బర్డ్‌ఫ్లూ ఎఫెక్ట్‌.. అమెరికాలో కొండెక్కిన కోడిగుడ్డు | Egg Prices Sky Rockets In America Due To Bird Flu | Sakshi
Sakshi News home page

బర్డ్‌ఫ్లూ ఎఫెక్ట్‌.. అమెరికాలో కొండెక్కిన కోడిగుడ్డు

Feb 17 2025 11:33 AM | Updated on Feb 17 2025 11:43 AM

Egg Prices Sky Rockets In America Due To Bird Flu

వాషింగ్టన్‌:బర్డ్‌ఫ్లూ ఇక్కడే కాదు అగ్రదేశం అమెరికానూ భయపెడుతోంది. ఒకవైపు బర్డ్‌ఫ్లూ వల్ల మన దేశంలో చికెన్‌,గుడ్లు తినాలంటే భయపడుతుండడంతో చికెన్‌,గుడ్ల అమ్మకాలు ఒక్కసారిగా పడిపోయాయి. అమెరికాలో బర్డ్‌ఫ్లూ దెబ్బకు కోడిగుడ్ల ధరలు రోజురోజుకు కొండెక్కుతున్నాయి. అమెరికాలో గుడ్లను ప్రోటీన్లు అందించే ఆహారంగా భావిస్తారు. దీంతో అక్కడ గుడ్లకు భారీగా డిమాండ్‌ ఉంటుంది.

ఇదే సమయంలో బర్డ్‌ఫ్లూ కారణంగా గుడ్లు పెట్టే కోళ్లు చనిపోతుండడంతో వాటి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఈ కారణంతో గుడ్ల ఉత్పత్తి ఒక్కసారిగా పడిపోయింది. ఈ ఎఫెక్ట్‌ గుడ్ల ధరలపై పడింది. ప్రస్తుతం అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో డజను గుడ్ల ధర ఏకంగా పది డాలర్లు(రూ.867)కు చేరిందంటే పరిస్థితి ఎలాఉందో అర్థం చేసుకోవచ్చు.

గత ఏడాది జనవరి నుంచి అమెరికాలో గుడ్ల ధరలు పెరుగుతూనే ఉన్నాయి.అప్పటి నుంచి ఇప్పటివరకు డజను గుడ్ల ధర ఏకంగా 65 శాతం పెరిగింది. గుడ్ల ఉత్పత్తి పడిపోవడంతో కొన్ని సూపర్‌ మార్కెట్లలో కస్టమర్‌లకు అమ్మే గుడ్లపై పరిమితులు విధించారు. 

ఏవియన్‌ ఇన్‌ఫ్లూయెంజా లేదా బర్డ్‌ఫ్లూ కోళ్లలో శరవేగంగా వ్యాప్తి చెందుతుంది. దీని వ్యాప్తి నివారించడానికి లక్షల్లో కోళ్లను అధికారులు చంపుతున్నారు. బర్డ్‌ఫ్లూ ప్రభావం ఫామ్‌లలో పెరిగే కోళ్ల మీద కంటే దేశీయంగా పెరిగే నాటుకోళ్లపై అధికంగా ఉంటుందని తేలింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement