
నెలాఖరుకు పీఎల్ దేశ్‌పాండే కళా అకాడమీ ప్రారంభానికీ ఏర్పాట్లు
కార్యక్రమానికి హాజరుకానున్న సీఎం, డిప్యూటీ సీఎంలు
ముంబై: కళాకారులు, రంగస్థలనటులకు ప్రీతిపాత్రమైన రవీంద్ర నాట్య మందిర్ ఆడిటోరియం, పీఎల్ దేశ్‌పాండే మహారాష్ట్ర కళా అకాడమీ తిరిగి ప్రారంభం కానున్నాయి. పునరుద్ధరణ పనులు పూర్తైన నేపథ్యంలో ఫిబ్రవరి 28న జరిగే పునఃప్రారంభ కార్యక్రమానికి ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రులు ఏక్‌నాథ్ శిందే, అజిత్ పవార్‌లు హాజరుకానున్నారని ఈ సందర్భంగా అకాడమీ కొత్త చిహ్నం ఆవిష్కరణ కూడా జరుగుతుందని ఓ అధికారి తెలిపారు.
‘రీఓపెన్’ఆర్ట్స్’ కమ్యూనిటీకి కొత్త ఉదయం– మంత్రి ఆశిష్ షెలార్
ఈ సందర్భంగా సాంస్కృతిక వ్యవహారాల మంత్రి ఆశిష్ షెలార్ మాట్లాడుతూ, మహారాష్ట్రలో అభివృద్ధి చెందుతున్న థియేటర్, ఆర్ట్స్ కమ్యూనిటీకి ఈ కార్యక్రమం ‘కొత్త ఉదయాన్ని‘ తెస్తుందని అన్నారు. అకాడమీతో తరతరాలుగా కళాకారులను, వారిలోని ప్రతిభకు మెరుగులద్దుతూనే ఉన్నామని , దీన్ని మరింత విస్తృతంగా కొనసాగిస్తామని స్పష్టంచేశారు.
పునరుద్ధరించిన రవీంద్ర నాట్య మందిర్‌లో అధునాతన సౌండ్ సిస్టమ్స్, రిఫైన్డ్ ఇంటీరియర్స్, రెండు చిన్న థియేటర్లు, ఐదు ఎగ్జిబిషన్ హాళ్లు, ఆరి్టస్టుల కోసం 15 రిహార్సల్ రూమ్‌లు, గ్రాండ్ ఓపెన్–ఎయిర్ స్టేజ్, వర్చువల్ చిత్రీకరణ, సౌండ్ రికార్డింగ్, డబ్బింగ్, సౌండ్ మిక్సింగ్ కోసం స్టూడియోలు ఏర్పాటు చేశామని ఉన్నాయని మంత్రి తెలిపారు. అకాడమీలో త్వరలో వివిధ కళారూపాలకు సంబంధించి 20 సరి్టఫికెట్, డిప్లొమా కోర్సులను కూడా ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment