adam vojes
-
మైదానంలో కుప్పకూలిన వోజెస్
తలకు తగిలిన బంతి లండన్: క్రికెట్ మైదానంలో ఆటగాడిని గాయపరిచిన మరో తీవ్ర ఘటన చోటు చేసుకుంది. ఈసారి ఆస్ట్రేలియా టెస్టు క్రికెటర్ ఆడమ్ వోజెస్ దీనికి బాధితుడయ్యాడు. ఇంగ్లండ్ కౌంటీల్లో భాగంగా వోజెస్ మిడిలెసెక్స్ జట్టు తరఫున ఆడుతున్నాడు. హాంప్‌షైర్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తుండగా అతను గాయపడ్డాడు. అదే జట్టు ఫీల్డర్ ఒలీ రేనర్ బౌండరీ నుంచి బలంగా విసిరిన త్రో అనూహ్యంగా వోజెస్ తల వెనుక భాగంలో తగిలింది. దాంతో వెంటనే గ్రౌండ్లో కుప్పకూలిన అతను కొద్దిసేపు స్పృహ కోల్పోయాడు. జట్టు ఫిజియో, ఇతర సహాయక సిబ్బంది వోజెస్ను వెంటనే ఆస్పత్రికి తరలించారు. హాస్పిటల్లో చికిత్స అనంతరం వోజెస్ కోలుకున్నాడని, అతని పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని మిడిలెసెక్స్ జట్టు ప్రతినిధి వెల్లడించారు. వోజెస్ ఆసీస్ తరఫున 15 టెస్టులు ఆడాడు. -
రెండో రోజూ దుమ్ము రేపారు
♦ స్మిత్, వోజెస్ సెంచరీలు తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ 551/3 డిక్లేర్డ్ విండీస్ 91/6 మెల్బోర్న్: వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఆస్ట్రేలియా జట్టు పూర్తి పట్టు సాధించింది. తొలి రోజు ఆటలో రెండు శతకాలు నమోదు కాగా రెండో రోజు ఆదివారం కెప్టెన్ స్టీవెన్ స్మిత్ (134 నాటౌట్; 8 ఫోర్లు), ఆడమ్ వోజెస్ (106 నాటౌట్; 12 ఫోర్లు) సెంచరీలతో అదరగొట్టారు. దీంతో తమ తొలి ఇన్నింగ్స్‌ను ఆసీస్ 135 ఓవర్లలో మూడు వికెట్లకు 551 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. స్మిత్, వోజెస్ నాలుగో వికెట్‌కు అజేయంగా 223 పరుగులు జోడించారు. అనంతరం తమ తొలి ఇన్నింగ్స్‌ను ఆరంభించిన విండీస్ బ్యాట్స్‌మెన్‌ను ఆసీస్ బౌలర్లు కట్టడి చేశారు. రోజు ముగిసే సమయానికి 43 ఓవర్లలో ఆరు వికెట్లకు 91 పరుగులు మాత్రమే చేయగలిగింది. క్రీజులో డారెన్ బ్రేవో (13 బ్యాటింగ్), కార్లస్ బ్రాత్‌వైట్ (3 బ్యాటింగ్) ఉన్నారు. ఇంకా 460 పరుగులు వెనుకబడి ఉండగా చేతిలో నాలుగు వికెట్లు మాత్రమే ఉన్నాయి. ప్యాటిన్సన్, లియోన్, సిడిల్లకు రెండేసి వికెట్లు దక్కాయి. ఆసీస్ కెప్టెన్ స్మిత్ ఈ ఏడాది టెస్టుల్లో అత్యధిక పరుగులు (1,404) చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఇందులో ఆరు సెంచరీలు ఉన్నాయి. తన అరంగేట్ర ఏడాదిలోనే వెయ్యి పరుగులు పూర్తి చేసిన మూడో ఆటగాడిగా వోజెస్ నిలిచాడు. ఆసీస్ గడ్డపై ఓ ఇన్నింగ్స్‌లో నలుగురు ఆసీస్ బ్యాట్స్‌మెన్ సెంచరీలు చేయడం ఇదే తొలిసారి. ఈ సిరీస్‌లో ఆసీస్ కేవలం ఏడు వికెట్లు మాత్రమే కోల్పోయి 1,134 పరుగులు చేసింది. బ్యాటింగ్ సగటు 162. ఓ సిరీస్‌లో ఇదే అత్యధిక సగటు. -
వోజెస్ సూపర్ డబుల్
ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 583/4 డిక్లేర్డ్ విండీస్ 207/6 హోబర్ట్: ఆడమ్ వోజెస్ (285 బంతుల్లో 269 నాటౌట్; 33 ఫోర్లు) కెరీర్లో తొలిసారిగా డబుల్ సెంచరీ నమోదు చేయడంతో పాటు షాన్ మార్ష్ (266 బంతుల్లో 182; 15 ఫోర్లు; 1 సిక్స్)తో కలిసి టెస్టు క్రికెట్ చరిత్రలో నాలుగో వికెట్‌కు 449 పరుగుల అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పాడు. దీంతో శుక్రవారం రెండో రోజు ఆసీస్ తమ తొలి ఇన్నింగ్స్‌ను 114 ఓవర్లలో నాలుగు వికెట్లకు 583 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఆసీస్ గడ్డపై కూడా ఏ వికెట్‌కైనా ఇదే అత్యధిక భాగస్వామ్యం. వారికన్‌కు మూడు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన విండీస్‌ను స్పిన్నర్ లియోన్ (3/43) దెబ్బతీశాడు. దీంతో రోజు ముగిసే సమయానికి 65 ఓవర్లలో ఆరు వికెట్లకు 207 పరుగులు చేసింది. విండీస్ ఇంకా 376 పరుగులు వెనుకబడి ఉంది. డారెన్ బ్రేవో (159 బంతుల్లో 94 బ్యాటింగ్; 17 ఫోర్లు) ఒక్కడే పోరాడుతున్నాడు. అతనికి జతగా క్రీజులో రోచ్ (89 బంతుల్లో 31 బ్యాటింగ్; 3 ఫోర్లు) ఉన్నాడు. హాజెల్‌వుడ్‌కు రెండు వికెట్లు దక్కాయి.