టోక్యో: ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఏడాది టోక్యోలో ఒలింపిక్స్ జరుపుతామని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) నిర్వహణా కమిటీ పదే పదే చెబుతున్నా... స్థానికంగా మాత్రం పరిస్థితులు అంత అనుకూలంగా కనిపించడం లేదు. ఒలింపిక్స్ రద్దు చేయాలంటూ కోరుతున్న పిటిషన్‌కు అనుకూలంగా 3 లక్షల మంది ఇప్పటికే సంతకాలు చేశారు. కరోనాతో ప్రజలు ఇబ్బంది పడుతుండగా... పలు చోట్ల సరైన వైద్య సౌకర్యాలు అందుబాటులో లేవు.
జపాన్ దేశంలోని పలు ప్రాంతాల్లో ప్రస్తుతం జాతీయ ఎమర్జెన్సీ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో స్థానిక పత్రికలో వచ్చిన ఒక ప్రకటన అందరి దృష్టినీ ఆకర్షించింది. ‘వ్యాక్సిన్లు లేవు, వైద్యం లేదు, వెదురు బొంగులతో చేసిన ఆయుధాలతో మేం పోరాడాలా. పరిస్థితులు మారకపోతే ఈ రాజకీయాల కారణంగానే మేం చచ్చిపోతాం. ఏడాది కాలంగా మమ్మల్ని మోసం చేస్తూనే ఉన్నారు. ఇంకా ఏం చేయాలి’ అని రాసి ఉన్న ప్రకటనలో జపాన్ దేశ ప్రజల్లో పెరిగిపోతున్న అసహనం కనిపించింది.
Comments
Please login to add a commentAdd a comment