జపాన్ ఓపెన్ రెండో రౌండ్లో సింధు | P V Sindhu enter second round of japan open | Sakshi
Sakshi News home page

జపాన్ ఓపెన్ రెండో రౌండ్లో సింధు

Published Wed, Sep 18 2013 2:35 PM | Last Updated on Fri, Sep 1 2017 10:50 PM

జపాన్ ఓపెన్ రెండో రౌండ్లో సింధు

జపాన్ ఓపెన్ రెండో రౌండ్లో సింధు

భారత బ్యాడ్మింటన్ వర్ధమాన సంచలనం పి.వి.సింధు జపాన్ ఓపెన్లో రెండో రౌండ్లో ప్రవేశించింది. ఈ టోర్నీలో సింధుతో పాటు రాష్ట్రానికే చెందిన యువ షట్లర్ కె. శ్రీకాంత్ శుభారంభం చేశాడు. బుధవారమిక్కడ జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ఎనిమిదో సీడ్ సింధు 21-12, 21-13తో స్థానిక షట్లర్ యుకినో నకాయ్పై అలవోకగా గెలుపొందింది. హైదరాబాదీ వరుస గేమ్ల్లో మ్యాచ్ను ముగించింది. రెండో రౌండ్లో జపాన్ క్వాలిఫయర్ అకానె యమగూచితో తలపడనుంది.

పురుషుల సింగిల్స్ తొలిరౌండ్లో ఆంధ్రప్రదేశ్ ఆటగాడు కె.శ్రీకాంత్ 22-20, 22-24, 21-18తో ప్రపంచ 22వ ర్యాంకర్ షొ ససాకి (జపాన్)పై పోరాడి నెగ్గాడు. ఇతర మ్యాచ్ల్లో భారత షట్లర్లు 37వ ర్యాంకర్ ఆనంద్ పవార్ 21-17, 7-21, 21-18తో ప్రపంచ 12వ ర్యాంకర్ సోనీ ద్వి కున్కొరొ (ఇండోనేసియా)కు షాకివ్వగా, అజయ్ జయరామ్ 21-11, 21-18తో టీన్ చెన్ (చైనీస్ తైపీ)ని చిత్తుచేశాడు. కాగా సాయి ప్రణీత్, సౌరభ్వర్మ తొలిరౌండ్లో ఓటమి చవిచూశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement