు.. ఒక్కోసారి టోర్నీలు ప్రారంభమయ్యాక కూడా ఇక్కడి నుంచి వెళ్లిపొమ్మంటూ అథ్లెట్లకు ఛీత్కారాలు.. గత ఏడాది కాలంలో భారత్ తరఫున బరిలోకి దిగిన అథ్లెట్లకు ఎదురైన అనుభవాలివి. అయితే ఇక ఈ అవమానకర ధోరణికి చెక్ పడింది. కళంకిత వ్యక్తుల ప్రమేయంతో పాటు కేంద్ర ప్రభుత్వ జోక్యానికి ప్రతిచర్యగా భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ)పై కొనసాగుతున్న నిషేధాన్ని.... అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) ఎత్తివేసింది. తాజా ఎన్నికలు జరిగిన కొద్ది రోజులకే తిరిగి ఐఓఏ... ఒలింపిక్ ఉద్యమంలోకి అడుగుపెట్టినట్టయ్యింది. నూతన అధ్యక్షుడిగా ప్రపంచ స్క్వాష్ సమాఖ్య చీఫ్ ఎన్.రామచంద్రన్ ఎన్నికైన విషయం తెలిసిందే. నిషేధం తొలగాలంటే తాము చెప్పిన సూచనలను అమలు చేయడంతోపాటు రాజ్యాంగ సవరణ చేసుకోవాల్సిందేనని గతంలో ఐఓసీ ఆదేశాలు జారీ చేసింది. తదనుగుణంగా కళంకిత వ్యక్తులకు ఎన్నికల్లో పాల్గొనకుండా ఐఓఏ రాజ్యాంగాన్ని సవరించింది. దీంట్లో భాగంగా ఈనెల 9న ఐఓసీ పరిశీలకుల ఆధ్వర్యంలో ఎన్నికలు జరిగి నూతన బోర్డు ఏర్పాటయ్యింది. ఈ ఎన్నికల ఫలితాలతో పాటు సాధారణ సర్వసభ్య సమావేశం గురించి ఐఓసీ అధ్యక్షుడికి పరిశీలకులు నివేదికను అందించారు. శీతాకాల ఒలింపిక్స్ జరుగుతున్న సోచిలో మంగళవారం ఐఓసీ ఎగ్జిక్యూటివ్ బోర్డు (ఈబీ) అడ్ హక్ సమావేశం జరిగింది. ఎలాంటి అవినీతి మచ్చ లేని వ్యక్తులు ఈ ఎన్నికల్లో పోటీ చేశారని, ఐఓఏ రాజ్యాంగాన్ని గౌరవిస్తూనే ఎన్నికలు జరిగాయని పరిశీలకులు ఐఓసీ ఈబీ సభ్యులకు తెలిపారు. సంతృప్తి చెందిన ఐఓసీ... ఐఓఏను పునరుద్ధరిస్తున్నట్టు ప్రకటించింది. ఇది వెంటనే అమల్లోకి వస్తుందని తెలిపింది. దీంతో 14 నెలలుగా కొనసాగుతున్న భారత ఒలింపిక్ సంఘంపై ఉన్న నిషేధం తొలగింది. ఈ నిర్ణయంతో అంతర్జాతీయ స్థాయి ఈవెంట్లలో భారత అథ్లెట్లు తమ జాతీయ పతాకం కింద పాల్గొనేందుకు మార్గం సుగమమైంది. సోచిలో జరుగుతున్న వింటర్ ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న ముగ్గురు భారత ఆటగాళ్లు తమ దేశం తరఫున ఆడే వీలు చిక్కింది. ముగింపు ఉత్సవంలో వీరు భారత పతాకంతోనే పాల్గొంటారు. ఇదే తొలిసారి ‘ఒలింపిక్ క్రీడలు జరుగుతున్న సందర్భంలో ఓ ఎన్ఓసీపై నిషేధం ఎత్తివేయడం ఒలింపిక్ చరిత్రలోనే ఇది తొలిసారి. ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుంది. సోచి వింటర్ ఒలింపిక్స్‌లో భారత ఆటగాళ్లు ఒలింపిక్ పతాకం చేతబట్టి ప్రారంభ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. స్వతంత్ర ఒలింపిక్ ఆటగాళ్లుగా పోటీల్లో పాల్గొంటున్నారు. ఇక వారు తమ దేశం తరఫునే పాల్గొనవచ్చు. అలాగే ముగింపు కార్యక్రమంలో భారత పతాకాన్ని చేతపట్టుకోవచ్చు’ - ఐఓసీ అసలేం జరిగింది... భారత ప్రభుత్వం అమలు చేయాలనుకున్న జాతీయ క్రీడా బిల్లుకు ఐఓఏ అంగీకరించడం, కళంకిత వ్యక్తులను తమ కమిటీలో ఉంచడంతో ఐఓసీ ఆగ్రహించింది. దీంతో 14 నెలల క్రితం.. డిసెంబర్ 4, 2012న భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ)పై ఐఓసీ నిషేధం విధిస్తూ కఠిన నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ఐఓఏ, ప్రభుత్వ ప్రతినిధులతో లాసానేలో సమావేశం కావాలని ఐఓసీ ప్రతిపాదించింది. పలుమార్లు వాయిదా పడిన అనంతరం గతేడాది మే 15న సమావేశం జరిగింది. క్రీడా మంత్రి జితేంద్ర సింగ్, షూటర్ బింద్రా కూడా హాజరయ్యారు. ఇక్కడే ఒలింపిక్ ఉద్యమంలోకి రావాలంటే ఏం చేయాలో రోడ్ మ్యాప్‌ను జారీ చేసింది. జూలై 15లోగా తమ రాజ్యాంగాన్ని సవరించుకోవాలి.. సెప్టెంబర్ 1లోగా కొత్త ఆఫీస్ బేరర్లను నియమించుకోవాలి.. అని స్పష్టం చేసింది. అలాగే కళంకితులు ఐఓఏ ఎన్నికలకు అర్హులు కారని ఆగస్టు 15న ప్రకటించింది. అయితే ఈ నిబంధనను ఐఓఏ తిరస్కరించింది. తమ దేశ చట్టాల ప్రకారమే తాము నడుచుకుంటామని స్పష్టం చేసింది. శిక్ష పడినవారికే ఈ నిబంధన అమలు కావాలని సూచించింది. కానీ పట్టు వీడని ఐఓసీ.. అక్టోబర్ 31లోగా తమ రాజ్యాంగ సవరణ ద్వారా అలాంటి వారిని తొలగించాలని, డిసెంబర్ 15లోగా తాజా ఎన్నికలు జరపాలని ఆదేశించింది. ఆ తర్వాత ఐఓసీ సూచనలన్నింటినీ ఆమోదించిన ఐఓఏ.. ఎన్నికలు కూడా జరపడంతో వివాదం ఓ కొలిక్కి వచ్చింది. ‘ఆ నిషేధం మంచే చేసింది’ ‘ఏడాదికి పైగా క్రీడాకారులు, అభిమానులు జరుగుతున్న పరిణామాలపై తమ ఆందోళనను వెలిబుచ్చారు. భారత్‌పై ఉన్న నిషేధాన్ని తొలగించాలని మా క్రీడా శాఖ కూడా లాసానేలో, ఇతర వేదికలపై కోరాం. అయితే ఇంతకాలంగా మనం సాధించిందేమైనా ఉంటే అది క్రీడలను ప్రక్షాళన చేయడం. తిరిగి ఒలింపిక్ ఉద్యమంలోకి వచ్చినందుకు ఐఓఏకు సహకరించినందుకు ఐఓసీకి అభినందనలు. ఇక ఆటగాళ్లు దేశ పతాకం కింద పోటీపడనున్నారనే విషయం సంతృప్తినిస్తోంది’ - జితేంద్ర సింగ్ (క్రీడా మంత్రి) ఇక గర్వంగా చెబుతాను ‘సోచి క్రీడల ప్రారంభ వేడుకల్లో మేం ముగ్గురం ఒలింపిక్ పతాకం కింద నడవడం ఇబ్బందికరంగా అనిపించింది. ఎందుకంటే ఇది నా తొలి వింటర్ ఒలింపిక్స్. ఐఓసీ పతాకం కింద పోటీచేయాల్సి రావడం విచారం కలిగించింది. కానీ ఇప్పుడు భారత అథ్లెట్‌గా బరిలోకి దిగబోతున్నాను. నిజానికి ఇది నేనూహించలేదు. ఇప్పుడు నా తోటి అథ్లెట్లతో ‘నేను భారత ఆటగాడిని’ అని గర్వంగా చెబుతాను’ - హిమాన్షు (అథ్లెట్)