
ముంబై: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఇంగ్లండ్‌కు చెందిన మిడిలెసెక్స్‌తో కలిసి అంతర్జాతీయ క్రికెట్ అకాడమీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించాడు. ‘టెండూల్కర్ మిడిలెసెక్స్ గ్లోబల్ అకాడమీ’ (టీఎంజీఏ) పేరుతో త్వరలోనే నార్త్‌వుడ్ (ఇంగ్లండ్)లో తొలిదశ శిక్షణ శిబిరం ప్రారంభం కానుంది. నార్త్‌వుడ్‌లోని ప్రఖ్యాత మర్చంట్ టేలర్స్ స్కూల్ క్యాంపస్‌లో వచ్చే నెల 6 నుంచి 9వ తేదీ వరకు క్యాంప్ జరుగనుంది.
ఆ తర్వాత ముంబై, లండన్‌లలోనూ శిబిరాలను నిర్వహించనున్నారు. 9 నుంచి 14 ఏళ్ల బాలబాలికలకు విశేష అనుభవజ్ఞులతో శిక్షణ ఇప్పించడమే ఈ శిబిరాల లక్ష్యం. ఇందులో సచిన్ కోచ్‌గా పరకాయ ప్రవేశం చేయనున్నాడు. ‘మిడిలెసెక్స్‌తో జతకట్టడం ఆనందంగా ఉంది. ఇక్కడ కేవలం క్రికెటర్లను తయారు చేయడమే కాదు, ఉన్నతమైన పౌరుల్ని అందించడమే మా లక్ష్యం’ అని సచిన్ అన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment