చెన్నైలో సింధు పేరుతో అకాడమీ | Badminton PV Sindhu Academy to come up in Chennai | Sakshi
Sakshi News home page

చెన్నైలో సింధు పేరుతో అకాడమీ

Published Thu, Feb 20 2020 6:27 AM | Last Updated on Thu, Feb 20 2020 6:27 AM

Badminton PV Sindhu Academy to come up in Chennai - Sakshi

చెన్నై: ప్రపంచ చాంపియన్, భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు పేరుతో చెన్నైలో అకాడమీ నిర్మా ణమవుతోంది. ‘హార్ట్‌ఫుల్‌నెస్‌ ఇన్‌స్టిట్యూట్‌’ ఆధ్వర్యంలో చెన్నై శివారులో ఈ అకాడమీని నిర్మిస్తున్నారు. బుధవారం జరిగిన శంకుస్థాపన కార్యక్రమానికి తెలుగుతేజం సింధు స్వయంగా హాజరై పునాదిరాయి వేసింది. హార్ట్‌ఫుల్‌నెస్‌ ఇన్‌స్టిట్యూట్‌ అనేది ధ్యానం నేర్పించే సంస్థ. కమలేశ్‌ పటేల్‌ ఆధ్వర్యంలో పనిచేసే ఈ సంస్థలో ఆమె ధ్యానం నేర్చుకున్నారు. మొత్తం 8 కోర్టులతో అత్యాధునిక హంగులతో నిర్మించనున్న ఈ అకాడమీని 18 నుంచి 24 నెలల్లో పూర్తిచేయనున్నట్లు తెలిసింది. జిమ్, ఫిజియో సెంటర్లు అందుబాటులో ఉంచుతారు. 1000 మంది ప్రేక్షకులు సౌకర్యంగా కూర్చునే ఏర్పాట్లు చేయనున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement