టాంటాన్" ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ మరోసారి విజృంభించాడు. టీ20 బ్లాస్ట్ సిరీస్‌లో భాగంగా మిడిల్‌సెక్స్ తరఫున ఆడుతున్న మోర్గాన్.. శుక్రవారం సోమర్‌సెట్‌తో జరిగిన మ్యాచ్‌లో చెలరేగి పోయాడు. 29 బంతుల్లో 8 సిక్సర్లు, 5 ఫోర్లతో అజేయంగా 83 పరుగులు సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సోమర్‌సెట్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లకు 226 పరుగులు చేసింది. ఆ జట్టు కెప్టెన్ టామ్ బెల్(101 నాటౌట్; 47 బంతుల్లో 13 ఫోర్లు, 3సిక్సర్లు) బ్యాట్ ఝుళిపించడంతో భారీ స్కోరు చేసింది.
అటు తర్వాత 227 పరుగుల లక్ష్య ఛేదనతో బ‍్యాటింగ్‌కు దిగిన మిడిల్‌సెక్స్‌కు డేవిడ్ మాలన్(41; 14 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు), పాల్ స్టిర్లింగ్(25; 10 బంతుల్లో 4 ఫోర్లు, 1సిక్స్)లు శుభారంభం అందించారు. ఈ జోడి తొలి వికెట్‌కు 67 పరుగులు సాధించింది.ఆపై డివిలియర్స్(32; 16 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించాడు. కాగా, ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన మోర్గాన్ వచ్చీ రావడంతోనే బ్యాట్‌కు పని చెప్పాడు. సోమర్‌సెట్ బౌలర్లను ఓ ఆట ఆడుకుంటూ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. మోర్గాన్ ధాటికి మిడిల్‌సెక్స్ 17 ఓవర్లలోనే నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఇది ఈ టోర్నమెంట్ చరిత్రలోనే ఛేజింగ్ రికార్డుగా నమోదైంది. 2014లో ససెక్స్ 226 పరుగుల టార్గెట్‌ను ఎసెక్స్‌పై సాధించగా, అది ఇప్పటివరకూ అత్యుతమ ఛేజింగ్ రికార్డుగా ఉంది. దాన్ని ఐదేళ్ల తర్వాత మిడిల్‌సెక్స్ బ్రేక్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment