నీతా అంబానీ దగ్గర రూ.వందల కోట్ల ఐఫోన్‌.. నిజమేనా? | Does Nita Ambani owns Falcon Supernova iPhone 6 Pink which is worlds most expensive | Sakshi
Sakshi News home page

నీతా అంబానీ దగ్గర రూ.వందల కోట్ల ఐఫోన్‌.. నిజమేనా?

Published Sat, Dec 28 2024 8:31 PM | Last Updated on Sun, Dec 29 2024 10:18 AM

Does Nita Ambani owns Falcon Supernova iPhone 6 Pink which is worlds most expensive

ఆసియాలోనే అత్యంత సంపన్నుడైన ముఖేష్ అంబానీ (Mukesh Ambani) సతీమణి నీతా అంబానీ (Nita Ambani) తరచూ వార్తలలో నిలుస్తుంటారు. ఆడంబరాలకు, విలాసవంతమైన జీవనశైలికి ప్రసిద్ధి చెందిన ఆమె విశేషాలు తెలుసుకునేందుకు చాలా మంది ఆసక్తి కనబరుస్తుంటారు. నీతా అంబానీ ఉపయోగించే ఆడంబరమైన వస్తువులకు సంబంధించి అనేక పుకార్లు షికారు చేస్తుంటాయి. వాటిలో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఐఫోన్‌ (iPhone) కూడా ఒకటి.

ఫాల్కన్ సూపర్‌నోవా ఐఫోన్ 6 పింక్ డైమండ్ అని పిలిచే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఐఫోన్‌ నీతా అంబానీ దగ్గర ఉందన్న పుకార్లు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఈ ప్రత్యేక ఫోన్ ధర 48.5 మిలియన్ డాలర్లు (రూ.403 కోట్లకు పైగా). ఖరీదైన ప్లాటినం, 24-క్యారెట్ల బంగారంతో తయారైన ఈ ఫోన్‌ వెనుక భాగంలో భారీ గులాబీ వజ్రం (Pink Diamond) ఉంది.

అయితే ఈ పుకార్లన్నీ అవాస్తవమని కొన్ని సంవత్సరాల క్రితమే రిలయన్స్ వివరణ ఇచ్చింది. కంపెనీలోని సన్నిహిత వర్గాల సమాచారం మేరకు ఇంత ఖరీదైన ఫోన్‌ నీతా అంబానీ దగ్గర లేదని, ఆమె వాడలేదని ఇండియా టుడే కథనం పేర్కొంది.

ఇటీవల ముంబైలో జరిగిన ఎన్‌ఎంఏసీసీ ఆర్ట్స్‌ కేఫ్‌ ప్రారంభోత్సవానికి హాజరైన నీతా అంబానీ ధరించిన డ్రస్‌ అందరి దృష్టిని ఆకర్షించింది. నీతా ధరించిన వైట్‌ సిల్క్‌ టాప్‌ ధర 1395 డాలర్లు అంటే మన కరెన్సీలో రూ.1,18,715కు సమానం. అంతేకాకుండా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చీరను కూడా నీతా అంబానీ ధరించారు. దీని ధర ఏకంగా రూ. 40 లక్షలు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement