గ్లోబల్ హోమ్‌స్టే అండ్ హోటల్ అగ్రిగేటర్ 'ఎయిర్‌బీఎన్‌బీ'.. గోవా ప్రభుత్వ పర్యాటక శాఖ సహకారంతో.. గోవాలో భారతదేశపు మొట్టమొదటి ఎయిర్‌బీఎన్‌బీ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అకాడమీని ప్రారంభించింది. హోమ్‌స్టే టూరిజాన్ని ప్రోత్సహించడానికి.. రాష్ట్రంలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని హాస్పిటాలిటీ వ్యాపారవేత్తలలో సామర్థ్యాన్ని పెంపొందించడానికి కంపెనీ గోవాలోని పర్యాటక శాఖ (DoT) మధ్య ఉన్న అవగాహన ఒప్పందం (MOU)లో భాగంగా ఈ అకాడమీ ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో గోవా పర్యాటక శాఖ మంత్రి రోహన్ ఖౌంటే, ఎయిర్‌బీఎన్‌బీ ఇండియా జనరల్ మేనేజర్ అమన్‌ప్రీత్ బజాజ్ పాల్గొన్నారు.
కొత్త అకాడమీ ద్వారా.. వ్యక్తులను కంపెనీ హోస్ట్ చేసే ప్రపంచానికి పరిచయం చేయడమే ఎయిర్‌బీఎన్‌బీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే దీనికోసం కంపెనీ ఇంటరాక్టివ్ వర్క్‌షాప్‌ల ద్వారా 25 మందికి ట్రైనింగ్ ఇచ్చింది. ఉత్తర గోవా నుంచి పాల్గొనేవారి కోసం మిరామార్ రెసిడెన్సీలో మొదటి రౌండ్ వర్క్‌షాప్‌లు జరిగాయి. దక్షిణ గోవా నుంచి మరో 25 మంది ట్రైనీలను లక్ష్యంగా చేసుకుని మడ్గావ్‌లో తదుపరి రౌండ్ శిక్షణలు నిర్వహించనున్నారు.
ఎయిర్‌బీఎన్‌బీ అకాడమీ ప్రారంభం సందర్భంగా పర్యాటక మంత్రి రోహన్ ఖౌంటే మాట్లాడుతూ.. గోవా సంస్కృతిని సంరక్షించడం ద్వారా పునరుత్పాదక పర్యాటకాన్ని ప్రోత్సహించడంలో హోమ్‌స్టే విభాగం కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా ఈ ఒప్పందం గ్రామీణ గోవాకు ప్రయోజనం చేకూరుస్తుందని అన్నారు.
ఎయిర్‌బీఎన్‌బీతో అవగాహన ఒప్పందం.. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అకాడమీని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. స్థానిక కమ్యూనిటీలకు సాధికారత కల్పిస్తూనే.. గోవా తన ప్రత్యేక సాంస్కృతిక, సహజ ఆస్తులను ఉపయోగించుకోవడానికి ఈ చొరవ అద్భుతమైన అవకాశాన్ని అందిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమం గోవా విభిన్నమైన, ప్రామాణికమైన అనుభవాలను ప్రదర్శించడానికి సహాయం చేస్తుందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment