వైట్హౌస్లో ఘనంగా దక్షిణాసియా యువ సదస్సు
వాషింగ్టన్: అమెరికా వైట్హౌస్ లో దక్షిణాసియా యువ సమ్మేళన సదస్సు ఘనంగా జరిగింది. ఉత్తర అమెరికా తెలుగు సంఘం(నాట్స్), గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు కల్చరల్ సొసైటీ దీన్ని సంయుక్తంగా నిర్వహించాయి. అమెరికా జాతీయ గీతాలాపనతో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో వైట్హౌస్ పబ్లిక్ ఎంగేజ్‌మెంట్ సీనియర్ అసోసియేట్ డైరక్టర్ జాకీ బర్ జింగి ప్రారంభ ఉపన్యాసం చేశారు. కో ఆర్డినేటర్‌గా రావులింగా వ్యవహరించారు. ప్రజాసేవ, జీవితం, నాయకత్వ పురోభివృద్ధి, సమాజంలోని వేధింపులు, బులియింగ్ కే12 అనే అంశాలతోపాటు మిషెల్ ఒబామా ప్రారంభించిన లెట్స్ మూవ్ ఉద్యమంపై కూడా చర్చ ఇందులో జరిగింది.
వైట్ హౌస్ బిజినెస్ కౌన్సిల్ అసిస్టెంట్ డైరక్టర్ జాయెద్ హసన్, వైట్ హౌస్ సీనియర్ అడ్వైజర్ బెస్పీ చాన్, డిప్యూటీ అసోషియేట్ కౌన్సిల్ రుక్కు సింగ్లా , మిలియనిల్ యాక్షన్ ప్రాజెక్ట్ ప్రెసిడెంట్ అండ్ కో పౌండర్ స్టివెన్ ఒలికరా, వినయ్ తుమ్మలపల్లి సెలక్ట్ యూఎస్ఏ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్, ప్రెసిడెంట్ ఫర్ హైయ్యర్ ఎడ్యుకేషన్ స్పెషల్ అసిస్టెంట్, అజితా మీనన్, వైట్ హౌస్ డొమెస్టిక్ పాలసీ కౌన్సిల్, ఎడ్యుకేషన్ పాలసీ సీనియర్ అడ్వైజర్ మారియో కార్డోనా, వైట్ హౌస్ ఇనిషియేటివ్స్ ఆన్ ఏసియన్ అమెరికన్స్ అడ్వైజర్ డేవిడ్ లూ, నాట్స్ ప్రెసిడెంట్ మోహన కృష్ణ మన్నవ తదితరులు యువతకు విలువైన సలహాలు, సూచనలు అందించారు.
నాట్స్ ఈ సందర్భంగా ఓ సావనీర్‌ను ఆవిష్కరించింది. వైట్హౌస్ నావీ స్టెప్స్ వద్ద ఫోటో సెషన్ కూడా జరిగింది. సింపోజియంను ఘనంగా నిర్వహించినందుకు వైట్హౌస్ ఆవరణలో న్యూజెర్సీ గవర్నర్ క్రిస్క్రిస్టి నాట్స్ కు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో రావు లింగా, శ్రీనివాస్ మద్దాళి, మోహన మన్నవ, రమేష్ నూతలపాటి రాధిక గుంటూరు, పద్మిని నిడుమోలు, ప్రవీణ్ నిడుమోలు, జయశ్రీ పెద్దిబొట్ల, కవిత ఎనిగండ్ల, పవన్ బెజవాడ, అశోక్ అనమలశెట్టి, సంజీవ్ నాయుడు,కామరాజు వాడ్రేవు, అంగెల ఆనంద్, ఆనంద్ నాయక్, లక్ష్మి లింగా, బాపయ్య చౌదరి, శ్రీనివాస్ చౌదరిలు పాల్గొన్నారు.