
పారిస్ ఒలింపిక్స్‌లో మెగా ఫ్యామిలీ సందడి చేస్తోంది. గేమ్స్ ప్రారంభానికి ముందే పారిస్ చేరుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి దంపతులు, రామ్ చరణ్, ఉపాసన, క్లీంకారతో పాటు బయలుదేరి వెళ్లారు. ప్రారంభ వేడుకల్లోనూ ఒలింపిక్ జ్యోతి పట్టుకుని చిరంజీవి, సురేఖ కనిపించారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి.
తాజాగా పారిస్ వీధుల్లో రామ్ చరణ్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు కలిసి ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకున్నారు. వారిద్దరూ సరదాగా ముచ్చటిస్తున్న వీడియో నెట్టింట వైరలవుతోంది. అనుకోకుండా రామ్ చరణ్, సింధు కలుసుకోవడం చెర్రీ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. చెర్రీ పెట్ డాగ్ రైమ్ గురించి సింధు ఆరాతీస్తూ కనిపించింది. ఎక్కడికెళ్లినా రైమ్‌ను తీసుకెళ్తారా? అంటూ రామ్ చరణ్ అడిగింది. సింధు ఆటతీరుని ప్రశంసిస్తూ ఆమె రాబోయే మ్యాచుల్లో అద్భుతంగా రాణించాలని కోరుతూ రైమ్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. కాగా.. పీవీ సింధు ఇవాళ తన తొలి విజయాన్ని నమోదు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment