
సాక్షి, హైదరాబాద్: పారిస్ వేదికగా ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైన 2024 ఒలింపిక్ పోటీలకు దేశం నుంచి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ పోటీలను తిలకిచడానికి నగరం నుంచి మెగాస్టార్ చిరంజీవి కుటుంబ సమేతంగా పారిస్ వెళ్లారు. కుటుంబ సభ్యులు సురేఖ, రామ్‌చరణ్, ఉపాసనతో పాటు మనుమరాలు క్లీంకారతో తీసుకున్న ఫొటోలను సోషల్ యాప్‌లో పోస్ట్ చేస్తూ సంతోషాన్ని వ్యక్తపరిచారు.
ప్రముఖ వ్యాపారవేత్త, ఫ్యాషన్ ఐకాన్ సుధారెడ్డి కూడా పారిస్ ఒలింపిక్స్‌లో మెరిశారు. అయితే 117 మందితో కూడిన భారత ఒలింపిక్ క్రీడాకారుల బృందంలో నగరం నుంచి నలుగురు మహిళా అథ్లెట్లు పాల్గొంటున్నారు. అంతేకాకుండా భారత జాతీయ ఫ్లాగ్ బేరర్‌గా తెలుగమ్మాయి పీవీ సింధూ నాయకత్వం వహించడం విశేషం. జాతీయ జెండా రంగులతో రూపొందించిన చీరతో పీవీ సింధూ షేర్ చేసిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
Comments
Please login to add a commentAdd a comment