
నిర్మలకు ఒలింపిక్స్ బెర్త్
హర్యానా అథ్లెట్ నిర్మలా షెరాన్ రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. జాతీయ సీనియర్ అథ్లెటిక్స్
సాక్షి, హైదరాబాద్: హర్యానా అథ్లెట్ నిర్మలా షెరాన్ రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. జాతీయ సీనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో మహిళల 400 మీ. పరుగును 51.48 సెకన్లలో పరుగు పూర్తి చేసి ఆమె స్వర్ణం సొంతం చేసుకుంది. రియో అర్హతా ప్రమాణమైన 52.20 సెకన్లను నిర్మల సునాయాసంగా అందుకుంది.