
లండన్: న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ కౌంటీ జట్టు మిడిలెసెక్స్‌తో జతకట్టాడు. ఇంగ్లండ్ దేశవాళీ టి20 కౌంటీ చాంపియన్‌షిప్ ఆడేందుకు రెండేళ్ల పాటు మిడిలెసెక్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇప్పటికే ఇంగ్లండ్‌లో జరిగే ఫ్రాంచైజీ లీగ్ ‘ది హండ్రెడ్ టోర్నీలో లండన్ స్పిరిట్‌కు కివీస్ దిగ్గజం సారథ్యం వహిస్తున్నాడు. గతంలో టి20 కౌంటీ చాంపియన్‌షిప్‌లో గ్లూసెస్టర్‌షైర్ (2011–12), యార్క్‌షైర్ (2013–2018)కు ప్రాతినిధ్యం వహించాడు. తాజా సీజన్‌లో బ్లాస్ట్ గ్రూప్‌లో మిడిలెసెక్స్ తరఫున కనీసం పది మ్యాచ్‌లు ఆడనున్నాడు. అనంతరం మరో ఐదు కౌంటీ చాంపియన్‌షిప్ మ్యాచ్‌ల్లోనూ విలియమ్సన్ బరిలోకి దిగుతాడు.
‘గతంలో అడపాదడపా కౌంటీలు ఆడాను. ఇప్పుడు మాత్రం పూర్తిస్థాయిలో సీజన్‌కు అందుబాటులో ఉంటాను’ అని అన్నాడు. ఈ వెటరన్ బ్యాటర్ అంతర్జాతీయ క్రికెట్లో మూడు ఫార్మాట్లలో కలిపి 18,000 పైచిలుకు పరుగులు చేశాడు. 47 సెంచరీలు సాధించాడు. టెస్టుల్లో 54.88, వన్డేల్లో 49.65, టి20ల్లో 33.44 సగటు నమోదు చేశాడు. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్, గుజరాత్ టైటాన్స్ ప్రాతినిధ్యం వహించిన విలియమ్సన్ కరీబియన్ లీగ్‌లో బార్బడోస్ ట్రిడెంట్స్, ఎస్‌ఏ–20 (సఫారీ లీగ్)లో డర్బన్ సూపర్‌జెయింట్స్ తరఫున బరిలోకి దిగాడు. ఈ సీజన్‌లో కరాచీ కింగ్స్ జట్టుతో జతకట్టిన కేన్ పాకిస్తాన్ సూపర్ లీగ్‌లోనూ ఆడనున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment