గుర్రాలపై విన్యాసాలు.. పరుగు పందేలు..
చదువుతో పాటూ క్రీడలూ ముఖ్యమే..
ఒలింపిక్స్ జాతీయ చాంపియన్ (స్ప్రింటింగ్) జ్యోతిక శ్రీదండి
సనత్‌నగర్ : బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (హెచ్‌పీఎస్) 101వ వార్షిక క్రీడోత్సవం శుక్రవారం ఘనంగా జరిగింది. హెచ్‌పీఎస్ ఆవరణలోని ఫ్రంట్ ఫీల్డ్‌లో అట్టహాసంగా నిర్వహించిన క్రీడా సంబరాల్లో వివిధ తరగతులకు చెందిన విద్యార్థులు ఆయా క్రీడల్లో సత్తా చాటారు. హెడ్‌బాయ్ శాని్వసాగి, హెడ్‌బాయ్ సార్తక్ లాంబా నేతృత్వంలో పాఠశాలలోని తక్షశిల, నాగార్జున, నలంద, విజయనగర బృందాలు అద్భుతరీతిలో మార్చ్‌ఫాస్ట్ నిర్వహణతో వేడుకలు ప్రారంభమయ్యాయి. ఒకవైపు విద్యార్థులు కేరింతల నడుమ క్రీడాకారులు విజయం సాధించి తమ బృందానికి కీర్తి ప్రతిష్టలు తెచి్చపెట్టేందుకు పోటీపడారు.
సీనియర్ బాలురు, బాలికల 100 మీటర్ల పరుగు పందెంలో విజయనగర హౌస్‌కు చెందిన రుత్విక్ వూవాదన్, ఎస్‌ఎస్ సమితరెడ్డిలు మొదటి స్థానంలో నిలిచారు. అలాగే హార్స్ రైడింగ్ క్లబ్‌కు చెందిన విద్యార్థులు గుర్రాలపై విన్యాసాలు చేసి అలరించారు. ఏరోబిక్స్ విన్యాసాలు ఒళ్లు గగుర్పొడిచేలా చేశాయి. అనంతరం 6, 7 తరగతులకు చెందిన 690 మంది విద్యార్థులు ‘టాలోన్స్ ఆఫ్ ట్రయంఫ్’ పేరుతో ఆకర్షణీయమైన ప్రదర్శన ఇచ్చారు. పర్పుల్ అండ్ వైట్ దుస్తులు ధరించిన విద్యార్థులు రిబ్బన్లతో అదిరిపోయే సింఫనీని సృష్టించారు.
3, 4, 5 తరగతులకు చెందిన 981 మంది విద్యార్థులు ఆక్స్‌ఫర్ట్ అండ్ కేంబ్రిడ్జి బ్లూస్ ధరించి ‘ఫ్యూజన్ ఫిట్‌నెస్’ పేరుతో కాలిస్టెనిక్స్ పరిపూర్ణ ప్రదర్శన వీక్షకులను ఆశ్చర్యచకితులను చేసింది. 8, 9 తరగతుల విద్యార్థులు ప్రదర్శించిన ‘వైబ్రెంట్ వైబ్స్’ డీల్ అబ్బురపరిచింది. క్రీడలు, ఇతర పోటీల్లో విజేతలైన విద్యార్థులకు జ్యోతిక శ్రీదండి ట్రోఫీలు, జ్ఞాపికలను ప్రదానం చేశారు. హెచ్‌పీఎస్ ప్రిన్సిపాల్ స్కంద్‌బాలి, సొసైటీ ప్రతినిధులు, ఆధ్యాపక సిబ్బంది పాల్గొన్నారు.
క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వాలి..
విద్యార్థులను క్రీడల్లో ప్రోత్సహించేలా పాఠశాలల యాజమాన్యాలు, తల్లిదండ్రులు తగిన శ్రద్ధ చూపించాలి. హెచ్‌పీఎస్ క్రీడోత్సవ వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరవడం నా అదృష్టం. విద్యార్థులు వైఫల్యానికి భయపడవద్దు. క్రీడలు ఆత్మస్థైర్యాన్ని పెంపొందిస్తాయి. అంకితభావం, పట్టుదలతో సాధించలేనిది ఏదీ ఉండదు. చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించడం ద్వారా శారీరక, మానసిక దృఢత్వం పెరుగుతుంది.
– ఒలింపిక్స్ జాతీయ చాంపియన్ (స్ప్రింటింగ్) జ్యోతిక శ్రీదండి
Comments
Please login to add a commentAdd a comment