academy
-
భారత్‌లో మొట్టమొదటి ఎయిర్‌బీఎన్‌బీ అకాడమీ: ఎక్కడంటే..
గ్లోబల్ హోమ్‌స్టే అండ్ హోటల్ అగ్రిగేటర్ 'ఎయిర్‌బీఎన్‌బీ'.. గోవా ప్రభుత్వ పర్యాటక శాఖ సహకారంతో.. గోవాలో భారతదేశపు మొట్టమొదటి ఎయిర్‌బీఎన్‌బీ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అకాడమీని ప్రారంభించింది. హోమ్‌స్టే టూరిజాన్ని ప్రోత్సహించడానికి.. రాష్ట్రంలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని హాస్పిటాలిటీ వ్యాపారవేత్తలలో సామర్థ్యాన్ని పెంపొందించడానికి కంపెనీ గోవాలోని పర్యాటక శాఖ (DoT) మధ్య ఉన్న అవగాహన ఒప్పందం (MOU)లో భాగంగా ఈ అకాడమీ ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో గోవా పర్యాటక శాఖ మంత్రి రోహన్ ఖౌంటే, ఎయిర్‌బీఎన్‌బీ ఇండియా జనరల్ మేనేజర్ అమన్‌ప్రీత్ బజాజ్ పాల్గొన్నారు.కొత్త అకాడమీ ద్వారా.. వ్యక్తులను కంపెనీ హోస్ట్ చేసే ప్రపంచానికి పరిచయం చేయడమే ఎయిర్‌బీఎన్‌బీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే దీనికోసం కంపెనీ ఇంటరాక్టివ్ వర్క్‌షాప్‌ల ద్వారా 25 మందికి ట్రైనింగ్ ఇచ్చింది. ఉత్తర గోవా నుంచి పాల్గొనేవారి కోసం మిరామార్ రెసిడెన్సీలో మొదటి రౌండ్ వర్క్‌షాప్‌లు జరిగాయి. దక్షిణ గోవా నుంచి మరో 25 మంది ట్రైనీలను లక్ష్యంగా చేసుకుని మడ్గావ్లో తదుపరి రౌండ్ శిక్షణలు నిర్వహించనున్నారు.ఎయిర్‌బీఎన్‌బీ అకాడమీ ప్రారంభం సందర్భంగా పర్యాటక మంత్రి రోహన్ ఖౌంటే మాట్లాడుతూ.. గోవా సంస్కృతిని సంరక్షించడం ద్వారా పునరుత్పాదక పర్యాటకాన్ని ప్రోత్సహించడంలో హోమ్‌స్టే విభాగం కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా ఈ ఒప్పందం గ్రామీణ గోవాకు ప్రయోజనం చేకూరుస్తుందని అన్నారు.ఎయిర్బీఎన్బీతో అవగాహన ఒప్పందం.. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అకాడమీని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. స్థానిక కమ్యూనిటీలకు సాధికారత కల్పిస్తూనే.. గోవా తన ప్రత్యేక సాంస్కృతిక, సహజ ఆస్తులను ఉపయోగించుకోవడానికి ఈ చొరవ అద్భుతమైన అవకాశాన్ని అందిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమం గోవా విభిన్నమైన, ప్రామాణికమైన అనుభవాలను ప్రదర్శించడానికి సహాయం చేస్తుందని పేర్కొన్నారు. -
రిలయన్స్ స్కిల్లింగ్ అకాడమీ ప్రారంభం
దేశంలో జాబ్ మార్కెట్‌కు అనుగుణంగా యువతలో నైపుణ్యాలు పెంచేందుకు రిలయన్స్ ఫౌండేషన్ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది. రిలయన్స్ ఫౌండేషన్ స్కిల్లింగ్ అకాడమీని ప్రారంభించింది. స్కిల్ డెవలప్మెంట్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, విద్యా శాఖల సహాయ మంత్రి జయంత్ చౌదరి ఈ అకాడమీని ప్రారంభించారు.నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (NSDC) సహకారంతో రిలయన్స్ ఫౌండేషన్ నిర్వహించిన ‘భవిష్యత్ ఉద్యోగాల కోసం యువతకు సాధికారత’ అనే అంశంపై జరిగిన జాతీయ సదస్సులో ఈ కొత్త చొరవను ఆవిష్కరించారు. స్కిల్ బిల్డింగ్, పర్సనలైజ్డ్ ఎక్స్పర్ట్ గైడెన్స్ అందించే ఫ్యూచర్ రెడీ కోర్సులను స్కిల్లింగ్ అకాడమీ అందిస్తుందని రిలయన్స్ ఫౌండేషన్ తెలిపింది. పరిశ్రమల అనుసంధానంతో కెరీర్ డెవలప్మెంట్కు తోడ్పాటునందిస్తుందని పేర్కొంది.నైపుణ్యాలను నేర్పించడం, పెంపొందించడం ద్వారా వచ్చే సంవత్సరంలో 6 లక్షల మంది భారతీయ యువతకు సాధికారత కల్పించడం అకాడమీ లక్ష్యమని వెల్లడించింది. ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (AICTE) భాగస్వామ్యంతో రిలయన్స్ ఫౌండేషన్ స్కిల్లింగ్ అకాడమీ తన కోర్సుల పరిధిని విస్తరిస్తుందని, స్కిల్ ఇండియా మిషన్‌కు మద్దతునిస్తుందని వివరించింది. -
ఒళ్లో పేలిన ఫోను.. తృటిలో తప్పిన పెను ప్రమాదం!
హిమాచల్ ప్రదేశ్‌లోని హమీర్పూర్ జిల్లాలో మొబైల్ ఫోన్ పేలిన ఉదంతం వెలుగు చూసింది. స్థానిక కోచింగ్ సెంటర్లో క్లాసులు జరుగుతుండగా ఒక విద్యార్థిని ఒళ్లోవున్న మొబైల్ ఫోన్ ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో తరగతిలో కలకలం చెలరేగింది. అయితే వెంటనే అప్రమత్తమైన ఆ విద్యార్థిని మొబైల్ ఫోనును బయటకు విసిరేసింది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం హమీర్పూర్ ప్రధాన మార్కెట్ ప్రాంతంలో ఒక ప్రైవేట్ విద్యాసంస్థ ఉంది. ఇక్కడ దాదాపు 40 మంది చదువుకుంటున్నారు. క్లాసులో తరగతి జరుగుతుండగా ఓ విద్యార్థిని దగ్గరున్న ఫోనులో నుంచి మంటలు చెలరేగాయి దీంతో ఆమె భయంతో ఆ మొబైల్ ఫోనును మెయిన్ రోడ్డు వైపునకు విసిరేసింది. ఆ ఫోను అక్కడున్న సైన్ బోర్డుకు తగిలి పేలిపోయింది. దీంతో సైన్ బోర్డుకు మంటలు అంటుకున్నాయి. ఆ తర్వాత మొబైల్ ఫోను పూర్తిగా కాలిపోయింది. అనంతరం స్థానికులు అప్రమత్తమై ఆ మంటలపై బకెట్లతో నీళ్లు పోసి, ఆర్పివేశారు. భవనం మొదటి అంతస్థులో ఈ ఘటన జరిగింది. అక్కడికి సమీపంలోనే దుస్తుల దుకాణాలు ఉన్నాయి. రోడ్డుపైనో, తరగతి గదిలోనో ఆ మొబైల్ ఫోన్ పేలి ఉంటే పరిస్థితి మరింత దారుణంగా ఉండేదని స్థానికులు అంటున్నారు. -
రెడీ టు బడి
డిజిటల్ స్టార్ కావడం అనేది అదృష్టం కాదు. అవకాశం.ఆ అవకాశం చేతికి అందాలంటే ‘ఎందుకు? ఏమిటి? ఎలా?’ అనేది బాగా తెలిసి ఉండాలి.చాలామందిలో ఈ అవగాహన లోపించి ‘ఆరంభ శూరత్వం’ ప్రదర్శిస్తున్నారు.‘ఇది మనకు వర్కవుట్ అయ్యేలా లేదు’ అని రథాన్ని వెనక్కి మళ్లిస్తున్నారు.దీన్ని దృష్టిలో పెట్టుకొని.. డిజిటల్ కంటెంట్ క్రియేటర్ కావాలని కలలు కనే యువతరం కోసం ‘స్పియర్‌క్రాఫ్ట్ అకాడమీ’లాంటి నయా స్కూల్స్ వస్తున్నాయి. ‘కంటెంట్ కోచ్’లాంటి నయా గురువులు వస్తున్నారు.కెమెరా యాంగిల్స్ నుంచి ‘ఏ టైమ్‌లో వీడియోను రోస్ట్ చేయాలి?’ ‘బ్రాండ్లతో ఎలా కొలాబరేట్ కావాలి... లాంటి సమస్త విషయాలను నేర్చుకుంటున్నారు... దిల్లీకి చెందిన ఇరవై సంవత్సరాల కడలికి డిజిటల్ కంటెంట్ క్రియేటర్ కావాలనేది కోరిక. పబ్లిక్ స్పీకింగ్, బ్లాగింగ్‌పై పట్టు సాధించడానికి షార్ట్ కమ్యూనికేషన్ కోర్సులో చేరింది. డిజిటల్ స్టార్డమ్ ప్రభావంతో, తాము కూడా ఆ స్థాయిలో పేరు తెచ్చుకోవాలనే లక్ష్యంతో పర్సనల్ బ్రాండ్ బిల్డింగ్ కోసం బడి బాట పడుతున్న అనేకానేక మందిలో కడలి ఒకరు. 2022తో పోల్చితే మన దేశంలో 2024లో కంటెంట్ క్రియేటర్ల సంఖ్య బాగా పెరిగిందని చెబుతోంది ఇన్ఫ్లూయెన్సర్ మార్కెటింగ్ ఫర్మ్ జెమ్ఫో. ‘ఇంటర్నెట్ అందుబాటులో ఉంటే చాలు, ఆడియో అండ్ వీడియో కాప్చరింగ్ తెలిసి ఉంటే చాలు కంటెంట్ క్రియేటర్‌గా రాణించవచ్చు అని అనుకోవడానికి లేదు. నేర్చుకోవడానికి చాలా ఉంది’ అంటున్నాడు కంటెంట్ కోచ్, బ్రాండ్ కన్సల్టంట్ మనీష్ ΄ాండే. మనీష్లాంటి కంటెంట్ కోచ్‌ల ద్వారా సాంకేతిక విషయాలపై నైపుణ్యంతో ΄ాటు ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్‌లలో ఎలాంటి వీడియోలు ఆదరణ పోందుతున్నాయో తెలుసుకుంటున్నారు ఔత్సాహిక కంటెంట్ క్రియేటర్లు. డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని ఇన్ఫ్లూయెన్సర్లు కావాలనుకునేవారి కోసం ‘స్పియర్‌క్రాఫ్ట్ అకాడమీ’ పేరుతో ఫస్ట్ స్కూలు ఏర్పాటయింది. ‘కంటెంట్‌ను ఎలా క్రియేట్ చేయాలి? ఎలా ఎడిట్ చేయాలి? పర్సనల్ గ్రూమింగ్, వార్డ్రోబ్ మేనేజ్మెంట్, బాడీ లాంగ్వేజ్...ఇలా వెరైటీ కోర్సులను ఆఫర్ చేస్తున్నాం. మంచి స్పందన ఉంది’ అని చెబుతున్నారు ‘స్పియర్‌క్రాఫ్ట్’ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సౌమ్యబాత్రసేన్ గు΄్తా.మరోవైపు మైక్రో అండ్ నానో న్ఫ్లూయెన్సర్లు కంటెంట్ కోచ్‌లకు బిగ్గెస్ట్ క్లయింట్స్‌గా ఉన్నారు. కన్సల్టేషన్ కోసం తన దగ్గరకు వస్తున్న వారిలో చిన్న వ్యా΄ారాలు చేస్తున్నవారు, నెయిల్ ఆర్టిస్ట్‌లు, స్కిన్‌కేర్ క్రియేటర్లు... ఇలా అన్ని రకాల వారు ఉన్నారని హైదరాబాద్‌కు చెందిన కంటెంట్ కోచ్ ఇషిక పన్సారీ చెబుతోంది. ‘ఆరు నెలల వ్యవధిలో 600 మందికి శిక్షణ ఇచ్చాను’ అని చెబుతుంది ఇషిక. సెషన్లో భాగంగా కంటెంట్ ఐడియాలు ఇస్తుంది. ‘బార్టర్ డీల్స్ నుంచి బ్రాండ్ కొలాబ్రేషన్స్, యాడ్–జెనరేటెడ్ రెవెన్యూ వరకు కంటెంట్ క్రియేషన్ స్పేస్‌లో ఎన్నో అవకాశాలు ఉన్నాయి. అయిన్పటికీ ‘డబ్బు’ అనేది చివరి అంశం. డబ్బు సం΄ాదించడానికి ఓపిక, స్థిరత్వం ఉండాలి’ అంటాడు కంటెంట్ కోచ్ మనీష్ ΄పాండే. ఇరవై రెండు సంవత్సరాల దామినీ చౌదురీ ఫుడ్, ఫ్యాషన్, లైఫ్‌స్టైల్ ఇన్ఫ్లూయెన్సర్గా రాణించాలనుకుంటుంది. ‘ఇటీవలే పర్సనల్ స్టైలింగ్, ఇమేజ్ మేనేజ్మెంట్ కోర్సు పూర్తి చేశాను. నాకు 7,000 ఫాలోవర్స్ ఉన్నారు’ అంటున్న దామిని శిక్షణ ద్వారా ఓవరాల్ ప్రెజెంటేషన్, అ్ర΄ోచ్లో చిన్న చిన్న మార్పులు చేసుకుంది. ‘ఆడియెన్స్‌తో కనెక్ట్ అయ్యే స్పార్క్ అనేది ఏ కొద్దిమందికో పరిమితమైనది కాదు’ అంటున్న కంటెంట్ కోచ్‌లు బ్రాండ్‌తో ఎలా కొలాబరేట్ కావాలి. ఎలా నెగోషియేట్ చేయాలి, కంటెంట్‌ను ఎలా ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలి, బెటర్ కెమెరా యాంగిల్ ఎలా ఉపయోగించాలి... మొదలైన టెక్నికల్ యాస్పెక్ట్స్ను సులభంగా తెలియజేస్తున్నారు. కంటెంట్ క్రియేషన్ కోర్సుల కోసం చాలామంది స్కిల్స్ షేర్, ఉడెమీలాంటి ఆన్లైన్ లెర్నింగ్ ΄్లాట్ఫామ్లపై ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. వీడియో రోస్ట్ చేయడానికి రోజులో మంచి టైమ్ ఏమిటి? ఎలాంటి పరికరాలు కావాలి? ఎలాంటి లైటింగ్ బాగా ఉపయోగపడుతుంది... లాంటి విషయాలను నేర్చుకుంటున్నారు. కొండంత అండ... మన దేశంలోని టాప్ డిజిటల్ స్టార్స్‌లో 27 సంవత్సరాల బృంద శర్మ ఒకరు. డిజిటల్ స్టార్ కావాలని, అవుతానని ఎప్పుడు అనుకోలేదు. కొండలు, గుట్టలు అంటే ఆమెకు ఇష్టం. వాటిని వెదుక్కుంటూ వెళ్లడం అంటే ఇష్టం. దుబాయ్‌లో చేసే 9–5 ఉద్యోగం కంటే కొండల గుండెల చప్పుడు వినడం అంటేనే ఆమెకు ఇష్టం. ఎన్నో దేశాలలో ఎన్నో పర్వతాలకు సంబంధించిన ఆసక్తికరమైన చరిత్రను ఇన్స్టాగ్రామ్ వేదికగా లోకంతో పంచుకునేది. ఆ తరువాత ట్రావెలింగ్కు సంబంధించిన వీడియోలతో ఫుల్–టైమ్ ఇన్ఫ్లూయెన్సర్గా మారింది. ప్రకృతిపై ప్రేమ, ప్రయాణం అనేది పూర్తిగా తన వ్యక్తిగత విషయం అన్నట్లుగా ఉండేది బృంద. అయితే అనునయ్సూద్ అనే ఫ్రెండ్ సలహాతో ఇన్స్టాగ్రామ్ మిషన్ ్ర΄ారంభించింది. తన వీడియోలను వైరల్ చేయాలని, కావాలనీ... బృంద ఎప్పుడూ అనుకోలేదు. అయితే కంటెంట్‌లో ఉన్న సత్తాతో ఆ వీడియోలు వైరల్ అయ్యాయి. బృందశర్మను డిజిటల్ స్టార్‌ను చేశాయి. ప్రేక్షక లోకమే ΄పాఠశాల సీఏ పరీక్షలు పూర్తయిన తరువాత ఫైనాన్స్ర్΄÷ఫెషన్లోకి వచ్చింది ట్వింకిల్ జైన్. ఫైనాల్సియల్ లిటరసీని దృష్టిలో పెట్టుకొని 2021 నుంచి సోషల్ మీడియా వేదికగా వీడియోలు చేయడం మొదలుపెట్టింది. ‘బిజినెస్ అండ్ ఫైనాన్స్‌కు సంబంధించిన వీడియోలు ఎవరు చూస్తారు?’ అని అనుకొని ఉంటే 26 సంవత్సరాల వయసులోనే టాప్ డిజిటల్ స్టార్స్ జాబితాలో ట్వింకిల్ పేరు ఉండేది కాదు. తెలిసో తెలియకో జటిలమైన విషయాలను మరింత జటిలంగా చెబుతూ శ్రోతలను భయభ్రాంతులకు గురి చేస్తారు కొందరు. మరి కొందరు మాత్రం ఎంత జటిలమైన విషయాన్ని అయినా ‘ఓస్ ఇంతేనా’ అన్నట్లుగా సులభంగా అర్థమయ్యేలా చెబుతారు. ట్వింకిల్ జైన్ రెండో కోవకు చెందిన వ్యక్తి. ప్రేక్షక లోకమే ఆమె ΄ాఠశాల. వారి నుంచే విలువైన ΄ాఠాలను నేర్చుకుంది. -
ప్రపంచ స్థాయికి ‘నాసిన్’ కీర్తి
సాక్షి, పుట్టపర్తి: అత్యంత వెనుకబడిన జిల్లాల్లో ఒకటైన ఉమ్మడి అనంతపురం జిల్లాలో ప్రపంచస్థాయి సంస్థ ‘నాసిన్’ అకాడమీని నెలకొల్పినందుకు ప్రధాని నరేంద్రమోదీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ధన్యవాదాలు తెలియచేశారు. మంగళవారం శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలం పాలసముద్రం వద్ద నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇన్‌డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కోటిక్స్ (నాసిన్) అకాడమీ ప్రారంభోత్సవంలో సీఎం జగన్ ప్రధానితో కలసి పాల్గొన్నారు. ‘నాసిన్’ను తీసుకొచ్చే గొప్ప ప్రయత్నం చేయడమే కాకుండా పట్టుబట్టి సాధించేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పలు సందర్భాలలో ఇక్కడికి రావడం మన కళ్లెదుటే కనిపించిన వాస్తవమన్నారు. ఇలాంటి ప్రతిష్టాత్మక సంస్థ మన రాష్ట్రం పేరు, కీర్తి ప్రతిష్టలను దేశంలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో ప్రతిబింబిస్తూ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, అన్నింటిని అనుసంధానించే గొప్ప సంస్థగా నిలవాలని ఆకాంక్షించారు. -
ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు: సీఎం జగన్
-
క్షిపణుల డిజైన్‌లో స్టార్టప్‌లను భాగస్వాములను చేయాలి
సాక్షి, విశాఖపట్నం: క్షిపణుల మరమ్మతులు, డిజైన్లలో స్టార్టప్‌లు, ఎంఎస్ఎంఈలను భాగస్వాములను చేస్తే ఆత్మ నిర్భర్ భారత్ దిశగా మరింత పురోగతి సాధించవచ్చని డీఆర్డీవో డైరెక్టర్ జనరల్ డాక్టర్ వై.శ్రీనివాసరావు అన్నారు. విశాఖపట్నం కేంద్రంగా ఉన్న తూర్పు నౌకాదళం(ఈఎన్సీ) ప్రధాన కేంద్రానికి అనుబంధంగా ఉన్న ఐఎన్ఎస్ కళింగ బేస్‌లో గురువారం ‘అమృత్–2023’ పేరుతో మిసైల్ టెక్నాలజీ కాంక్లేవ్, సింపోజియం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని డాక్టర్ శ్రీనివాసరావు, ఈఎన్సీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ వైస్ అడ్మిరల్ సమీర్ సక్సేనా ప్రారంభించారు. డాక్టర్ వై.శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆత్మ నిర్భర్ భారత్ మిషన్‌కు అనుగుణంగా ఇండియన్ పబ్లిక్, ప్రైవేట్ ఇండస్ట్రీస్, డీఆర్డీవో ల్యాబ్స్, అకాడమీ, ఇండియన్ నేవీ ముందుకువెళ్తుండటం శుభపరిణామమని చెప్పారు. విదేశీ దిగుమతులపై ఆధారపడకుండా రక్షణ పరిశ్రమ ప్రధాన సామర్థ్యాలను బలోపేతం చేయాలని సూచించారు. -
అమీర్‌పేట్‌లో అవాన్య నెయిల్ అకాడమీ.. ‘బేబీ’ మూవీ డైరెక్టర్ సాయి రాజేష్ సందడి (ఫోటోలు)
-
ఏపీ జ్యూడిషియల్ అకాడమీని ప్రారంభించిన సీజేఐ జస్టిస్ చంద్రచూడ్
-
ఏపీ జ్యుడీషియల్ అకాడమీని ప్రారంభించిన సీజేఐ చంద్రచూడ్
సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్ జ్యుడీషియల్ అకాడమీని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ ప్రారంభించారు. మంగళగిరి మండలం ఖాజాలో శుక్రవారం రోజున ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, హైకోర్టు న్యాయమూర్తులు పాల్గొన్నారు. అనంతరం సీజేఐ మీడియాతో మాట్లాడుతూ.. న్యాయవ్యవస్థలో సాంకేతిక పరిజ్ఞానం వాడకం పెరిగింది. సాంకేతికతను అందిపుచ్చుకునేలా డిజిటలైజేషన్ ప్రక్రియకు శ్రీకారం చుట్టాం. సాంకేతికతకు అనుగుణంగా మార్పులు చేసుకోవాలి. కేసుల సత్వర పరిష్కారానికి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగపడుతుంది. న్యాయవాదులు నల్లకోటు ధరించి తిరగడం చూస్తుంటాం. అందులోని తెలుపు, నలుపు రంగులను ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణగా పరిగణిస్తారు. న్యాయమూర్తులు నిత్య విద్యార్థులుగా ఉంటూ నైపుణ్యాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. కోర్టులు వివాదాల పరిష్కారమే కాదు, న్యాయాన్ని నిలబెట్టేలా చూడాలి. కేసుల పరిష్కారంలో జాప్యాన్ని తగ్గించాలి. న్యాయవ్యవస్థను పరిరక్షించడానికి అందరి సహకారం అవసరం. పెండింగ్ కేసులు సత్వరమే పరిష్కరించాలి. జడ్జిలకు సొంత సామర్ధ్యాలపై విశ్వాసం ఉండాలి. ముఖ్యమైన కేసుల్లో త్వరగా న్యాయం జరిగేలా చూడాలి. న్యాయవ్యవస్థలో కేసుల సంఖ్య కంటే తీర్పుల్లో నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలి అని సీజేఐ చంద్రచూడ్ పేర్కొన్నారు. -
కర్నూలులో రాష్ట్ర జ్యుడిషియల్ అకాడమీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని న్యాయాధికారులకు శిక్షణ ఇచ్చే రాష్ట్ర జ్యుడిషియల్ అకాడమీని శాశ్వత ప్రాతిపదికన కర్నూలులో ఏర్పాటు చేసేందుకు అనుమతి మంజూరు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అకాడమీని ప్రస్తుతానికి మంగళగిరిలో అద్దె భవనంలో ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇచ్చింది. రాష్ట్ర విభజన తరువాత ఇప్పటివరకు రాష్ట్రంలో జ్యుడిషియల్ అకాడమీ లేదు. దీంతో రాష్ట్రంలో జ్యుడిషియల్ అకాడమీ ఏర్పాటుకు హైకోర్టు న్యాయమూర్తుల కమిటీ సిఫారసులు పంపింది. ఈ సిఫారసులను పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం కర్నూలులో అకాడమీ ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు న్యాయశాఖ కార్యదర్శి జి.సత్యప్రభాకర్ పేరు మీద జీవో జారీ అయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జ్యుడిషియల్ అకాడమీలో ఉన్న సిబ్బందిలో 58.32 శాతం మించకుండా సిబ్బందిని మంజూరు చేస్తున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. సిబ్బంది మంజూరు, మౌలిక సదుపాయాల కల్పన వివరాలతో తగిన ఉత్తర్వులను వేరుగా జారీ చేస్తామంది. ఈ ఉత్తర్వులకు అనుగుణంగా తగిన చర్యలు చేపట్టాలని హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌ను కోరింది. కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేయాలని సంకల్పించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఇప్పటికే అక్కడ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్, రాష్ట్ర లోకాయుక్త కార్యాలయాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. -
సాగర గర్భంలో పర్యాటకం
విశాఖ తీరం పర్యాటకులకు వినూత్న అనుభూతులను అందిస్తోంది. సాగరగర్భంలోని అనంత సంపద అందాల మధ్య ఈత కొట్టిస్తోంది. సాహసాలు చేసే యువతకు స్కూబా డైవింగ్ (సముద్ర లోతుల్లో ఈత)లో దేశంలోనే అగ్రశ్రేణి ప్రాంతంగా నిలుస్తోంది. ఇప్పటికే రుషికొండ బీచ్ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికెట్తో అంతర్జాతీయ పర్యాటకాన్ని ఆకర్షిస్తున్న తరుణంలో.. ప్రభుత్వం విశాఖ కేంద్రంగానే స్కూబా డైవింగ్ అకాడమీ ఏర్పాటుకు కూడా ప్రత్యేక చర్యలు చేపడుతోంది. – సాక్షి, అమరావతి ఎన్నెన్నో డైవింగ్ స్పాట్లు విశాఖ సముద్ర జలాల లోతుల్లో ఈదుతూ స్పష్టంగా చూడగలిగే ప్రాంతాలు చాలా ఉన్నాయి. ఇవే పర్యాటకులను స్కూబా డైవింగ్ వైపు ఆకర్షిస్తున్నాయి. పూడిమడక బీచ్‌లో 3 స్పాట్స్, రుషికొండలో 2, మంగమారిపేటలో 3, భీమిలిలో సైతం సాగర అడుగు భాగంలోని అరుదైన మత్స్య, వృక్ష, జంతు సంపదతో డైవింగ్‌కు అనుకూలంగా ఉండే ప్రాంతాలను స్థానిక స్కూబా డైవర్లే కనుగొనడం విశేషం. అరుదైన చింతపల్లి.. ప్రభుత్వం విజయనగరం జిల్లా తీర ప్రాంత గ్రామమైన చింతపల్లిలో స్కూబా డైవింగ్ అకాడమీ ఏర్పాటుకు చర్యలు చేపడుతోంది. ఇక్కడి సముద్ర జలాలు మాల్దీవులు, అండమాన్ పరిస్థితులను పోలి ఉండటంతో పాటు అడుగున ఓడ శిథిలాలు, చిన్నచిన్న పర్వతాలు, జంతుజాలం ఎక్కువగా ఉన్నాయి. ఇలాంటి ప్రాంతాలు చాలా అరుదుగా ఉంటాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఒడ్డు నుంచి 10 కిలో మీటర్ల లోపలికి వెళ్లితే 5 స్పాట్‌ల్లో సముద్రగర్భ అందాలను చూడవచ్చు. ప్రపంచంలో ఎక్కడైనా.. పర్యాటకులతో సరదాగా స్కూబా డైవింగ్ చేయించడంతో పాటు అకాడమీ ద్వారా సర్టిఫికేషన్ కోర్సులు అందించనున్నారు. తద్వారా ప్రపంచ సముద్ర జలాల్లో స్కూబా డైవింగ్ చేసేందుకు అర్హత లభిస్తుంది. ఇందులో ఓపెన్ వాటర్, అడ్వాన్స్ ఓపెన్ వాటర్ విభాగాల్లో డైÐŒ లు చేయాల్సి ఉంటుంది. వీరికి శిక్షణలో భాగంగా తొలుత స్విమ్మింగ్ పూల్ (నిశ్చల జలాల్లో) మెలకువలు నేర్పిస్తారు. సముద్రం అడుగు భాగంలోని వాతావరణ పరిస్థితులను బోధిస్తారు. రెండు రోజుల నుంచి వారం పాటు సాగే ఈ కోర్సుల్లో చేరేవారికి కచ్చితంగా ఈత వచ్చి ఉండాలి. ఒక్కో కోర్సుకు సుమారు రూ. 25 వేల వరకు ఫీజు ఉంటుంది. దేశంలో గోవా, నేత్రాని ద్వీపం (గోవా సమీపంలోని కర్ణాటక తీరంలో), పుదుచ్చేరి, లక్షద్వీప్, అండమాన్ దీవుల్లో మాత్రమే డైవింగ్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. స్కూబా డైవింగ్‌ను సాహస క్రీడగా పేర్కొంటూ అందులో విశేష ప్రతిభ కనబరిచిన వారికి కేంద్రం టెన్జింగ్ నార్గే అవార్డును సైతం అందిస్తోంది. దీనిని అర్జున అవార్డుతో సమానంగా గుర్తిస్తారు. రెండు విధాలుగా.. విశాఖలో పర్యాటకులకు రెండు రకాల స్కూబా డైవింగ్ విధానాలు అందుబాటులో ఉన్నాయి. ఒకటి డైవింగ్ మాస్టర్ ప్రత్యేక సూచనలిస్తూ ఒడ్డు నుంచి ఈదుకుంటూ 500 మీటర్ల వరకు సముద్ర జలాల్లోకి తీసుకెళ్తారు. మరో విధానంలో బోటుపై 1.5కిలో మీటర్ల సముద్రం లోనికి తీసుకెళ్లి డైవింగ్ చేయిస్తారు. రెండింటిలోనూ 8–11 మీటర్ల లోతు వరకే పర్యాటకులను అనుమతిస్తారు. ఇందు కోసం రూ.2,500 నుంచి రూ.4వేలకు పైగా ఫీజు వసూలు చేస్తారు. పర్యాటకులు సాహసం చేసే సమయంలో వీడియోను చిత్రీకరించి అందిస్తారు. ప్రశాంత జలాల్లోనే.. ఉదయం పూట సముద్రం ప్రశాంతంగా ఉంటుంది. అలల ఉధృతి తక్కువగా ఉండటంతో పాటు సాగర గర్భంలో పరిస్థితులు నెమ్మదిగా ఉంటాయి. అందుకే ఉదయం పూటనే స్కూబా డైవింగ్‌ను చేయిస్తున్నాం. సాయంత్రం అయితే సముద్రం పోటు ఎక్కువగా ఉండి.. డైవర్లకు విజిబులిటీ తక్కువ అవుతుంది. గతంతో పోలిస్తే పర్యాటకులు సంఖ్య పెరుగుతోంది. స్కూబా డైవింగ్‌కు వయసుతో సంబంధం లేకుండా ఆరోగ్యంగా ఉంటే ఎవరైనా చేయవచ్చు. మనకు చింతపల్లి అంతర్జాతీయ స్థాయి స్కూబా డైవింగ్ కేంద్రంగా మారే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ప్రభుత్వంతో కలిసి అక్కడ అక్టోబర్ నుంచి అకాడమీ సేవలను ప్రారంభించనున్నాం. – బలరామ్‌నాయుడు, లైవ్ ఇన్ అడ్వెంచర్స్, విశాఖపట్నం -
జైభీమ్ చిత్రానికి మరో అరుదైన గౌరవం.. 'ఆస్కార్' ఛానెల్లో
Suriya Jai Bhim Features On The Oscars Official Youtube Channel: మాస్ పాత్రల్లోనే కాకుండా, క్లాస్, వైవిధ్యమైన రోల్స్‌లో అదరగొడుతుంటాడు తమిళ స్టార్ హీరో సూర్య. ఇటీవల సూర్య నటించిన చిత్రం 'జైభీమ్'. సినిమా అంటే మూడు ఫైట్లు, నాలుగు పాటలు, హీరోయిన్‌తో ప్రేమాయణం, ఐటెం సాంగ్‌లు కాదని నిరూపించి, సూపర్ డూపర్ హిట్ కొట్టిన చిత్రం జైభీమ్. సినిమాకు సామాజిక బాధ్యతకు ఉన్న అవినాభావ సంబంధాన్ని మరోసారి తట్టిలేపింది. ఒక ఆడబిడ్డ నిజజీవిత గాథను, పోరాటాన్ని ప్రయోగాత్మకంగా తెరకెక్కించి సత్తా చాటింది. టీజే జ్ఞానవేల్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను సూర్య నిర్మించారు. గతేడాది నవంబరులో ఓటీటీలో విడుదలైన ఈ చిత్రం విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కించుకుంది. అంతేకాకుండా ఐఎండీబీ రేటింగ్స్‌లో హాలీవుడ్ క్లాసిక్ హిట్ 'ది షాషాంక్ రిడంప్షన్' చిత్రాన్ని అధిగమించి 73 వేలకుపైగా ఓట్లతో 9.6 రేటింగ్ సాధించింది. ఇప్పటివరకూ ఏ సౌత్ సినిమాకు ఇలాంటి రేటింగ్ రాలేదు. అలాగే గోల్డెన్ గ్లోబ్ 2022 పురస్కారానికి కూడా నామినేట్ అయిన సంగతి తెలిసిందే. వాస్తవ సంఘటనల ఆధారంగా కోర్టు డ్రామా కథాశంతో తెరకెక్కిన 'జైభీమ్' చిత్రానికి మరో అరుదైన గౌరవం దక్కింది. అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ (ఆస్కార్) అధికారిక యూట్యూబ్ ఛానెల్లో 'సీన్ ఎట్ ది అకాడమీ' పేరుతో ఈ సినిమాలోని ఓ వీడియోను ఉంచారు. అకాడమీ యూట్యూబ్ వేదికగా ఒక తమిళ చిత్రానికి సంబంధించిన వీడియో క్లిప్‌ను ఉంచటం ఇదే మొదటిసారి. కాగా అకాడమీ యూట్యూబ్ ఛానెల్లో జైభీమ్ సినిమా వీడియో ఉండటంపై చిత్రబృందంతోపాటు అభిమానులు సంతోషపడుతున్నారు. 'జైభీమ్' ఇండియన్ సినిమా స్థాయిని మరో మెట్టు ఎక్కించిందని పండుగ చేసుకుంటున్నారు. ఈ చిత్రాన్ని 'జస్టిస్ చంద్రు' జీవిత కథ ఆధారంగా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఇదీ చదవండి: సూర్య ‘జై భీమ్’ మూవీ ఎలా ఉందంటే..? #Suriya's #JaiBhim scenes uploaded to #Oscars Official YouTube channel.👍👏@Suriya_offl ➡️ https://t.co/AXQwY2av72 pic.twitter.com/QmgFrz827n — Suresh Kondi (@SureshKondi_) January 18, 2022 • #JaiBhim is now the only Tamil Movie to be shown in The Academy #Oscars YouTube channel 🔥💯 Ever Proudful @Suriya_offl na 😇❤️ pic.twitter.com/3JhxVZhX1q — CHENTHUR (@ck__tweetz) January 18, 2022 #JaiBhim getting bigger and bigger 🔥 First Tamil movie scenes to shown in #Oscars utube ❤@Suriya_offl #EtharkkumThunindhavan#VaadiVaasal pic.twitter.com/qJcs0TsIQd — Mass Syed 💥 (@SuriyaFanstren4) January 18, 2022 -
తిరుపతిలో ఏపీ సర్వే ట్రైనింగ్ అకాడమీ
సాక్షి, అమరావతి: ఏపీ సర్వే శిక్షణ అకాడమీ తిరుపతిలో ఏర్పాటు కానుంది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం చిత్తూరు జిల్లా తిరుపతి మండలం చెన్నయ్యగుంట గ్రామ పరిధిలో 41.19 ఎకరాల భూమిని కేటాయించింది. ప్రస్తుతం ఈ అకాడమీ తూర్పు గోదావరి జిల్లా సామర్లకోటలో తాత్కాలికంగా కొనసాగుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో ఇది హైదరాబాద్ గచ్చిబౌలిలోని 200 ఎకరాల సువిశాల ప్రదేశంలో ఉండేది. రాష్ట్ర విభజన తర్వాత అది తెలంగాణ ఆధీనంలోకి వెళ్లింది. రాష్ట్రంలో సర్వే శిక్షణ అవసరాల కోసం అకాడమీ లేకపోవడంతో 2017లో తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలోని పంచాయతీరాజ్ ఎక్స్టెన్షన్ ట్రెయినింగ్ సెంటర్లో లీజు ప్రాతిపదికన సర్వే అకాడమీని ఏర్పాటు చేశారు. అది కేవలం 2.90 ఎకరాల్లో మాత్రమే ఉంది. తాత్కాలిక కేంద్రంలో సరిపడా వసతులు లేకుండానే అకాడమీ నడుస్తున్న విషయం తెలుసుకున్న సీఎం వైఎస్ జగన్ వెంటనే శాశ్వత అకాడమీకి తిరుపతిలో భూమి కేటాయించారు. ఈ భూముల్లో త్వరలో కొత్త అకాడమీని ఏర్పాటుచేసేందుకు సర్వే శాఖ ప్రణాళిక రూపొందిస్తోంది. తరగతి గదులు, హాస్టల్, పరిపాలనా భవనం, క్యాంటీన్ ఇతర సౌకర్యాల కోసం భవనాలను నిర్మించాల్సి వుంది. అందరికీ ఇక్కడే శిక్షణ కొత్తగా సర్వీసులోకి వచ్చిన ఐఏఎస్ అధికారులు, డిప్యూటీ కలెక్టర్లకు భూముల సర్వేపై ఇక్కడే శిక్షణనిస్తారు. ప్రొబేషనరీ డిప్యూటీ తహశీల్దార్లు, సర్వే అసిస్టెంట్ డైరెక్టర్లు, జ్యుడీషియల్ అధికారులు, ఇతర సర్వే ఉద్యోగులకూ సర్వేపై శిక్షణ ఇస్తారు. కొత్తగా సర్వీసులోకి వచ్చిన వారికి ఇండక్షన్ ట్రెయినింగ్లు, ప్రస్తుతం పనిచేస్తున్న అధికారులకు రిఫ్రెషర్ ట్రెయినింగ్లు, కొన్ని ప్రత్యేక శిక్షణలతోపాటు అడ్వాన్స్డ్ సర్వే టెక్నాలజీ ట్రెయినింగ్లనూ ఇక్కడ ఇస్తారు. రాష్ట్ర ప్రభుత్వం భూముల రీసర్వేను ప్రతిష్టాత్మకంగా చేపట్టడంతో సర్వేయర్లు, రెవెన్యూ సిబ్బందికి పెద్దఎత్తున శిక్షణ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే అకాడమీకి ముఖ్యమంత్రి తిరుపతిలో భూములు కేటాయించినట్లు సర్వే శాఖ అధికారులు తెలిపారు. గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పాటైన తర్వాత 11,187 మంది సర్వేయర్లకు అకాడమీ 50కిపైగా శిక్షణలు ఇచ్చింది. -
‘రజా అకాడమీ’ని నిషేధించాలి
నాగపూర్/పుణే: మహారాష్ట్రలోని పలు నగరాలు, పట్టణాల్లో హింసాకాండ చోటుచేసుకోవడంపై విశ్వ హిందూ పరిషత్(వీహెచ్‌పీ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. త్రిపురలో జరిగిన మత కలహాలను నిరసిస్తూ ఇస్లామిక్ సంఘాల ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీల సందర్భంగా అల్లరి మూకలు దుకాణాలపై రాళ్లు రువ్విన సంగతి తెలిసిందే. ఈ ఘటనలను వీహెచ్‌పీ జనరల్ సెక్రెటరీ మిలింద్ పరాండే ఆదివారం ఖండించారు. అల్లర్లకు కారణమైన ‘రజా అకాడమీ’ అనే ఇస్లామిక్ సంఘాన్ని రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అల్లరి మూకలపై తాము పలు పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేశామని అన్నారు. రాళ్లు రువ్వినవారిని గుర్తించి, చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఒకవేళ పోలీసులు స్పందించకపోతే తామే ఆ పని చేస్తామని హెచ్చరించారు. ఈ విషయంలో త్వరలో గవర్నర్ భగత్‌సింగ్ కోషియారీని కలుస్తామన్నారు. అల్లర్లలో నష్టపోయిన వారికి పరిహారం చెల్లించా లని మహారాష్ట్ర సర్కార్‌కి మిలింద్ పరాండే విజ్ఞప్తి చేశారు. బాలీవుడ్ నటి కంగనా రనౌత్ వ్యాఖ్యలపైనా ఆయన మాట్లాడారు. భారత్ 2014లో సాంస్కృతిక స్వాతంత్య్రం పొందిందని చెప్పారు. -
తెలుగు-సంస్కృత అకాడమీ ఏర్పాటులో తప్పేంటి?
అమరావతి: తెలుగు అకాడమీ పేరును తెలుగు-సంస్కృత అకాడమీగా మారుస్తూ ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులిచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై వస్తున్న విమర్శలపై ఆదివారం ఏపీ తెలుగు-సంస్కృత అకాడమీ చైర్మన్ నందమూరి లక్ష్మీపార్వతి స్పందించారు. తెలుగు-సంస్కృత అకాడమీ ఏర్పాటులో తప్పేంటి? అని ఆమె ప్రశ్నించారు. తెలుగు అకాడమీ పేరును తెలుగు-సంస్కృత అకాడమీగా.. విస్తరించడం వల్ల నష్టం ఏంటో విమర్శకులు వివరించాలి అని ఆమె నిలదీశారు.తెలుగు భాషాభివృద్ధికి, దానితో పాటు సంస్కృత భాషాభివృద్ధికి కూడా సీఎం జగన్ ప్రభుత్వం చేస్తున్న కృషిని అభినందించాలని లక్ష్మీపార్వతి పేర్కొన్నారు. అకారణమైన, నిర్హేతుకమైన విమర్శలను చేయవద్దని సవినియంగా మనవి చేస్తున్నానన్నారు. -
బైజూస్ మెగా డీల్ @7,300 కోట్లు
ముంబై: దేశంలోనే అతిపెద్ద ఆన్లైన్ ఎడ్యుకేషన్ స్టార్టప్ బైజూస్ తాజాగా ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్‌ను కొనుగోలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు 1 బిలియన్ డాలర్లు(సుమారు రూ. 7300 కోట్లు) చెల్లించనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. వెరసి దేశీయంగా అతిపెద్ద ఎడ్యుటెక్ డీల్స్‌లో ఒకటిగా ఇది నిలవనున్నట్లు అభిప్రాయపడ్డాయి. కోవిడ్–19 నేపథ్యంలో ఆన్లైన్ క్లాసులకు డిమాండ్ మరింత పెరగడంతో బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న బైజూస్ ఇటీవల నిధుల సమీకరణ చేపట్టిన విషయం విదితమే. ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ సంస్థతోపాటు, టైగర్ గ్లోబల్ మేనేజ్మెంట్, బాండ్ క్యాపిటల్ తదితర సంస్థల నుంచి నిధులను సమకూర్చుకుంది. దీంతో బైజూస్ విలువ 12 బిలియన్ డాలర్లకు చేరినట్లు పరిశ్రమవర్గాలు తెలియజేశాయి. ఇంజినీరింగ్, మెడికల్ విద్యా శిక్షణలో పట్టున్న ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్‌కు దేశవ్యాప్తంగా 200 శిక్షణా కేంద్రాలున్నాయి. బైజూస్‌తో డీల్‌లో భాగంగా ఆకాష్లో కంపెనీ వ్యవస్థాపకులు చౌధరీ కుటుంబ సభ్యులు వైదొలగనున్నట్లు తెలుస్తోంది. మరోపక్క ఆకాష్లోగల 37.5 శాతం వాటాకుగాను బైజూస్‌లో కొంత వాటాను బ్లాక్‌స్టోన్ గ్రూప్ పొందే వీలున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. జేఈఈ ప్రిపరేషన్‌కు ‘అమెజాన్ అకాడమీ’ అమెజాన్ ఇండియా ‘అమెజాన్ అకాడమీ’ పేరిట జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) ప్రిపరేషన్ కోసం విద్యార్థులకు అవసరమైన ఆన్లైన్ వేదికను ప్రారంభించింది. గూగుల్‌ప్లే స్టోర్‌లో బీటా వర్షన్ యాప్ ఉచితంగా అందుబాటులో ఉందని కంపెనీ తెలిపింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో బైజూస్, అన్అకాడమీ, వేదాంతు వంటి కంపెనీలకు ప్రజాదరణ పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెజాన్ ఇండియా (ఎడ్యుకేషన్) డైరెక్టర్ అమోల్ గుర్వారా తెలిపారు. జేఈఈతో పాటు బీఐటీఎస్ఏటీ, వీఐటీఈఈఈ, ఎస్‌ఆర్‌ఎంజేఈఈఈ, ఎంఈటీ పరీక్షల విద్యార్థులకు కూడా నాణ్యమైన కంటెంట్ అందుబాటులో ఉందని తెలిపారు. చదవండి: ఫుల్ సిగ్నల్.. జోరుగా టెలిగ్రాం! మొబైల్ యూజర్లకు అమెజాన్ ప్రైమ్ వీడియో సూపర్ ఆఫర్ -
గగన్ అకాడమీలోకి వరద నీరు
హైదరాబాద్: నగరంలో కురుస్తున్న భారీ వర్షాలకు ఒలింపిక్ మెడలిస్ట్, షూటర్ గగన్ నారంగ్ ‘గన్ ఫర్ గ్లోరీ (జీఎఫ్జీ) అకాడమీ’లోకి వరద నీరు వచ్చి చేరింది. సికింద్రాబాద్‌లోని తిరుమలగిరి ప్రాంతంలో ఉన్న తన షూటింగ్ రేంజ్‌లోకి వరద నీరు చేరడంతో దాదాపు రూ. 1.3 కోట్లు విలువైన షూటింగ్ సామగ్రి పాడైనట్లు నారంగ్ గురువారం వెల్లడించాడు. ‘ 24 గంటల్లో అంతా నాశనమైంది. భారీ వరద మా షూటింగ్ రేంజ్‌ను ముంచెత్తింది. కొత్తగా తెచ్చిన 80 రైఫిల్స్, పిస్టల్స్‌తో పాటు ఇతర సామగ్రిని పూర్తిగా పాడు చేసింది. జీఎఫ్జీ సిబ్బంది 9 ఏళ్ల కష్టం వరద నీటిలో కొట్టుకుపోయింది’ అని ఆవేదనతో నారంగ్ పోస్ట్ చేశాడు. ఇప్పటికే కరోనా వల్ల ఏర్పడిన నష్టం చాలదన్నట్లు... తాజా వరదలు జీఎఫ్‌జీని ఆర్థికంగా దెబ్బ తీశాయని నారంగ్ వ్యాఖ్యానించాడు. జీఎఫ్‌జీని ప్రపంచస్థాయి షూటింగ్ అకాడమీగా మార్చేందుకు తాము రాత్రింబవళ్లు కష్టపడ్డామని, ఇకపై అకాడమీని మునపటిలా మార్చడానికి వీలవుతుందో లేదో చెప్పడం కష్టమని పేర్కొన్నాడు. -
తెలంగాణలో వెయిట్‌లిఫ్టింగ్ అకాడమీ
సాక్షి, హైదరాబాద్: ఒలింపిక్స్ క్రీడల్లో పతకం అందించిన భారత తొలి మహిళా క్రీడాకారిణిగా ఆంధ్రప్రదేశ్ వెయిట్‌లిఫ్టర్ కరణం మల్లేశ్వరి చరిత్రలో నిలిచిపోయింది. సరిగ్గా 20 ఏళ్ల క్రితం 2000 సిడ్నీ ఒలింపిక్స్‌లో మల్లేశ్వరి మహిళల వెయిట్‌లిఫ్టింగ్ 69 కేజీల విభాగంలో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం సొంతం చేసుకుంది. ఈ ఘనత సాధించి రెండు దశాబ్దాలు పూర్తయిన సందర్భంగా ఆమెతో టీ–స్పోర్ట్స్ చైర్మన్, జాతీయ హ్యాండ్‌బాల్ సంఘం ఉపాధ్యక్షుడు అరిసనపల్లి జగన్మోహన్ రావు వెబీనార్ నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లేశ్వరి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం సహకారమిస్తే హైదరాబాద్ కేంద్రంగా వెయిట్‌లిఫ్టింగ్ అకాడమీని ఏర్పాటు చేస్తానని, తెలుగు రాష్ట్రాల క్రీడాకారుల అభ్యున్నతి కోసం తాను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని హామీ ఇచ్చింది. తెలంగాణలో ప్రతిభావంతులైన ఎంతోమంది యువ వెయిట్‌లిఫ్టర్లు ఉన్నారని... అయితే వారికి అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన అకాడమీ లేకపోవడంతో వెలుగులోకి రావడం లేదని టీ–స్పోర్ట్స్ చైర్మన్ జగన్మోహన్ రావు తెలిపారు. మల్లేశ్వరి ఫౌండేషన్‌తో కలిసి తెలంగాణ లిఫ్టర్లకు చేయూత ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన అన్నారు. మల్లేశ్వరి హైదరాబాద్‌కు రావాలని ఈ వెబీనార్‌లో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ (శాట్స్) అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి ఆహ్వానించారు. క్రీడల మంత్రి శ్రీనివాస్ గౌడ్ సహకారంతో సీఎం కేసీఆర్‌ను కలిసి రాష్ట్రంలో వెయిట్‌లిఫ్టింగ్ అకాడమీ ఏర్పాట్లపై చర్చిద్దామని ఆయన అన్నారు. -
తిరుపతికి మరో మణిహారం
ఆధ్యాత్మిక నగరంగానే కాకుండా సంస్కృతి, సంప్రదాయాలకు నిలయమైన తిరుపతిలో తెలుగు సంస్కృత అకాడమీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గురువారం జరిగిన ఏపీ కేబినెట్ మీటింగ్ రాష్ట్రంలో ఏపీ హయ్యర్ ఎడ్యుకేషన్ సొసైటీ ద్వారా తెలుగు సంస్కృత అకాడమీని తిరుపతిలో ఏర్పాటు చేయాలని సూత్రప్రాయ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. సాక్షి, తిరుపతి: ఏపీ, తెలంగాణాల అధికార భాష తెలుగు. సుమారు 9 కోట్ల మందికి తెలుగు మాతృభాషగా ఉంది. ప్రపంచంలో అత్యధికులు మాట్లాడే భాషల్లో తెలుగు ఒకటి. తెలుగు భాష, సంస్కృతి అభివృద్ధి, తెలుగు భాషలో పాఠ్యాంశాల తయారీ, ప్రచురణ, తెలుగు సాహిత్యంపట్ల అవగాహన పెంచి ప్రొత్సహించడానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు అకాడమీ ఏర్పాటు చేశారు. దీని ద్వారా అనేక పాఠ్యపుస్తకాలను ముద్రించి విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చారు. అలాగే వివిధ యూనివర్సిటీలు, కళాశాలల్లో సదస్సులు, సెమినార్లు నిర్వహించేవారు. ఈ అకాడమీ ద్వారా డిగ్రీ స్థాయి వరకు అనేక ప్రామాణిక పుస్తకాలు తీసుకొచ్చారు. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయాక తెలుగు అకాడమీ ఇంకా విడిపోలేదు. రెండు రాష్ట్రాలకు సంయుక్తంగా ఉంది. సుమారు 400 కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఇందులో ఏపీలో 58 శాతం నిధులు రావాల్సి ఉంది. 2014–2019 వరకు అధికారంలో కొనసాగిన టీడీపీ ప్రభుత్వం దీని గురించి ఏమాత్రం పట్టించుకోలేదు. అయితే ప్రస్తుత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలుగు అకాడవీుకి పూర్వ వైభవం తీసుకొచ్చే దిశగా చర్యలు తీసుకున్నారు. లక్ష్మీపార్వతిని తెలుగు అకాడమీ చైర్మ న్గా నియమించారు. ప్రభుత్వం తెలుగు భాష, సంస్కృతిని అకాడమీతో కలిపి తెలుగు సంస్కృత అకాడమీ పేరిట రాష్ట్రస్థాయి సంస్థ ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ఈ సంస్థను తిరుపతిలో ఏర్పాటు చేయాలని గురువారం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన కేబినెట్ సమావేశంలో సూత్రప్రాయంగా నిర్ణయించారు. చదవండి: తెలుగు రాష్ట్రాల్లోని విద్యా సంస్థలకు ర్యాంకులు ఇలా.. ఇప్పటికే ప్రాంతీయ కేంద్రం తెలుగు అకాడవీుకి ఏపీలో 5 ప్రాంతీయ కేంద్రాలు ఉన్నాయి. తిరుపతి, అనంతపురం, గుంటూరు, విజయవాడ, విశాఖ పట్నం నగరాల్లో ప్రాంతీయ కేంద్రాలు ఉన్నాయి. వీటిల్లో సుమారు 30 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. తిరుపతిలో కోర్టు ఎదురుగా ఉన్న కోదండరామ హైసూ్కల్లో ప్రాంతీయ కేంద్రం పని చేస్తుంది. తిరునగరికి మరో కలికితురాయి.. తిరుపతిలో ఎస్వీయూ, మహిళావర్సిటీ, వేదిక్, వెటర్నరీ, సంస్కృత వర్సిటీ, ఐఐటీ, ఐసర్ తదితర విద్యాసంస్థలు ఉన్నాయి. అలాగే తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో తెలుగు సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు అనేక కార్యక్రమాలు చేపట్టారు. తెలుగు పరిరక్షణ సమితి, తెలుగు భాషా వికాస వేదిక తదితర సంస్థలు తెలుగు సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు పని చేస్తున్నాయి. తిరుపతిలో నిర్వహించే గంగమ్మ జాతరకు రాష్ట్రంలో ఎంతో గుర్తింపు ఉంది. అలాంటి తిరుపతి నగరంలో తెలుగు సంస్కృత అకాడమీ ఏర్పాటు పట్ల తెలుగు భాష ప్రేమికులు, సాహితివేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎంతో మంచి నిర్ణయం తెలుగు భాష, సంస్కృతి పరిరక్షణకు తిరుపతి లో తెలుగుసంస్కృత అకాడమీ ఏర్పాటు చేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయం హర్షణీయం. రాయలసీమ ప్రాంతంలో తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు ఎంతో గుర్తింపు లభిస్తుంది. – జే ప్రతాప్ రెడ్డి, ప్రొఫెసర్, తెలుగు అకాడమీ మాజీ డైరెక్టర్ తెలుగు భాష, సంస్కృతికి మేలు తిరుపతిలో తెలుగు సంస్కృత అకాడమీ ఏర్పా టు చేయడం వల్ల తెలుగుభాష, సంస్కృతికి మే లు చేకూరుతుంది. ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో ఆధ్యాత్మికతకు సంస్కృతి, భాష తోడైతే తెలుగు సంస్కృతి, భాషకు ఉన్నత స్థితి లభిస్తుంది. తెలుగు ప్రజలకు గుర్తింపు దక్కుతాయి. – డాక్టర్ గెంజి అరుణ, అసోసియేట్ ప్రొఫెసర్, భాషోత్పత్తి శాస్త్రం, ఎస్వీయూ -
చెన్నైలో సింధు పేరుతో అకాడమీ
చెన్నై: ప్రపంచ చాంపియన్, భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు పేరుతో చెన్నైలో అకాడమీ నిర్మా ణమవుతోంది. ‘హార్ట్ఫుల్నెస్ ఇన్స్టిట్యూట్’ ఆధ్వర్యంలో చెన్నై శివారులో ఈ అకాడమీని నిర్మిస్తున్నారు. బుధవారం జరిగిన శంకుస్థాపన కార్యక్రమానికి తెలుగుతేజం సింధు స్వయంగా హాజరై పునాదిరాయి వేసింది. హార్ట్ఫుల్నెస్ ఇన్స్టిట్యూట్ అనేది ధ్యానం నేర్పించే సంస్థ. కమలేశ్ పటేల్ ఆధ్వర్యంలో పనిచేసే ఈ సంస్థలో ఆమె ధ్యానం నేర్చుకున్నారు. మొత్తం 8 కోర్టులతో అత్యాధునిక హంగులతో నిర్మించనున్న ఈ అకాడమీని 18 నుంచి 24 నెలల్లో పూర్తిచేయనున్నట్లు తెలిసింది. జిమ్, ఫిజియో సెంటర్లు అందుబాటులో ఉంచుతారు. 1000 మంది ప్రేక్షకులు సౌకర్యంగా కూర్చునే ఏర్పాట్లు చేయనున్నారు. -
విద్యార్థి ఆత్మహత్య: శ్రీసాయి డిఫెన్స్ అకాడమీపై దాడి
-
15 ఎకరాల్లో అడ్వొకేట్స్ అకాడమీ
కమాన్‌చౌరస్తా (కరీంనగర్): హైదరాబాద్ సమీపంలోని షామీర్పేట, నల్సార్ లా యూనివర్సిటీ సమీపంలో 15 ఎకరాల్లో అడ్వొకేట్స్ అకాడమీ ఏర్పాటు చేయనున్నట్లు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ తెలిపారు. కరీంనగర్ కోర్టు ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్, ఫ్యామిలీ కోర్టు మినీగార్డెన్, ఈ–ఫైలింగ్ కోర్టు విభాగాలను హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ చల్లా కోదండరాం, జస్టిస్ పి.నవీన్‌రావుతో కలసి శనివారం ఆయన ప్రారంభించారు. కోర్టు ఆవరణలో జిల్లా జడ్జి అనుపమ చక్రవర్తి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రధాన న్యాయమూర్తి చౌహాన్ మాట్లాడారు. జనవరిలోగా ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. బార్ అసోసియేషన్లు కూడా న్యాయవాదుల కోసం వర్క్‌షాప్‌లు ఏర్పాటు చేయాలని సూచించారు. కరీంనగర్ పోర్ట్‌ఫోలియో జడ్జి, హైకోర్టు న్యాయమూర్తి చల్లా కోదండరాం మాట్లాడుతూ కోర్టులు సరైన సమయంలో తీర్పులు ఇవ్వకపోవడంతోనే ప్రత్యేకంగా ట్రిబ్యునల్స్ ఏర్పాటయ్యాయని గుర్తు చేశారు. మరో న్యాయమూర్తి పి.నవీన్‌రావు మాట్లాడుతూ కోర్టులో అధునాతన మార్పులు ఆనందకరమని, త్వరలో మరిన్ని మార్పులు తీసుకువచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. నంది మేడారం పంప్‌హౌస్ సందర్శన ధర్మారం: రైతులకు ఎల్లకాలం సాగునీరు అందేలా కాళేశ్వరం ప్రాజెక్టు అందుబాటులోకి రావడం సంతోషకరమని జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహన్ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ – 6లో భాగంగా పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారం వద్ద నిర్మించిన పంప్‌హౌస్‌ను శనివారం న్యాయమూర్తులు కోదండరాం, నవీన్‌రావు, కరీంనగర్ జిల్లా జడ్జి అనుపమా చక్రవర్తితో కలసి సందర్శించారు. పంప్‌హౌస్‌లోని సర్జిఫూల్, మోటార్లు, విద్యుత్తు సబ్స్టేషన్లను పరిశీలించారు. ప్రాజెక్టు గురించి ఈఎన్సీ వెంకటేశ్వర్లు, ఈఈ నూనె శ్రీధర్ వివరించారు. అనంతరం మేడారంలోని హనుమాన్ ఆలయంలో పూజలు చేసి, ఆవరణలో మొక్కలు నాటారు. త్రికుటాలయం, నంది ఆలయాలను సందర్శించారు. న్యాయమూర్తి నవీన్‌రావు నివాసానికి వెళ్లి కాసేపు గడిపారు. -
పైలెట్ల కార్ఖానా
-
గోపీచంద్ అకాడమీలో మరో శిక్షణ కేంద్రం
సాక్షి, హైదరాబాద్: భారత బ్యాడ్మింటన్‌కు కేంద్రంగా ఉన్న హైదరాబాద్‌లో క్రీడాకారుల కోసం మరో శిక్షణ కేంద్రం ఏర్పాటు కానుంది. గచ్చిబౌలిలోని పుల్లెల గోపీచంద్ అకాడమీ ఆవరణలో అదనంగా ఆరు ఎయిర్ కండిషన్డ్ కోర్టుల నిర్మాణం జరగనుంది. ఈ మేరకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన శిక్షణ కేంద్రం నిర్మాణం కోసం కొటక్ మహీంద్రా బ్యాంక్ లిమిటెడ్ ముందుకొచ్చింది. పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ ఫౌండేషన్‌తో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా రాబోయే మూడేళ్ల కాలంలో రూ. 30 కోట్ల నుంచి రూ. 35 కోట్లు వెచ్చించి ఈ శిక్షణ కేంద్రాన్ని అభివృద్ధి చేస్తామని సోమవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కొటక్ మహీంద్రా బ్యాంక్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ దీపక్ గుప్తా తెలిపారు. ఈ కేంద్రంలో స్పోర్ట్స్ సైన్స్ సెంటర్‌ను కూడా నెలకొల్పుతామని, కోచ్‌లకు శిక్షణ కా ర్యక్రమాలు ఉంటాయని అన్నారు. ‘అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన శిక్షణ సౌకర్యాలు లభిస్తే భారత ఆటగాళ్లు మున్ముందు మరిన్ని గొప్ప ఫలితాలు సాధిస్తారు. అంతర్జాతీయ మ్యాచ్‌లను ఎయిర్ కండిషన్డ్ కోర్టులలో నిర్వహిస్తారు. అకాడమీలో ఎయిర్ కండిషన్డ్ కోర్టులు ఉండాలని కోరుకున్నాం. త్వరలోనే వీటి నిర్మాణ పనులు మొదలవుతాయి. ఇందులో భారత అగ్రశ్రేణి క్రీడాకారులు ప్రాక్టీస్ చేస్తారు’ అని జాతీయ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ తెలిపారు.