Deshpande
-
కమలంలో కొత్త లొల్లి
సాక్షి, హైదరాబాద్: నామినేషన్ల దాఖలు చివరిరోజు అభ్యర్థుల జాబితాలో కొన్ని మార్పులు చేసి, ఇదివరకే ప్రకటించిన వారికి బీఫాంలు ఇవ్వకపోవడం బీజేపీకి కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. టికెట్లు దక్కని వారితో పాటు జాబితాలో ప్రకటించినా బీఫామ్స్ దక్కని వారిలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. శుక్రవారం ప్రకటించిన 14 మంది అభ్యర్థుల జాబితా అంతా వివాదాస్పదం కావడంతో సమస్య మరింత ముదిరింది. వేములవాడలో తుల ఉమకు బదులు వికాస్‌రావుకు, సంగారెడ్డిలో రాజేశ్వర్ దేశ్‌పాండేకు బదులు పులిమామిడి రాజుకు బీఫామ్‌లు ఇవ్వడంతో తుల ఉమ, దేశ్‌పాండే కన్నీటి పర్యంతం అయ్యారు. స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో నిలవనున్నట్లు ప్రకటించడంతో పార్టీ నాయకులు వారిని బుజ్జగించే ప్రయత్నాలు మొదలుపెట్టారు. చివరి క్షణంలో పలువురికి చెయ్యి బీసీ మహిళ (కురుమ) ఉమకు టికెట్ కోసం ఈటల రాజేందర్ గట్టిగా పట్టుబట్టారు. ఆమెకు సీటు కేటాయించకపోతే తాను ఎన్నికల్లో పోటీ చేయనని అల్టిమేటమ్ కూడా ఇచ్చారు. దీంతో నాయకత్వం దిగివచ్చినట్టు ప్రచారం జరిగింది. కానీ చివరకు బీఫామ్ ఇవ్వలేదు. సంగారెడ్డిలో పులిమామిడి రాజుకు కూడా సీటు కేటాయించాలని ఈటల కోరారు. దీంతో ఏదో ఒక సీటు ఎంపిక చేసుకోవాలని అధిష్టానం సూచించిందని, గెలిచే అవకాశాలున్న సంగారెడ్డి వైపు ఈటల మొగ్గుచూపినట్టుగా తెలుస్తోంది. కాగా తనను నామినేషన్ వేసుకోమని చెప్పి బీఫామ్ ఇవ్వకపోవడంపై తీవ్ర మనస్థాపానికి గురైన దేశ్‌పాండే.. కిషన్‌రెడ్డికి ఫోన్‌చేసి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానంటూ హెచ్చరించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జాబితాలో బెల్లంపల్లి స్థానానికి ఏమాజీ పేరుంటే శ్రీదేవిని, ఆలంపూర్లో మారెమ్మ ప్లేస్‌లో రాజగోపాల్‌ను బీజేపీ ఖరారు చేయడం కూడా వివాదానికి తెరతీసింది. అనూహ్యంగా కంటోన్మెంట్ సీటు... సికింద్రాబాద్ కంటోన్మెంట్‌ను చివరి నిమిషం వరకు కాంగ్రెస్‌లోనే ఉండి ఇంకా బీజేపీలో చేరని సాయి గణే‹Ùకు కేటాయించడంపై కూడా పారీ్టవర్గాల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇక్కడ మాజీ డీజీపీ కృష్ణప్రసాద్‌కు నామినేషన్ వేసేందుకు సిద్ధం కావాలంటూ చెప్పిన బీజేపీ.. ఆయనకు మొండిచేయి చూపి సాయి గణే‹Ùకు టికెట్ కేటాయించడం పారీ్టలో తీవ్ర చర్చనీయాంశమైంది. అదేవిధంగా తుది జాబితాలో పోటీకి సుముఖంగా లేని మాజీ ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావుకు మల్కాజిగిరి సీటును కేటాయించడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. మల్కాజిగిరి టికెట్ కోసం ఆకుల రాజేందర్, బీజేవైఎం అధ్యక్షుడు భానుప్రకాష్ మధ్య తీవ్ర పోటీ నెలకొనడంతో నాయకత్వం మధ్యే మార్గంగా రామచంద్రరావుకు అవకాశం ఇచ్చినట్టు సమాచారం. దీంతో భానుప్రకాష్ పారీ్టకి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. శేరిలింగంపల్లి టికెట్‌ను రవికుమార్ యాదవ్‌కు కేటాయించడంతో గత కొంతకాలంగా ఇక్కడ పనిచేస్తూ ఈ సీటును గట్టిగా కోరుకున్న గజ్జెల యోగానంద్ ఎలాంటి కార్యచరణకు దిగుతారనేదది చర్చనీయాంశమైంది. బీసీలకు 36 సీట్లు బీజేపీ ప్రకటించిన మొత్తం 111 సీట్లలో (జనసేనకు 8 సీట్లు) బీసీలు–36, ఓసీ–44 (రెడ్డి–29, వెలమ–8, కమ్మ–3, బ్రాహ్మణ–2, వైశ్య–1, నార్త్ ఇండియన్అగర్వాల్–1) ఎస్సీ 19+2 (రిజర్వ్‌డ్‌తో పాటు అదనంగా 2 జనరల్ సీట్లు (నాంపల్లి, చాంద్రాయణగుట్ట), ఎస్టీలకు 10 కేటాయించారు. బీసీలకు ఇతర పారీ్టల కంటే అధిక సీట్లనే కేటాయించినా.. 40కి పైగా సీట్లు కేటాయిస్తామనే హామీని నేతలు నిలబెట్టుకోలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కాగా మాదిగలకు ఎక్కువ ప్రాధా న్యం దక్కింది. 21 స్థానాలను ఎస్సీలకు కేటాయించగా, అందులో మాదిగ సామాజిక వర్గానికి 14, మాల సామాజిక వర్గానికి 7 ఇచ్చారు. బీసీలకు కేటాయించిన 36 సీట్లలో ముదిరాజ్ 9, మున్నూరు కాపు 7, యాదవ 5, గౌడ 5, పెరిక 2 లోధ్ 2 పద్మశాలి, ఆరే కటిక, లింగాయత్, వాలీ్మకి బోయ, ఆరే క్షత్రియ, విశ్వకర్మలకు ఒక్కో సీటు కేటాయించారు. -
ట్విస్టుల మీద ట్విస్టులు.. ఆఖరి రోజు అనూహ్య పరిణామాలు!
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: నామినేషన్ల చివరి రోజు శుక్రవారం అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. కాంగ్రెస్, బీజేపీ పలుచోట్ల అభ్యర్థులను మార్చడం ఆయా నియోజకవర్గాల్లో రాజకీయం ఆసక్తికరంగా మారింది. నారాయణఖేడ్ కాంగ్రెస్ టికెట్‌ను అధిష్టానం రెండు రోజుల క్రితం మాజీ ఎంపీ సురేష్‌షెట్కార్‌కు ప్రకటించింది. దీంతో టికెట్ దక్కని పీసీసీ ఉపాధ్యక్షుడు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి తీవ్ర అసమ్మతి వ్యక్తం చేశారు. కార్యకర్తలతో సమావేశమై స్వతంత్రంగానైనా బరిలో నిలుస్తానని ప్రకటించారు. దీంతో అధినాయకత్వం రంగంలోకి దిగి.. షెట్కార్, సంజీవరెడ్డిలతో చర్చించి సయోధ్య కుదిర్చింది. షెట్కార్ స్థానంలో సంజీవరెడ్డికి బీ–ఫారం ఇచ్చింది. ఈ ఎన్నికల్లో సంజీవరెడ్డి గెలుపు కోసం కలిసి పనిచేస్తామని షెట్కార్ వర్గం ప్రకటించింది. ఈ మేరకు ఇరువర్గాల నేతలంతా కలిసి సంజీవరెడ్డి నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు. పటాన్చెరు నియోజకవర్గం టికెట్ అనూహ్యంగా కాటా శ్రీనివాస్‌గౌడ్‌కు దక్కడంతో నీలం మధు ఆ పార్టీకి రాజీనామా చేశారు. బీఎస్పీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తడిగుడ్డతో తన గొంతు కోసిందని ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం బీఎస్పీ నుంచి నామినేషన్ దాఖలు చేశారు. నీలం మధుకు తొలుత కాంగ్రెస్ అభ్యర్థిత్వం ప్రకటించిన విషయం విదితమే. నామినేషన్ వేసిన ఇద్దరు! చివరి నిమిషంలో బీజేపీ బీ–ఫారం దక్కకపోవడంతో రాజేశ్వర్‌రావు దేశ్‌పాండే శుక్రవారం స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఎట్టి పరిస్థితుల్లో తాను బరిలో నిలుస్తానని తేల్చి చెప్పారు. మరోవైపు బీజేపీ బీఫారం దక్కిన పులిమామిడి రాజు శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. గురువారమే ఒక సెట్ నామినేషన్ వేసిన రాజు, శుక్రవారం బీజేపీ బీ–ఫారంతో మరోసెట్ నామినేషన్ వేశారు. సంగారెడ్డి బీజేపీ టికెట్ బిగ్ ట్విస్ట్.. సంగారెడ్డి బీజేపీ టికెట్ విషయంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ టికెట్‌ను ఆ పార్టీ నాయకుడు పులిమామిడి రాజుకు కేటాయించాలని నిర్ణయించినట్లు రాష్ట్ర నాయకత్వం ఆయనకు గురువారం రాత్రి సమాచారం ఇచ్చింది. ఈ మేరకు నామినేషన్ వేసేందుకు సిద్ధంగా ఉండాలని సూచించింది. తీరా శుక్రవారం ఉదయం విడుదల చేసిన తుది జాబితాలో ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రాజేశ్వర్‌రావు దేశ్‌పాండే పేరును ప్రకటించింది. కానీ బీ–ఫారం మాత్రం రాజుకు ఇచ్చింది. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన దేశ్‌పాండే.. స్థానిక రిటర్నింగ్ అధికారి కార్యాలయం వద్ద విలపించారు. తనకు టికెట్‌ను ఎందుకు ప్రకటించారు..? ఎందుకు మార్చారంటూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి ఫోన్ చేసి ప్రశ్నించారు. ఐదేళ్లుగా పార్టీకి సేవలందిస్తున్న తనను అవమానించారంటూ వెక్కివెక్కి ఏడ్చారు. తాను, తన కుటుంబం ఆత్మహత్య చేసుకుంటామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో దేశ్‌పాండే అనుచరులు బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించారు. అక్కడ ఉన్న ఫ్లెక్సీలను చించివేశారు. బీ–ఫారంతో నామినేషన్ వేసేందకు అటువైపు వెళుతున్న బీజేపీ అభ్యర్థి పులిమామిడి రాజు వాహనంపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు రువ్వారు. దీంతో అక్కడ కొంత ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు వారిని అక్కడి నుంచి చెదరగొట్టారు. ఇవి చదవండి: ఆ పార్టీ మాయమాటలు నమ్మొద్దు! : మంత్రి హరీశ్‌రావు -
నిర్మల్ జిల్లాలో రియల్టర్ కిడ్నాప్ కలకలం
-
ఓటమి సాధారణమే
లోక్‌సభ ఎన్నికలపై సీఎం సిద్ధు పరమేశ్వరతో కలిసి ఢిల్లీలో ఆంటోనితో భేటీ పార్టీ బలోపేతమే లక్ష్యం : పరమేశ్వర సీఎం రేసులో లేను : దేశ్‌పాండే సాక్షి ప్రతినిధి, బెంగళూరు : లోక్‌సభ ఎన్నికల్లో జాతీయ పార్టీలకు గెలుపోటములు సర్వ సాధారణమేనని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చెప్పారు. ఇటీవల ఎన్నికల్లో పార్టీ ఓటమిపై అధిష్టానానికి వివరణ ఇవ్వడానికి బుధవారం ఢిల్లీ వెళ్లిన ఆయన, కేపీసీసీ చీఫ్ పరమేశ్వరతో కలిసి విలేకరులతో మాట్లాడారు. కర్ణాటక మాత్రమే కాకుండా, దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పార్టీ ఓటమిపై కేంద్ర మాజీ మంత్రి ఏకే. ఆంటోనీ నాయకత్వంలో ఏర్పడిన కమిటీతో సమావేశమవడానికి పరమేశ్వరతో కలసి ఆయన వెళ్లారు. ఆంటోనీతో జరిగిన సమావేశంలో ఎన్నికల్లో ఓటమిపై విశ్లేషించడంతో పాటు పార్టీని బలోపేతం చేసే విషయమై చర్చించినట్లు విలేకరులకు పరమేశ్వర తెలిపారు. కాగా ఎన్నికల్లో పార్టీ ఓటమికి సీఎం వైఖరే కారణమని గత వారాంతంలో ఇక్కడ జరిగిన ఆత్మావలోకన సమావేశంలో పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు పరోక్షంగా ఆరోపించడంతో వారిద్దరి ఢిల్లీ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. ఈ పదవి ఉంటుందో, ఊడుతుందో అని అదే సమావేశంలో సీఎం వేదాంత ధోరణిలో మాట్లాడడం చర్చనీయాంశమైంది. నాయకత్వ మార్పు దిశగా కాంగ్రెస్ అధిష్టానం యోచిస్తోందా అనే సందేహాలూ తలెత్తాయి. సీఎంకు దేశ్‌పాండే బాసట శాసన సభ సమావేశాలు జరుగుతున్న తరుణంలో ఉన్నత విద్యా శాఖ మంత్రి ఆర్వీ. దేశ్‌పాండే ముఖ్యమంత్రికి మద్దతుగా మాట్లాడారు. శాసన సభ వెలుపల ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ అధిష్టానం సీఎంను ఢిల్లీకి రావాల్సిందిగా ఆదేశించిందని, లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఓటమికి ఆయనే కారణమంటూ పలువురు ఎమ్మెల్యేలు, నాయకులు ఆరోపించారని వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని చెప్పారు. ముఖ్యమంత్రి చక్కగా పని చేస్తున్నారని కితాబునిస్తూ, ఎమ్మెల్యేలు ఆయనకు మద్దతుగా ఉన్నారని తెలిపారు. అల్ప సంఖ్యాకులు, వెనుకబడిన తరగుతులు, దళితులతో కూడిన ‘అహింద’ ప్రభుత్వాన్ని సిద్ధరామయ్య నడుపుతున్నారని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు పస లేనివని కొట్టి పారేశారు. సమాజంలోని అన్ని వర్గాల సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం పని చేస్తోందన్నారు. ఇటీవల శాసన మండలికి ఐదుగురిని నామినేట్ చేసిన విషయంలో సీఎం ‘కోటరీ’ పాత్ర ఉందని వచ్చిన ఆరోపణలను ఖండిస్తూ, పార్టీ అధిష్టానం అనుమతితోనే ఈ ఎంపికలు జరిగాయని వివరించారు. రాష్ర్ట మంత్రి వర్గంలో చర్చించిన తర్వాతే పేర్లను ఖరారు చేశారని తెలిపారు. కాగా తాను ముఖ్యమంత్రి పదవిని కోరుకోవడం లేదని ఆయన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.