p v sindhu
-
ముసుగు ధరించి.. చరిత్రను చెబుతూ.. అట్టహాసంగా పారిస్ ఒలింపిక్స్ ప్రారంభం (ఫొటోలు)
-
భారత బ్యాడ్మింటన్ రారాణికి జన్మదిన శుభాకాంక్షలు (ఫొటోలు)
-
తిరుపతి జిల్లా వెంకటగిరిలో అంగరంగ వైభవంగా పోలేరమ్మ జాతర (ఫొటోలు)
-
సింధుకు నిరాశ
బాలి (ఇండోనేసియా): భారత స్టార్ షట్లర్ పీవీ సింధుకు మరోసారి నిరాశ ఎదురైంది. ఇండో నేసియా ఓపెన్ సూపర్–1000 బ్యాడ్మింటన్ టోర్నీ లో ప్రపంచ చాంపియన్ సింధు కథ సెమీఫైనల్లో ముగిసింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో 26 ఏళ్ల సింధు 21–15, 9–21, 14–21తో ప్రపంచ మాజీ చాంపియన్ ఇంతనోన్ రచనోక్ (థాయ్‌లాండ్) చేతిలో ఓడిపోయింది. 54 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సింధు తొలి గేమ్‌ను దక్కించుకున్నా ఆ తర్వాత తడబడి మూల్యం చెల్లించుకుంది. టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెల్చుకున్నాక సింధు ఆడిన నాలుగు టోర్నీల్లో సెమీఫైనల్ దశను దాటి ముందుకెళ్లలేదు. వరుసగా పదోసారి... మరోవైపు పురుషుల డబుల్స్ విభాగంలో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జంట కూడా సెమీఫైనల్లో నిష్క్రమించింది. ప్రపంచ నంబర్‌వన్ జోడీ మార్కస్ గిడియోన్–కెవిన్ సుకముల్జో (ఇండోనేసియా)తో జరిగిన సెమీఫైనల్లో సాత్విక్–చిరాగ్ 16–21, 18–21తో ఓటమి పాలైంది. గిడియోన్–కెవిన్ ద్వయం చేతిలో సాత్విక్–చిరాగ్‌లకిది వరుసగా పదో పరాజయం కావడం గమనార్హం. -
చెన్నైలో సింధు పేరుతో అకాడమీ
చెన్నై: ప్రపంచ చాంపియన్, భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు పేరుతో చెన్నైలో అకాడమీ నిర్మా ణమవుతోంది. ‘హార్ట్ఫుల్నెస్ ఇన్స్టిట్యూట్’ ఆధ్వర్యంలో చెన్నై శివారులో ఈ అకాడమీని నిర్మిస్తున్నారు. బుధవారం జరిగిన శంకుస్థాపన కార్యక్రమానికి తెలుగుతేజం సింధు స్వయంగా హాజరై పునాదిరాయి వేసింది. హార్ట్ఫుల్నెస్ ఇన్స్టిట్యూట్ అనేది ధ్యానం నేర్పించే సంస్థ. కమలేశ్ పటేల్ ఆధ్వర్యంలో పనిచేసే ఈ సంస్థలో ఆమె ధ్యానం నేర్చుకున్నారు. మొత్తం 8 కోర్టులతో అత్యాధునిక హంగులతో నిర్మించనున్న ఈ అకాడమీని 18 నుంచి 24 నెలల్లో పూర్తిచేయనున్నట్లు తెలిసింది. జిమ్, ఫిజియో సెంటర్లు అందుబాటులో ఉంచుతారు. 1000 మంది ప్రేక్షకులు సౌకర్యంగా కూర్చునే ఏర్పాట్లు చేయనున్నారు. -
ఘనంగా : సిక్కి రెడ్డి, సుమీత్ రెడ్డిల వివాహం
-
పీవీ సింధూ వాలీబాల్ ప్లేయరా!
హైదరాబాద్ : ఇటీవలే బీకాంలో మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టులు చదివానంటూ వ్యాఖ్యానిస్తూ అందరిన్నీ ఆశ్చర్యపరిచిన విజయవాడ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన జలీల్ ఖాన్ గుర్తుండే ఉంటారు. ఇప్పుడు మరో ఎమ్మెల్యే పీవీ సింధూని వాలీబాల్ ప్లేయరంటూ తనకున్న మిడిమిడి జ్ఞానాన్ని బట్టబయలు చేసుకున్నారు. చార్మినార్‌లో శుక్రవారం 5కే రన్ ప్రొగ్రామ్ కోసం వచ్చిన పీవీ సింధూని ఏఐఎంఐఎంకు చెందిన ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ వాలీబాల్ ప్లేయర్ గా అభివర్ణించారు. రన్ ప్రారంభోత్సవ ప్రసంగంలో పాల్గొన్న ముంతాజ్ ఈ రన్‌ను నిర్వహిస్తున్న ఆర్గనైజర్లందరికీ, స్టేజ్‌పై ఉన్న వారందరికీ కృతజ్ఞతలు చెప్పారు. అనంతరం పీవీ సింధూని ప్రస్తావించే సమయంలో కొంత తడబడిన ఎంఎల్ఏ, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చెవిలో ఏదో గుసగుసలాడి, హైదరాబాద్ తరుఫున వాలీబాల్ ప్లేయర్‌గా ఇంటర్నేషనల్ ప్లాట్‌ఫామ్‌పై ఆడిన సింధూకి తాము థ్యాంక్సూ చెబుతున్నట్టు వ్యాఖ్యానించారు. ఎంఎల్ఏ పొరపాటున తనను వాలీబాల్ ప్లేయర్ అనడంతో పీవీ సింధూ చిన్న నవ్వు నవ్వేసి ఊరుకున్నారు. కాగా సింధూ పేరెంట్స్ మాజీ వాలీబాల్ ప్లేయర్స్. కానీ సింధూకి బ్యాడ్మింటన్ మీద ఉన్న ఆసక్తితో ఆమె సంచనాలు సృష్టిస్తున్నారు. ప్రతిష్టాత్మక రియో ఒలింపిక్స్‌లో మెరుగైన ఆటతీరును ప్రదర్శించి రజత పతకాన్ని కూడా సాధించారు. మన లీడర్లకు నాన్-పొలిటికల్ వ్యవహారాలపై ఏమేర నాలెడ్జ్ ఉందో ఇటీవల ఎమ్మెల్యేలు ప్రస్తావిస్తున్న అంశాల వల్ల బయటపడుతున్నాయి. -
పీవీ సింధు ఖాతాలో మరో బ్రాండ్
వైజాగ్: ప్రముఖ బాడ్మింటన్ క్రీడాకారిణి, రియో ఒలంపిక్ రజత పతక విజేత పీవీ సింధు మరో ప్రత్యేకతను తన ఖాతాలో వేసుకుంది. ప్రఖ్యాతి గాంచిన వైజాగ్ స్టీల్ సంస్థ , రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఎన్నికైంది. బేస్‌లైన్ వెంచర్స్, డైరెక్టర్ , మరియు సహ వ్యవస్థాపకుడు ఆర్ రామకృష్ణన్ ఈ ఒప్పంద వివరాలు వెల్లడించారు. దీంతో వైజాగ్ స్టీల్ అథ్లెట్ రంగంలో ప్రధాన భాగస్వామి మారిందని చెప్పారు. దీని ప్రకారం బాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్, భారతదేశం బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మరియు దేశీయ పోటీలలో సింధు ఆడే సమయంలో ఆమె జెర్సీ మీద కంపెనీ బ్రాండ్ లోగో ఉండనుందని తెలిపారు. సింధు ప్రస్తుతం ప్రపంచంలో టాప్ 10 ర్యాంక్ ఆటగాళ్ళ మధ్య రియో ఒక ఒలింపిక్ రజత పతకం గెలుచుకున్న మొదటి భారతీయ మహిళా క్రీడాకారిణిగా రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. ఇది తనకు అత్యంత ముఖ్యమైన ఎండార్స్మెంట్ అని పీవీ సింధు వ్యాఖ్యానించింది. బ్యాడ్మింటన్ క్యాలెండర్ లో నెలకు కనీసం మూడు ప్రధాన అంతర్జాతీయ ఈవెంట్స్ కు విస్తరించిన నేపథ్యంలో ర్యాంకింగ్స్ మెరుగుకు ఆర్ఐఎన్ఎల్ విశ్వసనీయ బ్రాండ్ అనిసంతోసం వ్యక్తం చేసింది. ఖచ్చితంగా తన ఆట మీద దృష్టికి సహాయపడుతుందిని పేర్కొంది. సింధు, వైజాగ్ స్టీల్ రెండూ భారతదేశం యొక్క అమూల్యమైన ఆస్తులు అని ఆర్ఐఎన్ఎల్ సీఎండీ పి మధుసూదన్ చెప్పారు . తాజా బాండ్ వారికి, దేశానికి గర్వకారణమన్నారు. -
అమాంతం పెరిగిన పీవీ సింధు బ్రాండ్ వాల్యూ
మొన్నటివరకు వర్ధమాన షట్లర్గానే ఉన్న పీవీ సింధు.. రియో ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించడంతో ప్రపంచ బ్యాడ్మింటన్ స్టార్ అయ్యింది. రాష్ట్ర ప్రభుత్వాలు పోటీలు పడి సింధుకు ప్రోత్సాహకాలు ప్రకటించాయి. సన్మానాలు చేశారు. ఉద్యోగాలు ప్రకటించారు. రియోలో రజతపతకం సాధించాక ఈ తెలుగుతేజం కెరీర్ మారిపోయింది. సింధు బ్రాండ్ వాల్యూ ఎన్నో రెట్లు పెరిగింది. ఆమెతో వాణిజ్య ప్రకటనల ఒప్పందాలు చేసుకోవడానికి పలు కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. ఒలింపిక్స్ బ్యాడ్మింటన్‌లో రజతం సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా సింధు రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. సింధు బ్రాండ్ వాల్యూ మరింత పెరుగుతుందని, ఒప్పందాలు చేసుకోవడంలో తొందరపడబోమని ఆమె ఎండార్స్మెంట్ వ్యవహారాలను చూస్తున్న బ్రాండ్ మేనేజ్మెంట్ సంస్థ బేస్‌లైన్ వెంచర్స్ భావిస్తోంది. సింధుతో రెండు ఎండార్స్మెంట్ ఒప్పందాలను త్వరలో ప్రకటించనున్నట్టు సమాచారం. బేస్‌లైన్ వెంచర్స్ డైరెక్టర్ ఆర్ రామకృష్ణన్ మాట్లాడుతూ.. ఒలింపిక్స్‌కు ముందు ఈ ఎండార్స్మెంట్ ఒప్పందాలు జరిగాయని, సింధు సన్నాహకాల్లో తీరికలేకుండా ఉండటంతో ప్రకటించలేదని చెప్పారు. ఇవి జాతీయ స్థాయిలో మేజర్ ఎండార్స్మెంట్స్ అని చెప్పారు. -
పూరీ తీరంలో సింధు సైకతశిల్పం
భువనేశ్వర్: రియో ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన భారత బ్యాడ్మిటన్ స్టార్, తెలుగుతేజం పీవీ సింధు, కోచ్ గోపీచంద్‌లను అభినందిస్తూ ప్రముఖ సైకతశిల్పి సుదర్శన్ పట్నాయక్ ఇసుకతో చక్కటి శిల్పాన్ని తయారుచేశారు. ఒడిశాలో పూరీ సముద్రతీరంలో ఐదు అడుగుల ఎత్తైన సైకత శిల్పాన్ని రూపొందించారు. ఇంగ్లీష్‌లో కంగ్రాట్స్ పీవీ సింధు, థ్యాంక్స్ గోపీచంద్ అనే అక్షరాలతో పాటు బ్యాడ్మింటన్ ఆడుతున్నట్టుగా సింధు ప్రతిమ ఉంది. సుదర్శన్ పట్నాయక్ ఈ శిల్పం తయారు చేయడానికి నాలుగు టన్నుల ఇసుకను వాడారు. ఒలింపిక్స్‌లో సింధు పతకం సాధించడాన్ని దేశం గర్విస్తోందని, ఆమె విజయం వెనుక కోచ్ గోపీచంద్ ఉన్నాడని ప్రశంసించారు. సమాజంలో ఆయా పరిస్థితులకు, పరిణామాలకు సందర్భోచితంగా విలక్షణ శైలిలో సైకత శిల్పాలను రూపొందించడం సుదర్శన్ పట్నాయక్ ప్రత్యేకత. -
సింధు జైత్రయాత్ర ఆరంభం
-
సూపర్ సింధు
* మలేసియా మాస్టర్స్ టైటిల్ సొంతం * ఫైనల్లో కిర్స్టీ గిల్మౌర్‌పై విజయం * కెరీర్లో ఐదో గ్రాండ్‌ప్రి గోల్డ్ టైటిల్ గతేడాది గాయాల కారణంగా అనుకున్న స్థాయిలో రాణించలేకపోయిన భారత బ్యాడ్మింటన్ స్టార్ పూసర్ల వెంకట (పీవీ) సింధు కొత్త ఏడాదిలో శుభారంభం చేసింది. పూర్తి ఫిట్నెస్ను సంతరించుకున్న ఈ హైదరాబాద్ అమ్మాయి కొత్త సీజన్‌ను టైటిల్‌తో ప్రారంభించింది. స్వదేశంలో జరిగిన ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్)లో అజేయంగా నిలిచిన ఈ తెలుగు అమ్మాయి అదే జోరును మలేసియా ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నమెంట్లోనూ కొనసాగించి చాంపియన్‌గా నిలిచింది. పెనాంగ్: నిలకడగా రాణిస్తే అంచనాలకు అనుగుణమైన ఫలితాన్ని సాధించడం కష్టమేమీ కాదని భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు మరోసారి నిరూపించింది. సీజన్ ప్రారంభానికి ముందే పూర్తి ఫిట్నెస్ సంపాదించిన ఈ తెలుగు అమ్మాయి ఈ ఏడాది బరిలోకి దిగిన తొలి టోర్నమెంట్‌లోనే విజేతగా అవతరించింది. ఆదివారం ముగిసిన మలేసియా మాస్టర్స్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నమెంట్లో సింధు చాంపియన్‌గా నిలిచింది. ఏకపక్షంగా జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో మూడో సీడ్ సింధు 21-15, 21-9తో ప్రపంచ 20వ ర్యాంకర్ కిర్స్టీ గిల్మౌర్ (స్కాట్లాండ్)పై గెలిచింది. తద్వారా 2013లో ఫ్రెంచ్ ఓపెన్‌లో కిర్స్టీ గిల్మౌర్ చేతిలో ఎదురైన ఏకైక పరాజయానికి బదులు తీర్చుకుంది. విజేతగా నిలిచిన సింధుకు 9000 డాలర్ల (రూ. 6 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 7000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఎనిమిదేళ్ల చరిత్ర కలిగిన మలేసియా మాస్టర్స్ టోర్నీలో మహిళల సింగిల్స్ టైటిల్‌ను రెండుసార్లు నెగ్గిన తొలి ప్లేయర్‌గా సింధు గుర్తింపు పొందింది. 2013లో సింధు మలేసియా మాస్టర్స్ టైటిల్‌ను తొలిసారి సాధించి సీనియర్ స్థాయిలోనూ గొప్ప విజయాలు సాధించే సత్తా తనలో ఉందని చాటిచెప్పింది. సెమీఫైనల్లో టాప్ సీడ్ సుంగ్ జీ హున్ (దక్షిణ కొరియా)పై సంచలన విజయం సాధించిన సింధు... ఫైనల్లోనూ ఆద్యంతం నిలకడగా ఆడింది. గతంలో గిల్మౌర్ చేతిలో ఓడిన అనుభవమున్న సింధు ఈసారి ప్రత్యర్థిని తక్కువ అంచనా వేయకుండా ఆరంభం నుంచే జాగ్రత్తగా ఆడింది. అవకాశం దొరికినపుడల్లా పదునైన స్మాష్ షాట్లతో పాయింట్లు సాధించింది. ఈ క్రమంలో తొలుత 5-2తో.. ఆ తర్వాత 12-6తో... 18-10తో సింధు ఆధిక్యంలోకి వెళ్లి అదే జోరులో తొలి గేమ్‌ను సొంతం చేసుకుంది. రెండో గేమ్‌లోనూ సింధు ఆటతీరుకు గిల్మౌర్ వద్ద సమాధానం లేకపోయింది. మొదట్లో సింధు 9-6తో ఆధిక్యంలోకి వెళ్లి ఆ తర్వాత వరుసగా 7 పాయింట్లు నెగ్గి 16-6తో ముం దంజ వేసింది. గిల్మౌర్‌కు ఏదశలోనూ పుంజుకునే అవకాశం ఇవ్వకుండా ఆడిన సింధు తుదకు 32 నిమిషాల్లో మ్యాచ్‌ను ముగించి తన ఖాతాలో టైటిల్‌ను జమచేసుకుంది. ఈ టోర్నీలో మొత్తం ఐదు మ్యాచ్‌లు ఆడిన సింధు మూడు గంటల 46 నిమిషాలపాటు కోర్టులో గడిపింది. తన ప్రత్యర్థులకు కేవలం రెండు గేమ్‌లు మాత్రమే కోల్పోయింది. పురుషుల సింగిల్స్ ఫైనల్లో లీ చోంగ్ వీ 21-18, 21-11తో జైనుద్దీన్‌పై గెలిచి టైటిల్ నెగ్గాడు. సింధుకు జగన్ అభినందనలు సాక్షి, హైదరాబాద్: మలేసియా ఓపెన్ టైటిల్‌ను గెల్చుకున్న పి.వి.సింధుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో జరగబోయే క్రీడా పోటీలన్నింటిలోనూ ఆమె విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ‘బాయ్’ నజరానా రూ. 5 లక్షలు మలేసియా ఓపెన్ టైటిల్ విజేత పీవీ సింధుకు భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) రూ. 5 లక్షల నగదు పురస్కారాన్ని ప్రకటించింది. ఇదే విధంగా రాణిస్తూ మున్ముందు ఆమె మరిన్ని టైటిల్స్ గెలవాలని ‘బాయ్’ అధ్యక్షుడు అఖిలేశ్ దాస్‌గుప్తా ఆకాంక్షించారు. ఇదో గొప్ప విజయం. కొత్త సీజన్లో శుభారంభం లభించింది. ఫైనల్‌తో పోలిస్తే శనివారం టాప్ సీడ్ సుంగ్ జీ హున్‌తో జరిగిన సెమీఫైనల్లో కష్టపడి గెలిచాను. ఫైనల్లో ఆరంభంలోనే ఆధిక్యంలోకి వెళ్లి దానిని నిలబెట్టుకున్నాను. గతంలో గిల్మౌర్ చేతిలో ఓడినా... అప్పటికి ఇప్పటికీ నా ఆటతీరులో చాలా మార్పు వచ్చింది. ఈనెల 26న లక్నోలో మొదలయ్యే సయ్యద్ మోదీ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నీలో పాల్గొంటున్నాను. ఆ తర్వాత హైదరాబాద్‌లో జరిగే ఆసియా టీమ్ చాంపియన్‌షిప్‌లో బరిలోకి దిగుతాను. -‘సాక్షి’తో సింధు -
పివి సింధుదే టైటిల్
-
క్వార్టర్ ఫైనల్లో సింధు
ఓడోన్సీ(డెన్మార్క్): భారత స్టార్ షట్లర్, వరల్డ్ నంబర్ వన్ సైనా నెహ్వాల్ డెన్మార్క్ ఓపెన్ లో తన పోరాటాన్ని ముగించినా.. మరో హైదరాబాదీ అమ్మాయి పివి సింధు క్వార్టర్ ఫైనల్ కు చేరింది. మహిళల ప్రి క్వార్టర్ ఫైనల్లో భాగంగా శుక్రవారం జరిగిన పోరులో సింధు 21-12, 21-15 తేడాతో మూడో సీడ్ తై జూ యింగ్(చైనీస్ తైపీ)పై విజయం సాధించి క్వార్టర్ ఫైనల్ కు చేరింది. గతంలో మూడు సార్లు జూ యింగ్ చేతిలో పరాభవం ఎదుర్కొన్న సింధు డెన్మార్క్ ఓపెన్ లో అందుకు ప్రతీకారం తీర్చుకుంది. వరుస సెట్లను కైవసం చేసుకుని జూ యింగ్ పై ఆధిక్యాన్ని ప్రదర్శించింది. 34 నిమిషాల్లో ముగిసిన ఈ పోరులో సింధు ఆద్యంతం ఆకట్టుకుంది. సింధు తన తదుపరి పోరులో ఆరో సీడ్ వాంగ్ యహాన్(చైనా)తో తలపడనుంది. -
క్వార్టర్స్‌లో సైనా, సింధు ఓటమి
వుహన్: ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత్ పోరాటం ముగిసింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో సైనా నెహ్వాల్, పీవీ సింధు ఓటమి చవిచూశారు. వరల్డ్ నెంబర్ వన్ సైనా 21-16 13-21 18-21 స్కోరుతో ఐదో సీడ్ జు యింగ్ తాయ్ (చైనీస్ తైపీ) చేతిలో ఓడింది. 55 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌లో సైనా మూడు గేమ్‌ల్లో మ్యాచ్‌ను కోల్పోయింది. మరో మ్యాచ్‌లో ఎనిమిదో సీడ్ సింధు 21-11 19-21 8-21తో టాప్ సీడ్ లీ జురుయ్ (చైనా) చేతిలో పరాజయం చవిచూసింది. 52 నిమిషాల పాటు ఈ మ్యాచ్ జరిగింది. -
హాంకాంగ్ ఓపెన్ లో సింధు ఓటమి
హాంకాంగ్: హాంకాంగ్ ఓపెన్ బ్యాడ్మింటన్ సూపర్ సిరీస్‌లో తెలుగు తేజం పీవీ సింధు ఓటమిపాలైంది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్ లో తనకంటే తక్కువ ర్యాంకులో ఉన్న క్రీడాకారిణి చేతిలో ఓటమి చవిచూసింది. జపనీస్ క్రీడాకారిణి నోజోమీ ఒకుహరాతో గంటపైగా సాగిన మ్యాచ్ లో 17-21, 21-13, 11-21తో సింధు పరాజయం పాలైంది. నోజోమీతో సింధు తలపడడం ఇది రెండోసారి. 2012లో ఆసియా యూత్ బ్యాడ్మింటన్ అండర్-19 టోర్నమెంట్ లో తొలిసారిగా వీరిద్దరూ పోటీపడ్డారు. -
సింధు ముందంజ.. జ్వాలా జోడీ అవుట్
కాపెన్‌హాగెన్: ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్లో పీవీ సింధు ముందంజ వేయగా, జ్వాల జోడీకి నిరాశ ఎదురైంది. మహిళల సింగిల్స్‌లో రైజింగ్ స్టార్ సింధు మూడో రౌండ్లో ప్రవేశించింది. రెండో రౌండ్లో సింధు 21-12, 21-17తో ఓల్గా గొలొవనోవా (రష్యా)పై అలవోకగా విజయం సాధించింది. పురుషుల డబుల్స్‌లో భారత్ జోడీ సుమీత్ రెడ్డి, మను అట్రి జంట మూడో రౌండ్లో ప్రవేశించింది. కాగా మహిళల డబుల్స్ రెండో రౌండ్లో గుత్తా జ్వాల, అశ్వినీ పొన్నప్ప జోడీ ఓటమి చవిచూసింది. -
సైనా సెమీస్‌కు.. సింధు ఇంటికి
సిడ్నీ: భారత ఏస్ షట్లర్ సైనా నెహ్వాల్ ఆస్ట్రేలియా ఓపెన్ సూపర్ సిరీస్‌లో దూసుకెళ్తోంది. మహిళల సింగిల్స్‌లో హైదరాబాదీ సైనా సెమీస్‌లో ప్రవేశించింది. కాగా మరో తెలుగుతేజం పీవీ సింధుకు నిరాశ ఎదురైంది. క్వార్టర్స్‌లో ఆరో సీడ్ సైనా 21-18 21-9తో ఎరికో హిరోసి (జపాన్)పై సునాయాసంగా విజయం సాధించింది. 47 నిమిషాల్లో వరుస గేమ్‌ల్లో మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. సెమీస్‌లో వరల్డ్ నెంబర్ టూ షిజియాన్ వాంగ్ (చైనా)తో తలపడనుంది. మరో క్వార్టర్స్‌లో సింధు 17-21 17-21తో కరోలినా మారిన్ (స్పెయిన్) చేతిలో ఓటమి చవిచూసింది. -
జపాన్ ఓపెన్ రెండో రౌండ్లో సింధు
భారత బ్యాడ్మింటన్ వర్ధమాన సంచలనం పి.వి.సింధు జపాన్ ఓపెన్‌లో రెండో రౌండ్లో ప్రవేశించింది. ఈ టోర్నీలో సింధుతో పాటు రాష్ట్రానికే చెందిన యువ షట్లర్ కె. శ్రీకాంత్ శుభారంభం చేశాడు. బుధవారమిక్కడ జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ఎనిమిదో సీడ్ సింధు 21-12, 21-13తో స్థానిక షట్లర్ యుకినో నకాయ్పై అలవోకగా గెలుపొందింది. హైదరాబాదీ వరుస గేమ్‌ల్లో మ్యాచ్‌ను ముగించింది. రెండో రౌండ్లో జపాన్ క్వాలిఫయర్ అకానె యమగూచితో తలపడనుంది. పురుషుల సింగిల్స్ తొలిరౌండ్లో ఆంధ్రప్రదేశ్ ఆటగాడు కె.శ్రీకాంత్ 22-20, 22-24, 21-18తో ప్రపంచ 22వ ర్యాంకర్ షొ ససాకి (జపాన్)పై పోరాడి నెగ్గాడు. ఇతర మ్యాచ్‌ల్లో భారత షట్లర్లు 37వ ర్యాంకర్ ఆనంద్ పవార్ 21-17, 7-21, 21-18తో ప్రపంచ 12వ ర్యాంకర్ సోనీ ద్వి కున్కొరొ (ఇండోనేసియా)కు షాకివ్వగా, అజయ్ జయరామ్ 21-11, 21-18తో టీన్ చెన్ (చైనీస్ తైపీ)ని చిత్తుచేశాడు. కాగా సాయి ప్రణీత్, సౌరభ్‌వర్మ తొలిరౌండ్లో ఓటమి చవిచూశారు.