Olympic
-
సందడిగా హెచ్‌పీఎస్ 101వ వార్షిక క్రీడోత్సవం
సనత్‌నగర్ : బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (హెచ్‌పీఎస్) 101వ వార్షిక క్రీడోత్సవం శుక్రవారం ఘనంగా జరిగింది. హెచ్‌పీఎస్ ఆవరణలోని ఫ్రంట్ ఫీల్డ్‌లో అట్టహాసంగా నిర్వహించిన క్రీడా సంబరాల్లో వివిధ తరగతులకు చెందిన విద్యార్థులు ఆయా క్రీడల్లో సత్తా చాటారు. హెడ్‌బాయ్ శాని్వసాగి, హెడ్‌బాయ్ సార్తక్ లాంబా నేతృత్వంలో పాఠశాలలోని తక్షశిల, నాగార్జున, నలంద, విజయనగర బృందాలు అద్భుతరీతిలో మార్చ్ఫాస్ట్ నిర్వహణతో వేడుకలు ప్రారంభమయ్యాయి. ఒకవైపు విద్యార్థులు కేరింతల నడుమ క్రీడాకారులు విజయం సాధించి తమ బృందానికి కీర్తి ప్రతిష్టలు తెచి్చపెట్టేందుకు పోటీపడారు. సీనియర్ బాలురు, బాలికల 100 మీటర్ల పరుగు పందెంలో విజయనగర హౌస్‌కు చెందిన రుత్విక్ వూవాదన్, ఎస్ఎస్ సమితరెడ్డిలు మొదటి స్థానంలో నిలిచారు. అలాగే హార్స్ రైడింగ్ క్లబ్‌కు చెందిన విద్యార్థులు గుర్రాలపై విన్యాసాలు చేసి అలరించారు. ఏరోబిక్స్ విన్యాసాలు ఒళ్లు గగుర్పొడిచేలా చేశాయి. అనంతరం 6, 7 తరగతులకు చెందిన 690 మంది విద్యార్థులు ‘టాలోన్స్ ఆఫ్ ట్రయంఫ్’ పేరుతో ఆకర్షణీయమైన ప్రదర్శన ఇచ్చారు. పర్పుల్ అండ్ వైట్ దుస్తులు ధరించిన విద్యార్థులు రిబ్బన్లతో అదిరిపోయే సింఫనీని సృష్టించారు. 3, 4, 5 తరగతులకు చెందిన 981 మంది విద్యార్థులు ఆక్స్‌ఫర్ట్ అండ్ కేంబ్రిడ్జి బ్లూస్ ధరించి ‘ఫ్యూజన్ ఫిట్నెస్’ పేరుతో కాలిస్టెనిక్స్ పరిపూర్ణ ప్రదర్శన వీక్షకులను ఆశ్చర్యచకితులను చేసింది. 8, 9 తరగతుల విద్యార్థులు ప్రదర్శించిన ‘వైబ్రెంట్ వైబ్స్’ డీల్ అబ్బురపరిచింది. క్రీడలు, ఇతర పోటీల్లో విజేతలైన విద్యార్థులకు జ్యోతిక శ్రీదండి ట్రోఫీలు, జ్ఞాపికలను ప్రదానం చేశారు. హెచ్‌పీఎస్ ప్రిన్సిపాల్ స్కంద్బాలి, సొసైటీ ప్రతినిధులు, ఆధ్యాపక సిబ్బంది పాల్గొన్నారు. క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వాలి..విద్యార్థులను క్రీడల్లో ప్రోత్సహించేలా పాఠశాలల యాజమాన్యాలు, తల్లిదండ్రులు తగిన శ్రద్ధ చూపించాలి. హెచ్‌పీఎస్ క్రీడోత్సవ వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరవడం నా అదృష్టం. విద్యార్థులు వైఫల్యానికి భయపడవద్దు. క్రీడలు ఆత్మస్థైర్యాన్ని పెంపొందిస్తాయి. అంకితభావం, పట్టుదలతో సాధించలేనిది ఏదీ ఉండదు. చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించడం ద్వారా శారీరక, మానసిక దృఢత్వం పెరుగుతుంది. – ఒలింపిక్స్ జాతీయ చాంపియన్ (స్ప్రింటింగ్) జ్యోతిక శ్రీదండి -
కాంస్యం కోసం ఆఖరి పోరు
పారిస్: భారీ అంచనాలతో పారిస్ ఒలింపిక్స్ బరిలోకి దిగి ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయిన భారత పురుషుల హాకీ జట్టు.. గురువారం కాంస్య పతకం కోసం స్పెయిన్‌తో తలపడనుంది. టోర్నీ ఆరంభం నుంచి చక్కటి ఆటతీరు కనబర్చిన హర్మన్‌ప్రీత్ సింగ్ సారథ్యంలోని టీమిండియా.. మంగళవారం సెమీఫైనల్లో జర్మనీ చేతిలో ఓడి కాంస్య పతక పోరుకు చేరింది. మూడేళ్ల క్రితం జరిగిన టోక్యో ఒలింపిక్స్‌లోనూ భారత్ కాంస్య పతకమే సాధించగా... వరుసగా రెండోసారి పోడియంపై నిలిచే అవకాశం టీమిండియా ముందుంది. జర్మనీతో సెమీఫైనల్లో భారత్ హోరాహోరీగా పోరాడి ఓడగా... మరో సెమీస్‌లో నెదర్లాండ్స్ చేతిలో స్పెయిన్ పరాజయాం పాలైంది. బ్రిటన్‌తో క్వార్టర్ ఫైనల్ సందర్భంగా ‘రెడ్ కార్డు’కు గురై సెమీస్‌కు అందుబాటులో లేకుండా పోయిన డిఫెండర్ అమిత్ రోహిదాస్... ఈ మ్యాచ్‌లో ఆడనుండటం భారత్‌కు సానుకూలాంశం. జర్మనీతో పోరులో పెనాల్టీ కార్నర్ అవకాశాలను సది్వనియోగ పర్చుకోలేకపోయిన భారత్.. ఆ విషయంలో మరింత మెరుగవ్వాల్సిన అవసరం ఉంది. ఇక ఈ టోరీ్నతో కెరీర్‌కు వీడ్కోలు పలుకనున్న గోల్‌కీపర్ పీఆర్ శ్రీజేశ్ మరోసారి కీలకం కానున్నాడు. ‘సెమీస్ పరాజయం చాలా బాధించింది. పసిడి నెగ్గే సువర్ణ అవకాశం చేజారింది. అయితే ఆ ఓటమిని మరిచి కాంస్య పతక పోరుపై దృష్టి పెట్టాం. దేశానికి పతకం అందించేందుకు ఇదే చివరి అవకాశం. అందుకే ప్రతి ఆటగాడు దీన్ని వినియోగించుకోవాలని అనుకుంటున్నాడు’అని శ్రీజేశ్ అన్నాడు. ఒలింపిక్స్ వేదికగా స్పెయిన్‌తో భారత్ పది సార్లు తలపడగా.. అందులో ఏడింట గెలిచింది. ఒక మ్యాచ్ స్పెయిన్ నెగ్గగా.. మరో రెండు ‘డ్రా’గా ముగిశాయి. -
Paris Olympics 2024: నీరజ్ వస్తున్నాడు
పారిస్: భారీ అంచనాలతో పారిస్ ఒలింపిక్స్‌లో అడుగు పెట్టిన ఒలింపిక్ డిఫెండింగ్ చాంపియన్, భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా మంగళవారం క్వాలిఫయింగ్ బరిలోకి దిగనున్నాడు. 2020 టోక్యో ఓలింపిక్స్లో నీరజ్ పసిడి పతకం సాధించి దేశ అథ్లెటిక్స్ చరిత్రలో కొత్త అధ్యాయానికి నాంది పలికాడు. ‘పారిస్’లోనూ టోక్యో ప్రదర్శనను పునరావృతం చేయాలని పట్టుదలతో ఉన్నాడు. టోక్యో విశ్వ క్రీడల తర్వాత అంతర్జాతీయ స్థాయిలో నిలకడైన ప్రదర్శన కొనసాగించిన 26 ఏళ్ల నీరజ్ గత ఏడాది ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం సాధించి విశ్వవిజేతగా నిలిచాడు. ‘పారిస్’ నుంచి కూడా పతకంతో తిరిగి వస్తాడని యావత్ భారతావని ఆశలు పెట్టుకోగా... వాటిని అందుకోవడమే లక్ష్యంగా నేడు నీరజ్ మైదానంలో అడుగు పెట్టనున్నాడు. గాయాల బారిన పడకుండా ఉండేందుకు ఆచితూచి టోరీ్నల్లో పాల్గొన్న 26 ఏళ్ల నీరజ్.. ఈ ఏడాది బరిలోకి దిగిన మూడు టోరీ్నల్లోనూ ఆకట్టుకున్నాడు. ఈ విభాగంలో భారత్ నుంచి నీరజ్ చోప్రాతోపాటు.. కిశోర్ కుమార్ జేనా కూడా పోటీ పడుతున్నాడు. రెండు గ్రూప్‌ల్లో కలిపి మొత్తం 32 మంది త్రోయర్లు బరిలోకి దిగుతున్నారు. గ్రూప్ ‘బి’లో నీరజ్... కిశోర్ గ్రూప్ ‘ఎ’లో ఉన్నారు. ఫైనల్ చేరడానికి అర్హత ప్రమాణంగా 84 మీటర్లు నిర్ణయించారు. క్వాలిఫయింగ్ రౌండ్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన 12 మంది ఫైనల్‌కు అర్హత సాధించనున్నారు. ఒకవేళ 12 మంది కంటే ఎక్కువ మంది 84 మీటర్లను దాటి జావెలిన్‌ను విసిరితే ఇందులో నుంచి టాప్–12 మందికి ఫైనల్ బెర్త్‌లు లభిస్తాయి. ఫైనల్ గురువారం జరుగుతుంది. పాకిస్తాన్ త్రోయర్ నదీమ్ అర్షద్, జాకబ్ వాద్లెచ్ (చెక్ రిపబ్లిక్), వెబర్ (జర్మనీ), ఒలీవర్ (ఫిన్లాండ్) నుంచి నీరజ్‌కు ప్రధాన పోటీ ఎదురయ్యే అవకాశాలున్నాయి. నీరజ్ టైటిల్ నిలబెట్టుకుంటే.. ఒలింపిక్స్‌లో ఆ ఘనత సాధించిన ఐదో జావెలిన్ త్రోయర్ కానున్నాడు. విశ్వక్రీడల చరిత్రలో ఎరిక్ లామింగ్ (స్వీడన్; 1908, 1912), జానీ మైరా (ఫిన్లాండ్; 1920, 1924), జాన్ జెలెన్జీ (చెక్ రిపబ్లిక్; 1992, 1996, 2000), ఆండ్రీస్ థోర్కిల్డ్సెన్ (నార్వే; 2004, 2008) స్వర్ణాన్ని నిలబెట్టుకున్నారు. -
రామ్ చరణ్‌తో పీవీ సింధు.. పారిస్ ఒలింపిక్స్‌లో అరుదైన దృశ్యం!
పారిస్ ఒలింపిక్స్‌లో మెగా ఫ్యామిలీ సందడి చేస్తోంది. గేమ్స్ ప్రారంభానికి ముందే పారిస్ చేరుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి దంపతులు, రామ్ చరణ్, ఉపాసన, క్లీంకారతో పాటు బయలుదేరి వెళ్లారు. ప్రారంభ వేడుకల్లోనూ ఒలింపిక్ జ్యోతి పట్టుకుని చిరంజీవి, సురేఖ కనిపించారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి.తాజాగా పారిస్ వీధుల్లో రామ్ చరణ్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు కలిసి ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకున్నారు. వారిద్దరూ సరదాగా ముచ్చటిస్తున్న వీడియో నెట్టింట వైరలవుతోంది. అనుకోకుండా రామ్ చరణ్, సింధు కలుసుకోవడం చెర్రీ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. చెర్రీ పెట్ డాగ్ రైమ్ గురించి సింధు ఆరాతీస్తూ కనిపించింది. ఎక్కడికెళ్లినా రైమ్‌ను తీసుకెళ్తారా? అంటూ రామ్ చరణ్ అడిగింది. సింధు ఆటతీరుని ప్రశంసిస్తూ ఆమె రాబోయే మ్యాచుల్లో అద్భుతంగా రాణించాలని కోరుతూ రైమ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేశారు. కాగా.. పీవీ సింధు ఇవాళ తన తొలి విజయాన్ని నమోదు చేసింది. View this post on Instagram A post shared by Rhyme Konidela (@alwaysrhyme) -
పారిస్‌లో స్టార్స్
సాక్షి, హైదరాబాద్: పారిస్ వేదికగా ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైన 2024 ఒలింపిక్ పోటీలకు దేశం నుంచి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ పోటీలను తిలకిచడానికి నగరం నుంచి మెగాస్టార్ చిరంజీవి కుటుంబ సమేతంగా పారిస్ వెళ్లారు. కుటుంబ సభ్యులు సురేఖ, రామ్‌చరణ్, ఉపాసనతో పాటు మనుమరాలు క్లీంకారతో తీసుకున్న ఫొటోలను సోషల్ యాప్‌లో పోస్ట్ చేస్తూ సంతోషాన్ని వ్యక్తపరిచారు. ప్రముఖ వ్యాపారవేత్త, ఫ్యాషన్ ఐకాన్ సుధారెడ్డి కూడా పారిస్ ఒలింపిక్స్‌లో మెరిశారు. అయితే 117 మందితో కూడిన భారత ఒలింపిక్ క్రీడాకారుల బృందంలో నగరం నుంచి నలుగురు మహిళా అథ్లెట్లు పాల్గొంటున్నారు. అంతేకాకుండా భారత జాతీయ ఫ్లాగ్ బేరర్‌గా తెలుగమ్మాయి పీవీ సింధూ నాయకత్వం వహించడం విశేషం. జాతీయ జెండా రంగులతో రూపొందించిన చీరతో పీవీ సింధూ షేర్ చేసిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. -
నిశాంత్ దేవ్‌కు పారిస్ ‘టికెట్’
బ్యాంకాక్: భారత బాక్సర్ నిశాంత్ దేవ్ పారిస్ విమానం ఎక్కనున్నాడు. ప్రతిష్టాత్మక విశ్వ క్రీడలకు అతను అర్హత సంపాదించాడు. మెగా ఈవెంట్‌కు ఆఖరి అర్హత టోర్నీ అయిన ‘వరల్డ్ ఒలింపిక్ క్వాలిఫయర్స్’లో నిశాంత్ పురుషుల 71 కేజీల విభాగంలో సెమీఫైనల్ చేరడం ద్వారా బెర్త్ దక్కించుకున్నాడు. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో అతను 5–0తో వాసిల్ సె»ొటరి (మాల్దొవా)పై ఏకపక్ష విజయం సాధించాడు. మహిళల 60 కేజీల క్వార్టర్స్‌లో అంకుశిత 2–3తో అగ్నెస్ (స్వీడన్) చేతిలో ఓడి... అరుంధతి 1–4తో జెస్సికా (స్లొవేకియా) చేతిలో ఓడి ఒలింపిక్స్‌కు దూరమయ్యారు. పురుషుల 51 కేజీల ప్రిక్వార్టర్స్‌లో భారత స్టార్ బాక్సర్ అమిత్ పంఘాల్ 5–0తో కిమ్ ఇంక్యూ (కొరియా)పై గెలిచి ‘పారిస్’కు అడుగు దూరంలో ఉన్నాడు. 57 కేజీల క్వార్టర్స్‌లో సచిన్ సివాచ్ 4–1 తో శామ్యూల్ కిస్తోహరీ (ఫ్రాన్స్)పై గెలిచి సెమీస్ చేరాడు. ఈ వెయిట్ కేటగిరీలో మూడు బెర్త్‌లు మాత్రమే ఉండటంతో సచిన్ ఫైనల్ చేరాలి లేదంటే ‘బాక్స్ ఆఫ్’ బౌట్లో గెలిస్తే పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తాడు. పురుషుల 92 కేజీల విభాగం ప్రిక్వార్టర్ ఫైనల్లో భారత బాక్సర్ సంజీత్ 0–5తో అల్ఫోన్సో (అజర్బైజాన్) చేతిలో ఓడిపోయాడు. -
ఫ్రాన్స్‌లో నల్లుల నకరాలు.. ఒలింపిక్ ఆటగాళ్ల ఒళ్లు గుల్లే?
నల్లులు జాతీయ సమస్యగా మారనున్నాయా? అని ఫ్రెంచి వారిని అడిగితే ‘అవును’ అనే సమాధానం ఇవ్వనున్నారు. ప్రస్తుతం పారిస్ బెడ్‌బగ్స్ (నల్లులు)తో తీవ్రంగా ఇబ్బందులు పడుతోంది. ఇక్కడి మెట్రో, విమానాశ్రయం, సినిమా హాళ్లు, హోటళ్లు ఇలా ప్రతిచోటా నల్లులు నక్కి ఉంటున్నాయి. పారిస్‌లో నల్లుల సమస్య తీవ్రంగా మారడంతో అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపధ్యంలో అధికారులు అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. నల్లులను ప్రజలంతా తరిమికొట్టాలంటూ ప్రత్యేక ప్రచారాన్ని ప్రారంభించారు. మంత్రులంతా దీనిపై హడావుడిగా ప్రకటనలు జారీ చేస్తున్నారు. ఫ్రాన్స్ 2024లో ఒలింపిక్ క్రీడలను నిర్వహిస్తోంది. ఇటువంటి పరిస్థితిలో విదేశీ ఆటగాళ్లు నల్లులకు బలికాకుండా చూసుకోవడం ప్రభుత్వం ముందున్న అతిపెద్ద సవాలు. రాజధాని ప్యారిస్‌తో పాటు చుట్టుపక్కల గ్రామాలకు కూడా నల్లుల బెడద సోకింది. పొంచివున్న ప్రమాదం నుంచి ఇక్కడివారు ఎవరూ సురక్షితంగా లేరని పారిస్ డిప్యూటీ మేయర్ ఇమ్మాన్యుయేల్ గ్రెగోయిర్ తెలిపారు. ఆయన ఒక పత్రికా ప్రకటనలో ప్రజలనుఉద్దేశించి ‘మీరు ఎప్పుడైనా నల్లుల బారిన పడవచ్చు. అవి మిమ్మల్ని తాకినప్పుడు, అవి మీతో పాటు మీ ఇంటికి వస్తాయి’ అని హెచ్చరించారు. అలాగే గ్రెగోయిర్ ఫ్రాన్స్ స్టేట్ రేడియో సర్వీస్ ‘ఫ్రాన్స్ ఇన్ఫో’తో మాట్లాడుతూ ‘నల్లుల వల్ల వచ్చే వ్యాధుల చికిత్సను బీమా పాలసీలో చేర్చాలి. ఇది బెడ్‌బగ్ బారిన పడి అనారోగ్యానికి గురవుతున్న వారికి ఉపశమనం కల్పిస్తుంది. ఈ సమస్యను అధిగమించేందుకు ప్రభుత్వం శాయశక్తులా కృషి చేస్తున్నదని’ ఆయన మీడియాకు తెలిపారు. మూడేళ్ల కిందట కూడా ఇదేవిధంగా నలుల్ల బెడద దాపురించింది. వెంటనే స్పందించిన ఫ్రెంచ్ ప్రభుత్వం తన ప్రత్యేక వెబ్సైట్, సమాచార హాట్‌లైన్ సాయంతో యాంటీ-బెడ్‌బగ్ ప్రచారాన్ని ప్రారంభించింది. ఇటీవల మెట్రోలో బెడ్‌బగ్‌లు కనిపించిన నేపధ్యంలో ప్రయాణికులు సీట్లలో కూర్చోవడం మానేశారు. పారిస్ సిటీ హాల్ సభ్యులు ఈ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రధాన మంత్రి ఎలిసబెత్ బోర్న్‌కు లేఖ కూడా రాశారు. 1950లో ఫ్రాన్స్‌లో ఇదే విధమైన నల్లుల సమస్య తీవ్రంగా కనిపించింది. అయితే ఆ తర్వాత కొన్ని రోజులకు నల్లులు మాయమయ్యాయి. అయితే ఇప్పుడు హఠాత్తుగా నల్లుల సంఖ్య విపరీతంగా పెరిగింది. నల్లులు కుట్టడం వలన డిప్రెషన్, యాంగ్జయిటీ తదితర వ్యాధులు వస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. స్కిన్ ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం కూడా ఉందని హెచ్చరిస్తున్నారు. -
భారత్‌కు మరో ఒలింపిక్ బెర్త్
ప్రపంచ షూటింగ్ చాంపియన్‌షిప్ మహిళల ట్రాప్ ఈవెంట్లో భారత షూటర్ రాజేశ్వరి కుమారి ఐదో స్థానంలో నిలిచింది. అజర్బైజాన్ రాజధాని బాకులో జరుగుతున్న ఈ టోర్నీలో ఆరుగురు షూటర్లు పోటీపడ్డ ఫైనల్లో రాజేశ్వరి 19 పాయింట్లు సాధించింది. రాజేశ్వరి ప్రదర్శనతో భారత్‌కు ఈ విభాగంలో పారిస్ ఒలింపిక్స్ బెర్త్ ఖరారైంది. ఇప్పటివరకు షూటింగ్ క్రీడాంశంలో భారత్‌కు ఏడు ఒలింపిక్ బెర్త్‌లు లభించాయి. -
అడివి శేష్‌కు ఛాలెంజ్ విసిరిన హైదరాబాద్ సీపీ
జూన్ 23న ఒలింపిక్‌డే సందర్భంగా హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ పలువురి సెలబ్రిటీలకు ఇలా ఛాలెంజ్ విసిరారు. 'మన జీవితాలు ఎప్పుడూ ఆందోళనకరమైనవిగానే కొనసాగుతాయి. మునుపెన్నడూ లేనంత వేగంగా కదులుతున్న ఈ ప్రపంచంలో, ప్రజలు మాత్రం శారిరక వ్యాయామం లేకుండా ఉండటం చూస్తుంటే కలవరపెడుతుంది. అంతేకాకుండా చాలా ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే, పిల్లలు, యువకులు తమ సెల్ ఫోన్లతో పాటు ఇతర డిజిటల్ గాడ్జెట్లకు అంకితమవుతున్నారు. అవి వారిని కట్టిపడేశాయి. దాంతో వారు అస్సలు కదలరు.' అని తెలిపారు. (ఇదీ చదవండి: పెద్ద కూతురి కోసం చిరంజీవి సంచలన నిర్ణయం!) ఈ ఒలింపిక్‌డే నుంచి అయినా వారిని మేలుకొల్పాలని తను వ్యాయామం చేసిన వీడియోను మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్,పీవీ సింధు, యాక్టర్ అడివి శేష్, నిఖల్‌కు ట్యాగ్ చేసి, ఇలాంటి వర్కౌట్స్ చేయాలని వారికి ఛాలెంజ్ విసిరారు. తాజాగా సినీ నటుడు అడివి శేష్ చేసిన వ్యాయామం వీడియోను సీపీ ఆనంద్‌కు షేర్ చేశాడు. త్వరలో మరింత ఫిట్నెస్తో తమను రీచ్ అవుతానని ఆయన అన్నాడు. (ఇదీ చదవండి: రానా నాయుడులో దుమ్ములేపిన భామ గురించి ఈ విషయాలు తెలుసా?) అందుకు తిరిగి సీపీ ఆనంద్ ఇలా అన్నారు. 'ఛాలెంజ్‌ను స్వీకరించినందుకు ధన్యవాదాలు అడివి శేష్ ! మీ నిమాల్లో స్మార్ట్ లుక్‌తో ఉంటారు. నేను పోటీ పడలేను, అంతే కాదు కష్టం కూడా' అని సీపీ ఆనంద్ అన్నారు. Hi @VVSLaxman281 @pvsindhu1 @AdiviSesh @actor_Nikhil Pl do share your workout videos as it’ll inspire everyone to do some physical activity. https://t.co/4GhSD3mvaT— CV Anand IPS (@CVAnandIPS) June 24, 2023 Taking up your offer @CVAnandIPS sir🫡 Heres one of my home workout videos 🙏🏼I believe in natural training and a healthy lifestyle, just like you. Hopefully, I can match your fitness soon! ❤️ https://t.co/Jcui8Vv5Ig pic.twitter.com/7wLZ4vSIc2— Adivi Sesh (@AdiviSesh) June 24, 2023 -
ఉక్రెయిన్ దళంలో చేరిన ఒలింపిక్ షూటర్
Olympic Star Shooter Joins Ukraine Forces: ఉక్రెనియన్ చాంపియన్ షూటర్ క్రిస్టినా డిమిత్రెంకో తన మాతృభూమి రక్షణ కోసం ఉక్రెయిన్ బలగంలో చేరింది. ఆమె 2016 యూత్ ఒలింపిక్ గేమ్స్‌లో బయాథ్లాన్‌లో స్వర్ణం గెలుచుకుందిలో స్వర్ణ పతకం గెలుచుకుంది. బయాథ్లాన్ అనేది స్కీయింగ్, రైఫిల్ షూటింగ్‌లను మిళితం చేసే క్రీడ. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆమె ఉక్రెయిన్‌కు పశ్చిమాన ఉన్న కార్పాతియన్ పర్వతాలలో అంతర్జాతీయ పోటీ కోసం ప్రాక్టీసు చేస్తోంది. అంతేగాదు క్రిస్టినా ఫిబ్రవరి 27న స్విట్జర్లాండ్‌కు వెళ్లి ఇటలీతో పోటీపడాల్సి ఉంది. ఆమె కీవ్, చెర్నిహివ్‌లలో రష్యా బలగాల విధ్వంసాన్ని తెలుసుకుని ఉక్రెనియన్ యుద్ధంలో చేరాలని నిర్ణయించుకుంది. అంతేగాదు యుద్ధంలో పాల్గొని ఆయుధాలను చేతపట్టడానికి కూడా అర్హత సాధించింది. క్రీస్టినా ఇలాంటి పరిస్థితి ఒకటి తన జీవితంలో ఎదరవుతుందని తాను ఊహించలేదని చెప్పింది. పైగా తనకు శత్రువంటే భయం లేదని, వాళ్లకసలు అవకాశం ఇవ్వకుండా దాడి చేస్తానని చెబుతోంది. అంతేగాదు ఆటలో ఉన్న యుద్ధంలో ఉన్నా చివరి వరకు ఉంటానిని విజయం మనదేనని విశ్వాసం వ్యక్తం చేసింది. అదీగాక ఉక్రేనియన్ దళాలు రష్యా దళాలను ఖార్కివ్ నుంచి వెనక్కి మళ్లేలా బలవంతం చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఉక్రేనియన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్ స్కీ కూడా డాన్బాస్ ప్రాంతంలో పరిస్థితి చాలా కష్టంగా ఉందని, రష్యా దళాలు ఏదోరకంగా దురాక్రమణ చేసేందుకు యత్నిస్తున్నట్లు చెప్పారు. (చదవండి: పుతిన్ అనారోగ్యం.. నయం చేయలేనంత రోగమా?) -
భారత్ కు మరో అరుదైన గౌరవం, హర్షం వ్యక్తం చేసిన నీతా అంబానీ!!
40 ఏళ్ల తర్వాత భారత్‌కు మరో అరుదైన గౌరవం లభించింది. వచ్చే ఏడాది ముంబాయిలో అంతర్జాతీయ ఒలంపిక్స్ కమిటీ 2023 సెషన్ ను నిర్వహించేందుకు భారత్ హక్కుల దక్కించుకుంది. ఈ సెషన్ ను 1863లో ఢిల్లీలో నిర్వహించారు. మళ్లీ వచ్చే ఏడాది ముంబైలో సెషన్ నిర్వహించడంపై రిలయన్స్ ఫౌండేషన్ చైర్మన్, అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) సభ్యురాలు నీతా అంబానీ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నీతా అంబానీ మాట్లాడుతూ.. ఇన్నేళ్ల నిరీక్షణ తర్వాత భారత్‌లో సెషన్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ అరుదైన గౌరవాన్ని భారత్‌కు అందించినందుకు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీకి కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాదు ఈ గౌరవం భారతదేశ ఒలింపిక్ ఆకాంక్షలకు గణనీయమైన అభివృద్ధికి సంకేతమనీ నీతా అంబానీ అభిప్రాయం వ్యక్తం చేశారు. -
మీరు ఆడండి.. మేము అండగా ఉంటాం.. ‘టోక్యో’తో మారిన సీన్!
టోక్యో ఒలింపిక్స్ భారత క్రీడా ముఖ చిత్రాన్ని మార్చనున్నాయా? క్రికెట్‌తో పాటు ఇతర క్రీడలకు కార్పోరేటు దన్ను విస్తరించనుందా? ఆటగాళ్లకు మెరుగైన సౌకర్యాలు, శిక్షణ లభించనున్నాయా అంటే అవుననే సమాధానం వస్తోంది. సాక్షి, వెబ్‌డెస్క్: అనేక అనుమానాల మధ్య మొదలైన టోక్యో ఒలింపిక్స్ భారత క్రీడలపై భారీ ప్రభావం చూపింది. ఆరంభంలో అపజయాలు పలకరించినా విశ్వ క్రీడల చివరల్లో భారత ఆటగాళ్లు చూపిన తెగువ, పోరాడిన తీరు ఇండియన్ల మనసుపై చెరగని ముద్రని వేశాయి. గట్టి ప్రోత్సాహం లభిస్తే మన ఆటగాళ్లు విశ్వవేదికలపై మరింత మెరుగైన ప్రదర్శన, పతాకలు తేవడం గ్యారంటీ అనే భరోసా ఇచ్చాయి. దీంతో ఆటగాళ్లకు మెరుగైన శిక్షణ, వసతులు కల్పించడంతో పాటు ఆర్థికంగా అండగా ఉండేందుకు కార్పోరేటు కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి. ప్రైవేటు రంగంలో కోచింగ్ సెంటర్లు ఒలింపిక్ క్రీడల్లో అథ్లెటిక్స్ విభాగంలో అప్పుడెప్పుడో రన్నింగ్ రేసులో పీటీ ఉష పతకం ఆశలు రేపగా దాదాపు నలభై ఏళ్లకు జావెలిన్ త్రోలో నీరజ్ చోప్డా ఆ కలను నిజం చేశాడు. రెజ్లింగ్‌లో భజరంగ్ పునియా రజతంతో మెరిశాడు. అయితే వీరిద్దరు ఒలింపిక్స్‌కి ముందు ఇన్స్పైర్ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ (ఐఐఎస్)లో శిక్షణ పొందారు. ఇండియా నుంచి ఒలింపిక్స్‌లో పోటీ పడుతున్న క్రీడాకారులకు అత్యుత్తమ శిక్షణ ఇచ్చేందుకు ఐఐఎస్ పని చేస్తోంది. దీనికి ఆర్థిక సహకారాన్ని జిందాల్ ఇండస్ట్రీస్‌తో పాటు కోటక్ గ్రూప్, ఇండస్ఇండ్, సిటీబ్యాంక్, బ్రిడ్జిస్టోన్, బోరోసిల్ ఇలా మొత్తం 20కి పైగా కార్పోరేట్ కంపెనీలు ఆర్థిక సాయం అందిస్తున్నాయి. ప్రభుత్వ పరంగా కాకుండా క్రీడాకారులకు అత్యుత్తమ శిక్షణ ఇచ్చే ప్రైవేటు ఇన్సిస్టి్యూట్గా ఐఐఎస్ పేరు మార్మోగిపోతుంది. పెరుగుతున్న ఫండింగ్ ఐఐఎస్‌లో శిక్షణ తీసుకున్న ఇద్దరు ఒలింపిక్ పతకాలు తేవడంతో ఈ ఏడాది ఐఐఎస్‌కు తమ ఫండింగ్‌ను 40 శాతం పెంచుతామంటూ జేఎస్‌డబ్ల్యూ సిమెంట్స్ ఎండీ పార్థ్ జిందాల్ ప్రకటించారు. తమలాగే రిలయన్స్, ఆదానీ, టాటాలు కూడా పెంచే అవకాశం ఉందంటూ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ విషఁంలో రిలయన్స్ ఒక అడుగు ముందుకు వేసి గోస్పోర్ట్స్ ఫౌండేషన్ పేరుతో ఎన్జీవోని నిర్వహిస్తోంది. కంపెనీలకు అవసరమే మనదేశంలో క్రికెట్‌కి క్రేజ్ ఎక్కువ. బ్రాండ్ ప్రచారం చేసుకోవాలన్నా క్రికెట్ ప్రధానంగా అయ్యింది. అయితే క్రికెట్ స్సాన్సర్షిప్, ఆటగాళ్ల ఎండార్స్మెంట్ ఫీజులు కోట్లలో ఉంటున్నాయి. వీటిని దక్కించుకోవాలంటే భారీగా ఖర్చు చేయాల్సి వస్తోంది. దీంతో ఇతర క్రీడలను ప్రోత్సహించడం అనివార్యత ఎప్పటి నుంచో ఉంది. ఎడిల్‌వైస్ కంపెనీ అయితే 2008 నుంచి ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్ (ఏజీక్యూ) పేరుతో ప్రత్యేకంగా ఫండ్ ఏర్పాటు చేసి శిక్షణ ఇస్తోంది. అయితే దేశం మొత్తం గుర్తించి... సెలబ్రేట్ చేసుకునే స్థాయిలో ఆటగాళ్ల నుంచి విజయాలు రాలేదు. ఒలింపిక్ చరిత్రలోనే ఈసారి ఇండియాకు అత్యధిక పతకాలు వచ్చాయి. దీంతో మెరుగైన ఆటగాళ్లకు స్పాన్సర్ చేసేందుకు ఒలింపిక్ అసోసియేషన్‌తో ఎడిల్‌వైస్ కంపెనీ చర్చలు ప్రారంభించింది. పీపీపీ మోడ్ ఒడిషా, టాటా గ్రూపులు సంయుక్తంగా పబ్లిక్, ప్రైవేటు పార్ట్నర్షిప్లో పురుష, మహిళా హకీ జట్లను స్పాన్సర్షిప్ అందించాయి. నలభై ఏళ్ల తర్వాత పురుషుల హాకీ జట్టు కాంస్య పతకం సాధించగా మహిళల జట్టు తృటిలో పతకాన్ని కోల్పోయినా స్ఫూర్తిదాయక ఆటతీరుని కనబరిచింది. దీంతో పీపీపీ మోడ్‌లో ఆటగాళ్లకు అండగా నిలించేందుకు రియలన్స్, జిందాల్‌లు ముందుకు వచ్చాయి. అథ్లెటిక్స్‌కి రిలయన్స్ స్పాన్సర్ చేస్తుండగా స్విమ్మింగ్‌కి చేదోడుగా ఉండేందుకు జిందాల్ అంగీకారం తెలిపింది. ఒడిషా తరహాలో ఒక్కో రాష్ట్రం ఒక్కో క్రీడకు అండగా నిలిస్తే విశ్వపోటీల్లో ఇండియా ప్రదర్శన మరో స్థాయిలో ఉంటుందని జిందాల్ స్పోర్ట్స్ హెడ్ వినీల్ కార్నిక్ తెలిపారు. -
ఒలింపిక్స్‌లో కరోనా వివాదం
దశలు.. వేరియెంట్ల వారీగా కరోనా మనుషుల మీద విరుచుకుపడుతోంది. ఇద్దరు దగ్గరగా ఉంటేనే వైరస్ సోకుతుందేమోనన్న భయం వెంటాడుతోంది. అలాంటిది వేల మంది ఆటగాళ్లతో జపాన్ ఎందుకు ఒలింపిక్స్ నిర్వహించాలనుకుంటోంది. మరోవైపు ఒలింపిక్స్ వాయిదా వేయాలంటూ అంతర్జాతీయ సమాజం నుంచి ఒత్తిడి వస్తోంది. దీంతో ఒలింపిక్స్ నిర్వాహణపై సర్వత్రా ఆసక్తితో పాటు ఆందోళన కూడా నెలకొంది. -
ఒలింపిక్ మాజీ జిమ్నాస్టిక్స్ కోచ్ ఆత్మహత్య!
వాషింగ్టన్: అమెరికాలో ఒలింపిక్ మాజీ జిమ్నాస్టిక్స్ కోచ్ ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం సృష్టించింది. లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో జాన్ గెడ్డార్ట్ గురువారం బలవన్మరణానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. గతంలో ఒలింపిక్ జిమ్నాస్టిక్స్ కోచ్‌గా పని చేసిన గెడ్డార్ట్ మిచిగన్‌లో మహిళా జిమ్నాస్ట్ సెంటర్‌ను నిర్వహిస్తున్నాడు. ఇందులో లారీ నాసర్ డాక్టర్‌గా పని చేస్తున్నాడు. అనేక మంది మహిళలు జిమ్నాస్టిక్ శిక్షణ కోసం ఈ సెంటర్‌కు తరలి వచ్చేవారు. అయితే గెడ్డార్ట్, నాసర్ అక్కడి మహిళా జిమ్నాస్ట్‌లను లైంగికంగా వేధించడంతో పాటు, మానసికంగా హింసించేవారని నాసల్ అనే వ్యక్తి ఇటీవల సంచలన ఆరోపణలు చేశారు. నాసల్ చేసిన ఆరోపణల మేరకు కేసును నమోదు చేసుకున్న పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. లైంగిక వేధింపులకు గురైన వారిలో ఎక్కువగా 13, 16 సంవత్సరాల లోపు వయసువారే అని మిచిగాన్ అటార్నీజనరల్ డెనా నిసెల్ తెలిపారు. గెడ్డార్ట్, నాసర్‌లు తన కూతురిని కూడా లైంగికంగా వేధించారని ఒక జిమ్నాస్టిక్ ట్రైనీ తల్లి ఆరోపించింది. దీంతో తీవ్ర ఒత్తిడికి గురైన జాన్ గెడ్డార్ట్ ఆత్మహత్య చేసుకున్నట్టుగా తెలుస్తోంది. కాగా గెడ్డార్ట్ తనను లైంగికంగా వేధించాడని మాజీ జిమ్నాస్ట్ రాచెల్ డెస్హోలాండర్ 2000 సంవత్సరంలోనే సోషల్ మీడియా వేదికగా ఆరోపించించిన విషయం తెలిసిందే. చదవండి: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. కుప్పలుగా తల్లో పేలు! -
టి10 లీగ్‌ను ఒలింపిక్స్‌లో చేరిస్తే బాగుంటుంది
జమైకా: ఒలింపిక్స్‌కి టి10 ఫార్మాట్ క్రికెట్ సెట్ అవుతుందని విండీస్ విధ్వంసకర ఆటగాడు క్రికెట్ క్రిస్ గేల్ అభిప్రాయపడ్డాడు. ఈ విషయాన్ని శుక్రవారం ట్విట్టర్ ఈ విషయాన్ని పోస్ట్ చేశాడు. టి 10 ఫార్మాట్ అయితే కేవలం 90 నిమిషాల్లోనే మ్యాచ్ పూర్తయి ఫలితం వస్తుందన్నాడు. అదే టీ20 ఫార్మాట్ అయితే ఒక్కో మ్యాచ్ ముగిసేందుకు కనీసం 3గంటల సమయం పట్టవచ్చన్నాడు. సమయాభావంతోనే క్రికెట్‌కు ఒలింపిక్స్‌లో చోటు దక్కలేదని, అమెరికాలోనూ ఇటీవల టి10 లీగ్ జరగడంతో అక్కడా క్రికెట్‌కు ఆదరణ లభిస్తోందని గేల్ తన అభిప్రాయాన్ని తెలిపాడు. ఎనిమిది జట్ల మధ్య అబుదాబి టి10 లీగ్ జనవరి 28నుంచి జరగనుండగా.. క్రిస్ గేల్ అబుదాబి జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. -
ఒలింపిక్స్ నుంచి రష్యా ఔట్
జెనీవా : కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (కాస్) గురువారం రష్యాపై రెండేళ్ల నిషేధం విధించింది. దీని ప్రకారం రానున్న రెండు ఒలింపిక్స్ క్రీడల్లో లేదా రెండు ప్రపంచ చాంపియన్‌షిప్ ఈవెంట్లలో రష్యా దేశానికి ప్రాతినిధ్యం ఉండదు. ఆ దేశం తరఫున ఎవరూ పాల్గొనడానికి వీల్లేదు. అంతేకాకుండా రెండేళ్ల పాటు ఎలాంటి క్రీడల ఆతిథ్య హక్కుల కోసం రష్యా బిడ్డింగ్‌లో పాల్గొనకూడదు. అయితే డోపింగ్‌తో సంబంధం లేనట్లు నిరూపించుకునే రష్యా ఆటగాళ్లు వచ్చే ఏడాది జరుగనున్న టోక్యో ఒలింపిక్స్, 2022 బీజింగ్ వింటర్ గేమ్స్, ప్రపంచ చాంపియన్‌షిప్స్ టోర్నీల్లో తమ దేశం తరఫున కాకుండా ‘న్యూట్రల్’ అథ్లెట్లుగా పాల్గొనేందుకు అనుమతిచి్చంది. -
పోలియోను గెలిచి... ఒలింపిక్ వరకు పరుగు
పసితనంలోనే ఆమెకు పోలియో సోకింది. ఇక నడవడం కష్టమే అని డాక్టర్లు తేల్చేశారు. ఆపై మశూచి మహమ్మారి కూడా ఆమెను వదల్లేదు. ఇక కోలుకున్నట్లుగా అనిపించిన సమయంలో న్యుమోనియా దాడి చేసింది. ఒకదశలో బతకడం కూడా కష్టమని అనిపించింది. పదేళ్లు వయసు కూడా దాటక ముందే ఇలాంటి గండాలను ఎదుర్కొనే పిల్లల భవిష్యత్తు సాధారణంగా ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. పైగా 22 మంది పిల్లల కుటుంబంలో ఆమె 20వ సంతానం. శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా వారిపై ఇవన్నీ ప్రభావం చూపిస్తాయి. కానీ విల్మా రుడాల్ఫ్ విధిని ఎదిరించింది. కష్టాలను అధిగమించి ఒలింపిక్ చాంపియన్‌గా నిలిచింది. నల్ల జాతీయుల ప్రతినిధిగా వారికి స్ఫూర్తిగా నిలిచింది. పరుగు, పరుగు, పరుగు... విల్మా గ్లాడియాన్ రుడాల్ఫ్ జీవితకాలం ఇష్టపడిన మంత్రం! కొత్తగా రెక్కలొచ్చిన పక్షికి ఎగరాలనే కోరిక ఎంత బలంగా ఉంటుందో బహుశా అదే ఆమెకు స్ఫూర్తినందించి ఉండవచ్చు. ఎందుకంటే పోలియో బారిన పడిన తర్వాత నడవలేనేమో అనుకున్న దశ నుంచి ఆమె కొంత కోలుకుంది. అయితే ఎడమ కాలు బాగా బలహీనంగా మారిపోయింది. కానీ సుదీర్ఘ చికిత్స తర్వాత 12 ఏళ్ల వయసు వచ్చేసరికి ఆమె పాదాల్లో చురుకుదనం వచ్చింది. అంతే...ఆ తర్వాత నడకే కాదు పరుగునే విల్మా ప్రాణంగా మార్చుకుంది. కోచ్ దృష్టిలో పడి... పాఠశాల స్థాయిలో విల్మా బాస్కెట్‌బాల్ ఆడేది. ఆమె చురుకుదనం, వేగంతో స్కూల్ టీమ్‌కు పలు విజయాలు అందించింది. అదే సమయంలో విల్మాపై స్థానిక టెన్నెసీ యూనివర్సిటీ అథ్లెటిక్స్ కోచ్ ఎండ్ టెంపుల్ దృష్టి పడింది. ఆమెలోని సహజ అథ్లెట్ నైపుణ్యాన్ని గుర్తించిన కోచ్... తమ వేసవి శిబిరంలో చేరాల్సిందిగా సూచించాడు. అక్కడి క్యాంప్‌లో భాగమైన తర్వాత విల్మా పరుగు మరింత మెరుగైంది. ఇదే జోరులో ప్రతిష్టాత్మక అమెచ్యూర్ అథ్లెటిక్ యూనియన్ నిర్వహించిన ట్రాక్ మీట్లో పాల్గొన్న ఈ అమ్మాయి తాను పాల్గొన్న 9 ఈవెంట్లలో కూడా విజేతగా నిలిచింది. ఆ తర్వాత విల్మా రుడాల్ఫ్ అథ్లెటిక్స్ కెరీర్ అమిత వేగంగా దూసుకుపోయింది. పోలియో నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత కేవలం నాలుగేళ్ల వ్యవధిలో ఆమె అంతర్జాతీయస్థాయిలో పోటీ పడే అథ్లెట్‌గా ఎదగడం విశేషం. ఒలింపిక్ విజేతగా... విల్మా స్కూల్ చదువు కూడా పూర్తి కాక ముందే 1956 మెల్బోర్న్ ఒలింపిక్స్ కోసం అథ్లెటిక్స్ సెలక్షన్ ట్రయల్స్ జరిగాయి. 16 ఏళ్ల విల్మా ఇందులో పాల్గొని సత్తా చాటింది. 200 మీటర్ల పరుగులో పోటీ పడేందుకు జట్టులోకి ఎంపికై, మెల్బోర్న్ ఒలింపిక్స్‌లో పాల్గొన్న యూఎస్ జట్టులో అత్యంత పిన్న వయస్కురాలిగా నిలిచింది. 200 మీటర్ల పరుగులో హీట్స్‌లోనే విఫలమై వెనుదిరిగినా... రిలే రూపంలో ఆమెకు మరో అవకాశం దక్కింది. అమెరికా మహిళల 4్ఠ100 మీటర్ల రిలే టీమ్ మూడో స్థానంలో నిలిచి కాంస్యం దక్కించుకుంది. ఇందులో భాగంగా ఉన్న విల్మా ఖాతాలో తొలి ఒలింపిక్ పతకం చేరింది. బంగారు బాల... విల్మా కెరీర్ మరో నాలుగేళ్ల తర్వాత శిఖరానికి చేరింది. మెల్బోర్న్ ఒలింపిక్స్ అనుభవంతో ఆమె తర్వాతి ఒలింపిక్స్‌కు మరింత పట్టుదలగా, కఠోర శ్రమతో సిద్ధమైంది. దాని ఫలితమే 1960 రోమ్ ఒలింపిక్స్‌లో మూడు స్వర్ణ పతకాలు. 100 మీటర్ల పరుగు, 200 మీటర్ల పరుగులో వ్యక్తిగత స్వర్ణాలు గెలుచుకున్న ఈ స్ప్రింటర్ 4్ఠ100 మీటర్ల రిలేలో ఈసారి తన పతకం రంగు మార్చుకుంది. విల్మా సభ్యురాలిగా ఉన్న జట్టు అగ్రస్థానంలో నిలిచి స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. ఒకే ఒలింపిక్స్‌లో మూడు స్వర్ణాలు నెగ్గిన తొలి అమెరికన్‌గా ఆమె చరిత్ర సృష్టించింది. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి ఇదే మెగా ఈవెంట్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా పోటీల ప్రత్యక్ష ప్రసారం జరిగింది. దాంతో ఒక్కసారిగా విల్మా పేరు మారుమోగిపోయి స్టార్‌గా మారిపోయింది. అన్ని దేశాలు ఆమె వేగాన్ని ప్రశంసిస్తూ ‘టోర్నడో’... ‘ఫ్లాష్’... ‘ట్రాక్ స్టార్’... ‘ద బ్లాక్ పెర్ల్’ అంటూ వేర్వేరు ఉపమానాలతో విల్మాను ఆకాశానికెత్తేశాయి. 22 ఏళ్లకే ముగించి... రోమ్ ఒలింపిక్స్ తర్వాత కూడా అనేక మంది మిత్రులు, సన్నిహితుల నుంచి వచ్చిన ఒత్తిడి మేరకు పలు ఈవెంట్లలో విల్మా పాల్గొంది. కానీ తన కోసం ఎలాంటి ప్రత్యేక లక్ష్యాలను పెట్టుకోలేదు. ‘నేను వచ్చే ఒలింపిక్స్‌లో మరో రెండు స్వర్ణాలు నెగ్గినా ఇంకా ఏదో వెలితి కనిపిస్తూనే ఉంటుంది. నేను సాధించింది చాలు. ఇక పరుగు ఆపడమే మంచిది’ అంటూ కెరీర్ అత్యుత్తమ దశలో ఉండగా 22 ఏళ్లకే ట్రాక్‌కు రిటైర్మెంట్ చెప్పేసింది. అందుకే 1964 టోక్యో ఒలింపిక్స్‌లో ఆమె పాల్గొనలేదు. ఆట ముగించగానే తన చదువుపై దృష్టి పెట్టి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ఆపై పలు సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగమైంది. ముఖ్యంగా నల్ల జాతి అమెరికన్స్ పౌర హక్కులు, మహిళల హక్కుల కోసం ఆమె పోరాడింది. చిన్నప్పటి వైకల్యాలను అధిగమించి ఒలింపిక్ చాంపియన్‌గా నిలిచిన విల్మా జీవితం అందరికీ స్ఫూర్తిదాయకం. -
భౌతిక దూరం: నాడు రియల్.. నేడు వైరల్
వాషింగ్టన్: ఉసేన్ బోల్ట్ అంటే క్రీడాలోకానికి బాగా తెలుసు... చాంపియన్ స్ప్రింటర్ అని! బీజింగ్ ఒలింపిక్స్‌లో మొదలైన అతని విజయపరంపర తదనంతరం డైమండ్ లీగ్‌లు, ప్రపంచ చాంపియన్ షిప్లదాకా సాగింది. పుష్కరకాలం క్రితం బీజింగ్‌లో పరుగుల చిరుతగా, రియల్ హీరోగా రికార్డుల తెరకెక్కిన బోల్ట్ ఇప్పుడు 12 ఏళ్లు అయ్యాక కూడా వార్తల్లోకెక్కాడు. చిత్రంగా అదే చాంపియన్ ఫొటోతో! 2008 ఒలింపిక్స్‌లో జరిగిన 100 మీటర్ల రేసును బోల్ట్ 9.69 సెకన్ల రికార్డు టైమింగ్‌తో ముగించి చరిత్రకెక్కాడు. అప్పుడు విజేతగా నిలిచి న క్షణాల్ని ఏఎఫ్‌పీ ఫొటోగ్రాఫర్ నికోలస్ తన కెమెరాలో బంధించాడు. ఇందులో బోల్ట్ అందరికంటే ముందుగా, వేగంగా, తోటి పోటీదారులు ఫినిషింగ్ లైన్‌కు దూరంగా ఉండగానే ముగించాడు. ఇందు లో సామాజిక దూరం (సోషల్ డిస్టెన్సింగ్) కోణం కనబడుతుంది. మహమ్మారి విజృంభణతో ఇప్పు డు ప్రపంచమంతా ఈ దూరంతోనే బతికేస్తోంది. అందుకే నాటి ఫొటో అప్పుడు ఎంతగా పతాక శీర్షికలకు ఎక్కిందో... ఇప్పుడు కూడా అంతే తాజాగా సామాజిక సైట్లలో వైరల్ అయింది. ఇప్పుడీ ఫొటో వేలసంఖ్యలో రీట్వీట్ కాగా.. లక్షలకొద్దీ లైక్‌లు వచ్చాయి. నిజంగా ఈ జమైకన్ స్ప్రింటర్ అప్పుడు రియల్... ఇప్పుడేమో వైరల్ ‘చాంపియన్’ అయ్యాడు కదా! అన్నట్లు ఈ రిటైర్డ్ చాంపియన్ కోవిడ్–19పై పోరులో జమైకాను జాగృతం చేస్తున్నాడు. మహమ్మారికి మందు దూరంగా ఉండటమేనంటూ, గడపదాటకుండా గడపడమే సురక్షితమంటూ ప్రచారం చేస్తున్నాడు. ఈ సంక్షోభంలో నిధుల సేకరణలోనూ చురుగ్గా పాల్గొంటున్నాడు. చదవండి: ఊ.. 500 సార్లు రాయండి.. పోలీసాఫీసర్‌గానూ.. డాక్టర్‌గానూ -
‘వింబుల్డన్’కు వెయ్యి కోట్ల బీమా సొమ్ము
సాక్షి, న్యూఢిల్లీ : రానున్న జూన్‌లో జరగాల్సిన వింబుల్డన్ టెన్నీస్ ప్రపంచ ఛాంపియన్షిప్ పోటీలు కరోనా వైరస్ మహమ్మారి కారణంగా వాయిదా పడిన విషయం తెల్సిందే. ఇందుకుగాను భీమా సౌకర్యం కింద ఈ పోటీలను నిర్వహించే ఆల్ ఇంగ్లండ్ క్లబ్‌కు 114 మిలియన్ పౌండ్ల (దాదాపు 1,079 కోట్ల రూపాయలు) సొమ్ము అందనుంది. వాస్తవానికి ఆ క్లబ్ పోటీలను నిర్వహించినట్లయితే 250 మిలియన్ డాలర్లు (దాదాపు 23,100 కోట్ల రూపాయలు) వచ్చేవి. ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్న కరోనా మహమ్మారిని అరికట్టడంలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా అన్ని క్రీడా పోటీలను రద్దు చేస్తూ వస్తున్నారు. ప్రతిష్టాకరమైన ఒలింపిక్స్ పోటీలను కూడా రద్దు చేశారు. రెండో ప్రపంచ యుద్ధానంతరం వింబుల్డన్ పోటీలను రద్దు చేయడం ఇదే మొదటి సారి. 2003లో సార్స్ వచ్చినప్పుడు వింబుల్డన్ పోటీలకు భీమా తీసుకున్నారు. అప్పటి నుంచి ప్రతి ఏటా జీవిత భీమా కింద 1.6 మిలియన్ పౌండ్లు ప్రీమియం కింద చెల్లిస్తూ వస్తున్నారు. భీమా తీసుకున్నాక 15 ఏళ్ల తర్వాత మొదటి సారి వింబుల్డన్ పోటీలు వాయిదా పడ్డాయి. -
భారత్ తీన్మార్
దోహా (ఖతర్): ఆసియా షూటింగ్ ఛాంపియన్ షిప్ పోటీల్లో ఆదివారం భారత షూటర్లు అద్భుతమే చేశారు. ఏకంగా మూడు ఒలింపిక్ బెర్త్‌లను సొంతం చేసుకున్నారు. పురుషుల స్కీట్ విభాగంలో అంగద్ సింగ్ బాజ్వా స్వర్ణం, మేరాజ్ అహ్మద్ ఖాన్ రజతం సాధించి వచ్చే ఏడాది జరిగే టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత పొందారు. పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ ఈవెంట్లో మధ్యప్రదేశ్‌కు చెందిన 18 ఏళ్ల ఐశ్వర్య ప్రతాప్ సింగ్ తోమర్ కాంస్య పతకం నెగ్గి టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. తాజా ప్రదర్శనతో భారత్ తరఫున ఒకే ఒలింపిక్స్ క్రీడల్లో అత్యధికంగా 15 మంది షూటర్లు బరిలోకి దిగనున్నారు. 2016 రియో ఒలింపిక్స్‌లో 12 మంది... 2012 లండన్ ఒలింపిక్స్‌లో 11 మంది భారత షూటర్లు పాల్గొన్నారు. ►స్కీట్ విభాగం క్వాలిఫయింగ్‌లో 44 ఏళ్ల మేరాజ్ నాలుగో స్థానంలో, 23 ఏళ్ల అంగద్ ఆరో స్థానంలో నిలిచి ఫైనల్‌కు చేరారు. ఆరుగురు పాల్గొన్న ఫైనల్లో నిరీ్ణత 60 షాట్ల తర్వాత అంగద్, మేరాజ్ 56 పాయింట్లతో సమఉజ్జీలుగా నిలిచారు. దాంతో ఇద్దరి మధ్య షూట్ ఆఫ్‌ను నిర్వహించగా... అంగద్ 6 పాయింట్లు సాధించి స్వర్ణం ఖాయం చేసుకోగా... 5 పాయింట్లు స్కోరు చేసిన మేరాజ్‌కు రజతం దక్కింది. ►పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ ఈవెంట్ ఫైనల్లో ఐశ్వర్య ప్రతాప్ సింగ్ 449.1 పాయింట్లు స్కోరు చేసి కాంస్యం గెలిచాడు. ఐశ్వర్య ప్రతాప్, చెయిన్ సింగ్, పారుల్ కుమార్‌లతో కూడిన భారత జట్టుకు టీమ్ విభాగంలో కాంస్యం లభించింది. ►10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ ఈవెంట్ ఫైనల్లో మను భాకర్–అభిõÙక్ వర్మ జంట 16–10తో భారత్‌కే చెందిన సౌరభ్–యశస్విని జోడీపై గెలిచి పసిడి పతకం సాధించింది. ►10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ ఈవెంట్ ఫైనల్లో తెలంగాణ అమ్మాయి ఇషా సింగ్–సరబ్‌జ్యోత్ సింగ్ (భారత్) ద్వయం 16–10తో మిన్సియో కిమ్–యున్హో సుంగ్ (కొరియా) జోడీని ఓడించి స్వర్ణం సొంతం చేసుకుంది. -
సెమెన్యాకు ఎదురుదెబ్బ
లుసానే: దక్షిణాఫ్రికా విఖ్యాత రన్నర్, 800 మీటర్ల విభాగంలో డబుల్ ఒలింపిక్ చాంపియన్ క్యాస్టర్ సెమెన్యాకు ఆర్బిట్రేషన్ కోర్టు (స్పోర్ట్స్)లో చుక్కెదురైంది. ఆమె అమ్మాయే అయినా ఆమెలో పురుష హార్మోన్లు ఉన్నాయని, పోటీల్లో ఆమె సామర్థ్యానికి ఇవి లబ్ది చేకూరుస్తున్నాయని అంతర్జాతీయ అమెచ్యూర్ అథ్లెటిక్స్ సమాఖ్య (ఐఏఏఎఫ్) సెమెన్యా పాల్గొనే పోటీలపై గతంలో ఆంక్షలు విధించింది. తనపై ఐఏఏఎఫ్ ఉద్దేశపూర్వకంగా కక్ష్య సాధిస్తోందని ఆరోపిస్తూ.. ఆర్బిట్రేషన్ కోర్టులో సెమెన్యా సవాలు చేసింది. సుదీర్ఘ విచారణ తర్వాత బుధవారం ముగ్గురు జడ్జీలతో కూడిన త్రిసభ్య బెంచ్ సెమెన్యాకు ప్రతికూలంగా తీర్పునిచ్చింది. అయితే దీనిపై మరింత దృష్టి సారించాల్సిన అవసరముందని ముగ్గురు న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. మహిళలకు నష్టం కలుగకుండా, వివక్షకు తావులేకుండా చూడాలని తమ తీర్పులో పేర్కొన్నారు. మరోవైపు ఇదివరకే అంతర్జాతీయ సమాజం ఐఏఏఎఫ్ తీరును నిరసించింది. ఓ అథ్లెట్ విజయం వెనుక కేవలం హార్మోన్ల ప్రభావమే ఉండదని... కఠోర శ్రమ, నిబద్ధత, సాధించాలనే తపనతోనే ఆ స్థాయికి చేరుకుంటారని పేర్కొంది. వీటన్నింటిని కాదని ఒక్క కారణం (హార్మోన్లు)తో అథ్లెట్ విజయాన్ని శంకించడం అవివేకమని పలువురు క్రీడా నిపుణులు తప్పుబట్టారు. భవిష్యత్‌లో సెమెన్యా అంత ర్జాతీయ రేసుల్లో పోటీపడాలంటే ఆమె శరీరంలోని పురుష హార్మోన్ల సంఖ్యను తగ్గించుకోవాల్సి ఉంటుంది. -
ఒలింపిక్ అర్హత పద్ధతి బాగా లేదు!
న్యూఢిల్లీ: ఒలింపిక్స్‌కు అర్హత సాధించే విషయంలో ప్రస్తుతం ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) అనుసరిస్తున్న విధానాన్ని భారత చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ తప్పుపట్టారు. ఇందులో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఒలింపిక్స్‌కు అర్హత సాధించేందుకు ఆటగాళ్లు ఏడాదంతా ఆడాల్సి వస్తోందని, అది వారిపై తీవ్ర ఒత్తిడి పెంచుతోందని ఆయన అన్నారు. ‘ఎక్కువ సంఖ్యలో టోర్నీలు ఆడటం వల్ల ఆటగాళ్లు పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించేందుకు అవకాశం ఉంటుందనేది వాస్తవం. అయితే సంవత్సరం పాటు ఒలింపిక్ క్వాలిఫయింగ్ పోటీలు కొనసాగడం సరైంది కాదు. దీనిపై దృష్టి పెట్టాలి. ఆల్ ఇంగ్లండ్ టోర్నీ, ప్రపంచ చాంపియన్‌షిప్ లేదా ఆసియా, యూరోపియన్ చాంపియన్‌షిప్ లాంటివి గెలిచినప్పుడు కొందరికైనా నేరుగా అర్హత సాధించే సౌకర్యం ఉండాలి. ఇప్పుడేమో పిచ్చి పట్టినట్లుగా ఆటగాళ్లు ప్రపంచమంతా తిరగాల్సి వస్తోంది. ఇది చాలా శ్రమతో కూడుకున్న విషయం’ అని గోపీచంద్ వ్యాఖ్యానించారు. -
టోక్యో ఒలింపిక్స్ టార్చ్ ఆవిష్కరణ
టోక్యో: వచ్చే ఏడాది ఒలింపిక్స్‌కు ఆతిథ్యమిచ్చేందుకు సిద్ధమవుతున్న టోక్యో నగరంలో బుధవారం టార్చ్‌ను ఆవిష్కరించారు. ఐదు రేకులతో ఉండే చెర్రీ బ్లాసమ్ పువ్వు ఆకారం ఈ టార్చ్ పైభాగంలో కనిపిస్తుంది. బంగారు వర్ణంలో ఉన్న ఈ టార్చ్ పొడవు 28 అంగుళాలు, బరువు 1.2 కిలోలు. దీన్ని అల్యూమినియం లోహంతో తయారు చేశారు. 2011లో సంభవించిన భూకంపం, సునామీ బాధితుల కోసం తాత్కాలికంగా ఇళ్లను నిర్మిం చగా వచ్చిన వేస్టేజ్ అల్యూమినియం లోహం తో టార్చ్ రూపొందింది. టోక్యోలో ఈ టార్చ్ పరుగు పెట్టనున్న నేపథ్యంలో నగర వీధుల్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దనున్నారు. మార్చి 26న టార్చ్ రిలే మొదలవుతుంది. -
ఫైనల్‌కు ‘సై’నా
జకార్తా: భారత సీనియర్ బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ ఈ సీజన్లో తొలి టైటిల్‌కు చేరువైంది. ఇండోనేసియా మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–500 టోర్నమెంట్లో ఆమె ఫైనల్లోకి ప్రవేశించింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో ఎనిమిదో సీడ్ సైనా 18–21, 21–12, 21–18తో ఆరో సీడ్ హి బింగ్జియావో (చైనా)పై విజయం సాధించింది. నేడు జరిగే టైటిల్ పోరులో 28 ఏళ్ల భారత వెటరన్... ప్రపంచ, ఒలింపిక్ చాంపియన్ కరోలినా మారిన్ (స్పెయిన్)తో తలపడనుంది. మరో సెమీస్‌లో మారిన్ 17–21, 21–11, 23–21తో చెన్ యుఫె (చైనా)పై నెగ్గింది. నేటి ఫైనల్స్ ఉదయం గం. 11.30 నుంచి స్టార్ స్పోర్ట్స్ సెలెక్ట్–1లో ప్రత్యక్ష ప్రసారం -
గ్రేడ్ ‘ఎ’లోకి సుశీల్, సాక్షి
ముంబై: స్టార్ రెజ్లర్లు, ఒలింపిక్ పతక విజేతలైన సుశీల్ కుమార్, సాక్షి మలిక్‌ల కాంట్రాక్టు గ్రేడ్‌ను ‘బి’ నుంచి ‘ఎ’కు మారుస్తూ భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది నుంచి గ్రేడింగ్ విధానం ప్రవేశపెట్టగా, బజరంగ్ పూనియా, వినేశ్ ఫొగాట్, పూజా ధండాలకు ‘ఎ’ గ్రేడ్ దక్కింది. దీనిపై విమర్శలు రావడంతో డబ్ల్యూఎఫ్ఐ పొరపాటును సరిదిద్దుకుంది. ‘ఇది మా తప్పే. వారిద్దరూ ‘బి’ గ్రేడ్‌లో ఉండాల్సిన వారు కాదు. అందుకని ‘ఎ’లోకి మార్చుతున్నాం’ అని డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ ప్రకటించారు. సుశీల్ 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో కాంస్యం, 2012 లండన్ ఒలింపిక్స్‌లో రజతం నెగ్గాడు. సాక్షి 2016 రియో ఒలింపిక్స్‌లో కాంస్యం గెలుపొందింది. మరోవైపు డబ్ల్యూఎఫ్ఐ రెజ్లర్లను ‘ఎ’ నుంచి ‘ఎఫ్’ వరకు వర్గీకరించింది. సుశీల్, సాక్షి గ్రేడ్ ‘ఎ’లోకి వెళ్లడంతో ‘బి’లో ఎవరూ లేనట్లైంది. ‘సి’లో ఏడుగురు, ‘డి’లో 9 మంది, ‘ఇ’లో నలుగురున్నారు. అండర్–23 జాతీయ స్వర్ణ పతక విజేతలకు ‘ఎఫ్’లో చోటు దక్కుతుంది. డ్ ‘ఎ’లోకి సుశీల్, సాక్షి -
‘టాప్స్’లో భారత హాకీ ఆటగాళ్లు
న్యూఢిల్లీ: కొత్త కోచ్ హరేంద్ర సింగ్ ఆధ్వర్యంలో నెదర్లాండ్స్‌లో జరిగిన చాంపియన్స్ ట్రోఫీలో రన్నరప్‌గా నిలిచిన భారత హాకీ జట్టుకు క్రీడా మంత్రిత్వ శాఖ ప్రత్యేక అలవెన్సులు ప్రకటించింది. మొత్తం హాకీ జట్టును టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ (టాప్స్)లోకి చేర్చుతున్నట్లు మిషన్ ఒలింపిక్ సెల్ (ఎమ్‌ఓసీ) పేర్కొంది. ‘టాప్స్’ కింద జట్టులోని మొత్తం 18 మంది ప్లేయర్లు ఒక్కొక్కరికి నెలకు రూ. 50 వేలు చొప్పున అందివ్వనుంది. విభిన్న క్రీడాంశాల్లో ప్రతిభ చాటుతున్న ఆటగాళ్లను ‘టాప్స్’లో చేర్చినా ఒక జట్టు మొత్తాన్ని ఇందులో భాగం చేయడం ఇదే ప్రథమం. త్వరలో జరుగనున్న ప్రపంచ కప్, ఆసియా క్రీడల్లో ప్రదర్శన అనంతరం మహిళల హాకీ జట్టును కూడా ‘టాప్స్’లో చేర్చే అంశం గురించి పరిశీలించనున్నారు. ఇటీవల అంతర్జాతీయ వేదికపై సత్తాచాటిన తెలుగు తేజం, జిమ్నాస్ట్ బుద్దా అరుణారెడ్డికి కూడా ప్రత్యేక అలవెన్సులు లభించనున్నాయి. ప్రస్తుతం బెల్జియంలో శిక్షణ తీసుకుంటున్న అరుణా రెడ్డి, ఆశిష్ కుమార్ల కోసం రూ. 14 లక్షలు కేటాయించారు. వీరితో పాటు ఉజ్బెకిస్తాన్‌లో శిక్షణ తీసుకుంటున్న ప్రణతీ నాయక్ కోసం రూ. 7.74 లక్షలు ప్రకటించారు. స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్‌కు జార్జియాలో ప్రత్యేక శిక్షణకు గాను రూ. 6.62 లక్షలు... ఇతర రెజ్లర్లు బజరంగ్ పూనియా, సుమిత్‌ల కోసం రూ. 3.22 లక్షలు మంజూరు చేశారు. డేవిస్ కప్ సభ్యుడు రామ్‌కుమార్ రామనాథన్‌కు ఆసియా క్రీడల ప్రత్యేక శిక్షణ నిమిత్తం రూ..12.57 లక్షలు కేటాయించారు. ఆర్చరీ సామాగ్రి కొనుగోలుకు రూ. 11.48 లక్షలు కేటాయించారు. దీంతో పాటు ఆర్చర్లు వెన్నం జ్యోతి సురేఖ, త్రిష, రజత్ చౌహాన్‌ల ప్రత్యేక శిక్షణ కోసం ఇటాలియన్ కోచ్ సెర్గియో పగ్నికి రూ. 4.04 లక్షలు ప్రత్యేకంగా కేటాయించారు. -
అంచనాలను పెంచేసిన గోల్డ్ ట్రైలర్
1948 లండన్ ఒలంపిక్స్‌లో భారత్ హకీలో గోల్డ్ పతాకం సాధించటం అన్న నేపథ్యంతో(కల్పిత గాథ) రీమా ఖగ్టీ డైరెక్షన్లో తెరకెక్కిన చిత్రమే ‘గోల్డ్’. అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్ర టీజర్ కాసేపటి క్రితం విడుదల అయ్యింది. 2:18నిమిషాల పాటు కొనసాగిన ‘గోల్డ్’ ట్రైలర్, పేరుకు తగినట్లుగానే బంగారం లాంటి సినిమా అనిపిస్తుంది. ‘గోల్డ్, బ్రిటిష్ ఇండియా’ అనే వాయిస్ ఓవర్‌తో 1936 సంవత్సరంలో ప్రారంభమైన ఈ ట్రైలర్లో బ్రిటీష్ జెండా వైవు తదేకంగా చూస్తున్న అక్షయ్ కుమార్ కళ్లల్లో ‘ఇది కాదు నేను కోరుకున్నది’ అనే భావన స్పష్టంగా కనిపిస్తుంది. రెండు నిమిషాల ట్రైలర్లోనే ఈ ఖిలాడీ హీరో దేశభక్తితో పాటు క్రీడల పట్ల తన ప్రేమను ఏక కాలంలోఅద్భుతంగా ప్రదర్శించాడు. బుల్లితెర ధారవాహిక ‘నాగిని’ ఫేం మౌనీ రాయ్ అక్షయ్‌ను బెంగాలీలో తిడుతూ ఓ 5 సెకన్ల పాటు కనిపించింది. ఈ చిత్రంలో అక్షయ్‌కు జోడిగా మౌనీరాయ్ నటించిన సంగతి తెలిసిందే. కాగా మౌనీరాయ్కు ఇదే తొలి బాలీవుడ్ చిత్రం. ఒకదాని తరువాత ఒకటిగా ఇతర పాత్రల్లో నటించిన కునాల్ కపూర్, అమిత్ సాద్, వినీత్ కుమార్ సింగ్, సన్నీ కౌశ్ల్ల పాత్రల పరిచయం ఉంటుందిం. వీరందరిని దేశం తరుపున హాకీ ఆడే ఆటగాళ్లుగా పరిచయం చేస్తూ ట్రైలర్ కొనసాగింది. ఈ చిత్రంలో అక్షయ్ స్వతంత్ర భారతావని తరుపున ఒలంపిక్‌లో గోల్డ్ మెడల్ సాధించే హాకీ జట్టు కోచ్ ‘తపం దాస్’ పాత్రలో కనిపించనున్నారు. చిత్రం తెరకెక్కింది. అక్షయ్ కుమార్, మౌనీ రాయ్, అమిత్ సద్, వినీత్ సింగ్, సంగీత్ కౌశల్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. రితేశ్ సిద్వానీ, ఫరాన్ అక్తర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘గోల్డ్’ ఆగష్టు 15 2018న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. -
ఈయేటి మేటి ఫుట్‌బాలర్
ఇంగ్లండ్ క్రీడాకారిణి లూసీ బ్రాంజ్ ‘బి.బి.సి. ఉమెన్స్ ఫుట్‌బాలర్ ఆఫ్ ది ఇయర్ 2018 అవార్డు గెలుచుకున్నారు. ‘మీ అభిమాన ఫుట్‌బాల్ క్రీడాకారిణి ఎవరు?’ అని బి.బి.సి. పెట్టిన అంతర్జాతీయ ఓటింగ్‌లో ఎక్కువ మంది లూసీ బ్రాంజ్ పేరును సూచించారని తెలిసినపుపడు లూసీ నమ్మశక్యం కాని ఆనందంతో కాసేపు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. 26 ఏళ్ల లూసీ మొదట్లో ‘మాంచెస్టర్ సిటీ’ జట్టుకు ఆడేవారు. అక్కడి నుంచి ఫ్రెంచి టీమ్ ‘ఒలింపిక్ నియోనైస్’ జట్టుకు మారారు. అంతమాత్రాన పూర్తిగా ఆమె ఇంగ్లండ్‌ను వదిలేశారని అనుకోకండి. ఇంగ్లండ్ నేషనల్ ఉమెన్స్ ఫుట్‌బాల్ టీమ్ ‘లయెనెసెస్’కు కూడా ఆడుతున్నారు. అవార్డు అందుకుంటున్నప్పుడు ‘ఇట్స్ రియల్లీ స్పెషల్’ అనే పదాలు లూసీ పెదవుల్ని ఒణికించాయి. అంతా చప్పట్లు కొడుతుండడం ఆమెను మరింతగా ఉద్వేగంతో కూడిన తత్తరపాటుకు లోను చేసింది. అవార్డుకు నామినేట్ అవడమే గొప్ప సంగతి అని ఆమె భావిస్తున్న తరుణంలో ఏకంగా అవార్డే అమెను వరించి వచ్చింది. ‘నాతో పాటు నామినేట్ అయిన వాళ్లందరూ కూడా అవార్డు అర్హులే’ అని లూసీ అన్నారు. ఇలా అనడం ద్వారా ఆమె తనకు అవార్డును ఇచ్చినవారిని కూడా గౌరవించారు. -
‘టాప్’ నుంచి సానియా తొలగింపు
న్యూఢిల్లీ: త్వరలో తల్లి కాబోతున్న భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా టార్గెట్ ఒలింపిక్ పోడియం (టాప్) పథకానికి దూరమైంది. భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) బుధవారం ఈ విషయాన్ని వెల్లడించింది. ఆమెతో పాటు ఐదుగురు రెజ్లర్లు, ఇద్దరు బాక్సర్లు కూడా ఈ జాబితాలో చోటు కోల్పోయారు. కొత్తగా ఇద్దరు ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్లు ఎ. ధరుణ్, మోహన్ కుమార్ ‘టాప్’ ద్వారా లబ్ధి పొందనున్నారు. రెజ్లర్లు ప్రవీణ్ రాణా, సత్యవర్త్ కడియన్, సుమిత్, లలిత, సరిత... బాక్సర్లు ఎల్. దేవేంద్రో సింగ్, ఎస్. సర్జుబాలా దేవిలను ‘టాప్’ జాబితా నుంచి సాయ్ తొలిగించింది. వచ్చే ఒలింపిక్స్‌ను దృష్టిలో పెట్టుకుని పతకం సాధించే అవకాశాలున్న క్రీడాకారులకు ప్రత్యేకంగా కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ‘టాప్’ ద్వారా ప్రోత్సాహాన్ని అందిస్తోంది. ప్రస్తుతం 192 మంది ఈ పథకంలో ఉన్నారు. వీరిలో 41 మంది మాత్రమే టోక్యో ఒలింపిక్స్ గేమ్స్ వరకు ఇందులో కొనసాగుతారు. మిగతా వారికి ఆసియా క్రీడల వరకే ఈ పథకం వర్తిస్తుంది. ఆటగాళ్ల ప్రదర్శనల ఆధారంగా కొత్త ఆటగాళ్లకు చోటు కల్పించడంతో పాటు, పురోగతి లేని క్రీడాకారులకు ఉద్వాసన కూడా పలుకుతారు. -
భారత మహిళా స్టార్ రెజ్లర్ వినేశ్‌కు ‘ఓజీక్యూ’ చేయూత
భారత మహిళా స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌కు ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్ (ఓజీక్యూ) సహకారం అందించనుంది. 2020లో జరిగే టోక్యో ఒలింపిక్స్‌కు సిద్ధమవుతున్న వినేశ్‌కు అంతర్జాతీయ స్థాయి శిక్షణ, సౌకర్యాలు కల్పించనున్నట్లు ఆ సంస్థ పేర్కొంది. టోక్యో ఒలింపిక్స్‌లో వినేశ్ కచ్చితంగా పతకం సాధిస్తుందని ఆ సంస్థ ఆశాభావం వ్యక్తం చేసింది. 50 కేజీల విభాగంలో పోటీ పడుతున్న 23 ఏళ్ల వినేశ్ ఇటీవల జరిగిన ఆసియా చాంపియన్‌షిప్‌లో రజతం సాధించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆమె మాట్లడుతూ... ‘టోక్యో ఒలింపిక్స్‌లో దేశం తరఫున పతకం గెలవాలని కృత నిశ్చయంతో ఉన్నా. నా లక్ష్యానికి ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్ ఎంతగానో సహకరిస్తోంది’ అని వినేశ్ తెలిపింది. -
కిమ్ జాంగ్ చిందులు!
ప్యాంగ్‌చాంగ్: కిమ్ జాంగ్ అంటే తెలియని వారు తక్కువే. ఉత్తర కొరియా నియంత మరి ఆయనేంటి? ఈ చిందులేంటని ఆశ్చర్యపోకండి. కాస్త ఈ వివరాల్లోకి వెళ్లండి... నిత్యనూతన క్షిపణి పరీక్షలతో ఎప్పుడు వార్తల్లో నిలిచే ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్. అగ్రరాజ్యం అమెరికాకు కొరకరాని కొయ్య. తాజాగా దక్షిణ కొరియాలో జరుగుతున్న వింటర్ ఒలింపిక్స్‌లో అచ్చు కిమ్ జాంగ్‌ను పోలిన వ్యక్తి కనువిందు చేశారు. తమ కొరియా చీర్ లీడర్ల బృందం ముందు డ్యాన్స్ చేశారు. నలుపు సూటు, బూటులో నల్లని కళ్లజోడు ధరించి సాక్షాత్తు కిమ్‌నే తలపించిన ఆయన ఉన్నపళంగా ఉమ్మడి కొరియా, జపాన్ జట్ల మధ్య ఐస్ హాకీ మ్యాచ్ జరుగుతుండగా వచ్చి చిందులేసి ఆశ్చర్యపరిచారు. వెంటనే అక్కడే ఉన్న భద్రతా సిబ్బంది ఆయన్ని అదుపులోకి తీసుకుంది. ఆయన పేరు హోవర్డ్. నిజానికి కిమ్‌లా ఉన్న హోవర్డ్, ట్రంప్‌ను అచ్చుగుద్దినట్లు ఉండే డెనిస్ అలన్ ఇద్దరు కలిసి స్టేడియంలోని ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరచాలనుకున్నట్లు కిమ్ డూపు... హోవర్డ్ తెలిపారు. పోలీసులు తనను అరెస్టు చేయలేదని కేవలం బయటికి లాక్కెళ్లినట్లు చెప్పారు. అయితే ఈ తతంగం జరుగుతుండగా వీఐపీ గ్యాలరీలో కిమ్ సొంత చెల్లి కిమ్ యో జాంగ్, అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ ఉన్నారు. -
ఆ క్షణంలో ఏది తోస్తే అదే చేస్తా
సక్సెస్ వారిది వ్యవసాయ కుటుంబం... అమ్మ నాన్న ఇద్దరు పిల్లలు... ఇద్దరిలో చిన్నవాడైన శ్రీకాంత్ భారత కీర్తి పతాకను రెపరెపలాడించాడు... వరుస సూపర్‌సిరీస్ గెలుచుకున్నాడు... ఒలింపిక్ లక్ష్యంగా ముందుకు దూసుకుపోతున్నాడు...తల్లిదండ్రులతో కలిసి సాక్షితో తన అనుభవాలను పంచుకున్నాడు. ‘‘నేను టోర్నమెంట్లో గెలిచినా, ఓడినా ఆ మ్యాచ్ గురించి నాన్నగారే మాట్లాడతారు. వేళకి అన్నం తిన్నావా లేదా, ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకుంటున్నావా లేదా అని అమ్మ అడుగుతుంది. మ్యాచ్ గురించిన వివరాలు అన్నయ్య అడుగుతాడు. నేను గెలిచినా, ఓడినా ఎప్పుడూ నాన్నగారు ఏమీ అనరు. ఏ దెబ్బలూ తగిలించుకోకుండా, జాగ్రత్తగా వేళకి అన్నీ తిన్నానని చెబితే చాలు అమ్మకి నేను ప్రపంచ కప్ సాధించిన ంత సంతోషం. అన్నయ్య కూడా షటిల్ ఆటగాడు కావడం వలన, ఆట గురించి ఇద్దరం చర్చించుకుంటాం. ఇది మా చిన్న కుటుంబంలో ఉండే ఆనందం. అన్నయ్యతో అడుగులు... మా అన్నయ్య షటిల్ ఆడుతుంటే నేను కూడా వెళ్లేవాడిని. అలా నాకు షటిల్ బ్యాడ్మింటన్ మీద ఆసక్తి మొదలైంది. నా తొమ్మిదో ఏట నేను షటిల్ ఆడటం ప్రారంభించాను. ఖమ్మంలో వివిసి స్కూల్లో చదువుకున్నాను. ఆ తరవాత బిఏ చేశాను. ప్రస్తుతం ఇండియన్ ఆయిల్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాను. ఆటలో స్ట్రిక్టు... బయట ఫ్రెండ్లీ వ్యక్తిగతంగా ఒక ఆటగాడికి ఆటలో బలం ఉంటే వారు తప్పకుండా పైకి రాగలరు. నా వరకు నాకు గోపీచంద్ గాడ్‌ఫాదర్‌తో సమానం. ఆయనే నా కోచ్. ఆయన సహకారం లేకపోతే నేను ఈస్థాయికి వచ్చి ఉండేవాడిని కాదు. ఆట నేర్పేటప్పుడు ఆయన చాలా స్ట్రిక్ట్‌గా ఉంటారు. గ్రౌండ్ బయటకు వచ్చాక ఫ్రెండ్లీగా ఉంటారు. ఆడేటప్పుడు ఏ మాత్రం ఒత్తిడి పడకూడదు. ఆట ఆడేటప్పుడు మనకు ఎలా ఉంటుందో, ప్రత్యర్థికి కూడా అలాగే ఉంటుంది కనుక ఒత్తిడి పడవలసిన అవసరం ఉండదు. పోయిన పాయింట్ గురించి ఆలోచించకుండా, తరవాతి పాయింట్ ఎలా కొట్టాలా అని ఆలోచించాలి. నా గ్రాఫ్ క్లియర్! కెరీర్లో చిన్నచిన్న ఇబ్బందులు ఎదుర్కొన్నాను. చాలామందితో పోలిస్తే నా గ్రాఫ్ చాలా క్లియర్‌గానే ఉందనుకోవచ్చు. అతి తక్కువ సమయంలో ఎన్నో సాధించగలిగాననే సంతృప్తి నాకుంది. మ్యాచ్ ఆడేటప్పుడు ఆ సమయంలో ఏది కరెక్ట్ అయితే అదే చేస్తాను. అందువల్ల తరవాత పశ్చాత్తాపం ఉండదు. మలేసియా ఓపెన్‌లో సెమీ ఫైనల్ మ్యాచ్నాకు చాలా ఇష్టం. చాలా క్లోజ్‌గా గెలిచాను. నాకు టెన్నిస్ అంటే కూడా చాలా ఇష్టం. అప్పుడప్పుడు ప్రయత్నిస్తుంటాను. కాని సరిగా రావట్లేదు. మా అమ్మ మాతో ఎప్పుడూ ఒక మాట అనేవారు, ‘చదువు మీద శ్రద్ధ ఉంటేనే చదువుకోవాలి. అంతేకాని రెండు పడవల మీద ప్రయాణం చేస్తే పడవ మునిగిపోతుంది’ అని. ఆవిడ మాటలో వాస్తవాన్ని త్వరగానే తెలుసుకున్నాం. ఆట మీద దృషి కేంద్రీకరించాను. నేను కష్టంలో ఉన్నప్పుడు మా అన్నయ్య అండగా నిలుస్తాడు’’ అంటారు శ్రీకాంత్. నా వెంటే తిరిగేవాడు మా అబ్బాయిలిద్దరూ ఆడుకోవడానికి వెళ్లేవారు. పెద్దవాడు గోడ దూకి వెళ్లిపోయేవాడు. చిన్నవాడు గోడ దూకలేక ఏడుస్తూ కూర్చునేవాడు. శ్రీకాంత్ చిన్నప్పుడు నా వెనకాలే ఉండేవాడు. నా పక్కనే పడుకుని కబుర్లు చెప్పేవాడు. వాళ్ల నాన్నగారు పడుకోమంటే దుప్పటి ముసుగు వేసుకుని, కబుర్లు చెప్పేవాడు. అసలు ఎప్పటికైనా వీడు బయటకు Ðð ళ్తాడా, నా వెనకాలే ఉంటాడా అనుకునేదాన్ని. ఇప్పుడు అవన్నీ తలుచుకుంటుంటే నవ్వు వస్తోంది. ఒక్కడే దేశదేశాలు తిరిగి వస్తున్నాడు. పిల్లలను ఆటల్లో రాణిస్తారా లేదా అనేది ప్రాక్టీస్ మొదలు పెట్టిన నాలుగైదేళ్లలో తెలిసిపోతుంది. నైపుణ్యం ఉందనిపిస్తే కొనసాగించాలి. తగదనిపిస్తే, పదవ తరగతి లోపే చదువు వైపు మళ్లించాలి. – రాధా ముకుంద (శ్రీకాంత్ తల్లి) సరైన నిర్ణయమే! ఒలింపిక్స్ తర్వాత జాయింట్‌కి సర్జరీ అయ్యింది. అక్టోబరు నుంచి జనవరి వరకు విశ్రాంతి. మళ్లీఫిబ్రవరిలో టోర్నమెంట్‌కి వెళ్లాడు. ఫిజియో థెరపిస్టుకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. అంతేకాదు మా అబ్బాయిని నడిపించిన మొత్తం టీమ్‌కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. వరుస సిరీస్‌లో ప్రపంచంలో గెలిచినవారిలో శ్రీకాంత్ ఐదవ స్థానం. 2014లోసెమీస్ కొట్టి, చైనా సూపర్‌సిరీస్ గెలవడం నాకు చాలా ఆన ందంగా అనిపించింది. రెండు ఒలింపిక్ గోల్డ్ మెడల్స్ గెలిచిన లిన్‌డాన్ గెలవడం నాకు చాలా సంతోషంగా అనిపించింది. పదహారు సంవత్సరాల క్రితం ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు నేను చాలా భయపడ్డాను, ఇప్పుడు ఇది మంచి నిర్ణయం అని అర్థం చేసుకున్నాను. పిల్లలు ఆటలో గెలిచినప్పుడు బాధనంతా మర్చిపోతారు. ఓడిపోతే, బాధపడతారు. వారు ఎలా ఆడినా వారిని తల్లిదండ్రులుగా ప్రోత్సహించాలి. – కెవియస్ కృష్ణ – డా. వైజయంతి -
23న ఒలింపిక్ రన్
- 24 ప్రాంతాల్లో నిర్వహణకు ఏర్పాట్లు భానుగుడి (కాకినాడ) : అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 23న జిల్లాలోని 24 ప్రాంతాల్లో ఒలింపిక్ రన్ నిర్వహించనున్నట్లు జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కన్వీనర్ పి.చిరంజీవినికుమారి తెలిపారు. ఐడియల్ డిగ్రీ కళాశాల కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆమె ఈ వివరాలు తెలిపారు. కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురం, గొల్లవిల్లి, రాజోలు, రామచంద్రపురం, తుని, సామర్లకోట, పిఠాపురం, జగ్గంపేట, కిర్లంపూడి, దివిలి, అంబాజీపేట, మల్కిపురం, మండపేట, పెద్దాపురం, తాళ్ళరేవు, తాటిపాక, అన్నవరం, పెదపూడి, కాండ్రకోట, ర్యాలి, మామిడికుదురు, సఖినేటిపల్లి కేంద్రాల్లో ఆ రోజు ఈ ఒలింపిక్ రన్ నిర్వహిస్తున్నామని వివరించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో జూన్ 20 నుంచి 22వ తేదీ వరకూ ఈ రన్ నిర్వహిస్తారని, జిల్లాలో 23న నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని చెప్పారు. రన్లో పాల్గొన్న అందరికీ ప్రశాంసా పత్రాలు అందిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా ఒలింపిక్ రన్ బ్రోచర్ విడుదల చేశారు. కార్యక్రమంలో ఒలింపిక్ అసోషియేషన్ ఇన్‌ఛార్జి కార్యదర్శి వి.రవిరాజు, అధ్యక్షుడు చుండ్రు గోవిందరాజులు తదితరులు పాల్గొన్నారు. -
రెజ్లర్‌ను మనువాడిన సాక్షి మాలిక్!
రియో ఒలింపిక్స్‌లో మొదటి పతకాన్ని సాధించి.. చరిత్ర సృష్టించిన మహిళా రెజ్లర్ సాక్షి మాలిక్ వైవాహిక జీవితంలో అడుగుపెట్టింది. ఆమె ఆదివారం రోహతక్‌లో తోటి రెజ్లర్ సత్యవ్రత్ కడియన్‌ను వివాహం చేసుకుంది. 2016 రియో ఒలింపిక్స్‌లో 58 కిలోల కేటగిరీలో సాక్షి కాంస్యం పతకం సాధించిన సంగతి తెలిసిందే. తద్వారా ఒలింపిక్స్ రెజ్లింగ్‌లో పతకం సాధించిన మొదటి మహిళగా ఆమె రికార్డు సృష్టించింది. రోహతక్‌లో అట్టహాసంగా జరిగిన ఆమె వివాహానికి ప్రముఖ రెజ్లర్ సుశీల్‌కుమార్ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. రెజ్లింగ్ క్రీడ ద్వారానే సాక్షికి సత్యవ్రత్‌కు మధ్య పరిచయం ఏర్పడింది. వీరిద్దరి పరిచయం ప్రేమగా మారి.. పెళ్లికి దారితీసింది. సత్యవ్రత్ 2010 యూత్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించాడు. అంతకుముందు వరల్డ్ జూనియర్ చాంపియన్ షిప్లో అతను పతకాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. Happy married life congratulation @SakshiMalik pic.twitter.com/7X34PS6MMe — Vijender Singh (@boxervijender) 3 April 2017 Time to get colored with Mehendi for the big day #excited pic.twitter.com/BjcBpIyrx3 — Sakshi Malik (@SakshiMalik) 1 April 2017 -
జాతీయ స్థాయి పోటీల్లో రాణించాలి
– ఒలంపిక్ సంఘం జిల్లా అధ్యక్షుడు విజయ్‌కుమార్ కర్నూలు (టౌన్): చండీఘడ్‌లో ఈనెల 28 నుంచి వచ్చేనెల 2 వ తేదీ వరకు నిర్వహిస్తున్న 7వ జాతీయ స్థాయి ఫెడరేషన్ సెపెక్‌తక్రా చాంపియన్ షిప్లో పాల్గొని విజయంతో తిరిగి రావాలని జిల్లా ఒలంపిక్ సంఘం అధ్యక్షులు విజయ్‌కుమార్ పేర్కొన్నారు. శనివారం స్థానిక ఔట్‌డోర్ స్టేడియంలో జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటున్న జట్లకు క్రీడా దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ స్థాయి పోటీల్లో రాణించి అంతర్జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై కర్నూలు జిల్లా ఖ్యాతిని ఇనుమడింపజేయాలన్నారు. అనంతరం సెపెక్‌తక్రా సంఘం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసులు జట్టును ప్రకటించారు. ఎంపికయిన వారిలో బి. రమేష్‌బాబు (కర్నూలు కెప్టెన్ ) సి. అశోక్‌కుమార్ (కర్నూలు ) పి. నాగ శ్రీకాంత్ రెడ్డి (కడప) ఎస్.కె.మాలిక్ బాషా (కర్నూలు )ఎస్. అశోక్‌బాబు (ఒంగోలు) శివకుమార్ (మేనేజర్)లు ఉన్నారు. -
దివ్య దరహాసం
క్యాలెండర్ అడ్డంకులకు కుంగిపోతే బతుకింతే అని ఆగిపోతే జీవితానికి అర్థం లేదు! పోరాడాలి... తిరగబడాలి.. పైపైకి ఎగరాలన్న కాంక్షను కిందకు లాగుతున్న అడ్డంకులను నువ్వెంత అని ప్రశ్నించాలి. ఈ స్ఫూర్తికి నిలువెత్తు తార్కాణాలు వీరే! అందరూ దివ్యాంగులే. కాని ఎవరికీ తాము తక్కువ కాదని నిరూపిస్తున్నారు. ఒకరు బ్లేడ్ రన్నర్.. ఇంకొకరు స్పీడ్ రేసర్... ఇంకొకరు ఒలింపిక్ మెడల్ విన్నర్! సూపర్ మోడల్ ఒకరైతే షటిల్లో సైనా, సింధూలకు పోటీనిచ్చే షట్లర్ ఇంకొకరు! ‘లివింగ్ స్మైల్స్’ అనే స్వచ్ఛంద సంస్థ దేశ 68వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా అందరికీ ఒకదగ్గరకు చేర్చింది. ఏడాది మొత్తం స్ఫూర్తినింపే కేలండర్‌గా గుదిగుచ్చింది... – సాక్షి నాలెడ్జ్ సెంటర్ కిరణ్ కనోజియా మొట్టమొదటి భారత మహిళా బ్లేడ్ రన్నర్ / ఐ.టి. ప్రొఫెషనల్ మానసి జోషి ప్రపంచ నెం.3 పారాలింపిక్ బ్యాడ్మింటన్ ప్లేయర్ (సింగిల్, మిక్స్డ్ డబుల్స్) వినోద్ రావత్ బైకర్, యాక్టర్, మారథాన్ రన్నర్ షాలిని సరస్వతి బ్లేడ్ రన్నర్, డ్యాన్సర్, బిపిఓ ప్రొఫెషనల్ సుయాష్ జాదవ్ పారాలింపిక్ స్విమ్మర్, రియో–2016 మరియప్పన్ తంగవేలు పారాలింపిక్ గోల్డ్ మెడలిస్ట్, హైజంప్, రియో–2016 -
ఒలింపిక్ సంఘం గుర్తింపును పొందాలి
రామచంద్రపురం : జిల్లాలో గల క్రీడా సంఘాలు జిల్లా ఒలింపిక్ సంఘం గుర్తింపును పొందాలని జిల్లా కార్యవర్గం తీర్మానించింది. స్థానిక కృత్తివెంటి పేర్‌ారజు పంతులు జాతీయోన్నత పాఠశాలలో గల ఏవీ హాల్లో ఆదివారం జిల్లా ఒలింపిక్ స ంఘం కార్యవర్గ సమావేశం అధ్యక్షుడు చుండ్రు గోవిందరాజు అధ్యక్షతన జరిగింది.వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జిల్లాలో మినీ ఒలింపియాడ్‌ను నిర్వహించాలని, తిరిగి జిల్లా సర్వ సభ్య సమావేశాన్ని డిసెంబర్లో రాజమండ్రిలో నిర్వహించాలని తీర్మానం చేశారు. క్రీడా సంఘాలను గుర్తించేందుకు కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ చైర్మ¯ŒSగా వై. తాతబ్బాయి, కన్వీనర్‌గా కృష్ణమూర్తి, సభ్యులుగా రాజు తదితరులు ఉన్నారు. క్రమశిక్షణ కమిటీ చైర్మ¯ŒSగా రామరాజు, కన్వీనర్‌గా సృజనారాజు, సభ్యులుగా కనకాల వెంకటేశ్వరరావు, వై. బంగార్‌ారజు, రమణలతో కార్యవర్గాన్ని ప్రకటించారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు చుండ్రు గోవిందరాజుతో పాటు ప్రధాన కార్యదర్శి కె. పద్మనాభం, కోశాధికారి వై. తాతబ్బాయి, పి. సీతాపతిలను సత్కరించారు. జిల్లా బాస్కెట్‌బాల్ అసోసియేష¯ŒS అధ్యక్షుడు డాక్టర్ సి. స్టాలిన్, కొప్పాల వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. 23ఆర్సీపీ02: మాట్లాడుతున్న జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు గోవిందరాజు -
దసరా క్రీడా పోటీలకు సింధూకు ఆహ్వానం
మైసూరు: గ్రీన్‌దసరా నినాదంతో ఈ ఏడాది దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహించడానికి ప్రభుత్వం, దసరా ఉత్సవ కమిటీలు అన్ని చర్యలు తీసుకుంటున్నాయి. అందులో భాగంగా దసరా ఉత్సవాల్లో నిర్వహించనున్న క్రీడాపోటీలను ఒలింపిక్ క్రీడల్లో వెండి పతకాన్ని సాధించిన పీ.వీ.సింధుచే ప్రారంభించడానికి నిర్ణయించుకున్నట్లు దసరా ఉత్సవ కమిటి అధ్యక్షుడు డీ.రందీప్ మంగళవారం తెలిపారు. ఆమె అంగీకరించిన అనంతరం దసరా కార్యాచరణ సమితి నుంచి అధికారికంగా ఆహ్వానపత్రికను అందించనున్నట్లు ఆయన తెలిపారు. అదేవిధంగా ఒలింపిక్ క్రీడల్లో కుస్తీ, జిమ్నాస్టిక్ విభాగాల్లో పతకాలు సాధించిన సాక్షిమాలిక్,దీపాకర్మాకర్‌లను క్రీడాపోటీలను ముఖ్య అతిథులుగా ఆహ్వానించడానికి భారతీయ అథ్లెటిక్ అసోసియేషన్ ద్వారా ఆహ్వానాలు అందించనున్నట్లు ఆయన తెలిపారు. -
ఒలంపిక్ అకాడమీ ఏర్పాటుకు కృషి
నల్లగొండ టూటౌన్: జిల్లాలో ఒలంపిక్ అకాడమీ ఏర్పాటుకు కృషి చేస్తానని కలెక్టర్ పి.సత్యనారాయణరెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక మేకల అభినవ అవుట్డోర్ స్టేడియంలో జరిగిన 1వ జూనియర్ బాలికల రాష్ట్రస్థాయి పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హాకీ క్రీడకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు క్రీడా సంఘాలు చొరవ తీసుకోవాలన్నారు. విద్యార్థులు విద్యతో పాటు తమకు నచ్చిన క్రీడలో పాల్గొని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించి, జిల్లాకు పేరు తీసుకురావాలని సూచించారు. క్రీడా పోటీల అభివృద్ధి కోసం పూర్తి సహకారం అందించనున్నట్లు తెలిపారు. అనంతరం పద్మశ్రీ అవార్డు గ్రహీత ముఖేష్ మాట్లాడుతూ తెలంగాణలోని క్రీడాకారులను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దడమే తన లక్ష్యమన్నారు. క్రీడాకారులు నిత్య సాధన చేస్తే హాకీలో రాణించవచ్చన్నారు. హాకీ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డీఎస్డీఓ మక్బూల్ అహ్మద్, హాకీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కొండకింది చినవెంకట్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎం.డీ.ఇమామ్ ఖరీం, డాక్టర్ హఫీజ్‌ఖాన్, సలీం, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు సుంకరి భిక్షంగౌడ్, పీఈటీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పి.కృష్ణమూర్తిగౌడ్, దూసరి కిరణ్, బి.శ్రీనివాస్, వి.రవీందర్, కె.వెంకటేశ్వర్లు యాదవ్, సీహెచ్.బ్రహ్మయ్య, దావూద్, భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు. -
ఆటాడుకుందాం..రా
వలంటీర్ల తరహాలో పీఈటీలు ∙జిల్లాలో 275 మంది నియామకం పాపన్నపేట:ఒలింపిక్ క్రీడా ఫలితాలు అధికారుల కళ్లు తెరిపించాయి. జనాభా పరంగా ప్రపంచంలో రెండో స్థానంలో ఉన్న భారత్ ఒలింపిక్ క్రీడల్లో ఉనికి చాటుకునే ప్రయత్నంలో రెండు పతకాలు సాధించడం కొంతలో కొంత ఊరట కలిగించింది. ముఖ్యంగా రెజ్లింగ్‌లో సాక్షిమాలిక్ కాంస్యం, బ్యాడ్మింటలో తెలుగు తేజం సింధు రజత పతకం పొంది.. పోరాడితే ఏదైనా సాధించవచ్చని నిరూపించారు. ఈ తరహా ‘సక్సెస్ ఆటిట్యూడ్’ను చిన్నప్పటి నుండే పిల్లలకు నేర్పాలన్న సందేశాన్ని వీరు సాధించిన విజయం అందించింది. దీంతో ప్రతి ప్రభుత్వ పాఠశాలలో పీఈటీలను నియమించి గ్రామీణ స్థాయి నుంచే మెరికల్లాంటి క్రీడాకారులనుతీర్చిదిద్దేందుకు చర్యలు ప్రారంభమయ్యాయి. వందకు పైగా విద్యార్థులున్న స్కూళ్లలో వలంటీర్ పీఈటీలను నియమించేందుకు సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఆటలు అటకెక్కాయి..మెదక్ జిల్లాలో మొత్తం 508 ఉన్నత పాఠశాలలు, 416 ప్రాథమికోన్నత, 1,907 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. అయితే విద్యాహక్కు చట్టం ప్రకారం అన్ని ప్రాథమికోన్నత పాఠశాలల్లో పీఈటీలు, ఆట స్థలాలు ఉండాలి. కాని మెదక్ జిల్లాలో 759 పాఠశాలలకు మైదానాలు లేవు. మొత్తం 162 మంది పీఈటీలు, 63 ఫిజికల్ డైరక్టర్లు ఉండగా మిగతా పాఠశాలల్లో పీఈటీలు లేరు. దీంతో వేలాది మంది విద్యార్థులను ఆటలాడించే పరిస్థితి లేదు. మొక్కుబడిగా క్రీడలు.. ఉన్నత, ప్రాథమికోన్నత పాఠశాలల్లో క్రీడలకు పీరియడ్లు కేటాయించాలి. కాని చాలా చోట్ల పీఈటీలు, వసతులు లేక ప్రత్యేక పీరియడ్లు కేటాయించడం లేదన్న విమర్శలున్నాయి. కేవలం 15 ఆగస్టు, 26 జనవరికి మాత్రమే మొక్కుబడిగా ఆటలాడిస్తున్నట్లు సమాచారం. అప్పట్లో మండల స్థాయి టోర్నమెంట్లు జరిగేవి. కాని ప్రస్తుతం పైకా (పంచాయతీ యువ ఖేల్ అభియా¯ŒS) పేరిట క్రీడాకారుల ఎంపికలు మాత్రమే జరుగుతున్నాయి. అలాగే క్రీడల కోసం ప్రత్యేక నిధులు పాఠశాలలకు మంజూరు కావడం లేదు. ఉన్నత పాఠశాలలకు ఆర్‌ఎంఎస్‌ఏ కింద ఏటా వచ్చే రూ.7,500లలో లైబ్రరీ పుస్తకాలు, క్రీడా సామగ్రి కొనుగోలుకు అవకాశం ఉంది. వంద మంది విద్యార్థులు దాటితే పీఈటీ క్రీడలకు పెద్దపీట వేసే లక్ష్యంతో మొదట వంద మందికి పైగా విద్యార్థులున్న ఉన్నత పాఠశాలల్లో వలంటీర్ పీఈటీలను నియమించాలని పాఠశాల విద్యా డైరక్టర్ కిష¯ŒS ఆదేశాలు జారీ చేశారు. దీంతో జిల్లాలో సుమారు 275 మంది పీఈటీలు నియామకమయ్యే అవకాశం ఉంది. సెస్టెంబర్ 1 కల్లా వీరిని నియమించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఆటలకు నిధులు కేటాయించాలి: పీడీ శ్రీధర్‌రెడ్డి ప్రతి పాఠశాలలో ఆటలకు నిధులు మంజూరు చేయాలి. క్రీడలకు ఒక పీరియడ్ విధిగా కేటాయించాలి. ప్రతి ప్రాథమికోన్నత పాఠశాలకు పీఈటీని నియమించాలి. మండల స్థాయి టోర్నమెంట్లు నిర్వహించాలి. ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఉండాలి: మధు, పీఈటీ క్రీడాకారులకు ఉద్యోగాల్లో, ప్రొఫెషనల్ కోర్సుల్లో రిజర్వేషన్లు కల్పించాలి. ప్రభుత్వం తరపున క్రీడా సామగ్రి పంపిణీ చేయాలి. మండల స్థాయిలో స్టేడియంలు నిర్మించి, కోచ్‌లను నియమించాలి. -
గోపిచంద్ బయోపిక్‌లో ఒలింపిక్స్ ఉండవట
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో మారుమోగిపోతున్న పేరు పుల్లెల గోపిచంద్. గతంలో తాను క్రీడాకారుడిగా ఎన్ని విజయాలు సాధించినా రాని ఇమేజ్, ఇప్పుడు కోచ్‌గా సొంతం చేసుకున్నాడు గోపి. తన మార్గ నిర్థేశంలో పీవీ సింధు ఒలింపిక్ మెడల్ సాధించటంతో గోపిచంద్ పేరు ఈ స్థాయిలో వినిపిస్తోంది. అదే సమయంలో గోపిచంద్ బయోపిక్‌గా తెరకెక్కుతున్న సినిమాకు కూడా భారీ క్రేజ్ ఏర్పడింది. ఒలింపిక్స్ కన్నా ముందే ఈ ప్రాజెక్ట్ ఫైనల్ అయినా.., సింధు విజయంతో సినిమా మీద అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అయితే ఇంత హైప్ క్రియేట్ చేస్తున్న ఈ సినిమాలో సింధు ఒలింపిక్స్ విజయం సాధించిన సన్నివేశాలు ఉండవట. కేవలం గోపిచంద్ కెరీర్, క్రీడాకారుడిగా ఆయన ఎదుర్కొన్న సవాళ్లతో పాటు తన తోటి క్రీడాకారిణి పీవీవీ లక్ష్మితో ఆయన ప్రేమ, వివాహం లాంటి అంశాలనే ఈ సినిమాలో చూపించనున్నారు. స్వతహాగా బ్యాట్మింటన్ క్రీడాకారుడైన సుధీర్ బాబు ఈ సినిమాలో గోపిచంద్ పాత్రలో నటిస్తుండగా జాతీయ అవార్డు సాధించిన చందమామకథలు సినిమాను తెరకెక్కించిన ప్రవీణ్ సత్తార్ డైరెక్ట్ చేస్తున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబందించిన ఇతర వివారాలు త్వరలోనే వెల్లడించనున్నారు. -
టోక్యో చేరిన ఒలింపిక్ పతాకం
టోక్యో: ఒలింపిక్ పతాకం తదుపరి ఆతిథ్య నగరం టోక్యో చేరుకుంది. జపాన్ రాజధానిలో 2020 ఒలింపిక్స్ జరగనున్న సంగతి తెలిసిందే. రియో ముగింపు వేడుకల్లో ఒలింపిక్ జెండాను లాంఛనంగా అందుకున్న టోక్యో గవర్నర్ యురికొ కొయికె అక్కడి నుంచి బుధవారం ఇక్కడి హనెడా విమానాశ్రయానికి వచ్చారు. జెండాతో స్వదేశంలో దిగగానే ఆమె మాట్లాడుతూ ‘మేం పెద్ద బాధ్యతనే తీసుకున్నాం. 52 ఏళ్ల తర్వాత మళ్లీ ఒలింపిక్ జెండా మా దేశానికి వచ్చింది’ అని అన్నారు. జపాన్ చివరిసారిగా 1964లో మెగా ఈవెంట్‌కు ఆతిథ్యమిచ్చింది. రియో నుంచి టోక్యోకు ఒలింపిక్ ఫ్లాగ్ రావడంపై సరదాగా ఓ వీడియోగేమ్ రూపొందింది. ఇందులో జపాన్ ప్రధాని షింజో ఏబ్ సూపర్ మారియోగా... రియోలోని భూభాగాన్ని తొలుస్తూ టోక్యోలో భూమిని చీల్చుకుంటూ వస్తాడు. ఈ కామికల్ విడియోగేమ్‌పై జపాన్ ప్రజల ఆసక్తిని తాను తెలుసుకోవాలనుకుంటున్నట్లు ప్రధాని షింజో ఏబ్ చెప్పారు. -
రాష్ట్రస్థాయి స్టూడెంట్ ఒలింపిక్స్‌కు క్రీడాకారుల ఎంపిక
నెల్లూరు(బందావనం): రాష్ట్రస్థాయి స్టూడెంట్స్ ఒలింపిక్స్‌కు జిల్లా క్రీడాకారుల ఎంపికను ఆది,సోమవారాల్లో నిర్వహించారు. జిల్లా స్టూడెంట్స్ ఒలింపిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి విజయభరద్వాజ్రెడ్డి ఎంపికల వివరాలను వెల్లడించారు. బాలాజీనగర్, సరస్వతినగర్, కలివెలపాళెంలోని స్వామిదాస్, మోడరన్ స్కూల్, రెయిన్బో స్కూళ్ల మైదానాల్లో అండర్ 10 నుంచి అండర్–22 వరకు అథ్లెటిక్స్, హాకీ, వాలీబాల్, కబడ్డీ, త్రోబాల్, బ్యాడ్మింటన్ పోటీలను నిర్వహించినట్లు తెలిపారు. అథ్లెటిక్స్‌లో మొదటి మూడుస్థానాల్లో నిలిచిన, టీం ఈవెంట్లలో మొదటి రెండుస్థానాల్లో నిలిచిన జట్లను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికచేసినట్లు వివరించారు. సెప్టెంబరు 10,11 తేదీల్లో నెల్లూరులో రాష్ట్రస్థాయి పోటీలు ఉంటాయని తెలిపారు. జిల్లా స్టూడెంట్స్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎల్ సందీప్, సభ్యులు హరికష్ణ, మల్లికార్జున, ఆదినారాయణ తదితరులు ఎంపికలను పర్యవేక్షించారన్నారు. -
ఒలంపిక్ ఫుట్‌బాల్ కింగ్ బ్రెజిల్
-
మా సింధు బంగారం
రజతంతో దేశ ప్రజల హృదయాల్ని గెలుచుకుని, రియో ఒలింపిక్స్‌లో ఆ పథకం గెలుచుకున్న తొలి భారతీయురాలిగా చరిత్ర సృష్టించిన సింధుకు తమిళనాట అభినందనలు వెల్లువెత్తాయి. ఇక కాంస్యంతో అదరహో అనిపించిన సాక్షి మాలిక్‌కూ ప్రశంసలు అందుతున్నాయి. సాక్షి, చెన్నై: రియో ఒలింపిక్స్‌లో పతకంపై భారత్ ఆశలు వదులుకుంటున్న సమయంలో ఇద్దరు భారతావనితలు మెరిశారు. తమ సత్తాను చాటి ఒలింపిక్స్ పతకాల పట్టికలో భారత్‌కు చోటు కల్పించడంతో పాటు చరిత్ర సృష్టించే స్థాయికి ఎదిగారు. ఇందులో ప్రథమంగా భారత ఖ్యాతిని చాటే విధంగా బ్యాడ్మింటన్‌లో రాకెట్ వేగంతో చరిత్ర కెక్కిన షట్లర్ సింధు వీరోచిత శ్రమ యా వత్ భారతావని హృదయాల్ని తాకింది. అలా గే, రెజ్లింగ్‌లో కంచుమోత మోగించిన సాక్షి మా లిక్ ఆట తీరు ప్రశంసల జల్లుల్ని కురిపించింది. క్రీడాభిమానుల్లో ఆనందాన్ని నింపుతూ, దేశ ఖ్యాతిని చాటిన ఆ ఇద్దరికి తమిళనాట అభినందనలు వెల్లువెత్తాయి. తమిళనాడు సీఎం జయలలిత సింధు కు ప్రత్యేక అభినందనలు తెలుపుతూ, కాంస్యంతో సత్తా చాటిన సాక్షిని ప్రశంసించారు. భారత దేశంలోని క్రీడాకారుల్లో ఈ ఇద్దరూ ఉద్వేగాన్ని నింపారని వ్యాఖ్యానించారు. యువతులందరికీ ఈ ఇద్దరు ఆదర్శంగా కొనియాడారు. కఠోర శ్రమ, ఆ ఇద్దర్నీ ఉన్నత స్థితికి చేర్చిందనిపేర్కొంటూ, వారికి శిక్షణ అందించిన కోచ్‌లకు శుభాకాంక్షలు తెలియజేశారు. సింధు ఆట తీరును ప్రత్యేకంగా అభినందిస్తూ, ఆమె తల్లిదండ్రులను ప్రశంసించారు. డీఎంకే అధినేత ఎం.కరుణానిధి తన సందేశంలో అన్నీ పోటీల్లో విజయం లక్ష్యంగా సింధు ప్రదర్శించిన ఆట తీరు అమోఘం అని అభినందించారు. బంగారం కోసం ఆమె వీరోచితంగా శ్రమించారని, ఫైనల్ మ్యాచ్‌ను చూసిన తానే ఉత్కంఠకు గురైనట్టు పేర్కొన్నారు. ఆత్మస్థయిర్యంతో చివరి మ్యాచ్‌లో ముందుకు సాగి ఓడినా, చరిత్ర సృష్టించడం ఆనందంగా ఉందన్నారు. భవిష్యతులో ఆమె మరింత ఉన్నత స్థితికి చేరుతారని ఆకాంక్షించారు. ఇక, సాక్షికి తన ప్రత్యేక అభినందనలు తెలుపుకున్నారు. పీఎంకే యువజన నేత అన్భుమణి రాందాసు పేర్కొంటూ ఉత్కంఠ భరితంగా సాగిన పోరులో సింధు ప్రతి భను చూస్తుంటే, భవిష్యత్తులో ఆమె మరెన్నో పతకాలను తన ఖాతాలో వేసుకోవడం ఖాయం అని వ్యాఖ్యానించారు. భారత క్రీడాకారులు భవిష్యత్తులో సింధును ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని సూచించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ముత్తరసన్ పేర్కొంటూ సింధు ప్రతిభ అపారం అని, అందరికీ ఇప్పుడు ఆదర్శవంతురాలిగా అవతరించారని వ్యాఖ్యానించారు. ఇక, డీఎంకే కోశాధికారి, ప్రధాన ప్రతి పక్ష నేత ఎంకే స్టాలిన్, డీఎండీకే అధినేత విజయకాంత్లతో పాటు పలువురు నేతలు తమ అభినందనలు తెలియజేశారు. దక్షిణ భారత చలన చిత్ర సూపర్‌స్టార్ రజనీ కాంత్ అయితే, ఈ ఆటతో సింధుకు వీరాభిమానిగా మారారు. అదే బాటలో ఆయన అల్లుడు, నటుడు ధనుష్ కూడా స్పందించడం విశేషం. -
దొంగ చేతిలో తన్నులు
రియోడి జనీరో: జూడో కోర్టులో ప్రత్యర్థిని ఎత్తికుదేసిన ఆ జుడోకా బయట మాత్రం ఓ దొంగ చేతిలో దెబ్బలు తినాల్సి వచ్చింది. రియో ఒలింపిక్స్ సందర్భంగా నగరంలో పెరిగిన దొంగతనాలకు ఇది పరాకాష్టగా చెప్పుకోవచ్చు. బెల్జియం జుడోకా డిర్క్ వాన్ టిచెల్ట్ 73కేజీ జూడోలో తొలిసారిగా కాంస్యం సాధించాడు. ఈ ఆనందాన్ని కోపకబానా బీచ్‌లో సహచర జుడోకాతో జరుపుకునేందుకు ఏర్పాట్లు చేసుకున్నాడు. అయితే అంతా అనుకున్నట్టు జరగలేదు. వీరు అక్కడ సరదాగా గడుపుతుండగా అక్కడికి వచ్చిన ఓ దొంగ హఠాత్తుగా వాన్ స్నేహితుడి ఫోన్‌ను తీసుకుని పరుగందుకున్నాడు. వెంటనే తేరుకున్న వాన్ అతడి వెంటపట్టాడు. కానీ ఆ దొంగ అనూహ్యంగా కంటి మీద ఒక్క పంచ్ ఇవ్వడంతో కిందపడిపోయాడు. వెంటనే తనను ఆస్పత్రికి తీసుకెళ్లగా... సీరియస్ గాయం కాదని డాక్టర్లు చెప్పారు. -
రాష్ట్రంలో తొలి మహిళా ఒలంపిక్ క్రీడా సంఘం
నూనెపల్లె: క్రీడల్లో పురుషులతో పాటు మహిళలు రాణించాలని ఏపీ మహిళా ఒలంపిక్ సంఘం అధ్యక్షురాలు (ఫెన్సింగ్) కండె వాణి పిలుపునిచ్చారు. తైక్వాండో సంఘం రాష్ట్ర కార్యదర్శి నంద్యాల మహేశ్వరరావు అధ్యక్షతన మహిళా సంఘాన్ని మంగళవారం ప్రకటించారు. ఈ సందర్భంగా వాణి మాట్లాడుతూ మహిళలు క్రీడల్లో రాణిస్తే బంగారు భవిష్యత్తు ఉంటుందన్నారు. రాష్ట్రంలో తొలి మహిళా ఒలంపిక క్రీడా సంఘం ఏర్పాటు కావడం హర్షణీయమన్నారు. సంఘం అధ్యక్షురాలిగా కండె వాణి (ఫెన్సింగ్ కర్నూలు), ప్రధాన కార్యదర్శిగా మహేశ్వరరావు (తైక్వాండో), కోశాధికారిగా ఎల్. శాంతి (యోగా, కృష్ణాజిల్లా),ఉపాధ్యక్షులుగా సి.హెచ్.వి.విజయలక్ష్మి (ఫుట్‌బాల్, తూర్పుగోదావరి), నాగమాధవి (బాల్ బ్యాడ్మింటన్ చిత్తూరు)తో పాటు ముగ్గురిని సహాయ కార్యదర్శులుగా, ఆరు మందిని కార్యవర్గ సభ్యులుగా ఎంపిక చేశారు. -
సుశీల్ చేసిన తప్పేంటి?
రెజ్లింగ్‌లో ఒలింపిక్ పతకం కోసం58 ఏళ్ల ఎదురు చూపులకు తెరదించడం అతను చేసిన నేరమా? వరుసగా రెండు ఒలింపిక్స్‌లో భారత్‌కు పతకాలు అందించడం అతను చేసిన తప్పా? ఏం చేశాడని ఈ వివక్ష...? ఎందుకు సుశీల్ కుమార్‌ను ఇంత దారుణంగా అవమానించారు? దేశానికి బెర్త్ తెచ్చింది నర్సింగ్ యాదవ్ కాబట్టి... అతడినే రియో ఒలింపిక్స్‌కు పంపిస్తామంటే... సహజ న్యాయాన్ని పాటిస్తున్నారులే అని సరిపెట్టుకున్నాం... కానీ నర్సింగ్ డోపింగ్‌లో దొరికన తర్వాత అతని స్థానంలో మరో ఆటగాడిని పంపించే అవకాశం ఉన్నా... సుశీల్‌ను కాదన్నారంటే దీనిని ఎలా అర్థం చేసుకోవాలి? బీజింగ్, లండన్ ఒలింపిక్స్‌లలో మువ్వన్నెలను రెపరెపలాడించి, దేశానికి కీర్తి తెచ్చిన ఆటగాడిని ఇంత దారుణంగా అవమానిస్తారా? దేశ ప్రయోజనాల కంటే తమ స్వార్థానికే పెద్దపీట వేసే పెద్దలు ఆటను నడుపుతారా? ఒలింపిక్స్‌కు ముందు దేశంలో రె జ్లింగ్లో జరిగిన పరిణామాలు క్రీడారంగానికి ఏ మాత్రం మేలు చేసేవి కావు. సాక్షి క్రీడావిభాగం ‘లండన్‌లో దక్కని స్వర్ణాన్ని రియోలో సాధిస్తా... ‘పసిడి’ ప్రయత్నాలకు ఇప్పటి నుంచే సన్నాహాలు మొదలుపెడతా’ నాలుగేళ్ల క్రితం లండన్ ఒలింపిక్స్‌లో రజతం గెలుచుకున్న వెంటనే భారత స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ చేసిన వ్యాఖ్యలివి. అయితే రెజ్లింగ్‌ను 2020 టోక్యో ఒలింపిక్స్ నుంచి తొలగిస్తున్నామంటూ 2013 ఫిబ్రవరిలో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) ప్రకటించడంతో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. అయితే రెజ్లింగ్ ఒలింపిక్స్‌లో కొనసాగించాలనే పట్టుదలతో యునెటైడ్ వరల్డ్ రెజ్లింగ్ కొత్త తరహా ఆలోచనలతో ముందుకు వచ్చింది. వెయిట్ కేటగిరీలను మార్చడం, ఈ క్రీడను సులభంగా అర్ధం చేసుకొనేలా నిబంధనలను రూపొందిం చడం, ఒలింపిక్స్‌లో పురుషులతోపాటు మహిళా రెజ్లర్లకు కూడా సమానంగా స్వర్ణాలు లభించేలా చేయడం లాంటివి ఇందులో భాగమే. ఈ మార్పులను 2016 రియో ఒలింపిక్స్ నుంచే అమలు చేయాలని నిర్ణయించారు. దాంతో సుశీల్ పోటీపడే 66 కేజీల విభాగం, యోగేశ్వర్ దత్ పాల్గొనే 60 కేజీల విభాగం ఒలింపిక్స్‌లో లేకుండా పోయాయి. వీటి స్థానంలో కొత్తగా 65 కేజీల విభాగం వచ్చింది. లండన్ ఒలింపిక్స్‌లో 60 కేజీల విభాగంలో కాంస్యం నెగ్గిన యోగేశ్వర్ దత్ అవకాశాలు దెబ్బ తినకూడదనే ఉద్దేశంతో సుశీల్ 74 కేజీల విభాగానికి మారిపోయాడు. యోగేశ్వర్ 65 కేజీల విభాగంలో పోటీపడాలని నిర్ణయించుకున్నారు. 2013 సెప్టెంబరులో నిర్వహించిన ఓటింగ్‌లో రెజ్లింగ్‌కు అత్యధిక ఓట్లు రావడంతో 2020, 2024 ఒలింపిక్స్‌లో రెజ్లింగ్‌ను కొనసాగిస్తున్నట్లు ఐఓసీ ప్రకటించింది. రెండో అవకాశం లేకుండా: సుశీల్ కొత్తగా మారిన 74 కేజీల విభాగంలో నర్సింగ్ యాదవ్ అప్పటికే నిలకడగా రాణిస్తున్నాడు. 2014 గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్‌లో సుశీల్ 74 కేజీల విభాగంలో పోటీపడి స్వర్ణాన్ని సాధించాడు. అదే ఏడాది ఇంచియాన్ ఆసియా క్రీడలకు సుశీల్ దూరంగా ఉండటంతో... అతని స్థానంలో బరిలోకి దిగిన నర్సింగ్ కాంస్య పతకాన్ని నెగ్గాడు. ఆ తర్వాత సుశీల్ భుజం గాయం కారణంగా మరే అంతర్జాతీయ టోర్నీలో పాల్గొనకున్నా ఒలింపిక్స్ సన్నాహాలను మాత్రం కొనసాగించాడు. 2015 సెప్టెంబరులో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్ పోటీల సమయానికి సుశీల్ కోలుకోకపోవడంతో నర్సింగ్ 74 కేజీల విభాగంలో భారత్‌కు ప్రాతినిధ్యం వహిం చాడు. కాంస్యాన్ని సాధించడంతోపాటు భారత్‌కు ఒలింపిక్ బెర్త్‌ను అందించాడు. ఒకసారి ఒక వెయిట్ కేటగిరీలో ఒలింపిక్ బెర్త్ ఖాయమైతే ఆ కేటగిరీలో ఆ దేశానికి మరోసారి పోటీపడే అవకాశం ఉండ దు. నర్సింగ్ ఒలింపిక్ బెర్త్ సంపాదించడంతో 74 కిలోల విభాగంలో సుశీల్‌కు ఒలింపిక్ బెర్త్ సాధించే అవకాశం లేకుండా పోయింది. తేడా ఎక్కడ వచ్చిదంటే: నర్సింగ్ ఒలింపిక్ బెర్త్ తెచ్చినా రెండు ఒలింపిక్ పతకాలు నెగ్గిన సుశీల్ కూడా ఇదే విభాగంలో పోటీ పడుతుండటంతో రియోకు ఎవరు వెళ్తారనే ప్రశ్న ఉత్పన్నమైంది. ఈ విషయాన్ని సుశీల్ కుమార్ వర్గం భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ దృష్టికి తెచ్చింది. అప్పటికి ఒలింపిక్స్‌కు ఏడాది సమయం ఉండటంతో... రియోకు ఎవరిని పంపించాలి అనే విషయం ట్రయల్స్ ద్వారా నిర్ణయిస్తామని సుశీల్ వర్గానికి బ్రిజ్‌భూషణ్ హామీ ఇచ్చారు. దాంతో ఈ విషయాన్ని అందరూ మర్చిపోయారు. అయితే 2015 డిసెంబరులో భారత్‌లో తొలిసారి ప్రొ రెజ్లింగ్ లీగ్‌ను నిర్వహించారు. సుశీల్‌ను ఉత్తర్‌ప్రదేశ్ వారియర్స్ ఫ్రాంచైజీ రూ. 38.20 లక్షలకు కొనుగోలు చేసింది. మరోవైపు యోగేశ్వర్ దత్, ఇద్దరు విదేశీ మహిళా రెజ్లర్లకు సుశీల్ కంటే ఎక్కువ మొత్తాన్ని వెచ్చించి కొనుగోలు చేయడం ఆశ్చర్యపరచింది. ప్రొ రెజ్లింగ్ లీగ్ ప్రారంభానికి ఒక్క రోజు ముందు సుశీల్ గాయం కారణంగా వైదొలుగుతున్నట్లు ప్రకటించడం తో లీగ్ నిర్వాహకులు షాక్ తిన్నారు. సుశీల్ గైర్హాజరీలో లీగ్ అనుకున్నంత సక్సెస్ కాలేకపోయింది. సుశీల్ కారణంగానే లీగ్‌కు దెబ్బ పడిందని నిర్వాహకులతోపాటు బ్రిజ్‌భూషణ్ భావించారు. అసలు విలన్ ఆయనే: లీగ్ ముగిశాక జరిగిన ఒలింపిక్ అర్హత టోర్నీల ద్వారా భారత్‌కు ఎనిమిది బెర్త్‌లు ఖాయమయ్యాయి. మరోవైపు ఒలింపిక్స్ గడువు సమీపిస్తుండటంతో ట్రయల్స్ గురించి బ్రిజ్‌భూషణ్‌ను సుశీల్ వర్గం వాకబు చేసింది. అయితే ప్రొ రెజ్లింగ్ లీగ్ సమయంలో సుశీల్ చివరి నిమిషంలో వైదొలిగిన విషయాన్ని మనసులో పెట్టుకున్న డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు ఒలింపిక్ బెర్త్ సంపాదించిన నర్సింగ్ యాదవే 74 కేజీల విభాగంలో పాల్గొంటాడని, గతంలోనూ బెర్త్ సాధించినవారే ఒలింపిక్స్‌కు వెళ్లారని, ట్రయల్స్ నిర్వహించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ట్రయల్స్ నిర్వహిస్తామని గతంలో హామీ ఇచ్చిన విషయాన్ని సుశీల్ వర్గం గుర్తు చేసినా ఫలితం లేకపోయింది. సుశీల్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించడం, అక్కడా అతనికి నిరాశ ఎదురుకావడంతో ఈ స్టార్ రెజ్లర్ రియో ఒలింపిక్స్‌లో పాల్గొనే ఆశలను వదులుకున్నాడు. ప్రత్యామ్నాయ అవకాశం ఉన్నా... అనుకోకుండా నర్సింగ్ యాదవ్ డోపింగ్‌లో దొరికిపోవడం... అతనిపై తాత్కాలిక నిషేధం పడటంతో 74 కేజీల విభాగంలో బెర్త్ ఖాళీ అయింది. నర్సింగ్ స్థానంలో వేరే రెజ్లర్‌ను పంపించే వెసులుబాటు ఉందని యునెటైడ్ వరల్డ్ రెజ్లింగ్ భారత సమాఖ్యకు, ఒలింపిక్ సంఘానికి సమాచారం అందించింది. అయితే సుశీల్‌ను పంపించే అవకాశం ఉన్నా... రెజ్లింగ్ సమాఖ్య ఈ స్టార్ రెజ్లర్‌ను విస్మరించి అంతగా అనుభవం లేని ప్రవీణ్ రాణా పేరును ఖాయం చేసింది. తద్వారా సుశీల్‌ను రియోకు పంపించకూడదనే తన మాట ను బ్రిజ్‌భూషణ్ నెగ్గించుకున్నారు. నర్సింగ్పై నిజంగానే కుట్ర జరి గిందా లేదా అనే విషయంపై రానున్న రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశమున్నా... రెజ్లింగ్ సమాఖ్య రాజకీయాలకు సుశీల్ భారీ మూల్యాన్నే చెల్లించాల్సి వచ్చింది. పంతానికి పోకుండా దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని సమాఖ్య ట్రయల్స్ నిర్వహించి ఉంటే ఈ వివాదం ఇక్కడి వరకు వచ్చేదే కాదు. మరో పతకం గెలిచే సత్తా ఉన్న సుశీల్‌ను కాదని ఒక జూనియర్‌ను పంపిస్తున్న భారత్ పతకంపై ఆశలు పెట్టుకునే అవకాశాలు మాత్రం కనిపించడం లేదు. -
జాతీయస్థాయి రెజ్లింగ్ పోటీలకు ఎంపిక
ఈ నెల 22 నుంచి 25 వర కు ఉత్తరాఖండ్‌లో జరి గే స్టూడెంట్ ఒలింపిక్ జాతీయ స్థాయి రెజ్లింగ్ పోటీలకు వరంగల్‌లో ని లాల్ బహుదుర్ కళాశాలలో ఇంటర్ ద్వితీ య సంవత్సరం చదువుతున్న ఉదయ్‌సింగ్ ఎంపికయ్యాడు. నల్గొండలో జరిగిన రాష్ట్ర స్థాయి స్టూటెండ్ ఒలింపిక్స్‌లో ప్రతిభ కనబర్చాడు. ఈ సందర్బంగా గురువారం కళాశాల ప్రిన్సిపాల్ రమాదేవి విద్యార్థిని అభినందించారు. కార్యక్రమంలో ఫిజికల్ డైరెక్టర్ ప్రభాకర్ గౌడ్, రెజ్లింగ్ కమిటీ సభ్యులు రమణారెడ్డి, మొండ్రాతి సదానందం, రవీందర్, రాజేశ్వర్ రావు, బండి రజీనికుమార్, హరిణి, సతీష్ కుమార్, లలిత, రత్నాకర్ పాల్గొన్నారు. -
తలా ఓ చెయ్యేశారు...
ధరమ్‌వీర్‌కు చేయూతనిచ్చిన గ్రామస్థులు ఒలింపిక్ 200మీ. బరిలో భారత అథ్లెట్ చండీగఢ్: ఆ కుర్రాడిలో నైపుణ్యం ఉంది... కానీ శిక్షణకు డబ్బు లేదు... ఎల్ఐసీ ఏజెంట్‌గా పనిచేస్తూ నెలకు రూ.16 వేలు సంపాదిస్తున్నాడు. కానీ పేద కుటుంబం. తండ్రి రైతు. శిక్షణ కోసం నెలకు రూ.40 వేలు ఖర్చవుతోంది..? ఏం చేయాలి..? నాలుగు నెలల క్రితం భారత అథ్లెట్ ధరమ్వీర్ పరిస్థితి ఇది. సాధారణంగా క్రీడల్లో శిక్షణ కోసం డబ్బులు కావాలంటే చాలా మంది బంధువులు కూడా అప్పు ఇవ్వడానికి వెనకాడతారు. కానీ హరియాణాలోని రోహటక్ జిల్లాలో ఉన్న అజాయిబ్ గ్రామస్థులు మాత్రం ఇంకోలా ఆలోచించారు. తమ ఊరి కుర్రాడిని ప్రోత్సహించాలని నిర్ణయించారు. తలా ఓ చెయ్యేసి రూ.4.5 లక్షలు జమ చేశారు. ఆ డబ్బు మార్చిలో ధరమ్‌వీర్‌కు ఇచ్చారు. ఆ డబ్బు తీసుకుని శిక్షణ కొనసాగించిన ఈ అథ్లెట్ మూడు నెలల్లోనే ఆ గ్రామస్థుల్లో సంబరాన్ని నింపాడు. 200 మీటర్ల విభాగంలో ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. ఆ గ్రామస్థుల ప్రోత్సాహం, ధరమ్వీర్ కష్టంతో... 200 మీటర్ల పరుగుకు 36 ఏళ్ల విరామం తర్వాత భారత్ నుంచి ఓ అథ్లెట్ ఒలింపిక్స్‌కు వెళుతున్నాడు. ఒలింపిక్స్ అర్హత మీట్లో ధరమ్వీర్ 200మీ.ను 20.45 సెకన్లలో పూర్తిచేసి రియో ప్రమాణాన్ని (20.50 సె) అందుకున్నాడు. అంతే కాకుండా 2015 ఆసియా చాంపియన్‌షిప్‌లో 20.66 సెకన్లతో తానే నెలకొల్పిన జాతీయ రికార్డును కూడా సవరించాడు. ‘వాస్తవానికి 2012 లండన్ ఒలింపిక్స్‌కే ధరమ్వీర్ అర్హత సాధించాలి. అయితే ప్రభుత్వ సహాయం లేకపోవడం, శిక్షణకు కావాల్సినంత డబ్బు లేకపోవడం కారణంగా అతను ఏమీ చేయలేకపోయాడు. 2006లో కాలేజీ స్పోర్ట్స్ మీట్ సందర్భంగా తొలిసారిగా ధరమ్వీర్ ప్రతిభను గుర్తించాను. ఆర్థిక ఇబ్బం దులు లేకపోయుంటే ఈపాటికే అతను మరిన్ని ఘనతలు సాధించేవాడు’ అని పదేళ్లుగా అతనికి కోచ్‌గా వ్యవహరిస్తున్న డాక్టర్ రమేశ్ సంధూ తెలిపారు. బోల్ట్ గురించి ఆలోచించను... రియో ఒలింపిక్స్‌లో తన వ్యక్తిగత ప్రదర్శనను మరింత మెరుగుపర్చుకునేందుకు కృషి చేస్తానని ధరమ్వీర్ తెలిపాడు. 200 మీటర్ల విభాగంలో ఒలింపిక్, ప్రపంచ చాంపియన్ అయిన జమైకా స్టార్ ఉసేన్ బోల్ట్ గురించి ఆలోచించడం లేదన్నాడు. ‘రియోలో బోల్ట్ నాకు మరో ప్రత్యర్థి లాంటివాడు. నా ప్రదర్శనపైనే నేను దృష్టి పెట్టాను. 20 సెకన్లలోపు పరుగెత్తడమే నా లక్ష్యం. రియోకు అర్హత సాధించడం నాకేమీ ఆశ్చర్యమనిపించలేదు. ఈ లక్ష్యం కోసం నేను ఎనిమిదేళ్లుగా నిరంతరం కృషి చేస్తున్నాను. భారత్‌లో ప్రతిభకు కొదువలేదు. సరైన సహాయం లభిస్తే మరింతమంది వెలుగులోకి వస్తారు’ అని ధరమ్వీర్ అంటున్నాడు. -
బోల్ట్‌కు గాయం
ఒలింపిక్స్‌కు ముందే కోలుకునే అవకాశం కింగ్స్టన్: జమైకా స్టార్ అథ్లెట్ ఉసేన్ బోల్ట్ రియో ఒలింపిక్స్‌కు ముందు గాయపడ్డాడు. జమైకా నేషనల్ ఒలింపిక్ ట్రయల్స్‌లో శుక్రవారం జరిగిన 100మీ. సెమీఫైనల్ హీట్‌ను 10.04 సెకన్లలో ముగించి ఫైనల్‌కు అర్హత సాధించాడు. ఈ రేసు అనంతరం బోల్ట్ మోకాలు పైభాగంలో అసౌకర్యానికి గుర య్యాడు. ప్రస్తుతం బోల్ట్ తొడ కండరం నొప్పిని గ్రేడ్-1గా వైద్యులు నిర్ధారించారు. అయితే బోల్ట్ రియో ఆశలకు ఎలాంటి ప్రమాదం లేదు. మరో మూడు వారాల్లో లండన్‌లో జరగనున్న డైమండ్ లీగ్ ద్వారా బోల్ట్ రియో బెర్తు దక్కించుకోవచ్చు. -
నిర్మలకు ఒలింపిక్స్ బెర్త్
సాక్షి, హైదరాబాద్: హర్యానా అథ్లెట్ నిర్మలా షెరాన్ రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. జాతీయ సీనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో మహిళల 400 మీ. పరుగును 51.48 సెకన్లలో పరుగు పూర్తి చేసి ఆమె స్వర్ణం సొంతం చేసుకుంది. రియో అర్హతా ప్రమాణమైన 52.20 సెకన్లను నిర్మల సునాయాసంగా అందుకుంది. -
బీజింగ్ గేమ్స్ తర్వాత వైదొలగమన్నారు: సుశీల్
న్యూఢిల్లీ: భారత్ నుంచి వరుసగా రెండు ఒలింపిక్ పతకాలు సాధించిన ఏకైక క్రీడాకారుడిగా రెజ్లర్ సుశీల్ కుమార్ చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. అయితే తొలిసారిగా తను 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన అనంతరం కెరీర్ నుంచి తప్పుకోవాలని కొంతమంది సలహాలిచ్చారని తెలిపాడు. ‘మై ఒలింపిక్ జర్నీ’ అనే పుస్తకంలో సుశీల్ ఈ విషయాన్ని తెలిపాడు. అయితే ఈ పతకం తన కెరీర్‌కు ఆరంభంగానే భావించానని అన్నాడు. ‘బీజింగ్ గేమ్స్ అనంతరం నేను స్వదేశానికి రాగానే నా శ్రేయోభిలాషులు ఇక కెరీర్‌కు ముగింపు పలికితే బావుంటుందని చెప్పారు. నాకు కూడా ఆ సమయంలో ఏమీ అర్థం కాలేదు. అయితే ఇన్నేళ్ల కాలంలో ఒలింపిక్ విజేతకు గల అర్థమేమిటో తెలిసింది. ఆ పత కం సాధించిన అనంతరం రెజ్లింగ్‌పై మరింత అవగాహన పెంచుకున్నాను. అందుకే అది ఆరంభమే కానీ ముగింపు కాదని భావించాను’ అని సుశీల్ పేర్కొన్నాడు. -
వికాస్, మనోజ్‌లకు రియో బెర్త్‌లు
బాకు: వికాస్ క్రిషన్ (75కేజీ), మనోజ్ కుమార్ (64కేజీ)లకు ఒలింపిక్ బెర్త్‌లు ఖరారయ్యాయి. ఐబా ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రపంచ క్వాలిఫయింగ్ టోర్నీలో వీరిద్దరు సెమీఫైనల్స్‌కు చేరారు. క్వార్టర్ ఫైనల్స్‌లో వికాస్ 3-0తో లీ డోంగ్యున్ (కొరియా)ను ఓడించగా.. మనోజ్ 3-0తో రఖిమోవ్ షవ్కట్జోన్ (తజకిస్తాన్)పై నెగ్గాడు. ప్రస్తుతం భారత్ నుంచి ఈ ఇద్దరితో పాటు శివథాపా రియోకు అర్హత సాధించాడు. 75 కేజీల విభాగంలో వికాస్ అర్హత సాధిచినందున... ప్రొఫెషనల్ బాక్సర్‌గా మారిన విజేందర్కు ఇక రియో అవకాశం లేదు. -
రంగుల పరుగు
-
ప్రిక్వార్టర్స్‌లో సుమిత్
బాకు (అజర్ బైజాన్): ప్రపంచ ఒలింపిక్ క్వాలిఫయింగ్ బాక్సింగ్ టోర్నమెంట్లో భారత బాక్సర్ సుమిత్ సాంగ్వాన్ (81 కేజీలు) ప్రిక్వార్టర్స్‌లోకి దూసుకెళ్లాడు. ఆదివారం జరిగిన రెండో రౌండ్లో సుమిత్ 2-1 తేడాతో ఎనిమిదో సీడ్‌గా బరిలోకి దిగిన జున్ కార్లోస్ కారిలో (కొలంబియా)పై సంచలన విజయం సాధించాడు. మరోవైపు ఆసియా క్రీడల కాంస్య పతక విజేత సతీశ్ కుమార్ (+91 కేజీలు), డీన్ గార్డినర్ (ఐర్లాండ్)తో జరిగిన బౌట్లో పరాజయం చవిచూశాడు. బౌట్ మధ్యలో సతీశ్ కంటికి గాయం కావడంతో బౌట్‌ను నిలిపివేసి గార్డినర్‌ను విజేతగా ప్రకటించారు. మరో భారత బాక్సర్ అమృత్‌ప్రీత్ సింగ్ (91 కేజీలు) తొలి రౌండ్లోనే వెనుదిరిగాడు. -
భారత బాక్సర్లకు ‘ఐబా’ అండగా నిలవాలి: బింద్రా
భారత బాక్సింగ్ సమాఖ్యలో నెలకొన్న వివాదాన్ని పరిష్కరించి బాక్సర్లకు అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం (ఏఐబీఏ-ఐబా) అండగా నిలవాలని ఒలింపిక్ స్వర్ణపతక విజేత అభినవ్ బింద్రా కోరాడు. దీనిని త్వరలో చక్కదిద్ది భారత ఆటగాళ్లు దేశం తరఫున ‘రియో’లో పాల్గొనే అవకాశం కల్పించాలని అతను విజ్ఞప్తి చేశాడు. రియో ఒలింపిక్స్‌లో భారత పతాకధారిగా వ్యవహరించనున్న బింద్రా బాకులో ప్రపంచ చాంపియన్‌షిప్ క్వాలిఫయింగ్ పోటీల్లో పాల్గొంటున్న బాక్సర్లను కలిశాడు. ప్రస్తుతం భారత సమాఖ్యపై నిషేధం కారణంగా భారత ఆటగాళ్లు ప్రధాన టోర్నీల్లో ‘ఐబా’ తరఫునే పాల్గొనాల్సి వస్తోంది. -
నలుగురు ఒలింపిక్ చాంపియన్లపై వేటు
డోపింగ్‌లో విఫలం బుడాపెస్ట్: కజకిస్తాన్‌కు చెందిన నలుగురు ఒలింపిక్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్లు డోపీలుగా తేలారు. 2012 లండన్ గేమ్స్‌లో స్వర్ణాలు సాధించిన వీరి డోపింగ్ శాంపిళ్ల రీటెస్టులు పాజిటివ్‌గా తేలాయి. దీంతో అంతర్జాతీయ వెయిట్‌లిఫ్టింగ్ సమాఖ్య వీరిపై నిషేధం విధించింది. ఇందులో బీజింగ్, లండన్ గేమ్స్‌లో స్వర్ణాలు సాధించిన కజకిస్తాన్ స్టార్ ఇల్యా ఇల్యిన్ (94కేజీ)తో పాటు జుల్ఫియా చిన్షాన్లో (53కేజీ), మైయా మనేజా (63కేజీ), స్వెత్లానా పొడోబెడేవా (73కేజీ) ఉన్నారు. అలాగే అజర్‌బైజాన్‌కు చెందిన ప్రపంచ చాంపియన్ బొయాంకా కొస్టొవా (58కేజీ), లండన్ గేమ్స్‌లో రజతం సాధించిన రష్యా లిఫ్టర్ అప్టి ఔఖడోవ్ (85కేజీ) కూడా ఉన్నారు. మరోవైపు వీరి పతకాలను వాపసు తీసుకోవడమే కాకుండా రియో గేమ్స్‌కు అనుమతించాలా? వద్దా? అనే విషయంపై త్వరలోనే అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సమావేశం కానుంది. -
కోమ్ కీ ఖౌమ్
మేరీకోమ్ తన ప్రపంచాన్నే మార్చేసింది ఆమెనే స్ఫూర్తిగా తీసుకున్న ఈ యువతులు బాక్సింగ్ రింగ్‌లోనే కాదు జీవితంలో కూడా ఒడిదొడుకులనెదుర్కొని గెలవగలమని నిరూపిస్తున్నారు అని నినదిస్తున్నారు ఉర్దూలో ఖౌమ్ అంటే జాతి. మేరీ కోమ్ భారత జాతికి అందించిన ఒలింపిక్ ఖ్యాతిని అందుకోవడానికి కొత్త తరం సిద్ధంగా ఉంది.... ఆమె జాతికి అందించిన కిరీటానికి వీళ్లు వారసులవుతారు! కోల్‌కతా ఇప్పుడు కొత్త శకాన్ని చూస్తోంది. అభ్యుదయ బాక్సింగ్ రింగ్‌కు వేదికవుతోంది. కిడ్డెర్పూర్ ఫిజికల్ కల్చర్ స్కూల్లోని బాక్సింగ్ రింగ్ ఇందుకు ప్రత్యక్ష సాక్షి. కోల్‌కతాలోని ముస్లిం యువ తులు బాక్సింగ్ గ్లవ్స్ ధరించి... విమర్శించే వారి ముఖానికి పంచ్ ఇస్తున్నారు. కోల్‌కతాలోని ఈ యువతులంతా రాబోయే విమెన్స్ నేషనల్స్ కోసం సిద్ధమవుతున్నారు. వారి కోచ్ చీనా భాయ్ (ఎకా మెహ్రాజుద్దీన్ అహ్మద్)ని పలకరిస్తే అనేక విషయాలు తెలిశాయి. 90లలో ఇదే క్లబ్లో ఇద్దరంటే ఇద్దరు ముస్లిం మహిళలు శిక్షణ తీసుకున్నారు. ఇదే క్లబ్‌కి బాక్సింగ్ నేర్చుకోవడానికి ఇప్పుడు అనేక మంది ముస్లిం యువతులు క్యూ కడుతున్నారు. పైగా వారంతా సంపన్నులేమీ కాదు. అనేక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూ, బంధువుల ఈసడింపులను భరిస్తూ ఆట మీద ఇష్టంతో కొనసాగుతున్నవారేనంటారు మెహ్రాజుద్దీన్. రకరకాల ఎదురీతలకు ఒడ్డి బాక్సింగ్‌లో రాణిస్తున్న యువతుల అభిప్రాయాలివి. ఇది మహిళలకు సేఫ్ స్పోర్ట్! కోల్‌కతాలోని ఎక్బల్పోర్లోని ‘టి’ జంక్షన్ దగ్గరకెళ్లి బాక్సర్, రెఫ్రీ షబ్నమ్ పేరు చెప్పగానే అక్కడ ఉండే వారి చూపుడు వేళ్లన్నీ ఓ మూడంతస్తుల భవనం వైపు చూపిస్తాయి. ఆ ఇంట్లో ఓ పోర్షన్లో షబ్నమ్ భర్త, పిల్లలతో జీవిస్తోంది. ఆమె భర్త ఫిట్నెస్ ఎక్స్పర్ట్, మొబైల్ ఫోన్ల డీలర్ కూడ. ఈ నేపథ్యం చూస్తే షబ్నమ్ బాక్సింగ్ కెరీర్ నల్లేరు మీద నడకలానే సాగినట్లు అనిపిస్తుంది. అయితే ఆమెకు తోటి మగబాక్సర్ల నుంచి ఆటుపోట్లు ఎదురయ్యాయి. షబ్నమ్ 1997లో కలకత్తా యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ మొదటి సంవత్సరంలో ఉన్నప్పుడు బాక్సింగ్ ప్రాక్టీస్ మొదలుపెట్టారు. ప్రస్తుతం స్థానిక, జాతీయ బృందాలకు శిక్షణనిస్తున్నారు, బాక్సింగ్ పోటీలకు రిఫరీగానూ వ్యవహరిస్తున్నారు. మూడేళ్ల అనుభవంలోనే కోచ్ అయ్యారామె. అందుకు అవసరమైన పరీక్షలను పూర్తి చేశారు. కానీ ఆమెతోపాటు శిక్షణ తీసుకున్న మగ క్రీడాకారులు చాలా మంది ఇంకా కోచ్‌లు కాలేదు. చాలాకాలం పాటు వారు తనకు అడుగడుగునా సమస్యలు సృష్టిస్తూనే వచ్చారని, వాటిని అధిగమిస్తూ రాటుతేలిపోయానని చెప్తారు షబ్నమ్. ‘‘ఇప్పుడు నా దగ్గర శిక్షణ తీసుకుంటున్న వారిలో నాకంటే పెద్దవారు, నాకంటే బలంగా ఉన్న మగవాళ్లు కూడా ఉన్నారు. అయితే వారెవ్వరూ నన్ను కోచ్‌గా అంగీకరించడానికి ఏ మాత్రం సందేహించరు. నా దగ్గర శిక్షణ తీసుకున్న అనేకమంది గోల్డ్‌మెడల్ సాధించారు. 2003లో హైదరాబాద్‌లో జరిగిన నేషనల్ గేమ్స్ లో పాల్గొన్న బెంగాల్ టీమ్‌కు శిక్షణనిచ్చాను. మా బంధువులు, నివాస ప్రదేశంలోని ముస్లిం అమ్మాయిల్లో నేను మొదటి గ్రాడ్యుయేట్‌ని, అలాగే తొలి బాక్సర్‌ని కూడా. మా అన్నయ్య బాక్సింగ్ నేర్చుకోవడంతో నాకు దారి ఏర్పడింది. నా ఇష్టాన్ని చెప్పగానే నాన్న చాలా సపోర్టు ఇచ్చారు. మా అమ్మ మాత్రం ఇలాంటి ఆటలు నేర్చుకుంటే పెళ్లెలా అవుతుందని నిరాకరించారు. కానీ నా ప్రాక్టీస్ ఆగలేదు. అప్పుడు మా అమ్మను ఒప్పించాను. ఇప్పుడు చాలామంది తల్లిదండ్రులను వారి బాలికలకు బాక్సింగ్ నేర్పించమని ఒప్పించగలుగుతున్నాను. ఇది మహిళలకు అనువైన ఆట. ఆత్మ రక్షణనిచ్చే ఆట కూడ’’. - రజియా షబ్నమ్, బాక్సింగ్ కోచ్ అమ్మానాన్న ఓకే... కానీ బంధువులే! పదిహేనేళ్ల సబినా యాస్మీన్ జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని మూడు బంగారు పతకాలు సాధించింది. కోల్‌కతాలోని బొటానికల్ గార్డెన్ సమీపంలోని క్లబ్లో శిక్షణ తీసుకుంటోంది. ఆమె తండ్రి ప్రభుత్వ ఉద్యోగి. ఆరుగురమ్మాయిల్లో సబినా చిన్నది. సబీనా పెద్దక్క ఫుట్‌బాల్ క్రీడాకారిణి. నిజానికి సబీనా తండ్రికి క్రీడాకారుడు కావాలనే కోరిక ఉండేది. అప్పటి పరిస్థితుల దృష్ట్యా అది సాధ్యం కాలేదు. దాంతో కూతుళ్లలో ఆసక్తి ఉన్న వారిని అయినా క్రీడల వైపు ప్రోత్సహించాలనేది అతడి ఆకాంక్ష. అయితే ముస్లిం ఇంటి ఆడపిల్లలు కురచ దుస్తులు ధరించడం పట్ల బంధువులు, ఇరుగుపొరుగు వారి నుంచి విమర్శలు తప్పడం లేదు. పైగా వారికి పెళ్లిళ్లు కావాలంటే ఈ ఆటలను వదిలేయడమే శ్రేయస్కరం అనే సలహాలూ వారిని వదలడం లేదు. అయితే సబినా తల్లిదండ్రులు మాత్రం ‘‘మా పిల్లలను క్రీడాకారులను చేయడానికి ఇతర ఖర్చులు తగ్గించుకుని సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్‌లో నివసిస్తున్నాం. అన్ని రాజీలతో పిల్లల్ని క్రీడాకారులను చేిసిన మా శ్రమకు, ప్రాక్టీస్ చేసిన పిల్లల శ్రమకు విలువ లేదా? ’’ అంటున్నారు. - సబినా యాస్మీన్, బాక్సర్ బాక్సింగ్నెలా వదులుతాను? సరితా ఖాతూన్... 18 ఏళ్ల అమ్మాయి. ఆమె తండ్రి కోల్‌కతాకు సమీపంలోని ‘నుంగి’ గ్రామంలో తాపీమేస్త్రీ. సరిత బాక్సర్ కావడం చాలా యాదృచ్చికంగా జరిగిపోయింది. ఆమె పెద్దన్నయ్య నుంగిలోని బాక్సింగ్ క్లబ్లో ప్రాక్టీస్ చేసేటప్పుడు సరిత కూడా అన్నయ్య వెంట వెళ్లేది. ఆమె అన్నయ్యను అనుకరిస్తూ సరదాగా పంచ్లిస్తుండేది. ఆమెలో స్పార్క్ చూసిన కోచ్‌లు ఆమెకు బాక్సింగ్ నేర్పించమని చెప్పారు. అందుకు తండ్రి ససేమిరా అన్నాడు. ఆ విముఖత... ఆమె ఏడవ తరగతిలో ఉన్నప్పుడు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ సహకారంతో జరిగిన రాష్ట్రస్థాయి పోటీలలో గోల్డ్ మెడల్ సాధించే వరకు కొనసాగింది. గోల్డ్‌మెడల్‌తో సరితకు తండ్రి నుంచి అంగీకారం వచ్చింది. ఆ తర్వాత ఆమె తిరిగి చూసుకోలేదు. 2012లో జరిగిన నేషనల్ మీట్లో కాంస్య పతకంతోపాటు మొత్తం తొమ్మిది పతకాలతో దూసుకుపోతోంది. అయితే ఆమెకి ఈ సారి మత సంప్రదాయాల పేరుతో బంధువుల నుంచి అడ్డంకి ఎదురైంది. ‘ఒక ముస్లిం అమ్మాయి బాక్సింగ్ పోటీలలో పాల్గొనడం ఏమిటి, మానెమ్’ అని సలహా రూపంలో ఆదేశించారు. అలాంటి క్లిష్టసమయంలో తల్లి తనకు అండగా నిలిచిందని సరిత చెప్తోంది. ‘‘మా అమ్మకు స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం. శిక్షణ తరగతులకు, టోర్నమెంట్లకు నాకు తోడుగా వచ్చేది. నాకు శిక్షణకు అవసరమైన షూస్, గ్లవ్స్, యూనిఫామ్, మంచి ఆహారం వంటి వసతులు సమకూర్చడానికి ఆమె చాలా శ్రమించేది. నేనీ స్థాయికి రావడానికి మా ఇద్దరి శ్రమ ఎంత ఉందో నాకు తెలుసు. అలాంటి బాక్సింగ్‌ను ఎందుకు వదులుకుంటాను? ఈ ఏడాది నేను స్కూల్ ఫైనల్ బోర్డ్ ఎగ్జామ్ రాయాలి. అయితే నాకు చదువు మీద ఎలాగూ పెద్ద ఆసక్తి లేదు కాబట్టి పరీక్షలయ్యాక బాక్సింగ్ మీదనే పూర్తి సమయం కేటాయిస్తాను. ఇందులోనే కెరీర్ బిల్డప్ చేసుకుంటాను’’. - సరితా ఖాతూన్ విమెన్ బాక్సర్ నేను బురఖా బాక్సర్‌ని! 2012లో పాట్నాలో జరిగిన నేషనల్ టోర్నమెంట్లో వెస్ట్‌బెంగాల్‌కి కాంస్య పతకాన్ని సాధించింది సిమి పర్వీన్. ఆమెది మరో రకమైన నేపథ్యం. సిమికి సామాజిక, మతపరమైన అడ్డంకులు లేవు. తల్లిదండ్రులు ప్రోత్సాహం ఉంది. సిమికి మేరీకోమ్ అంటే వల్లమాలిన అభిమానం. ఆ అభిమానమే ఆమెను బాక్సింగ్‌ను కెరీర్‌గా ఎంచుకునేలా చేసింది. ఎనిమిది మంది సంతానంలో చిన్నది సిమి. ‘‘నేను ఆర్ట్స్ గ్రాడ్యుయేషన్ స్టూడెంట్‌ని. కోల్‌కతాలోని ఎక్బాల్పోర్ ఏరియాలో నివాసం. అభ్యుదయ భావాలు కలిగిన సంప్రదాయ ముస్లిం కుటుంబం మాది. నేను బురఖా బాక్సర్‌ని అంటే మా వాళ్లంతా నవ్వుతారు. రాష్ట్రస్థాయి పోటీల్లో కాంస్య పతకం సాధించాను. ఇదే పరంపరను కొనసాగిస్తూ దేశానికి పతకాలు సాధించాలనేది నా ఆశయం’’. - సిమి పర్వీన్, బాక్సర్ ముస్లిం అమ్మాయి ఆ దుస్తులు వేసుకోరాదన్నారు! అజ్మీరాకి 18 ఏళ్లు, కశ్మీరాకి 15 ఏళ్లు. ఈ అక్కాచెల్లెళ్లకు వీనస్ విలియమ్స్, సెరీనా విలియమ్స్ సోదరీమణులు రోల్‌మోడల్స్. ఒలింపిక్స్‌లో బాక్సింగ్ పోటీల్లో పాల్గొనాలని వీరి ఆకాంక్ష. అనేక వ్యయప్రయాసలకోర్చి శిక్షణ తీసుకుంటున్నారు. కోల్‌కతాలోని కిడ్డర్పూర్ క్లబ్‌కు చేరడానికి రోజూ ఇంటి నుంచి కాలినడకన రైల్వే స్టేషన్ చేరుకుని లోకల్ ట్రైన్లో గంటన్నర సేపు ప్రయాణించాలి. వీరి తండ్రి కిడ్డర్‌పోర్ మార్కెట్లో చేపలమ్ముతాడు. ఈ నేపథ్యం నుంచి వచ్చిన ఈ అక్కాచెల్లెళ్లు ఇప్పటికి రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీల్లో ఐదు బంగారు పతకాలను సాధించారు. ఆర్థిక పరిస్థితులను ఎదుర్కోవడంతోపాటు సంప్రదాయ ఆంక్షలకు ఎదురీదడం కష్టమైన పనేనంటారు. మేనత్త ఒత్తిడి తట్టుకోవడం వీరికి కత్తిమీద సామవుతోంది. ‘బాక్సింగ్ సాధన సమయంలో ధరించే దుస్తులను ముస్లిం అమ్మాయిలు ధరించరాదు, కాబట్టి బాక్సింగ్ సాధన మానేయ’మనే మేనత్త వేధింపు భరించలేని స్థాయిలో ఉంటోందని చెప్తోంది కశ్మీరా. ఇంటి పరిసరాల్లోని మగవాళ్లు కూడా వీరు కనిపించగానే ‘బాక్సర్స్’ అని ఎగతాళిగా కేకలు పెడుతున్నారు. ఇన్ని అవాంతరాలను ఎదుర్కొంటూ కూడా ముందుకు సాగాలనేదే తమ నిర్ణయమని చెప్తున్నారు ఈ అక్కాచెల్లెళ్లు. శిక్షణకు అవసరమైన ఆర్థిక వెసులుబాటు కోసం ఉద్యోగం వెతుక్కునే పనిలో పడింది అజ్మీరా. -
వెయిట్‌లిఫ్టింగ్‌లో రెండు ‘రియో’ బెర్త్‌లు
ఆసియా చాంపియన్‌షిప్‌లో భారత వెయిట్‌లిఫ్టర్ల ప్రదర్శన రెండు ఒలింపిక్ బెర్త్‌లను అందించింది. ఉజ్బెకిస్తాన్‌లోని తాష్కెంట్ నగరంలో జరిగిన ఈ పోటీల్లో భారత్‌కు ఒక్క పతకం రాకపోయినా... ఓవరాల్ నైపుణ్యంతో పురుషుల, మహిళల విభాగాల్లో ఒక్కో బెర్త్ లభించింది. -
గర్భిణులు ఒలింపిక్స్‌కు వెళ్లొద్దు!
ఈ ఏడు జరిగే ఒలింపిక్స్‌కు గర్భిణులు వెళ్లకపోవడం మంచిదని అమెరికా ప్రభుత్వం సలహా ఇస్తోంది. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) ఈసారి బ్రెజిల్లో జరిగే ఒలింపిక్స్‌కు జికా వైరస్ ప్రమాదం పొంచి ఉందని, దీంతో గర్భిణిలు ఒలింపిక్స్ సందర్శనకు వెళ్లరాదని సూచిస్తోంది. పుట్టబోయే పిల్లలకు జికా వైరస్ వల్ల ఎటువంటి నష్టం కలగకూడదన్న అభిప్రాయంతోనే ఈ ప్రత్యేక సూచన చేస్తున్నట్లు సీడీసీ తెలిపింది. 2016లో తప్పనిసరిగా ఒలింపిక్స్‌కు వెళ్లాలనుకున్న గర్భిణిలు మాత్రం ముందుగా తమ డాక్లర్లు, లేదా హెల్త్ కేర్ ప్రొవైడర్ల సలహాలు, సూచనల మేరకు తగు జాగ్రత్తలు పాటించాలని సీడీసీ ట్రావెల్ అడ్వైజరీ ఇచ్చింది. ముఖ్యంగా జికా వైరస్‌ను దృష్టిలో పెట్టుకొని దోమలు కుట్టకుండా చూసుకోవాలని సూచిస్తోంది గర్భిణులు మాత్రమే కాదు, వారి భర్తలు ఒలింపిక్స్‌కు వెళ్లినా జికా ప్రమాదం ఉంటుందని సీడీసీ చెప్తోంది. అందుకే అలా వెళ్లాలనుకునే వారు ఇతరత్రా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని, ఒలింపిక్స్ సందర్శనకు వెళ్లి వచ్చిన భర్తతో సెక్స్ విషయంలోనూ గర్భిణులు జాగ్రత్తలు పాటించాలని, లేందంటే పుట్టబోయే పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని గర్భిణిగా ఉన్నంతకాలం సెక్స్ దూరంగా ఉండటం మంచిదని హెచ్చరిస్తోంది. ముఖ్యంగా బ్రెజిల్లో జికా వ్యాప్తి గణనీయంగా ఉండటంతో సీడీసీ ఈ ప్రత్యేక సిఫార్సులు చేసింది. అయితే పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంటామని సీడీసీ వెల్లడించింది. దోమల వల్ల కలిగే జికా వైరస్ బ్రెజిల్లో వ్యాప్తి చెందుతున్నట్లు గత సంవత్సరంలో బ్రెజిలియన్ అధికారులు వెల్లడించిన నేపథ్యంలో ఇటువంటి ముందుజాగ్రత్త చర్యలను తీసుకుంటున్నట్లు సీడీసీ చెబుతోంది. గర్భిణులకు జికా వైరస్ సోకితే పుట్టబోయే పిల్లల పెరుగుదలలో అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని సీడీసీ హెచ్చరిస్తోంది. ముఖ్యంగా చిన్న తలతో పుట్టడం, శారీరక ఎదుగుదల లోపించడం, వినికిడి శక్తిలోపం వంటి అసాధారణ సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని.. కొన్ని సందర్భాల్లో ఈ సమస్యలు జీవితానికే ప్రమాదం కావచ్చని చెబుతోంది. -
అంతరిక్షంలో అడుగు పెట్టిన ఒలంపిక్ జ్యోతి