భారత్ కు మరో అరుదైన గౌరవం, హ‌ర్షం వ్య‌క్తం చేసిన నీతా అంబానీ!! | India To Host International Olympic Committee Session In 2023 | Sakshi
Sakshi News home page

భారత్ కు మరో అరుదైన గౌరవం, హ‌ర్షం వ్య‌క్తం చేసిన నీతా అంబానీ!!

Published Sat, Feb 19 2022 4:31 PM | Last Updated on Sat, Feb 19 2022 5:58 PM

India To Host International Olympic Committee Session In 2023 - Sakshi

భారత్ కు మరో అరుదైన గౌరవం, హ‌ర్షం వ్య‌క్తం చేసిన నీతా అంబానీ!!

40 ఏళ్ల త‌ర్వాత భారత్కు మరో అరుదైన గౌరవం లభించింది. వచ్చే ఏడాది ముంబాయిలో అంతర్జాతీయ ఒలంపిక్స్ కమిటీ 2023 సెషన్ ను నిర్వహించేందుకు భారత్ హక్కుల దక్కించుకుంది. ఈ సెషన్ ను 1863లో ఢిల్లీలో నిర్వహించారు. మళ్లీ వచ్చే ఏడాది ముంబైలో సెష‌న్ నిర్వ‌హించ‌డంపై రిలయన్స్ ఫౌండేషన్ చైర్మన్, అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) సభ్యురాలు నీతా అంబానీ హర్షం వ్యక్తం చేశారు.



ఈ సంద‌ర్భంగా నీతా అంబానీ మాట్లాడుతూ.. ఇన్నేళ్ల నిరీక్ష‌ణ త‌ర్వాత భార‌త్‌లో సెష‌న్ నిర్వ‌హిస్తున్న‌ట్లు తెలిపారు. ఈ అరుదైన గౌర‌వాన్ని భార‌త్‌కు అందించినందుకు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీకి కృతజ్ఞత‌లు తెలిపారు. అంతేకాదు ఈ గౌర‌వం భారతదేశ ఒలింపిక్ ఆకాంక్షలకు గణనీయమైన అభివృద్ధికి సంకేత‌మ‌నీ నీతా అంబానీ అభిప్రాయం వ్య‌క్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement