Middlesex
-
Viral Video: వింత పద్ధతిలో ఔటయ్యాడు.. సిక్స్ కొట్టి..!
కౌంటీ ఛాంపియన్షిప్ 2023 డివిజన్ వన్ పోటీల్లో భాగంగా వార్విక్షైర్తో నిన్న (జులై 25) మొదలైన మ్యాచ్‌లో మిడిల్సెక్స్ కెప్టెన్ టోబీ రోలాండ్ జోన్స్ వింత పద్ధతిలో ఔటయ్యాడు. ఎడ్ బెర్నార్డ్ బౌలింగ్‌లో తాను ఎదుర్కొన్న 15వ బంతిని సిక్సర్‌గా మలిచిన టోబీ.. అదే బంతికి హిట్ వికెట్‌గా వెనుదిరిగాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది. టోబీ అంత దురదృష్టవంతుడు మరొకరు ఉండరని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. What do we make of this one then? Toby Roland-Jones won't want to see that dismissal again 🫣pic.twitter.com/xdaESl3EB0 — Wisden (@WisdenCricket) July 25, 2023 ఈ ఇన్నింగ్స్‌లో మొత్తం 15 బంతులు ఎదుర్కొన్న టోబీ 2 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 21 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరాడు. అనంతరం అతని జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 199 పరుగులకు ఆలౌటైంది. మిడిల్సెక్స్ ఇన్నింగ్స్‌లో ర్యాన్ హిగ్గిన్స్ (53) టాప్ స్కోరర్‌గా నిలువగా.. వార్విక్ బౌలర్లు డాల్బీ, హమ్జా, బర్నార్డ్ తలో 3 వికెట్లు, బ్రూక్స్ ఓ వికెట్ పడగొట్టాడు. ఆ వెంటనే సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన వార్విక్షైర్.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 53 పరుగులు చేసింది. అలెక్స్ డేవిస్ (0), విల్ రోడ్స్ (19) ఔట్ కాగా.. రాబర్ట్ యేట్స్ (26), సామ్ హెయిన్ (6) క్రీజ్‌లో ఉన్నారు. హెల్మ్, బాంబర్ తలో వికెట్ పడగొట్టారు. అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన వార్విక్షైర్.. బాంబర్ (5/20), కెప్టెన్ టోబీ జోన్స్ (3/27), ర్యాన్ హిగ్గిన్స్ (2/5) ధాటికి 22.5 ఓవర్లలో 60 పరుగులకే కుప్పకూలింది. 14 పరుగులు చేసిన బర్నార్డ్ వార్విక్షైర్ ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. బర్నార్డ్‌తో పాటు మైఖేల్ బుర్గెస్ (12), రాబర్ట్ యేట్స్ (10), డాల్బీ (10) మాత్రమే వార్విక్షైర్ ఇన్నింగ్స్‌లో రెండంకెల స్కోర్లు చేశారు. -
కసితీరా బాదారు.. టి20 చరిత్రలో రెండో అత్యధిక పరుగుల ఛేదన
తుఫాను వచ్చేముందు ప్రశాంతత ఉంటుందంటారు. అయితే ఒక్కసారి వర్షం మొదలయ్యాకా వచ్చే ఉరుములు, మెరుపులు మనల్ని ఉలికిపాటుకు గురి చేస్తాయి. అచ్చం అలాంటి తుఫాను ఇన్నింగ్స్ టి20 బ్లాస్ట్ 2023 టోర్నీలో నమోదైంది. కొడితే సిక్సర్.. లేదంటే బౌండరీ అనేలా స్టేడియం పరుగుల జడివానలో తడిసి ముద్దయింది. టోర్నీలో భాగంగా సౌత్ గ్రూప్‌లో ఉన్న సర్రీ, మిడిలెసెక్స్ మధ్య మ్యాచ్‌లో భారీ స్కోర్లు నమోదయ్యాయి.. సర్రీ జట్టు విధించిన 253 పరుగుల భారీ టార్గెట్‌ను మిడిలెసెక్స్ ఇంకా నాలుగు బంతులు మిగిలి ఉండగానే చేధించడం విశేషం. ఇరుజట్లలో ఎవరు సెంచరీలు చేయకపోయినప్పటికి సిక్సర్లు, బౌండరీలతో విరుచుకుపడ్డారు. మ్యాచ్‌లో మొత్తంగా 52 బౌండరీలు, 24 సిక్సర్లు నమోదయ్యాయి. టి20 బ్లాస్ట్ చరిత్రలోనే అత్యధిక పరుగుల లక్ష్యాన్ని చేధించిన తొలి జట్టుగా మిడిలెసెక్స్ చరిత్ర సృష్టించగా.. ఓవరాల్‌గా టి20 చరిత్రలో ఇది రెండో అత్యధిక లక్ష్య చేధన కావడం విశేషం. తొలుత బ్యాటింగ్ చేసిన సర్రీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 252 పరుగుల భారీ స్కోరు చేసింది. విల్ జాక్స్ (45 బంతుల్లో 96 పరుగులు, 8 ఫోర్లు, 7 సిక్సర్లు) నాలుగు పరుగుల తేడాతో సెంచరీ చేజార్చుకోగా.. లారి ఎవన్స్ (37 బంతుల్లో 85 పరుగులు, 9 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఇద్దరు మినహా మిగతావారి నుంచి పెద్దగా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్‌లు రాలేదు. అనంతరం కష్టసాధ్యమైన లక్ష్యంతో బరిలోకి దిగిన మిడిలెసెక్స్ ఆరంభం నుంచే దూకుడు ప్రదర్శించింది. వచ్చినోళ్లు వచ్చినట్లు కసితీరా బాదారు. తొలుత ఓపెనర్లు స్టీఫెన్ ఎస్కినాజి(39 బంతుల్లో 73 పరుగులు, 13 ఫోర్లు, ఒక సిక్సర్), జో క్రాక్నెల్(16 బంతుల్లో 36 పరుగులు, 4 ఫోర్లు, 2 సిక్సర్లు), మాక్స్ హోల్డన్(35 బంతుల్లో 68 నాటౌట్, 9 ఫోర్లు, 2 సిక్సర్లు), రియాన్ హిగ్గిన్స్(24 బంతుల్లో 48 పరుగులు) విధ్వంసం సృష్టించగా.. ఆఖర్లో జాక్ డేవిస్ 3 బంతుల్లో 11 పరుగులు చేసి జట్టును గెలిపించాడు. Utterly extraordinary 😲@Middlesex_CCC had lost their previous 14 Blast matches and have just chased down 253 🤯#Blast23 pic.twitter.com/NxeweZyKOh — Vitality Blast (@VitalityBlast) June 22, 2023 చదవండి: 'గిల్ క్యాచ్' పునరావృతం.. ఈసారి అన్యాయమే గెలిచింది! -
లక్నో ఆల్‌రౌండర్ సిక్సర్ల సునామీ.. తడిసి ముద్ద అయిన లార్డ్స్ మైదానం
టీ20 బ్లాస్ట్-2023లో లక్నో సూపర్ జెయింట్స్ (ఐపీఎల్) ఆల్‌రౌండర్, ఎస్సెక్స్ ఫాస్ట్ బౌలర్, ఆసీస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ డేనియల్ సామ్స్ విశ్వరూపం ప్రదర్శించాడు. నిన్న (జూన్ 18) మిడిల్సెక్స్తో జరిగిన మ్యాచ్‌లో సామ్స్ 24 బంతుల్లో 8 సిక్సర్లు, 2 బౌండరీల సాయంతో 67 పరుగులు చేశాడు. సామ్స్ సిక్సర్ల సునామీలో ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానం తడిసిముద్ద అయ్యింది. కేవలం 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న సామ్స్.. ఆ తర్వాత 3 బంతుల్లో వరుసగా 2 సిక్సర్లు, ఓ ఫోర్ కొట్టి ఔటయ్యాడు. సామ్స్‌కు జతగా డేనియల్ లారెన్స్ (30 బంతుల్లో 53; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), మైఖేల్ పెప్పర్ (34 బంతుల్లో 64; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) కూడా విజృంభించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్సెక్స్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 237 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం మిడిల్సెక్స్ భారీ లక్ష్య ఛేదనకు దిగగా వర్షం అంతరాయం కలిగించింది. 12.3 ఓవర్ల తర్వాత మొదలైన వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో డక్‌వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం ఎస్సెక్స్ను విజేతగా ప్రకటించారు. ఆ సమయానికి మిడిల్సెక్స్ 2 వికెట్ల నష్టానికి 116 పరుగులు చేసింది. అయితే డక్‌వర్త్ లూయిస్ సమీకరణల ప్రకారం మిడిల్సెక్స్ లక్ష్యానికి ఇంకా 22 పరుగులు వెనుకపడి ఉండింది. దీంతో అంపైర్లు ఎస్సెక్స్ను విజేతగా ప్రకటించారు. మిడిల్సెక్స్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ స్టీఫెన్ ఎస్కినాజీ (28), ర్యాన్ హిగ్గిన్స్ (32) ఓ మోస్తరు పరుగులు చేయగా.. జో క్రాక్నెల్ (36 నాటౌట్), మ్యాక్స్ హోల్డన్ (6 నాటౌట్) క్రీజ్‌లో ఉన్నారు. బౌలింగ్‌లోనూ సత్తా చాటిన డేనియల్ సామ్స్ ఓ వికెట్ దక్కంచుకోగా.. డేనియల్ లారెన్స్ మరో వికెట్ పడగొట్టాడు. కాగా, 31 ఏళ్ల డేనియల్ సామ్స్ ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడినప్పుడు బాగా పాపులర్ అయ్యాడు. 2022 సీజన్లో అతను ఎంఐ తరఫున 11 మ్యాచ్‌లు ఆడి 13 వికెట్లు పడగొట్టాడు. 2023 వేలంలో సామ్స్‌ను లక్నో సూపర్ జెయింట్స్ 75 లక్షలకు కొనుగోలు చేసింది. గత సీజన్లో అతను లక్నో తరఫున ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. -
విధ్వంసకర ఇన్నింగ్స్.. 38 బంతుల్లోనే సెంచరీ
టి20 బ్లాస్ట్ 2023లో భాగంగా గ్లామోర్గాన్స్ తరపున తొలి శతకం నమోదైంది. గ్లామోర్గాన్ బ్యాటర్ క్రిస్ కూక్ 38 బంతుల్లోనే శతకం మార్క్ సాధించి రికార్డులకెక్కాడు. ఓవరాల్‌గా 41 బంతుల్లో 113 పరుగులు నాటౌట్‌గా నిలిచిన క్రిస్ కూక్ ఇన్నింగ్స్‌లో 12 ఫోర్లు, ఏడు సిక్సర్లు ఉన్నాయి. కాగా క్రిస్ కూక్ సెంచరీ ఈ సీజన్ టి20 బ్లాస్ట్‌లో ఏడో శతకం. ఇక టి20 బ్లాస్ట్ టోర్నీలో క్రిస్ కూక్ది జాయింట్ ఆరో ఫాస్టెస్ట్ సెంచరీ. 26 బంతుల్లో అర్థసెంచరీ చేసిన క్రిస్ కూక్.. తర్వాతి 12 బంతుల్లోనే మరో 50 పరుగులు చేయడం విశేషం ఇక అంతర్జాతీయ టి20 క్రికెట్లో అత్యల్ప బంతుల్లో సెంచరీ సాధించిన ఆటగాళ్లు ముగ్గురు ఉన్నారు. డేవిడ్ మిల్లర్, రోహిత్ శర్మ, సుదేశ్ విక్రమసేనలు 35 బంతుల్లోనే శతకం సాధించి తొలి స్థానంలో ఉన్నారు. రెండో స్థానంలో పెరియాల్వార్, జీషన్ కుకికెల్, జాన్సన్ చార్లెస్‌లు 39 బంతుల్లో ఈ ఫీట్ సాధించడం విశేషం. అంతర్జాతీయం కాకుండా అత్యల్ప బంతుల్లో సెంచరీ సాధించిన నాలుగో ఆటగాడిగా క్రిస్ కూక్ ఘనత సాధించాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే గ్లామోర్గాన్స్ 29 పరుగుల తేడాతో మిడిలెసెక్స్పై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన గ్లామెర్గాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 238 పరుగుల భారీ స్కోరు చేసింది. క్రిస్ కూక్‌కు తోడుగా కొలిన్ ఇంగ్రామ్(51 బంతుల్లో 92 నాటౌట్) రాణించాడు. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన మిడిలెసెక్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 209 పరుగులు చేయగలిగింది. స్టీఫెన్ ఎస్కినాజి 59, జో క్రాక్నెల్ 77 మినహా మిగతావరు విఫలమయ్యారు. WHAT A CENTURY!!! 💯 Chris Cooke scores his 100 from just 38 balls which is the joint-sixth fastest Blast ton 🤯#Blast23 pic.twitter.com/wPU58omoJh — Vitality Blast (@VitalityBlast) May 31, 2023 చదవండి: ఫామ్‌లో ఉన్నాడు.. రికార్డులు బద్దలు కొట్టడం కష్టమేమి కాదు -
బ్యాట్స్‌మన్‌ను ప్రాంక్ చేసిన బౌలర్.. వీడియో వైరల్
లండన్: క్రికెట్లో అప్పుడప్పుడు ఫన్నీ మూమెంట్స్ చోటుచేసుకోవడం సహజం. అయితే బ్యాట్స్‌మన్, బౌలర్ మధ్య జరిగే కొన్ని చిలిపి సంఘటనలు మనకు నవ్వు తెప్పిస్తుంటాయి. తాజాగా ఇంగ్లండ్‌లో జరుగుతున్న కౌంటీ చాంపియన్‌షిప్‌లో ఇలాంటి ఘటనే జరిగింది. వివరాలు.. మంగళవారం చాంపియన్‌షిప్‌లో భాగంగా మిడిల్సెక్స్, హాంప్‌షేర్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో మిడిల్సెక్స్ బ్యాట్స్‌మన్ నిక్ గుబ్బిన్స్ అర్థ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఇన్నింగ్స్ మధ్యలో హాంప్‌షేర్ బౌలర్ కీత్ బార్కర్ వేసిన ఓవర్లో నిక్ బ్యాక్వర్డ్ దిశగా షాట్ ఆడాడు. రెండు పరుగులు తీయడానికి ప్రయత్నించగా.. నాన్‌స్ట్రైక్ ఎండ్‌వైపు వెళ్లిన నిక్ క్రీజులో జారి పడ్డాడు. దీంతో మిడిల్సెక్స్ ఒక్క పరుగుకే పరిమితమైంది. ఇంతవరకు బాగానే ఉంది.. అసలు మజా ఇక్కడే జరిగింది. బంతి విసిరిన బార్కర్ వెనక్కి వస్తున్నాడు. అప్పటికే క్రీజులో కిందపడి ఉన్న నిక్కు హెల్ఫ్ చేస్తున్నట్లుగా తన హ్యాండ్ను అతనికి అందించాడు. అది చూసిన నిక్ అతనికి చేయి ఇచ్చే ప్రయత్నం చేశాడు. కానీ ఇంతలో బార్కర్‌కు ఏమనిపించిందో వెంటనే తన చేయిని వెనక్కి తీసుకొని వెళ్లిపోయాడు. ఆ తర్వాత నిక్ లేచి బార్కర్‌ను చూస్తూ ఉండిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో గ్రేడ్ క్రికెటర్ తన ట్విటర్లో షేర్ చేసింది. ఇక ఈ మ్యాచ్‌లో హాంప్‌షేర్ విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన మిడిల్సెక్స్ తొలి ఇన్నింగ్స్‌లో 172 పరుగులు చేసింది. ఆ తర్వాత హాంప్‌షేర్ తొలి ఇన్నింగ్స్‌లో 208 పరుగులు చేసి 36 పరుగులు ఆధిక్యం సంపాదించింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో మిడిల్సెక్స్ 101 పరుగులకే కుప్పకూలింది. 66 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన హాంప్‌షేర్ మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. చదవండి: డ్యాన్స్‌తో రచ్చ చేసిన చహల్ భార్య.. వీడియో వైరల్ ఆర్చర్ బనానా ఇన్‌స్వింగర్.. నోరెళ్లబెట్టిన బ్యాట్స్‌మన్ Alpha’s gonna alpha pic.twitter.com/VDCfMO6qZh — The Grade Cricketer (@gradecricketer) May 15, 2021 -
మోర్గాన్ ‘టీ20 బ్లాస్ట్’
టాంటాన్" ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ మరోసారి విజృంభించాడు. టీ20 బ్లాస్ట్ సిరీస్‌లో భాగంగా మిడిల్సెక్స్ తరఫున ఆడుతున్న మోర్గాన్.. శుక్రవారం సోమర్‌సెట్‌తో జరిగిన మ్యాచ్‌లో చెలరేగి పోయాడు. 29 బంతుల్లో 8 సిక్సర్లు, 5 ఫోర్లతో అజేయంగా 83 పరుగులు సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సోమర్సెట్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లకు 226 పరుగులు చేసింది. ఆ జట్టు కెప్టెన్ టామ్ బెల్(101 నాటౌట్; 47 బంతుల్లో 13 ఫోర్లు, 3సిక్సర్లు) బ్యాట్ ఝుళిపించడంతో భారీ స్కోరు చేసింది. అటు తర్వాత 227 పరుగుల లక్ష్య ఛేదనతో బ్యాటింగ్‌కు దిగిన మిడిల్‌సెక్స్‌కు డేవిడ్ మాలన్(41; 14 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు), పాల్ స్టిర్లింగ్(25; 10 బంతుల్లో 4 ఫోర్లు, 1సిక్స్)లు శుభారంభం అందించారు. ఈ జోడి తొలి వికెట్‌కు 67 పరుగులు సాధించింది.ఆపై డివిలియర్స్(32; 16 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించాడు. కాగా, ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన మోర్గాన్ వచ్చీ రావడంతోనే బ్యాట్‌కు పని చెప్పాడు. సోమర్సెట్ బౌలర్లను ఓ ఆట ఆడుకుంటూ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. మోర్గాన్ ధాటికి మిడిల్సెక్స్ 17 ఓవర్లలోనే నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఇది ఈ టోర్నమెంట్ చరిత్రలోనే ఛేజింగ్ రికార్డుగా నమోదైంది. 2014లో ససెక్స్ 226 పరుగుల టార్గెట్‌ను ఎసెక్స్‌పై సాధించగా, అది ఇప్పటివరకూ అత్యుతమ ఛేజింగ్ రికార్డుగా ఉంది. దాన్ని ఐదేళ్ల తర్వాత మిడిల్సెక్స్ బ్రేక్ చేసింది. -
బాదుడు షురూ చేసిన ఏబీ!
43 బంతుల్లో 88 పరుగులు 6ఫోర్లు, 5 సిక్సర్లు. రిటైర్మెంట్ అనంతరం కూడా తనలో సత్తా తగ్గలేదని మరోసారి నిరూపించాడు మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్. ఐపీఎల్ వంటి క్యాష్ రిచ్ లీగ్ తర్వాత తొలిసారి ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న టీ20 బ్లాస్ట్ టోర్నీలో మిడిలెస్సెక్స్ తరుపున మైదానంలో అడుగుపెట్టాడు. ఈ టోర్నీ తొలి మ్యాచ్‌లోనే ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. అతడి ధాటికి ప్రత్యర్థి బౌలర్లు పసిపిల్లలయ్యారు. లార్డ్స్ వేదికగా ఎస్సెక్స్‌తో జరిగిన మ్యాచ్‌లో డివిలియర్స్ సుడిగాలి ఇన్నింగ్స్‌తో మిడిలెస్సెక్స్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఎస్సెక్స్ నిర్దేశించిన 165 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన మిడిలెస్సెక్స్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. 39 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ తరుణంలో డేవిడ్ మలాన్‌తో కలిసి డివిలియర్స్ రెచ్చిపోయాడు. వీర్దిదరూ మూడో వికెట్‌కు 105 పరుగులు జోడించడంతో మరో మూడు ఓవర్లు మిగిలుండగానే మిడిలెస్సెక్స్ లక్ష్యాన్ని ఛేదించింది. ఇక తొలిసారి టీ20 బ్లాస్ట్‌లో అడుగుపెట్టిన డివిలియర్స్‌కు అక్కడి అభిమానులు అపూర్వ స్వాగతం పలికారు. ఇక ఈ మ్యాచ్‌లో డివిలియర్స్ ఆటకు సంబంధించిన వీడియోను లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ తన అధికారిక ట్విటర్లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ హల్చల్ చేస్తోంది. -
సచిన్–మిడిలెసెక్స్ అకాడమీ
ముంబై: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఇంగ్లండ్‌కు చెందిన మిడిలెసెక్స్‌తో కలిసి అంతర్జాతీయ క్రికెట్ అకాడమీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించాడు. ‘టెండూల్కర్ మిడిలెసెక్స్ గ్లోబల్ అకాడమీ’ (టీఎంజీఏ) పేరుతో త్వరలోనే నార్త్వుడ్ (ఇంగ్లండ్)లో తొలిదశ శిక్షణ శిబిరం ప్రారంభం కానుంది. నార్త్‌వుడ్‌లోని ప్రఖ్యాత మర్చంట్ టేలర్స్ స్కూల్ క్యాంపస్‌లో వచ్చే నెల 6 నుంచి 9వ తేదీ వరకు క్యాంప్ జరుగనుంది. ఆ తర్వాత ముంబై, లండన్లలోనూ శిబిరాలను నిర్వహించనున్నారు. 9 నుంచి 14 ఏళ్ల బాలబాలికలకు విశేష అనుభవజ్ఞులతో శిక్షణ ఇప్పించడమే ఈ శిబిరాల లక్ష్యం. ఇందులో సచిన్ కోచ్‌గా పరకాయ ప్రవేశం చేయనున్నాడు. ‘మిడిలెసెక్స్‌తో జతకట్టడం ఆనందంగా ఉంది. ఇక్కడ కేవలం క్రికెటర్లను తయారు చేయడమే కాదు, ఉన్నతమైన పౌరుల్ని అందించడమే మా లక్ష్యం’ అని సచిన్ అన్నాడు. -
మైదానంలో కుప్పకూలిన వోజెస్
తలకు తగిలిన బంతి లండన్: క్రికెట్ మైదానంలో ఆటగాడిని గాయపరిచిన మరో తీవ్ర ఘటన చోటు చేసుకుంది. ఈసారి ఆస్ట్రేలియా టెస్టు క్రికెటర్ ఆడమ్ వోజెస్ దీనికి బాధితుడయ్యాడు. ఇంగ్లండ్ కౌంటీల్లో భాగంగా వోజెస్ మిడిలెసెక్స్ జట్టు తరఫున ఆడుతున్నాడు. హాంప్‌షైర్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తుండగా అతను గాయపడ్డాడు. అదే జట్టు ఫీల్డర్ ఒలీ రేనర్ బౌండరీ నుంచి బలంగా విసిరిన త్రో అనూహ్యంగా వోజెస్ తల వెనుక భాగంలో తగిలింది. దాంతో వెంటనే గ్రౌండ్లో కుప్పకూలిన అతను కొద్దిసేపు స్పృహ కోల్పోయాడు. జట్టు ఫిజియో, ఇతర సహాయక సిబ్బంది వోజెస్ను వెంటనే ఆస్పత్రికి తరలించారు. హాస్పిటల్లో చికిత్స అనంతరం వోజెస్ కోలుకున్నాడని, అతని పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని మిడిలెసెక్స్ జట్టు ప్రతినిధి వెల్లడించారు. వోజెస్ ఆసీస్ తరఫున 15 టెస్టులు ఆడాడు. -
విశ్వాసం పెరిగేలా...
వరుస ఓటములతో ఇంటా బయటా విమర్శల జడివానలో తడిసి ముద్దవుతున్న ధోని సేనకు కాస్త ఊరట.. విజయం కోసం మొహం వాచిపోయేలా ఎదురుచూస్తున్న భారత ఆటగాళ్లకు కొంత ఉపశమనం.. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ కోసం సన్నాహకంగా జరిగిన ఏకైక ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత్ సత్తా చూపింది. కీలకమైన పోరుకు ముందు ఈ మాత్రం ప్రదర్శనతో ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకుంది. ఫామ్ విషయంలో ఇబ్బందులెదుర్కొంటున్న విరాట్ కోహ్లితో పాటు తెలుగు తేజం అంబటి రాయుడు అదరగొట్టడం జట్టుకు కొండంత ధైర్యాన్నిచ్చింది. ప్రాక్టీస్ వన్డేలో భారత్ ఘనవిజయం ►అదరగొట్టిన రాయుడు ►ఫామ్‌లోకొచ్చిన కోహ్లి ►బౌలర్ల సమష్టి రాణింపు లండన్: భారత జట్టు తరఫున తొలిసారి ఇంగ్లండ్‌లో ఆడుతున్న అంబటి తిరుపతి రాయుడు (82 బంతుల్లో 72 రిటైర్డ్ అవుట్; 8 ఫోర్లు) ఆకట్టుకున్నాడు. వన్డే సిరీస్ కోసం వచ్చీ రాగానే సన్నాహక మ్యాచ్‌లో అర్ధసెంచరీతో రాణించి భరోసానిచ్చాడు. అలాగే సాధారణ లక్ష్యాన్ని కాపాడుకునే క్రమంలో మన బౌలర్లు కూడా విశేషంగా రాణించారు. ఫలితంగా లార్డ్స్ మైదానంలో శుక్రవారం మిడిలెసెక్స్‌తో జరిగిన వన్డేలో భారత్ 95 పరుగుల తేడాతో నెగ్గింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ 44.2 ఓవర్లలో 230 పరుగులు చేసింది. పూర్తి స్థాయి ఆటగాళ్లతోనే బరిలోకి దిగినా నిర్ణీత ఓవర్లు ఆడలేకపోయింది. స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లి (75 బంతుల్లో 71; 8 ఫోర్లు; 1 సిక్స్) తన పరుగుల దాహాన్ని తీర్చుకోగా మిగిలిన బ్యాట్స్‌మెన్ మాత్రం నిరాశపరిచారు. 52 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయిన దశలో కెప్టెన్ కోహ్లికి రాయుడు అండగా నిలిచాడు. ఈ జోడి బౌండరీలతో విరుచుకుపడి స్కోరును పట్టాలెక్కించింది. 59 బంతుల్లో కోహ్లి అర్ధ సెంచరీ సాధించాడు. అయితే కుదురుగా సాగుతున్న ఇన్నింగ్స్‌ను రవి పటేల్ దెబ్బతీశాడు. సింప్సన్‌కు క్యాచ్ ఇచ్చి కోహ్లి అవుట్ కావడంతో నాలుగో వికెట్‌కు 104 పరుగుల భాగస్వామ్యానికి తెర పడింది. కొద్దిసేపటికే జడేజా (7) వెనుదిరిగాడు. 60 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకున్న రాయుడు 40వ ఓవర్లో రిటైర్డ్ అవుట్‌గా పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత భారత ఇన్నింగ్స్ కుప్పకూలింది. ఆఫ్ స్పిన్నర్ రేనర్ (4/32) ధాటికి 19 పరుగుల వ్యవధిలో చివరి ఐదు వికెట్లను కోల్పోయింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన మిడిలెసెక్స్ను భారత బౌలర్లు కలిసికట్టుగా నిలువరించారు. వీరి కట్టుదిట్టమైన బౌలింగ్ కారణంగా జట్టు 39.5 ఓవర్లలో 135 పరుగులకు ఆలౌటయ్యింది. హిగ్గిన్స్ (24 బంతుల్లో 20; 3 ఫోర్లు), హారిస్ (22 బంతుల్లో 20; 4 ఫోర్లు) టాప్ స్కోరర్లుగా నిలిచారు. చివరి వరుస బ్యాట్స్‌మెన్‌ను కరణ్ శర్మ (3/14) వణికించాడు. భువనేశ్వర్, షమీ, మోహిత్, ఉమేశ్, కులకర్ణి, అశ్విన్‌లకు తలా ఓ వికెట్ దక్కింది. స్కోరు బోర్డు భారత్ ఇన్నింగ్స్: రోహిత్ శర్మ (సి) సంధూ (బి) ఫిన్ 8; ధావన్ (సి) మలన్ (బి) సంధూ 10; కోహ్లి (సి) సింప్సన్ (బి) పటేల్ 71; రహానే (సి) ఫిన్ (బి) హారిస్ 14; రాయుడు (రిటైర్డ్ అవుట్) 72; జడేజా (సి) గుబ్బిన్స్ (బి) పటేల్ 7; అశ్విన్ ఎల్బీడబ్ల్యు (బి) రేనర్ 18; శామ్సన్ (సి అండ్ బి) రేనర్ 6; బిన్నీ (సి అండ్ బి) రేనర్ 0; కరణ్ శర్మ నాటౌట్ 8; రైనా (స్టంప్డ్) సింప్సన్ (బి) రేనర్ 5; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (44.2 ఓవర్లలో ఆలౌట్) 230. వికెట్ల పతనం: 1-19; 2-29; 3-52; 4-156; 5-174; 6-211; 7-211; 8-211; 9-224; 10-230. బౌలింగ్: ఫిన్ 6-0-20-1; సంధూ 9-1-65-1; హారిస్ 7-1-29-1; పొడ్మోర్ 4-0-26-0; పటేల్ 9-0-56-2; రేనర్ 9.2-1-32-4. మిడిలెసెక్స్ ఇన్నింగ్స్: మలన్ (బి) షమీ 5; గుబ్బిన్స్ (సి) శామ్సన్ (బి) భువనేశ్వర్ 2; స్టిర్లింగ్ (సి) శామ్సన్ (బి) ఉమేశ్ 17; మోర్గాన్ (సి) శామ్సన్ (బి) మోహిత్ 16; హిగ్గిన్స్ (సి) ధావన్ (బి) కులకర్ణి 20; సింప్సన్ ఎల్బీడబ్ల్యు (బి) అశ్విన్ 19; బల్బిర్నీ (బి) కరణ్ 19; రేనర్ (రనౌట్) 5; హారిస్ (స్టంప్డ్) శామ్సన్ (బి) కరణ్ 20; పొడ్మోర్ నాటౌట్ 4; సంధూ ఎల్బీడబ్ల్యు (బి) కరణ్ 0; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (39.5 ఓవర్లలో ఆలౌట్) 135. వికెట్ల పతనం: 1-7; 2-11; 3-34; 4-64; 5-67; 6-101; 7-108; 8-114; 9-135; 10-135. బౌలింగ్: భువనేశ్వర్ 3-0-7-1; షమీ 4-1-13-1; మోహిత్ 5-2-20-1; ఉమేశ్ 7-0-32-1; కులకర్ణి 4-0-13-1; అశ్విన్ 6-2-16-1; జడేజా 6-0-14-0; కరణ్ 4.5-1-14-3. -
కుదురుకుంటారా!
నేడు మిడిలెసెక్స్‌తో భారత్ ప్రాక్టీస్ వన్డే లండన్: ఇంగ్లండ్ గడ్డపై టెస్టుల్లో ఘోరంగా ఓడిన భారత జట్టు ఇప్పుడు వన్డే సిరీస్‌పై దృష్టిపెట్టింది. ఈ నేపథ్యంలో నేడు మిడిలెసెక్స్‌తో ఏకైక ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. వన్డే సిరీస్‌కు ముందు ఒకే ఒక్క ప్రాక్టీస్ మ్యాచ్ కావడంతో భారత్ దీన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని ప్రణాళికలు రచిస్తోంది. దాదాపుగా వన్డేల్లో ఆడే తుది జట్టుతోనే బరిలోకి దిగే అవకాశాలున్నాయి. టెస్టుల్లో ఆడిన పది మందికి తోడుగా ఏడుగురు కొత్త ఆటగాళ్లు జట్టుతో చేరారు. రైనా, రాయుడు, మోహిత్, ధావల్, శామ్సన్, కరణ్ శర్మ, ఉమేశ్‌లు ఇందులో ఉన్నారు. అయితే వీళ్లలో ఎంత మందికి తుది జట్టులో చోటు దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు టెస్టుల్లో ఓటమితో జట్టులో ఆత్మ విశ్వాసం పూర్తిగా కొరవడింది. ఓపెనర్ ధావన్‌తో పాటు కోహ్లిల ఫామ్ కలవరపెడుతోంది. రోహిత్ కూడా ఓ భారీ ఇన్నింగ్స్ బాకీ ఉన్నాడు. అయితే ఈ త్రయం కుదురుకునే అంశంపైనే ఇంగ్లండ్‌లో భారత్ విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. బౌలింగ్ కూడా గాడిలో పడాల్సి ఉంది. ప్రాక్టీస్ మ్యాచ్‌లో ధోని ఆడే అవకాశాలు కనబడటం లేదు. అయితే తొలి వన్డేల్లో మాత్రం సీనియర్లను బరిలోకి దించాలని టీమ్ మేనేజ్మెంట్ యోచిస్తున్నట్లు సమాచారం. ప్రాక్టీస్‌కు ఏడుగురు డుమ్మా కీలకమైన వన్డే సిరీస్‌కు ముందు భారత క్రికెటర్లు ప్రాక్టీస్‌కు డుమ్మా కొట్టారు. గురువారం లార్డ్స్ నర్సరీ గ్రౌండ్స్‌లో జరిగిన ప్రాక్టీస్‌కు ధోని, ధావన్, రోహిత్, కోహ్లి, అశ్విన్, జడేజా, షమీలు గైర్హాజరయ్యారు. రహానే, భువనేశ్వర్, స్టువర్ట్ బిన్నీలతో పాటు యువ ఆటగాళ్లు మాత్రం నెట్స్‌లో చెమటోడ్చారు. బౌలింగ్, ఫీల్డింగ్ కోచ్‌లు జో డేవిస్, ట్రెవర్ పెన్నీల ఆధ్వర్యంలో స్లిప్ క్యాచ్‌లు, త్రో డౌన్స్ సాధన చేశారు. తర్వాత బ్యాటింగ్, బౌలింగ్‌కు పదును పెట్టారు. సంజూ శామ్సన్ వికెట్ కీపింగ్‌తో పాటు స్లిప్‌లో రైనా, రహానేతో కలిసి క్యాచ్‌లు ప్రాక్టీస్ చేశాడు.