దేశంలో జాబ్ మార్కెట్‌కు అనుగుణంగా యువతలో నైపుణ్యాలు పెంచేందుకు రిలయన్స్ ఫౌండేషన్ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది. రిలయన్స్ ఫౌండేషన్ స్కిల్లింగ్ అకాడమీని ప్రారంభించింది. స్కిల్ డెవలప్‌మెంట్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, విద్యా శాఖల సహాయ మంత్రి జయంత్ చౌదరి ఈ అకాడమీని ప్రారంభించారు.
నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (NSDC) సహకారంతో రిలయన్స్ ఫౌండేషన్ నిర్వహించిన ‘భవిష్యత్ ఉద్యోగాల కోసం యువతకు సాధికారత’ అనే అంశంపై జరిగిన జాతీయ సదస్సులో ఈ కొత్త చొరవను ఆవిష్కరించారు. స్కిల్ బిల్డింగ్, పర్సనలైజ్డ్ ఎక్స్‌పర్ట్ గైడెన్స్ అందించే ఫ్యూచర్ రెడీ కోర్సులను స్కిల్లింగ్ అకాడమీ అందిస్తుందని రిలయన్స్ ఫౌండేషన్ తెలిపింది. పరిశ్రమల అనుసంధానంతో కెరీర్ డెవలప్‌మెంట్‌కు తోడ్పాటునందిస్తుందని పేర్కొంది.
నైపుణ్యాలను నేర్పించడం, పెంపొందించడం ద్వారా వచ్చే సంవత్సరంలో 6 లక్షల మంది భారతీయ యువతకు సాధికారత కల్పించడం అకాడమీ లక్ష్యమని వెల్లడించింది. ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (AICTE) భాగస్వామ్యంతో రిలయన్స్ ఫౌండేషన్ స్కిల్లింగ్ అకాడమీ తన కోర్సుల పరిధిని విస్తరిస్తుందని, స్కిల్ ఇండియా మిషన్‌కు మద్దతునిస్తుందని వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment