‘టాప్ 100’లో ఐఐటీ గువాహటి | IIT Guwahati makes it to world's top 100 universities | Sakshi
Sakshi News home page

‘టాప్ 100’లో ఐఐటీ గువాహటి

Published Fri, May 2 2014 4:12 AM | Last Updated on Sat, Sep 2 2017 6:47 AM

IIT Guwahati makes it to world's top 100 universities

లండన్: ప్రతిష్టాత్మక గువాహటి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ గువాహటి) అరుదైన ఘనత సొంతం చేసుకుంది. అంతర్జాతీయంగా వంద అత్యుత్తమ విద్యాసంస్థల్లో స్థానం సంపాదించింది. ఈ జాబితాలో తొలిసారిగా చోటు సంపాదించిన ఏకైక భారతీయ విద్యాసంస్థ ఇదే. ‘50 ఏళ్ల కంటే తక్కువ వయసున్న 100 సంస్థల-2014’ జాబితాను టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ మేగజీన్ విడుదల చేసింది. ఇందులో ఐఐటీ గువాహటి.. 87వ ర్యాంకును పోర్చుగల్‌కు చెందిన లిస్బన్ వర్సిటీ, ఆస్ట్రేలియాకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ వెస్టర్న్ సిడ్నీతో కలిపి పంచుకుంది. ఇక దక్షిణ కొరియాకు చెందిన పొహాంగ్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వరుసగా మూడో ఏడాది కూడా ఈ జాబితాలో తొలి స్థానంలో నిలిచింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement