క్వార్టర్ ఫైనల్లో సింధు | Sindhu reaches quarterfinals of Denmark Open | Sakshi
Sakshi News home page

క్వార్టర్ ఫైనల్లో సింధు

Published Fri, Oct 16 2015 7:00 PM | Last Updated on Sun, Sep 3 2017 11:04 AM

క్వార్టర్ ఫైనల్లో సింధు

క్వార్టర్ ఫైనల్లో సింధు

ఓడోన్సీ(డెన్మార్క్): భారత స్టార్ షట్లర్, వరల్డ్ నంబర్ వన్ సైనా నెహ్వాల్  డెన్మార్క్ ఓపెన్ లో  తన పోరాటాన్ని ముగించినా.. మరో  హైదరాబాదీ అమ్మాయి పివి సింధు క్వార్టర్ ఫైనల్ కు చేరింది.  మహిళల ప్రి క్వార్టర్ ఫైనల్లో భాగంగా శుక్రవారం జరిగిన పోరులో సింధు 21-12, 21-15 తేడాతో మూడో సీడ్ తై జూ యింగ్(చైనీస్ తైపీ)పై విజయం సాధించి క్వార్టర్ ఫైనల్ కు చేరింది.

 

గతంలో మూడు సార్లు జూ యింగ్ చేతిలో పరాభవం ఎదుర్కొన్న సింధు డెన్మార్క్ ఓపెన్ లో అందుకు ప్రతీకారం తీర్చుకుంది. వరుస సెట్లను కైవసం చేసుకుని జూ యింగ్ పై ఆధిక్యాన్ని ప్రదర్శించింది. 34 నిమిషాల్లో ముగిసిన ఈ పోరులో సింధు ఆద్యంతం ఆకట్టుకుంది. సింధు తన తదుపరి పోరులో ఆరో సీడ్ వాంగ్ యహాన్(చైనా)తో తలపడనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement