కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న డాక్టర్ శ్రీనివాసరావు, సమీర్ సక్సేనా
సాక్షి, విశాఖపట్నం: క్షిపణుల మరమ్మతులు, డిజైన్లలో స్టార్టప్‌లు, ఎంఎస్‌ఎంఈలను భాగస్వాములను చేస్తే ఆత్మ నిర్భర్ భారత్ దిశగా మరింత పురోగతి సాధించవచ్చని డీఆర్‌డీవో డైరెక్టర్ జనరల్ డాక్టర్ వై.శ్రీనివాసరావు అన్నారు. విశాఖపట్నం కేంద్రంగా ఉన్న తూర్పు నౌకాదళం(ఈఎన్‌సీ) ప్రధాన కేంద్రానికి అనుబంధంగా ఉన్న ఐఎన్‌ఎస్ కళింగ బేస్‌లో గురువారం ‘అమృత్–2023’ పేరుతో మిసైల్ టెక్నాలజీ కాంక్లేవ్, సింపోజియం నిర్వహించారు.
ఈ కార్యక్రమాన్ని డాక్టర్ శ్రీనివాసరావు, ఈఎన్‌సీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ వైస్ అడ్మిరల్ సమీర్ సక్సేనా ప్రారంభించారు. డాక్టర్ వై.శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆత్మ నిర్భర్ భారత్ మిషన్‌కు అనుగుణంగా ఇండియన్ పబ్లిక్, ప్రైవేట్ ఇండస్ట్రీస్, డీఆర్‌డీవో ల్యాబ్స్, అకాడమీ, ఇండియన్ నేవీ ముందుకువెళ్తుండటం శుభపరిణామమని చెప్పారు. విదేశీ దిగుమతులపై ఆధారపడకుండా రక్షణ పరిశ్రమ ప్రధాన సామర్థ్యాలను బలోపేతం చేయాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment