టోక్యో: ఈ ఏడాది కూడా టోక్యో ఒలింపిక్స్ క్రీడల ను నిర్వహించొద్దంటూ ఆందోళనలు చేస్తున్న జపాన్ ప్రజలకు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) భరోసా ఇచ్చే ప్రయత్నం చేసింది. ఒలింపిక్స్‌ను సురక్షితంగా నిర్వహిస్తామంటూ ఐఓసీ ఉపాధ్యక్షుడు జాన్ కోట్స్ జపాన్ ప్రజలకు తెలియజేశారు. మెగా ఈవెంట్ ఏర్పాట్లలో భాగంగా మూడు రోజులపాటు జరిగిన వర్చువల్ సమావేశం శుక్రవారం ముగిసింది. ఇందులో అధ్యక్ష హోదాలో పాల్గొన్న జాన్... ‘నేను మరోసారి స్పష్టంగా చెబు తున్నా... గేమ్స్ సురక్షితంగా జరుగుతాయి.
అందు లో పాల్గొనే క్రీడాకారులతో పాటు జపాన్ వాసుల ఆరోగ్యానికి పెద్ద పీట వేస్తూ గేమ్స్‌ను నిర్వహిస్తాం’ అని స్పష్టం చేశారు. విశ్వ క్రీడలు ఆరంభమయ్యే సమయానికి టోక్యో ప్రజల్లో దాదాపు 80 శాతం మంది కోవిడ్–19 వ్యాక్సిన్‌ను వేసుకొని ఉంటారని ఆయన వ్యాఖ్యానించారు. ఒలింపిక్స్‌కు మరో తొమ్మిది వారాల సమయం మాత్రమే ఉండగా... ఇటీవల ఐఓసీ సీనియర్ సభ్యుడు రిచర్డ్ పౌండ్ ఒక పత్రికా సమావేశంలో ఆసక్తికర వ్యాఖ్య చేశారు. ఒలింపిక్స్ నిర్వహణపై తాము ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని, జూన్ చివరి నాటికి క్రీడలపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని ఆయన పేర్కొనడం విశేషం. ఒకవేళ ఈ ఏడాది గేమ్స్ జరగకపోతే... అవి రద్దయినట్లుగా భావించాలని రిచర్డ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment