shuttler
-
ఎవరీ తులసిమతి మురుగేశన్? పుట్టుకతో వచ్చే వైకల్యం దాటుకుని..
మనం చిన్న సమస్యకే విలవిలలాడిపోతాం. కాస్త బాగోకపోతేనే చేస్తున్న పనిని వదిలేస్తాం. కానీ ఈ అమ్మాయి పుట్టుకతో వచ్చే లోపంతో పోరాడింది. అది ప్రాణాంతకంగా మారి పరిస్థితిని దారుణంగా దిగజార్చింది. ఏదోవిధంగా కోలుకుని బయటపడిందనుకున్నా..దివ్యాంగురాలిగా చేసి బాధపెట్టింది. అయితేనేం తగ్గేదే లే..! అంటూ బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా రాణించడమేగాక పారాలింపిక్స్‌లో సత్తా చాటింది. రజత పతకంతో యావత్ దేశం గర్వపడేలా చేసింది. ఇంతకీ ఎవరీమె? ఆమె సక్సెస్ జర్నీ ఎలా సాగిందంటే..భారత పారా బ్యాడ్మింటన్ క్రీడాకారిణి తులసిమతి మురుగేశన్ సెప్టెంబర్ 2న జరిగిన పారిస్ పారాలింపిక్స్‌లో రజత పతకాన్ని సాధించి చరిత్ర సృష్టించింది. ఆమె SU5 ఫైనల్లో మహిళల సింగిల్స్‌కు చేరుకుంది. అయితే చైనాకు చెందిన యాంగ్ క్విక్సియా చేతిలో ఓడిపోయింది. కేవలం 30 నిమిషాల్లో 21-17, 21-10తో యాంగ్ క్విక్సియా మ్యాచ్‌ను గెలుచుకుంది. చివర వరకు ఉత్కంఠను రేపేలా ఆడి రజత పతకంతో భారతదేశం గర్వించేలా చేసింది. పారాలింపిక్స్‌లో బ్యాడ్మింటన్ విభాగంలో శిఖరాగ్ర స్థాయికి చేరుకున్న తొలి భారతీయ మహిళగా మురుగేషన్ చరిత్ర సృష్టించారు.ఎవరంటే ఆమె..?తులసిమతి మురుగేశన్ తమిళనాడులోని కాంచీపురానికి చెందింది. ఆమె పుట్టుకతో వచ్చే వైకల్యం తులసిమతి జీవితాన్ని అగాధంలోకి నెట్టిసింది. ఆ వైకల్యం కారణంగా బోటన వేలును కోల్సోవమే గాక ప్రాణాంతకమై ఆమె పరిస్థితిని దిగజార్చింది. ఏదోవిధంగా కోలుకున్నా.. ఎడమ చేయి చలనం కోల్పోయి దివ్యాంగురాలిగా చేసింది. అయితాన లెక్క చేయక క్రీడలపై దృష్టిసారించి. కక్రీడల పట్ల అమిత ఆసక్తిగల తండ్రి సాయంతో బ్యాడ్మింటన్ ఎంచుకుంది. సమర్థులైన క్రీడాకారులతో ఆడేలా నైపుణ్యం సంపాదించుకుంది. అంతేగాదు ఆమె వెటర్నరీ సైన్సు విద్యార్థి కూడా. ఆమె సోదరి కిరుత్తిమా కూడా బ్యాడ్బింటన్ క్రీడాకారిణి. ఆమె అనేక జిల్లా స్థాయి ఆటలను గెలుచుకుంది. అంతేగాదు తులసీమత్ ఐదవ ఫజ్జా దుబాయ్ పారా-బ్యాడ్మింటన్ ఇంటర్నేషనల్ 2023లో మహిళల డబుల్స్ ిభాగంలో మానసి జోషితో కలిసి బంగారు పతకాన్ని సాధించింది. ఆమె అదే ఈవెంట్లో నితేష్ కుమార్‌తో కలిసి కాంస్య పతకాన్ని కూడా సాధించింది. ఆమె అకుంఠితమైన పట్టుదల, శ్రమ ఎన్నో అవార్డులను, గౌరవ సత్కారాలను తెచ్చిపెట్టాయి. అంతేగాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రీడాకారులందరికీ స్ఫూర్తిగా నిలిచింది. జీవితం ఇచ్చే పెట్టే పరీక్షకు తలొగ్గక నచ్చినట్లుగా నీ తలరాతను రాసుకునేలా దూసుకుపోవడం అంటే ఏంటో చేసి చూపింది.A moment of immense pride as Thulasimathi wins a Silver Medal in the Women's Badminton SU5 event at the #Paralympics2024! Her success will motivate many youngsters. Her dedication to sports is commendable. Congratulations to her. @Thulasimathi11 #Cheer4Bharat pic.twitter.com/Lx2EFuHpRg— Narendra Modi (@narendramodi) September 2, 2024 (చదవండి: కిమ్ కర్దాషియాన్‌లా కనిపించాలని ఏకంగా రూ. 8 కోట్లు..పాపం ఆమె..!) -
Paralympics 2024: రైలు ప్రమాదం నుంచి ఒలింపిక్ స్వర్ణం వరకు...
తండ్రి నేవీ ఆఫీసర్... ఆయనను చూసి తానూ అలాగే యూనిఫామ్ సర్వీస్‌లోకి వెళ్లాలనుకున్నాడు... కానీ అనూహ్య ఘటనతో అది సాధ్యం కాలేదు. ఆ తర్వాత చదువుపై దృష్టి పెట్టి ఐఐటీ వరకు వెళ్లాడు... కానీ శరీరం అక్కడ ఉన్నా మనసు మాత్రం ఆటలపై ఉంది... కానీ అనుకోని వైకల్యం వెనక్కి లాగుతోంది... అయినా సరే ఎక్కడా తగ్గలేదు... అణువణువునా పోరాటస్ఫూర్తి నింపుకున్నాడు. బ్యాడ్మింటన్ క్రీడలోకి ప్రవేశించి పట్టుదలగా శ్రమిస్తూ అంచెలంచెలుగా ముందుకు పోయాడు. ఇప్పుడు పారాలింపిక్స్‌లో స్వర్ణం సాధించి తన కలను పూర్తి చేసుకున్నాడు. పారా షట్లర్ నితేశ్ కుమార్ విజయగాథ ఇది. 2009... నితేశ్ కుమార్ వయసు 15 ఏళ్లు. అప్పటికి అతనికి ఆటలంటే చాలా ఇష్టం. ఫుట్‌బాల్‌ను బాగా ఆడేవాడు. అయితే ఆ సమయంలో జరిగిన అనూహ్య ఘటన అతని జీవితాన్ని మలుపు తిప్పింది. విశాఖపట్నం వద్ద జరిగిన రైలు ప్రమాదంలో నితేశ్ తన కాలును కోల్పోయాడు. కోలుకునే క్రమంలో సుదీర్ఘ కాలం పాటు ఆస్పత్రి బెడ్‌పైనే ఉండి పోవాల్సి వచ్చింది. ఆ తర్వాత పరిస్థితి మెరుగైనా ఆటలకు పూర్తిగా గుడ్‌బై చెప్పేయాల్సి వచి్చంది. దాంతో చదువుపై దృష్టి పెట్టిన నితేశ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), మండీలో సీటు సంపాదించాడు. అక్కడ ఇంజినీరింగ్ చేస్తున్న సమయంలోనే బ్యాడ్మింటన్ ఆటపై ఆసక్తి పెరిగింది. పారా షట్లర్ ప్రమోద్ భగత్‌ను చూసి అతను స్ఫూర్తి పొందాడు. ఆటగాడిగా ఉండాలంటే ఎంత ఫిట్‌గా ఉండాలనే విషయంలో కోహ్లి నుంచి ప్రేరణ పొందినట్లు నితేశ్æ చెప్పాడు. కోల్పోయిన కాలు స్థానంలో కృత్రిమ కాలును అమర్చుకునే క్రమంలో నితేశ్ పుణేలోని ‘ఆర్టిఫీషియల్ లింబ్స్ సెంటర్’కు చేరాడు. అక్కడ ఎంతో మంది తనకంటే వయసులో పెద్దవారు కూడా ఎలాంటి లోపం కనిపించనీయకుండా కష్టపడుతున్న తీరు అతడిని ఆశ్చర్యపర్చింది. ‘40–45 ఏళ్ల వయసు ఉన్నవారు కూడా కృత్రిమ అవయవాలతో ఫుట్‌బాల్, సైక్లింగ్, రన్నింగ్ చేయడం చూశాను. ఈ వయసులో వారు చేయగా లేనిది నేను చేయలేనా అనిపించింది. ఆపై పూర్తిగా బ్యాడ్మింటన్‌పై దృష్టి పెట్టాను’ అని హరియాణాకు చెందిన నితేశ్ చెప్పాడు. 2020లో జరిగిన పారా బ్యాడ్మింటన్ జాతీయ చాంపియన్‌షిప్‌లో తొలిసారి నితేశ్ బరిలోకి దిగాడు. తను ఆరాధించే భగత్‌తోపాటు మనోజ్ సర్కార్వంటి సీనియర్‌ను ఓడించి స్వర్ణం గెలుచుకున్నాడు. దాంతో ఈ ఆటలో మరిన్ని సాధించాలనే పట్టుదల పెరిగింది. గత ఒలింపిక్స్‌లో భగత్ స్వర్ణం గెలుచుకోవడం చూసిన తర్వాత తానూ ఒలింపిక్స్ పతకం సాధించగలననే నమ్మకం నితేశ్‌కు కలిగింది. ఈ క్రమంలో గత మూడేళ్లుగా తీవ్ర సాధన చేసిన అతను ఎట్టకేలకు అనుకున్నది సాధించాడు. పారిస్‌లో ఆడిన ఐదు మ్యాచ్‌లలోనూ విజయాలు అందుకొని స్వర్ణపతకంతో సగర్వంగా నిలిచాడు. –సాక్షి క్రీడా విభాగం -
ఆసియా అండర్–15 బాలికల సింగిల్స్ విజేత తన్వీ పత్రి
ఆద్యంతం నిలకడగా ఆడిన భారత టీనేజ్ షట్లర్ తన్వీ పత్రి ఆసియా అండర్–15 బ్యాడ్మింటన్ బాలికల సింగిల్స్ చాంపియన్‌గా అవతరించింది. చైనాలోని చెంగ్డూ నగరంలో ఆదివారం ముగిసిన ఈ టోర్నీలో ఒడిశాకు చెందిన 13 ఏళ్ల తన్వీ వరుస గేముల్లో గెలిచింది. టాప్ సీడ్ హోదాలో బరిలోకి దిగిన తన్వీ తుది పోరులో 22–20, 21–11తో రెండో సీడ్ థి థు హుయెన్ ఎన్గుయెన్ (వియత్నాం)పై విజయం సాధించింది. టైటిల్ గెలిచిన క్రమంలో తన్వీ టోర్నీ మొత్తంలో తన ప్రత్యర్థులకు ఒక్క గేమ్ కూడా కోల్పోకపోవడం విశేషం. ఈ గెలుపుతో ఆసియా అండర్–15 బాలికల సింగిల్స్ విభాగంలో టైటిల్ సాధించిన మూడో భారత క్రీడాకారిణిగా తన్వీ గుర్తింపు పొందింది.2017లో హైదరాబాద్ అమ్మాయి సామియా ఇమాద్ ఫారూఖీ, 2019లో గుజరాత్ అమ్మాయి తస్నీమ్ మీర్ ఈ ఘనత సాధించారు. ఇదే టోర్నీలో బాలుర అండర్–17 సింగిల్స్ విభాగంలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన హైదరాబాద్ ప్లేయర్ జ్ఞాన దత్తు సెమీఫైనల్లో ఓడిపోయి కాంస్య పతకాన్ని సాధించాడు. -
ఫైనల్లో ప్రణయ్
సిడ్నీ: భారత స్టార్ షట్లర్ హెచ్.ఎస్.ప్రణయ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిలే లక్ష్యంగా ఫైనల్లోకి ప్రవేశించాడు. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోరీ్నలో భారత షట్లర్ల మధ్యే జరిగిన సెమీఫైనల్లో ప్రణయ్ వరుస గేముల్లో విజయం సాధించాడు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీస్‌లో 31 ఏళ్ల ప్రణయ్ 21–18, 21–12తో సహచరుడు ప్రియాన్షు రజావత్‌పై అలవోక విజయం సాధించాడు. ఆదివారం జరిగే టైటిల్ పోరులో ప్రపంచ 9వ ర్యాంకర్ ప్రణయ్... చైనాకు చెందిన వెంగ్ హాంగ్యంగ్తో తలపడతాడు. మరో సెమీస్‌లో 24వ ర్యాంకర్ హాంగ్యంగ్ 21–19, 13–21, 21–13తో మలేసియాకు చెందిన 17వ ర్యాంకర్ లీ జి జియాపై పోరాడి గెలిచాడు. కాగా హాంగ్యంగ్పై భారత ఆటగాడికి టైటిల్ గెలిచిన అనుభవం వుంది. గత మేలో కౌలాలంపూర్‌లో జరిగిన మలేసియన్ మాస్టర్స్ సూపర్–500 టోర్నమెంట్లో అతన్ని ఓడించే ప్రణయ్ విజేతగా నిలిచాడు. ఈ సీజన్లో రెండో టైటిల్‌పై కన్నేసిన భారత షట్లర్ ఇపుడు అడుగు దూరంలో ఉన్నాడు. -
స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్‌కు సీఎం జగన్ సత్కారం
సాక్షి, అమరావతి: భారత స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్.. సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. కిడాంబి శ్రీకాంత్ ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో రజత పతకం సాధించిన తొలి భారత పురుష షట్లర్‌గా సరికొత్త చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం వైఎస్ జగన్.. కిడాంబి శ్రీకాంత్‌ను ఘనంగా సత్కరించారు. ప్రభుత్వం తరపున రూ. 7 లక్షల నగదు బహుమతి, తిరుపతిలో అకాడమీ ఏర్పాటుకు ఐదెకరాల భూమి కేటాయించారు. ప్రస్తుతం శ్రీకాంత్ ఏపీలో డిప్యూటీ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్ 12 నుంచి 19 వరకు స్పెయిన్‌లో.. 2021 బీడబ్యూఎఫ్ వరల్డ్ చాంపియన్‌షిప్ పోటీలు జరిగిన విషయం తెలిసిందే. బుధవారం జరిగిన ఈ సన్మాన కార్యక్రమంలో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, స్పెషల్ సీఎస్ జి.సాయిప్రసాద్, శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్ధ్ రెడ్డి, శాప్ ఎండీ డాక్టర్ ఎన్.ప్రభాకర్ రెడ్డి, శాప్ ఓఎస్డీ రామకృష్ణ, శ్రీకాంత్ తల్లిదండ్రులు రాధాముకుంద, కేవీఎస్‌కృష్ణ తదితరులు పాల్గొన్నారు. చదవండి: అమూల్‌లో పాలు పోసే రైతులే యజమానులు -
షట్లర్ కిడాంబి శ్రీకాంత్‌కు సీఎం జగన్ సత్కారం
-
కిడాంబి శ్రీకాంత్‌కు సీఎం వైఎస్ జగన్ అభినందనలు
సాక్షి,అమరావతి: బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ (బీడబ్ల్యూఎఫ్) ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ సింగిల్స్ ఫైనల్లో సిల్వర్ మెడల్ సాధించిన కిడాంబి శ్రీకాంత్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలిపారు. బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో రజత పతకం సాధించిన తొలి భారతీయుడిగా కిడాంబి శ్రీకాంత్ సాధించిన ఘనతకు రాష్ట్ర ప్రజలతో పాటు యావత్తు దేశం గర్విస్తుందని అన్నారు. భవిష్యత్తులో ఉజ్వలమైన కెరీర్‌తో పాటు మరెన్నో అవార్డులు అందుకోవాలని ఆకాంక్షించారు. Many congratulations to our Telugu shutler @srikidambi on winning historic silver after a hard-fought final in BWF World Championship 2021. Wishing him all the best for a bright career and many more laurels in the future. — YS Jagan Mohan Reddy (@ysjagan) December 19, 2021 గవర్నర్ అభినందనలు బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో సింగిల్స్ ఫైనల్లో సిల్వర్ మెడల్ సాధించిన కిడాంబి శ్రీకాంత్‌ను ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అభినందించారు. కిడాంబి శ్రీకాంత్ భవిష్యత్తులో మరెన్నో విజయాలను సాధించాలని గవర్నర్ ఆకాంక్షించారు. ఈ మేరకు రాజ్ భవన్ నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. చదవండి : శభాష్ శ్రీకాంత్... -
టైటిల్‌కు విజయం దూరంలో...
హో చి మిన్ సిటీ (వియత్నాం): ఈ సీజన్లో తొలి టైటిల్ సాధించే దిశగా భారత అగ్రశ్రేణి షట్లర్ అజయ్ జయరామ్ మరో అడుగు ముందుకేశాడు. వియత్నాం ఓపెన్ బీడబ్ల్యూఎఫ్ టూర్ సూపర్–100 టోర్నమెంట్లో జయరామ్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో ప్రపంచ 93వ ర్యాంకర్ జయరామ్ 21–14, 21–19తో 49వ ర్యాంకర్, ఏడో సీడ్ యు ఇగారషి (జపాన్)పై గెలుపొందాడు. ఆదివారం జరిగే ఫైనల్లో ప్రపంచ 79వ ర్యాంకర్ రుస్తవిటో (ఇండోనేసియా)తో జయరామ్ తలపడతాడు. మరో సెమీ ఫైనల్లో రుస్తవిటో 21–17, 19–21, 21–14తో భారత్‌కు చెందిన మిథున్‌ను ఓడించాడు. ఏడాది క్రితం 13 ర్యాంక్‌లో నిలిచిన జయరామ్ ఆ తర్వాత గాయం కారణంగా ఆరు నెలల పాటు ఆటకు దూరమయ్యాడు. ఫలితంగా అతని ర్యాంక్ పడిపోయింది. ఈ సంవత్సరం ఆరంభంలో పునరాగమనం చేసిన జయరామ్ ఎనిమిది టోర్నీలు ఆడాడు. వైట్ నైట్స్ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచిన అతను యూఎస్ ఓపెన్‌లో సెమీఫైనల్లో నిష్క్రమించాడు. -
చరిత్ర సృష్టించిన కిదాంబి శ్రీకాంత్
తెలుగు తేజం.. బ్యాడ్మింటన్ ఆటగాడు కిదాంబి శ్రీకాంత్ చరిత్ర సృష్టించాడు. బ్యాడ్మింటన్‌లో భారత్ తరపున ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్‌ను(పురుషుల విభాగంలో) కైవసం చేసుకోబోతున్నాడు. బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ ఈ గురువారం విడుదల చేయబోయే జాబితాలో 25 ఏళ్ల శ్రీకాంత్‌కు మొదటి ర్యాంక్ దక్కబోతోంది. మొత్తం 76, 895 పాయింట్లతో శ్రీకాంత్ మొదటి స్థానం కైవసం చేసుకోనున్నాడు. ప్రస్తుతం వరల్డ్ నంబర్ వన్ స్థానంలో ఉన్న విక్టర్ అక్సెల్సన్ ప్రస్తుతం 77,130 పాయింట్లతో ఉన్నాడు. అయితే గాయం కారణంగా కొంత కాలంగా ఆటకు దూరంగా ఉన్న విక్టర్.. తాజా ర్యాకింగ్స్లో 1,660 పాయింట్లు కోల్పోబోతున్నాడు. దీంతో శ్రీకాంత్ నంబర్ వన్ ర్యాంక్ ఖరారైపోయింది. నిజానికి గతేడాదే శ్రీకాంత్ ఈ రికార్డును దక్కించుకోవాల్సింది. కానీ, గాయం కారణంతో ఆ అవకాశాన్ని పోగొట్టుకున్నాడు. కాగా, భారత్ తరపున బ్యాడ్మింటన్‌లో సైనా నెహ్వాల్(2015లో) నంబర్ వన్ ర్యాంక్(మహిళ విభాగంలో)ను దక్కించుకుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం జరుగుతున్న కామన్ వెల్త్ క్రీడల్లో మిక్స్డ్ టీమ్ బ్యాడ్మింటన్ విభాగంలో భారత్‌కు స్వర్ణం దక్కగా.. ఆ టీమ్‌లో కిదాంబి, సైనా కూడా ఉన్నారు. -
పీవీ సింధుకు ప్రశంసల వెల్లువ
హైదరాబాద్ : ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ టైటిల్ కైవసం చేసుకున్న భారత నంబర్‌వన్ క్రీడాకారిణి పీవీ సింధుకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. స్వదేశంలో తొలి సూపర్ సిరీస్ టైటిల్ నెగ్గిన ఆమెను పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు ప్రముఖులు, సెలబ్రెటీలు అభినందిస్తున్నారు. సింధును అభినందిస్తూ... భవిష్యత్తులో ఆమె మరిన్ని విజయాలు సాధించాలని ట్విట్టర్ ద్వారా ఆకాంక్షలు తెలిపారు. సింధును అభినందించినవారిలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, హర్యానా మనోహర్ లాల్ ఖట్టర్, ఒడిశా ముఖ్యమంత్రి సర్బానంద్ సోనోవాల్ తదితరులు ఉన్నారు. అలాగే క్రికెటర్స్ వీవీఎస్ లక్ష్మణ్, వీరేంద్ర సెహ్వాగ్, తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, శరద్ పవార్, రాజ్యసభ ఎంపీ విజయ్ గోయిల్,హీరోయిన్లు అనుష్క శెట్టి, రకుల్ ప్రీత్ సింగ్, సెంథిల్ కుమార్, మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సింధూకు శుభాకాంక్షలుత తెలిపారు. కాగా మహిళల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ ఐదో ర్యాంకర్ సింధు 21–19, 21–16తో ప్రపంచ మూడో ర్యాంకర్ కరోలినా మారిన్ (స్పెయిన్)పై గెలిచిన విషయం తెలిసిందే. Congratulations @Pvsindhu1 for clinching the #IndiaOpen2017 title by beating Carolina Marin. #SindhuvsMarin — Sarbananda Sonowal (@sarbanandsonwal) 2 April 2017 @Pvsindhu1 congratulationssssss champion.. ur an inspiration to many.. may ur success grow bigger by d day!! -
క్వార్టర్స్‌లో జయరామ్
ప్రిక్వార్టర్స్‌లో కశ్యప్ ఓటమి డచ్ ఓపెన్ బ్యాడ్మింటన్ అల్మెరా (నెదర్లాండ్స): డచ్ ఓపెన్‌లో భారత షట్లర్ అజయ్ జయరామ్ క్వార్టర్ ఫైనల్స్‌కు చేరాడు. కెరీర్లో రెండుసార్లు ఈ టైటిల్ గెలిచిన టాప్‌సీడ్ జయరామ్... గురువారం జరిగిన ప్రిక్వార్టర్స్‌లో మా రియస్ మైరే (నార్వే)పై 21-6, 21-6 తేడాతో సునాయాసంగా నెగ్గాడు. క్వార్టర్స్‌లో గోర్ కొయెల్హే డి ఒలివిరా (బ్రెజిల్)తో జయరామ్ తలపడతాడు. ఇక పారుపల్లి కశ్యప్ పోరాటం ప్రిక్వార్టర్స్‌లో ముగిసింది. తను 18-21, 18-21 తేడాతో రౌల్ మస్ట్ (ఈస్టోనియా) చేతిలో పరాజయం పాలయ్యాడు. మిక్స్డ్ డబుల్స్‌లో సుమిత్ రెడ్డి, మేఘన జంట క్వార్టర్స్‌కు చేరింది. ప్రిక్వార్టర్స్‌లో వీరు మాస్ జెల్లె, వాన్డర్పై 21-16, 21-18 (నెదర్లాండ్స) తేడాతో నెగ్గారు. మరోవైపు పురుషుల డబుల్స్‌లో టాప్ సీడ్స మను అత్రి, సుమీత్ రెడ్డి జోడితో పాటు ప్రణవ్, ఆక్షయ్ దే వాల్కర్ జోడి కూడా తొలి రౌండ్లోనే వెనుదిరిగారు. -
జ్వాల ఆనందం
ఆనందం, సంతోషం.. బాధ, దుఖం.. దేన్నీ దాచుకోకుండా కుండబద్దలు కొట్టినట్లు వ్యవహరించే స్టార్ షట్లర్ గుత్తా జ్వాల మరోసారి అదేపని చేశారు. రియో ఒలింపిక్స్ కు అర్హత సాధించిన ఆనందంలో వీపుపై ఉన్న ఒలింపిక్ టాటూ కనిపించే ఫొటోను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు గుత్తా జ్వాల. అన్ని విధాల ప్రోత్సహించిన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. 'మనం సాధించాం..' అంటూ తన జోడి అశ్విని పొన్నప్పకు అభినందనలు తెలిపారు. డబుల్స్ విభాగంలో గుత్తా జ్వాల, అశ్విని పొన్నప్పలతోపాటు మొత్తం ఏడుగురు షట్లర్ల ఒలింపిక్ బెర్త్ లు మంగళవారం ఖరారయ్యాయి. వారిలో సైనా నెహ్వాల్, పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్, మను ఆత్రి, సుమీత్ రెడ్డిలు ఉన్నారు. ర్యాంకుల ఆధారంగా వీరిని ఎంపిక చేశారు. క్వాలిఫైయింగ్ టోర్నమెంట్ గా భావించిన ఏసియన్ బ్యాడ్మింటర్ చాపియన్ షిప్ పోటీలు ముగిసిన తర్వాత ర్యాంకులను బట్టి షట్లర్లను ఎంపిక చేశారు. ర్యాంకులు మే 5న అధికారికంగా ప్రకటిస్తారు. ప్రతిష్టాత్మక రియో ఒలింపిక్స్ లో డబుల్స్ విభాగంలో జ్వాలా, అశ్వినిలు భారత్ కు ప్రాతినిథ్యం వహిస్తారు. సింగిల్స్ విభాగంలో ఈసారి ఇద్దరు క్రీడాకారిణులు(సైనా, సింధు) బరిలోకి దిగనున్నారు. పురుషుల సింగిల్స్ లోనూ ఈసారి ఇద్దరిని పంపే అవకాశం లభించింది. అయితే పారుపల్లి కాశ్యప్ అనూహ్యరీతిలో గాయపడటం, శస్త్రచికిత్స చేయుంచుకోవడంతో ఇండియా ఆ అవకాశాన్ని కోల్పోక తప్పలేదు. బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ (బిడబ్ల్యూఎఫ్) నిబంధనల మేరకు 16వ ర్యాంకులోపు ర్యాకుల్లో ఉన్న క్రీడాకారుల్లో ఇద్దరిని ఒలింపిక్స్ కు పంపొచ్చు. శ్రీకాంత్, కాశ్యప్ లు ఇద్దరూ ప్రస్తుతం 16 కంటే తక్కువ ర్యాంకులోనే కొనసాగుతున్నారు. ఆగస్ట్ 5 నుంచి 21 రియో డి జెనిరో ఒలింపిక్స్ జరుగుతాయి. టాటూ వెనుక కథ.. గుత్తా జ్వాల ఎన్నటికీ మర్చిపోలేని పోటీలు.. 2012 లండన్ ఒలింపిక్స్. ఆ వేదికపై బ్యాడ్మింటర్ చరిత్రలోనే కొత్త అధ్యాయం సృష్టించింది జ్వాల. డబుల్స్, మిక్స్ డ్ డబుల్స్ రెండు విభాగాల్లోనూ ఒలింపిక్ బెర్త్ పొందిన మొదటి షట్లర్ ఆమె. అందుకే 2012 ఒలింపిక్ గుర్తును వీపుపై పచ్చబొట్టు పొడిపించుకుంది. -
'ఆ సినిమాలో నేనే నటిస్తా'
హైదరాబాద్: తన జీవిత చరిత్ర ఆధారంగా సినిమా తీస్తే నటించేందుకు సిద్ధమని స్టార్ షట్లర్ పీవీ సింధు తెలిపింది. అయితే ఈ సినిమా ఎవరు తీస్తారు, ఎన్ని రోజుల్లో షూటింగ్ పూర్తి చేస్తారనే దానిపై తన నిర్ణయం ఆధారపడి ఉంటుందని అంది. అన్ని కుదిరితే నటించడానికి తనకేమీ అభ్యంతరం ఉండబోదని వెల్లడించింది. మ్యూజిక్ అంటే తనకెంతో ఇష్టమని 20 ఏళ్ల సింధు తెలిపింది. సినిమాలు ఎక్కువగానే చూస్తుంటానని చెప్పింది. సానియా మీర్జా, సైనా నెహ్వాల్ పద్మభూషణ్ పురస్కారాలు రావడంతో 'ఎస్' అక్షరం తమకు అదృష్టంగా భావిస్తున్నట్టు చెప్పింది. సింధు గతేడాది పద్మశ్రీ పురస్కారం అందుకున్న సంగతి తెలిసిందే. బ్యాడ్మింటన్ లో మరింతగా రాణిస్తానన్న నమ్మకాన్ని సింధు వ్యక్తం చేసింది. అభిమానులను చిరునవ్వుతో పలకరిస్తానని సింధు తెలిపింది. తాజాగా రెండోసారి మలేషియా ఓపెన్ గ్రాండ్ ప్రి టైటిల్ ను కైవసం చేసుకున్న ఈ తెలుగు అమ్మాయి ప్రస్తుతం సయ్యద్ మోదీ గ్రాండ్‌ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ఆడుతోంది. -
టైటిల్ పోరుకు ప్రణయ్
పాలెమ్‌బాంగ్: భారత యువ షట్లర్ హెచ్.ఎస్. ప్రణయ్ వరుసగా రెండో టోర్నమెంట్లో ఫైనల్లోకి దూసుకెళ్లాడు. ఇండోనేసియా మాస్టర్స్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నీలో శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీస్‌లో ఐదో సీడ్ ప్రణయ్ 21-14, 14-21, 21-14తో తొమ్మిదో సీడ్ డారెన్ లూ (మలేసియా)పై విజయం సాధించాడు. గతవారం జరిగిన వియత్నాం ఓపెన్‌లో ప్రణయ్ రన్నరప్‌తో సరిపెట్టుకున్న సంగతి తెలిసిందే. డారెన్‌తో దాదాపు గంటపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో భారత కుర్రాడు స్ఫూర్తిదాయక ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. తొలి గేమ్‌లో 5-8తో వెనుకబడ్డా 12-12తో స్కోరును సమం చేసి ముందుకు దూసుకెళ్లాడు. అయితే రెండో గేమ్ ఆరంభంలో 7-3 ఆధిక్యంలో ఉన్న ప్రణయ్‌ను మలేసియా ఆటగాడు కట్టడి చేయడంతో పుంజుకోలేకపోయాడు. నిర్ణయాత్మక మూడో గేమ్‌లో ప్రణయ్ 5-0, 11-9తో ఆధిక్యంలో నిలిచాడు. డారెన్ ఒత్తిడి పెంచినా ఏమాత్రం తడబడకుండా గేమ్‌తో పాటు మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. ఆదివారం జరిగే టైటిల్ పోరులో ప్రణయ్... అబ్దుల్ కోలిక్ (ఇండోనేసియా)తో తలపడతాడు. -
జపాన్ ఓపెన్ రెండో రౌండ్లో సింధు
భారత బ్యాడ్మింటన్ వర్ధమాన సంచలనం పి.వి.సింధు జపాన్ ఓపెన్‌లో రెండో రౌండ్లో ప్రవేశించింది. ఈ టోర్నీలో సింధుతో పాటు రాష్ట్రానికే చెందిన యువ షట్లర్ కె. శ్రీకాంత్ శుభారంభం చేశాడు. బుధవారమిక్కడ జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ఎనిమిదో సీడ్ సింధు 21-12, 21-13తో స్థానిక షట్లర్ యుకినో నకాయ్పై అలవోకగా గెలుపొందింది. హైదరాబాదీ వరుస గేమ్‌ల్లో మ్యాచ్‌ను ముగించింది. రెండో రౌండ్లో జపాన్ క్వాలిఫయర్ అకానె యమగూచితో తలపడనుంది. పురుషుల సింగిల్స్ తొలిరౌండ్లో ఆంధ్రప్రదేశ్ ఆటగాడు కె.శ్రీకాంత్ 22-20, 22-24, 21-18తో ప్రపంచ 22వ ర్యాంకర్ షొ ససాకి (జపాన్)పై పోరాడి నెగ్గాడు. ఇతర మ్యాచ్‌ల్లో భారత షట్లర్లు 37వ ర్యాంకర్ ఆనంద్ పవార్ 21-17, 7-21, 21-18తో ప్రపంచ 12వ ర్యాంకర్ సోనీ ద్వి కున్కొరొ (ఇండోనేసియా)కు షాకివ్వగా, అజయ్ జయరామ్ 21-11, 21-18తో టీన్ చెన్ (చైనీస్ తైపీ)ని చిత్తుచేశాడు. కాగా సాయి ప్రణీత్, సౌరభ్‌వర్మ తొలిరౌండ్లో ఓటమి చవిచూశారు.