ఒళ్లో పేలిన ఫోను.. తృటిలో తప్పిన పెను ప్రమాదం! | Mobile Phone Blast in Coaching Academy | Sakshi
Sakshi News home page

Himachal Pradesh: ఒళ్లో పేలిన ఫోను.. తృటిలో తప్పిన పెను ప్రమాదం!

Published Sun, Mar 24 2024 9:01 AM | Last Updated on Sun, Mar 24 2024 9:01 AM

Mobile Phone Blast in Coaching Academy - Sakshi

హిమాచల్ ప్రదేశ్‌లోని హమీర్పూర్ జిల్లాలో మొబైల్ ఫోన్‌ పేలిన ఉదంతం వెలుగు  చూసింది. స్థానిక కోచింగ్ సెంటర్‌లో క్లాసులు జరుగుతుండగా ఒక విద్యార్థిని  ఒళ్లోవున్న మొబైల్ ఫోన్ ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో తరగతిలో కలకలం చెలరేగింది. అయితే  వెంటనే అప్రమత్తమైన ఆ విద్యార్థిని మొబైల్‌ ఫోనును బయటకు విసిరేసింది.

మీడియాకు అందిన సమాచారం ప్రకారం హమీర్పూర్ ప్రధాన మార్కెట్ ప్రాంతంలో ఒక ప్రైవేట్ విద్యాసంస్థ ఉంది. ఇక్కడ దాదాపు 40  మంది చదువుకుంటున్నారు. క్లాసులో తరగతి జరుగుతుండగా ఓ విద్యార్థిని దగ్గరున్న ఫోనులో నుంచి మంటలు చెలరేగాయి దీంతో ఆమె భయంతో ఆ మొబైల్‌ ఫోనును మెయిన్‌ రోడ్డు వైపునకు  విసిరేసింది.

ఆ ఫోను అక్కడున్న సైన్ బోర్డుకు తగిలి పేలిపోయింది. దీంతో సైన్ బోర్డుకు మంటలు అంటుకున్నాయి. ఆ తర్వాత మొబైల్ ఫోను పూర్తిగా కాలిపోయింది. అనంతరం స్థానికులు అప్రమత్తమై ఆ మంటలపై బకెట్లతో నీళ్లు పోసి, ఆర్పివేశారు. భవనం మొదటి అంతస్థులో ఈ ఘటన జరిగింది. అక్కడికి సమీపంలోనే దుస్తుల దుకాణాలు ఉన్నాయి. రోడ్డుపైనో, తరగతి గదిలోనో ఆ మొబైల్ ఫోన్ పేలి ఉంటే పరిస్థితి మరింత దారుణంగా ఉండేదని స్థానికులు అంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement