ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్లో పీవీ సింధు ముందంజ వేయగా, జ్వాల జోడీకి నిరాశ ఎదురైంది.
కాపెన్హాగెన్: ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్లో పీవీ సింధు ముందంజ వేయగా, జ్వాల జోడీకి నిరాశ ఎదురైంది. మహిళల సింగిల్స్లో రైజింగ్ స్టార్ సింధు మూడో రౌండ్లో ప్రవేశించింది.
రెండో రౌండ్లో సింధు 21-12, 21-17తో ఓల్గా గొలొవనోవా (రష్యా)పై అలవోకగా విజయం సాధించింది. పురుషుల డబుల్స్లో భారత్ జోడీ సుమీత్ రెడ్డి, మను అట్రి జంట మూడో రౌండ్లో ప్రవేశించింది. కాగా మహిళల డబుల్స్ రెండో రౌండ్లో గుత్తా జ్వాల, అశ్వినీ పొన్నప్ప జోడీ ఓటమి చవిచూసింది.