మైదానంలో కుప్పకూలిన వోజెస్ | collapse of the ground vojes | Sakshi
Sakshi News home page

మైదానంలో కుప్పకూలిన వోజెస్

Published Tue, May 3 2016 12:52 AM | Last Updated on Sun, Sep 3 2017 11:16 PM

మైదానంలో   కుప్పకూలిన వోజెస్

మైదానంలో కుప్పకూలిన వోజెస్

తలకు తగిలిన బంతి

లండన్: క్రికెట్ మైదానంలో ఆటగాడిని గాయపరిచిన మరో తీవ్ర ఘటన చోటు చేసుకుంది. ఈసారి ఆస్ట్రేలియా టెస్టు క్రికెటర్ ఆడమ్ వోజెస్ దీనికి బాధితుడయ్యాడు. ఇంగ్లండ్ కౌంటీల్లో భాగంగా వోజెస్ మిడిలెసెక్స్ జట్టు తరఫున ఆడుతున్నాడు. హాంప్‌షైర్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తుండగా అతను గాయపడ్డాడు. అదే జట్టు ఫీల్డర్ ఒలీ రేనర్ బౌండరీ నుంచి బలంగా విసిరిన త్రో అనూహ్యంగా వోజెస్ తల వెనుక భాగంలో తగిలింది. దాంతో వెంటనే గ్రౌండ్‌లో కుప్పకూలిన అతను కొద్దిసేపు స్పృహ కోల్పోయాడు.

జట్టు ఫిజియో, ఇతర సహాయక సిబ్బంది వోజెస్‌ను వెంటనే ఆస్పత్రికి తరలించారు. హాస్పిటల్‌లో చికిత్స అనంతరం వోజెస్ కోలుకున్నాడని, అతని పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని మిడిలెసెక్స్ జట్టు ప్రతినిధి వెల్లడించారు. వోజెస్ ఆసీస్ తరఫున 15 టెస్టులు ఆడాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement