symposium
-
క్షిపణుల డిజైన్‌లో స్టార్టప్‌లను భాగస్వాములను చేయాలి
సాక్షి, విశాఖపట్నం: క్షిపణుల మరమ్మతులు, డిజైన్లలో స్టార్టప్‌లు, ఎంఎస్ఎంఈలను భాగస్వాములను చేస్తే ఆత్మ నిర్భర్ భారత్ దిశగా మరింత పురోగతి సాధించవచ్చని డీఆర్డీవో డైరెక్టర్ జనరల్ డాక్టర్ వై.శ్రీనివాసరావు అన్నారు. విశాఖపట్నం కేంద్రంగా ఉన్న తూర్పు నౌకాదళం(ఈఎన్సీ) ప్రధాన కేంద్రానికి అనుబంధంగా ఉన్న ఐఎన్ఎస్ కళింగ బేస్‌లో గురువారం ‘అమృత్–2023’ పేరుతో మిసైల్ టెక్నాలజీ కాంక్లేవ్, సింపోజియం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని డాక్టర్ శ్రీనివాసరావు, ఈఎన్సీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ వైస్ అడ్మిరల్ సమీర్ సక్సేనా ప్రారంభించారు. డాక్టర్ వై.శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆత్మ నిర్భర్ భారత్ మిషన్‌కు అనుగుణంగా ఇండియన్ పబ్లిక్, ప్రైవేట్ ఇండస్ట్రీస్, డీఆర్డీవో ల్యాబ్స్, అకాడమీ, ఇండియన్ నేవీ ముందుకువెళ్తుండటం శుభపరిణామమని చెప్పారు. విదేశీ దిగుమతులపై ఆధారపడకుండా రక్షణ పరిశ్రమ ప్రధాన సామర్థ్యాలను బలోపేతం చేయాలని సూచించారు. -
న్యాయవ్యవస్థలో మౌలిక కొరత: సీజేఐ
న్యూఢిల్లీ: న్యాయ పరిపాలనపై మచ్చ రావడానికి ముందుగానే న్యాయ వ్యవస్థలో మౌలిక వసతుల కొరతను అధిగమించాల్సి ఉందని సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా అన్నారు. మౌలిక సౌకర్యాల లేమికి ఆర్థికపరమైన అవరోధాలను సాకుగా చూపకూడదన్నారు. సుప్రీంకోర్టు అడ్వొకేట్స్ ఆన్ రికార్డ్ అసోసియేషన్ నిర్వహించిన సింపోజియంలో రాష్ట్రపతి కోవింద్‌తోపాటు సీజేఐ పాల్గొన్నారు. ‘మౌలిక వనరుల కొరత తీవ్రమై, న్యాయ పరిపాలనకు హాని కలిగించక ముందే చర్యలు తీసుకోవాల్సి ఉంది. నాణ్యమైన, జవాబుదారీ తనంతో కూడిన సత్వర న్యాయం అందించడానికి, న్యాయ ఉద్దేశం నెరవేరేందుకు న్యాయ వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది’ అని సీజేఐ అన్నారు. సామాన్యుడికి న్యాయం అందించటానికి, కక్షిదారులకు వసతులు, న్యాయవాదులకు అవసరమైన సౌకర్యాలను కల్పించాలంటే న్యాయస్థానాల పరిధి పెరగాలన్నారు. కాగా, చాలా కేసుల్లో కక్షిదారులు వాయిదాలు కోరడం సర్వసాధారణంగా మారిందని, కోర్టుల్లో పేరుకుపోతున్న కేసులకు ఇది కూడా ఒక కారణమని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అన్నారు. -
వైట్‌హౌస్‌లో ఘనంగా దక్షిణాసియా యువ సదస్సు
వాషింగ్టన్: అమెరికా వైట్‌హౌస్ లో దక్షిణాసియా యువ సమ్మేళన సదస్సు ఘనంగా జరిగింది. ఉత్తర అమెరికా తెలుగు సంఘం(నాట్స్), గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు కల్చరల్ సొసైటీ దీన్ని సంయుక్తంగా నిర్వహించాయి. అమెరికా జాతీయ గీతాలాపనతో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో వైట్‌హౌస్ పబ్లిక్ ఎంగేజ్మెంట్ సీనియర్ అసోసియేట్ డైరక్టర్ జాకీ బర్ జింగి ప్రారంభ ఉపన్యాసం చేశారు. కో ఆర్డినేటర్‌గా రావులింగా వ్యవహరించారు. ప్రజాసేవ, జీవితం, నాయకత్వ పురోభివృద్ధి, సమాజంలోని వేధింపులు, బులియింగ్ కే12 అనే అంశాలతోపాటు మిషెల్ ఒబామా ప్రారంభించిన లెట్స్ మూవ్ ఉద్యమంపై కూడా చర్చ ఇందులో జరిగింది. వైట్ హౌస్ బిజినెస్ కౌన్సిల్ అసిస్టెంట్ డైరక్టర్ జాయెద్ హసన్, వైట్ హౌస్ సీనియర్ అడ్వైజర్ బెస్పీ చాన్, డిప్యూటీ అసోషియేట్ కౌన్సిల్ రుక్కు సింగ్లా , మిలియనిల్ యాక్షన్ ప్రాజెక్ట్ ప్రెసిడెంట్ అండ్ కో పౌండర్ స్టివెన్ ఒలికరా, వినయ్ తుమ్మలపల్లి సెలక్ట్ యూఎస్ఏ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్, ప్రెసిడెంట్ ఫర్ హైయ్యర్ ఎడ్యుకేషన్ స్పెషల్ అసిస్టెంట్, అజితా మీనన్, వైట్ హౌస్ డొమెస్టిక్ పాలసీ కౌన్సిల్, ఎడ్యుకేషన్ పాలసీ సీనియర్ అడ్వైజర్ మారియో కార్డోనా, వైట్ హౌస్ ఇనిషియేటివ్స్ ఆన్ ఏసియన్ అమెరికన్స్ అడ్వైజర్ డేవిడ్ లూ, నాట్స్ ప్రెసిడెంట్ మోహన కృష్ణ మన్నవ తదితరులు యువతకు విలువైన సలహాలు, సూచనలు అందించారు. నాట్స్ ఈ సందర్భంగా ఓ సావనీర్‌ను ఆవిష్కరించింది. వైట్‌హౌస్ నావీ స్టెప్స్ వద్ద ఫోటో సెషన్ కూడా జరిగింది. సింపోజియంను ఘనంగా నిర్వహించినందుకు వైట్‌హౌస్ ఆవరణలో న్యూజెర్సీ గవర్నర్ క్రిస్క్రిస్టి నాట్స్ కు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో రావు లింగా, శ్రీనివాస్ మద్దాళి, మోహన మన్నవ, రమేష్ నూతలపాటి రాధిక గుంటూరు, పద్మిని నిడుమోలు, ప్రవీణ్ నిడుమోలు, జయశ్రీ పెద్దిబొట్ల, కవిత ఎనిగండ్ల, పవన్ బెజవాడ, అశోక్ అనమలశెట్టి, సంజీవ్ నాయుడు,కామరాజు వాడ్రేవు, అంగెల ఆనంద్, ఆనంద్ నాయక్, లక్ష్మి లింగా, బాపయ్య చౌదరి, శ్రీనివాస్ చౌదరిలు పాల్గొన్నారు. -
తెలంగాణ స్త్రీల సాహిత్యంపై సదస్సు
హైదరాబాద్: తెలంగాణ సాహిత్యాన్ని వెలుగులోకి తీసుకొచ్చే క్రమంలో భాగంగా సాహిత్య అకాడమీ, కోఠి మహిళా విశ్వవిద్యాలయ కళాశాలలోని తెలుగుశాఖ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని తలపెట్టాయి. ఒక రోజు సదస్సును సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఈ కార్యక్రమానికి హాజరవ్వాల్సిందిగా సాహితీ ప్రియులందరిని ఆహ్వానిస్తున్నాయి. ఆగస్టు 30న(మంగళవారం) ఉదయం 10 గంటలకు ప్రారంభంకానున్న ఈ సదస్సులో 'తెలంగాణ స్త్రీల సాహిత్యం సమాలోచన' అనే అంశంపై పలువురు ప్రముఖులు ప్రసంగాలు చేయడంతోపాటు పత్ర సమర్పణ కూడా ఉంటుంది. సాహిత్య అకాడెమి ప్రాంతీయ కార్యదర్శి ఎస్పీ మహాలింగేశ్వర్ ఈ కార్యక్రమానికి స్వాగతం చెప్పనుండగా.. తెలుగు సలహా మండలి, సాహిత్య అకాడమి సంచాలకులు గోపీ ఈ సదస్సుకు అధ్యక్షత వహించనున్నారు. ఇక స్వాగతోపన్యాసం ప్రొఫెసర్ సూర్యాధనంజయ్, కీలకోపన్యాసం ఎస్ రఘు(తెలుగు శాఖాధ్యక్షులు కోఠి, మహిళా విశ్వవిద్యాలయం) చేయనున్నారు. దీని అనంతరం రెండు దఫాలుగా ఈ సమావేశం జరుగనుంది. తొలి దఫా ఉదయం 11.30గంటలకు ప్రారంభం కానుండగా.. రెండో దఫా సమావేశం మ.2గంటలకు ఉంటుంది. సూరెపల్లి సుజాత, అనిశెట్టి రజిత, కే లావణ్య, ఎన్ రజిని, ఎం గీతావాణి, గోగు శ్యామల వంటి రచయితలతోపాటు, పలువురు పరిశోధకులు పాల్గొంటున్నారు. సమాపన ప్రసంగం ఉస్మానియా విశ్వవిద్యాలయ తెలుగుశాఖ అధ్యక్షుడు వెలిదండ నిత్యానంద రావు చేయనున్నారు.