కౌంటీ ఛాంపియన్‌షిప్ 2023 డివిజన్ వన్ పోటీల్లో భాగంగా వార్విక్‌షైర్‌తో నిన్న (జులై 25) మొదలైన మ్యాచ్‌లో మిడిల్‌సెక్స్ కెప్టెన్ టోబీ రోలాండ్ జోన్స్ వింత పద్ధతిలో ఔటయ్యాడు. ఎడ్ బెర్నార్డ్ బౌలింగ్‌లో తాను ఎదుర్కొన్న 15వ బంతిని సిక్సర్‌గా మలిచిన టోబీ.. అదే బంతికి హిట్ వికెట్‌గా వెనుదిరిగాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది. టోబీ అంత దురదృష్టవంతుడు మరొకరు ఉండరని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
What do we make of this one then?
— Wisden (@WisdenCricket) July 25, 2023
Toby Roland-Jones won't want to see that dismissal again 🫣pic.twitter.com/xdaESl3EB0
ఈ ఇన్నింగ్స్‌లో మొత్తం 15 బంతులు ఎదుర్కొన్న టోబీ 2 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 21 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరాడు. అనంతరం అతని జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 199 పరుగులకు ఆలౌటైంది. మిడిల్‌సెక్స్ ఇన్నింగ్స్‌లో ర్యాన్ హిగ్గిన్స్ (53) టాప్ స్కోరర్‌గా నిలువగా.. వార్విక్ బౌలర్లు డాల్బీ, హమ్జా, బర్నార్డ్ తలో 3 వికెట్లు, బ్రూక్స్ ఓ వికెట్ పడగొట్టాడు.
ఆ వెంటనే సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన వార్విక్‌షైర్.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 53 పరుగులు చేసింది. అలెక్స్ డేవిస్ (0), విల్ రోడ్స్ (19) ఔట్ కాగా.. రాబర్ట్ యేట్స్ (26), సామ్ హెయిన్ (6) క్రీజ్‌లో ఉన్నారు. హెల్మ్, బాంబర్ తలో వికెట్ పడగొట్టారు.
అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన వార్విక్‌షైర్.. బాంబర్ (5/20), కెప్టెన్ టోబీ జోన్స్ (3/27), ర్యాన్ హిగ్గిన్స్ (2/5) ధాటికి 22.5 ఓవర్లలో 60 పరుగులకే కుప్పకూలింది. 14 పరుగులు చేసిన బర్నార్డ్ వార్విక్‌షైర్ ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. బర్నార్డ్‌తో పాటు మైఖేల్ బుర్గెస్ (12), రాబర్ట్ యేట్స్ (10), డాల్బీ (10) మాత్రమే వార్విక్‌షైర్ ఇన్నింగ్స్‌లో రెండంకెల స్కోర్లు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment